సంకలనాలు
Telugu

పానీపూరి వ్యాపారం మొదలుపెట్టిన ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి !

గోల్ గప్పాకు గ్లోబల్ బ్రాండింగ్..వందల రకాల పానీపూరీ రుచుల పరిచయం..పదికి పైగా నగరాల్లో ఇప్పుడు ఫ్రాంచైజీలు..

Poornavathi T
23rd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పానీపూరి. పేరు వినగానే అప్రయత్నంగాలో మన నోట్లో నీళ్లు ఊరిపోతాయి. తియ్యగా,పుల్లగా, లైట్‌ ఉప్పూ, కారాలతో ఆ నీటిని చిన్నచిన్న పూరీలతో పాటు నోట్లో ఆబగా పెట్టేసుకుని తినేస్తుంటే ఈ రుచే వేరు. షాప్ వాడు.. అలా ఒక్కోటి.. వేస్తుంటే.. ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా లాగించేస్తుంటాం. పేరుకు అది పదో, ఇరవయ్యే విలువ చేసే తిండే అయినా పాపులారిటీలో మాత్రం దాని ముందు పిజ్జాలు కూడా బలాదూర్. అయితే ఇంతవరకూ పానీపూరికి ఓ బ్రాండ్ అంటూ లేదు. రోడ్డుపై ఎవరైనా చిన్న బుట్టపెట్టేసుకుని కూడా వీటిని అమ్మడం మనం చూస్తుంటాం.

image


కాసేపు పానీపూరిని పక్కనబెట్టి ప్రశాంత్ కులకర్ణి దగ్గరికి వద్దాం. ఒకప్పుడు అతనో కోడింగ్ ఎక్స్‌పర్ట్. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఐదంకెల జీతం, మంచి పేరు, జాలీ సర్కిల్.. ఈ లైఫే వేరు. అలా సాగిపోతూ ఉండేది జీవితం. కానీ ఈ ఉద్యోగం కంటే ఏదైనా గొప్పది చేయాలని ప్రశాంత్‌ను లోలోపల పురుగు తొలుస్తూ ఉండేది కానీ అవకాశంలేక ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించక అలా టైం సాగిపోయేది. ఇక మనందరిలానే ప్రశాంత్‌ కూడా పానీపూరీ ప్రియుడే. గోల్‌గప్పా కనపడగానే ఎక్కడైనా బండి ఆపేసి ఓ పట్టుపట్టకుండా వదలడు. అలాంటిది ఒక రోజు రోడ్డపై వెళ్తూ.. ఓ బండి దగ్గర పానీపూరిని ఫలహారంలా కుమ్మేశాడు. ఇంకేముంది ఇంటికి వెళ్లాకకానీ తెలీలేదు, ఏదో తేడా జరిగిందని. ఫుడ్ పాయిజన్ కావడంతో నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చింది. కొద్ది రోజుల సెలవు, పొట్టలో ఇబ్బందితో సతమతమయ్యాడు. కొద్ది రోజులు ఆ తిండికి దూరంగా ఉండమని డాక్టర్ ఓ ఉచిత కూడా ఇచ్చాడు. దీంతో నోరు కట్టుకుని నాలుగు నెలల పాటు పానీపూరీకి పావు కిలోమీటర్ దూరంగా నడిచేవాడు.

ఆర్తి, పల్లవి కులకర్ణి, ప్రశాంత్ కులకర్ణి - చటర్ పటర్ టీం

ఆర్తి, పల్లవి కులకర్ణి, ప్రశాంత్ కులకర్ణి - చటర్ పటర్ టీం


ఈ లోపు ఉద్యోగంపై అసంతృప్తి కూడా మొదలుకావడంతో పాటు మనసు మళ్లీ ఆ పానీపూరీపైకే మళ్లింది. నాలా ఎంతో మందికి ఆ ఫుడ్ అంటే ఇష్టం కదా.. మరి ఆరోగ్యకరంగా దాన్ని అందిస్తే ఎంతో మంది ఆదరిస్తారు కదా.. అనే ఆలోచన మొదలైంది. కానీ చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, చదివింది ఎంబిఏ.. ఎవరికైనా చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ధైర్యం కూడా లేదు. అయినా ఒక రోజు ధైర్యం చేసి తన ఆలోచనపై లెక్కలేయడం మొదలుపెట్టాడు. దేశంలో ఇప్పటివరకూ పానీపూరీ, ఛాట్ వంటివాటికి ఓ పాపులర్ బ్రాండ్ అంటూ ఏదీలేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇవి అందరికీ పరిచయమైన రుచులు. వీటికో ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తే బాగుంటుందని అనిపించింది ప్రశాంత్‌కు. ఇక అంతే ఆలోచన బలపడింది, స్పష్టత వచ్చింది.. 2011లో ఇన్ఫోసిస్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. ఎవరు వద్దన్నా, ఎంత మంది వారించినా తాను మాత్రం వెనక్కి తగ్గలేదు.

'గపాగప్' పేరుతో పానీపూరిని బ్రాండింగ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే అందరిలా కేవలం ఒకటి, రెండు రుచులు కాకుండా వందలాది కొత్త రుచులను జనాలకు పరిచయం చేయాలని అనుకున్నాడు. మెల్లిగామెల్లిగా అందులో చాట్, భేల్ వంటి ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌ కూడా చొప్పించి కంపెనీకి 'చటర్ పటర్' అని నామకరణం చేశాడు.

image


ప్రస్తుతం అతని దగ్గర 80 రకాల భేల్, 27 రకాల ఛాట్, పోహాలు ఉన్నాయి. వీటితో పాటు 112 రకాల పానీపూరీలు లభ్యమవుతాయి. బయట ఎక్కడా లభ్యం కాని, అసలు ఇలాంటి టేస్టులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయే కాంబినేషన్లు సృష్టించాడు. మ్యాగీ గపాగప్, మసాలా ఫ్రైస్, చాటిజా (చాట్ విత్ పిజ్జా), ఇడ్లీ ఫ్రైస్, ఇడ్లీ చాట్, కాక్రా చాట్ వంటివి కొన్ని పాపులర్ డిషెస్. కాన్సెప్ట్‌ కొత్తగా ఉండడం, కుర్రాడి ఆలోచనల్లో చురుకుదనం ఉండడంతో బిగ్ బజార్, స్పెన్సర్స్ సహా మరికొన్ని సంస్థలు అతడిని వెన్నుతట్టాయి. తమ స్టోర్స్‌లో వ్యాపారం చేసుకునేందుకు ఓకె చెప్పాయి. దీంతో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫ్రాంచైజీలు తెరిచి మరీ అద్భుతమైన వ్యాపారం చేస్తున్నాడు ప్రశాంత్.

image


అయితే ఇవన్నీ అంత సులువుగా, సాఫీగా మాత్రం జరగలేదు. వివిధ బ్రాంచ్‌లకు పూరీ మసాలా, భేల్ వంటివి సప్లై చేయడం చాలా కష్టంగా ఉండేది. జనాలను మేనేజ్ చేయడం, లాజిస్టిక్స్ వంటివి మరీ ఇబ్బంది పెట్టేవి. తమ హెడ్ ఆఫీస్ ఉన్న ఇండోర్ నుంచి వివిధ ఫ్రాంచైజీలకు సరుకును సప్లై చేయడానికి ప్రశాంత్ నానా యాతనా పడ్డాడు. సరైన భాగస్వామ్యులు దొరకక విలవిలలాడాడు. ప్రస్తుతం ఫ్రాంచైజీ మోడల్‌లో ఇండోర్, ఉజ్జైన్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, బరోడా, సూరత్, పూణే, హైదరాబాద్, విశాఖపట్నం జనాలు చటర్ పటర్‌ రుచులను చప్పరిస్తున్నారు.

image


''మాదంతా ఓ టీం. మా ఆలోచనలన్నీ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. చటర్ పటర్‌ను ఓ అంతర్జాతీయ బ్రాండ్ చేయాలనేదే లక్ష్యం. భారత మార్కెట్లో మా సత్తా పూర్తిస్థాయిలో చాటిన తర్వాత విదేశాల్లో కూడా కాలుమోపాలని చూస్తున్నాం'' అంటారు ప్రశాంత్.

ఇప్పటికే ఆస్ట్రేలియా, లండన్ నుంచి ఎంక్వైరీలు వచ్చాయని, వాటిని ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్టు చెప్పారు. అది కేవలం పానీపూరి పరిమితం కాకుండా చటర్ పటర్‌ను ఓ పూర్తిస్థాయి క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌(QSR)గా తీర్చిదిద్దాలనేది అతడి కల. ప్రస్తుతం భారత దేశంలో qsr మార్కెట్ రెండు బిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఇది ఏటికేడు పాతిక శాతం వృద్ధితో పరుగులు పెడ్తోంది. ఒకటి రెండేళ్లలో ఈ మార్కెట్ 5-6 బిలియన్ డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదు. మారుతున్న లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లే ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయని చెప్పొచ్చు.

చటర్ పటర్ ఆలోచన కాస్త విభిన్నంగా అనిపించినా.. ఇది అందరికీ తెలిసిన ఆహారం. చిన్నప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ చాట్‌ను రుచిచూసిన వారే. చాట్, గోల్ గప్పా వంటివి వాల్డ్ ఫేమస్. కానీ వాటికి ఓ బ్రాండ్ తెచ్చి శుచిగా, శుభ్రంగా తయారు చేసి ఇవ్వడం వీళ్ల టార్గెట్.

image


ఇక ప్రశాంత్ కుటుంబ సభ్యులు మొదట్లో వారించినా అతనికి ఉన్న పట్టుదల చూసి ఓకె చెప్పారు. ఎందుకంటే ప్రశాంత్ తండ్రి కూడా ఓ బిజినెస్‌మేన్. వాళ్లు చాలా కాలంగా ఆటోమొబైల్ రంగంలో ఉన్నారు. వివిధ వాహనాలకు అవసరమైన ట్యూబులను తయారు చేసే బిజినెస్ ఉంది. దాన్ని వదిలి ఇలా రోడ్ సైడ్ ఫుడ్ వెంబడిపడ్డాడని మొదట్లో కాస్త తటపటాయించారు కూడా. స్నేహితులు, బంధువులు అయితే వీడికి పిచ్చిపట్టిందని కూడా అన్నారని గుర్తుచేసుకుంటారు ప్రశాంత్.

రకరకాల పూరీలు, చూడగానే టెంప్టింగ్‌గా అనిపించే ఫుడ్ చూసి నోరూరుతోంది కదూ.. ! ఇంకెందుకు ఆలస్యం దగ్గర్లో ఎక్కడైనా చటర్ పటర్ ఉందేమో చూసి.. ఓ పట్టుపట్టిరండి.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags