కొండ, కోనలు తిప్పి కొత్త అనుభూతిని మిగిల్చే 'గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్'

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిన అడ్వంచర్ క్లబ్ సేవలు..ట్రెక్కింగ్ చేయాలనుకునే వారి కలను నిజం చేస్తోన్న క్లబ్..

26th Aug 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


మడిసన్నాక కూసింత కలాపోషణ ఉండాలి.. తిని తొంగుంటే మడిసికి గొడ్డుకీ తేడా ఏవుంటదీ ! అనేది మన దగ్గర పాపులర్ డైలాగ్. అది చెప్పిన సందర్భం ఎలా ఉన్నా.. మన లైఫ్ రొటీన్‌గా ఉండకూడదనేది దాని అంతరార్థం. హైదరాబాద్ లాంటి నగరాల్లో సాఫ్ట్‌వేర్, ఐటి ఆధారిత ఉద్యోగాలు చేసే వారి జీవితాలు ఉదయం ఆఫీసు, సాయంకాలం ఇల్లు. వీకెండ్స్ వస్తే సినిమాలు తప్పితే పెద్ద గొప్పగా ఏం ఉండదనే ఒపీనియర్ అందరిలో ఉంటుంది. కానీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది గ్రేట్ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్.

image


“ ట్రెక్కింగ్ చేయడం అంటే చిన్నప్పటి నుంచి నాకు భలే ఇష్టం. హైదరాబాద్ చుట్టుపక్కల చిన్న చిన్న గుట్టలు, కొండలు చాలా ఉన్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ ఎక్కాలనిపించేది. ఇప్పుడు నేను చేస్తోంది అదే. నా ఒక్కడికే కాకుండా.. నాలా ఇంట్రస్ట్ ఉన్న మరికొందరి కోసం ఈ క్లబ్‌ని ఏర్పాటు చేశా ” - దియానత్ అలీ.

ఇక్కడ ట్రెక్కింగా.. లేక వాటర్ సర్ఫింగా పక్కన పెడితే అడ్వెంచర్ చేయాలనుకున్న ఎంతో మంది సాహసీకులకు ఈ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఏడేళ్ల ప్రయాణంలో ఎంతోమంది ఈ క్లబ్ ద్వారా అడ్వెంచరర్స్‌గా మారారు. 2013లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరిన ఈ క్లబ్ దేశంలో ఉన్న అన్ని క్లబ్‌లలో పెద్దది. ఇందులో దాదాపు 5,000 మంది సభ్యులున్నారు. సిటీలోని కార్పొరేట్ లు, ఐటి నిపుణులు ఎంతో మంది ఇందులో ఉన్నారు. ప్రతీ నెలా దాదాపు 50 యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఈ క్లబ్ ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఈ క్లబ్ బాగా తెలుసు అంటున్నారు దియానత్ అలీ.

image


అసలెలాంటి అడ్వంచర్లు ఉన్నాయి

సాహసికులకు ఓపిక ఉండాలే కానీ ట్రెక్కింగ్, సైక్లింగ్, రాక్ క్లైంబింగ్, స్కూబా డైవింగ్, లాంగ్ మార్చ్, సైక్లింగ్ ఇలా చెప్పుకుంటే లిస్ట్ పెద్ద లిస్టే తయారవుతుంది. దీంతో పాటు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారికి సరికొత్త అనుభూతిని అందించడం వీళ్ల లక్ష్యం. కొత్తవారికి సాహసయాత్రల గురించి వివరిస్తూ.. పాత మెంబర్స్‌తో కొత్త ట్రిప్పులను ప్లాన్ చేస్తారు. ఇటీవల రాక్‌ థాన్, మడ్ బాత్ లాంటివి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయంటే వాటిని హైదరాబాద్‌లో తీసుకొచ్చింది ఈ అడ్వంచర్ క్లబ్బే. చిన్న చిన్న గుట్టలతో ఉండే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సహజసిద్ద సంపదను కొత్త వారికి చూపిస్తూ ఉంటారు. సైకిల్‌పై సిటీలోని కొత్త ప్రాంతాలకు తిరిగి రావడమూ ఓ అడ్వెంచరే అంటున్నారు అలీ.

'' స్థానికులు మాత్రమే ఈ క్లబ్ పరిమితం కాలేదు. పూణే, ముంబై, బెంగళూరు, వైజాగ్ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి సెటిలి అయిన ఎంతో మంది మా క్లబ్ లో ఉన్నారు. మొదట మా దగ్గర చేరింది బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే '' - దియాంత్ అలీ.

అడ్వంచర్ క్లబ్ టీం

గ్రేట్ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ ఫౌండర్ దియానత్ అలీ. ఇంజనీర్ అయిన అలీ ,ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఇండియన్ సోషియో ట్రేడింగ్ అండ్ డెవలప్‌మెంట్ తోపాటు స్టార్ లీడర్‌షిప్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఇలా వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన అలీకి.. ట్రెక్కింగ్‌పై ఉన్న ఇంట్రస్ట్ ఈ క్లబ్‌ని ప్రారంభించేలా చేసింది. దీన్ని సెక్షన్ 25 సి కింద రిజిస్టర్ చేశారు. అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడిపే సంస్థ. అలీతోపాటు 10మంది కోర్ టీం దీనిపై పనిచేస్తోంది. దీపమ్ మోరే పారియా, ట్రైట్లాన్ వ్యవహారాలు చూస్తారు. సురేష్, పిఆర్ అండ్ అకౌంటింగ్ చూస్తే, విశ్వం అడ్వంచరింగ్ వ్యవహారాలు చూస్తారు. అయితే యాక్టివిటీ ఉన్న రోజుల్లో అందులో పాల్గొనే మెంబర్స్ వారి ఖర్చులు పెట్టుకోవాలి. ఆ రోజు యాక్టివిటీ జరగడానికి సరిపడ సాయం వారే అందించేలా ఏర్పాటు చేశారు. ఈ రకంగా చూస్తే ఇక్కడున్న మెంబర్స్ అంతా టీం గానే పరిగణించాలని అలీ వివరిస్తారు.

image


మరి ఆదాయం ఎలా ?

ఎలాంటి లాభాలు ఆశించకుండా సంస్థను రన్ చేయాలి కాబట్టి ఫండ్స్ వసూలు చేయకూడదు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చే చిన్న చిన్న స్పాన్సర్లు, ప్రధానంగా ఫుడ్ ఐటమ్స్, ట్రావెల్ పాట్నర్‌తో పాటు హాస్పిటాలిటీ పాట్నర్ లాంటివి సాహస యాత్రలకు లభిస్తున్నాయి. సభ్యుల దగ్గర నామినల్ ఫీజును వసూలు చేసి, దాన్ని తిరిగి సభ్యుల కోసమే ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు అవుట్ లైఫ్ అనే మరో సంస్థనూ అలీ ఏర్పాటు చేశారు. దీనిలో ఔట్‌బౌండ్ లెర్నింగ్ లాంటి పాఠాలు నేర్పిస్తారు. దీని ద్వారా వచ్చే రెవెన్యూలో కొంత భాగాన్ని హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ కోసం వినియోగిస్తున్నారు. ట్రెక్కింగ్ లాంటి విషయాలపై అవగాహన కల్పించడంతోపాటు , మెళకువలు నేర్పించడం ఔట్ లైఫ్ ప్రధాన అజెండా. ఇందులో ఫీజులు వసూలు చేయడంతో పాటు ఫండ్స్‌ని అంగీకరిస్తారు.

హిమాలయాల్లో క్లబ్ మెంబర్స్

హిమాలయాల్లో క్లబ్ మెంబర్స్


క్లబ్ ప్రారంభించడం ఓ అడ్వంచరే !

గ్రేట్ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ ప్రారంభించడం నా జీవితంలో చేసిన పెద్ద సాహసం అంటారు అలీ.

నవ్వుతూ అది అడ్వెంచర్ ఎలా అయిందో వివరించారు అలీ. 2008లో అడ్వంచర్ క్లబ్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పుడు తానొక్కడే ట్రెక్కింగ్, ఇతర అడ్వెంచర్లు చేసే వారట. అందరికి ఈ విషయంపై అవగాహన కలగడానికి కనీసం ఏడాది పట్టిందట. హైదరాబాద్ స్లీపింగ్ హ్యాబిట్ దీనికి ప్రధాన కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. పొద్దున్న ఆరుగంటలకు హైదరాబాద్‌లో ఎవరూ నిద్రలేవరు. ఇదే ప్రధాన అడ్డంకిగా ఉండేది. మొదట్లో బయటి ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడిన వారు తమ క్లబ్ మెంబర్స్‌గా చేరారు. వారితో ప్రారంభమైన ప్రయాణం ఏడాది తిరిగే సరికి 500మంది సభ్యుల స్థాయికి పెరిగింది. ఇప్పుడీ క్లబ్‌లో పాతికవేల మంది సభ్యులు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని వివరించారు అలీ.

ఫౌండర్ అలీ

ఫౌండర్ అలీ


విద్యార్థుల్లో అడ్వంచర్ యాక్టివిటీ

క్లబ్ తరుపు నుంచి స్కూళ్లకు వెళ్లి అడ్వంచర్ పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు అలీ. ప్రత్యేకంగా వేసవి సెలవుల్లో క్యాంపులను నిర్వహిస్తున్నారు. వీకెండ్స్‌కు చిన్న చిన్న యాక్టివిటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన వ్యాపకాలు అలవరచడంతోపాటు యాక్టివ్ లైఫ్ అలవాటయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా విద్యార్థుల నుంచి అడ్వంచర్స్ పై మంచి స్పందన వస్తోంది. మొదటిసారి మా క్లబ్‌లోకి వచ్చిన వారితో ఒక గంటపాటు ట్రెక్కింగ్ నిర్వహిస్తాం. కొన్నాళ్లకు సగంరోజు, తర్వాత ఓ రోజంతా ట్రెక్కింగ్ చేసేలా చేస్తాం. అలా ఓ క్రమ పద్దతిలో ట్రెయినింగ్ ఇస్తామని అలీ చెప్పుకొచ్చారు.

హుస్సేన్ సాగర్ లో  సెయిలింగ్

హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్


భవిష్యత్ ప్రణాళికలు

హైదరాబాద్ సిటీ ట్రెక్కింగ్‌తోపాటు ఇతర ప్రాంతాలకు మేం ట్రెక్కింగ్ కోసం ఎలా వెళతామో.. దేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇదే రకమైన యాక్టివిటీ జరిగేలా ప్రణాళికలు చేస్తున్నాం. ఢిల్లీతోపాటు 10 నగరాల్లో ఈ ఏడాది చివరికల్లా విస్తరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఇప్పటికే తెలంగాణ టూరిజం, ఆంధ్ర టూరిజం లాంటి ప్రభుత్వ సంస్థలో టై అప్ అయ్యాం. దీంతో పాటు ఇక్ఫాయ్, సొసైటి ఫర్ సేవ్ ది రాక్స్, హైదరాబాద్ రన్ లాంటి ఆర్గనైజర్లతో కలసి యాక్టివిటీస్ చేస్తున్నాం. మరికొంతమందితో కలసి మరిన్ని యాక్టివిటీస్ చేయాలన్నదే మా లక్ష్యం.

ఇన్నేళ్ల ట్రెక్కింగ్‌తో పాటు ఎన్నో అడ్వంచర్స్ చేసిన గ్రేట్ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ ఒక్క యాక్సిడెంట్ కూడా ఫేస్ చేయలేదంటే నమ్ముతారా. డాక్టర్ అభిలాష్, డాక్టర్ విభాలు తమ క్లబ్ మెంబర్స్. వీరికి ఒక టీం ఉంది. ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ విషయాలపై వీరు కేర్ తీసుకుంటారు.

'' సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోడానికి, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవరుచుకోడానికి అడ్వెంచర్స్ చేయండి '' - దియాంత్ అలీ

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close