సంకలనాలు
Telugu

మొక్క‌ల‌ హాస్పిట‌ల్ 'గ్రీన్ థంబ్స్'

మొక్క‌లు, చెట్ల‌తో కూడిన ర‌మ‌ణీయ ప్ర‌కృతి అంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే. ప్ర‌కృతి సోయ‌గాల న‌డుమ ఒక‌రోజు గ‌డ‌ప‌డ‌మంటే అంత‌కుమించిన ఆనందం మ‌రోటి ఉండ‌దు. చిగురిస్తున్న ఆకులు, తాజా పూలు, సువాస‌న‌లు వెద‌జ‌ల్లే భూమాత‌.. ఈ ప్ర‌కృతిని ఆస్వాదించాలంటే ప్ర‌స్తుత బిజీ లైఫ్‌లో ప‌ల్లెల‌కు వెళ్లాళ్సిందే. కానీ ఆ ప్ర‌కృతిని ఇంటిలోనే సృష్టించి ఇస్తున్నారు గ్రీన్ థంబ్స్‌ బొటిక్ వ్య‌వ‌స్థాప‌కులు మినెట్టా, రంజిత్‌.. మొక్క‌ల ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తూ మొక్క‌ల హాస్పిట‌ల్‌గా సేవ‌లందిస్తున్నారు..

GOPAL
6th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ప్లాంట్లు, ప్ర‌కృతి గురించి గురించి అవ‌గాహ‌న ఉన్న బెంగ‌ళూరువాసుల‌కు మినెట్టా, రంజిత్‌ల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అంద‌మైన మొక్క‌ల ప్ర‌పంచంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, లైఫ్‌ను ఆహ్లాద‌క‌రంగా గ‌డుపుతున్నారు. 

మొక్క‌ల‌న్నా, ప్ర‌కృతన్నా మినెట్టే, రంజిత్‌లకు ఎంతో ఇష్టం. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు, ప‌చ్చ‌టి గార్డెన్‌లో గ‌డ‌ప‌డం, కొత్త కొత్త బోన్సాయి సృష్టించ‌డం, స‌రికొత్త పూ వంగ‌డాలు త‌యారుచేయ‌డం వీరికి హాబీ. ఈ మెటిరియ‌లిస్టిక్ జీవితంలో అంద‌మైన మొక్క‌ల‌ను బ‌హుమ‌తులుగా ఇవ్వాల‌ని వీరికి వ‌చ్చిన ఐడియా వారి జీవితాలే మార్చేసింది.

image


బ‌ర్త్‌డేలు, పెళ్లిరోజులు, ఇత‌ర‌ వేడుక స‌మ‌యాల్లో కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, త‌మకు తెలిసిన‌వారికి మొక్క‌ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చేవారు. కొన్ని సంద‌ర్భాల్లోనైతే బాల్క‌నీ మేకోవ‌ర్ల వంటి అంద‌మైన‌, అర్థ‌వంత‌మైన‌ బ‌హుమ‌తిని ఇచ్చి స‌న్నిహితుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేవారు. ఇలా ఒక‌టి రెండు సార్లు జ‌ర‌గ‌డంతో వీరి మొక్క‌ల పెంప‌కం గురించి వారి స‌ర్కిల్‌లో అంద‌రికీ తెలిసిపోయింది. ఈ ఐడియా న‌చ్చి చాలామంది వీరిని సంప్ర‌దించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో త‌మ సేవ‌ల‌ను ఉచితం నుంచి చిన్న‌పాటి వ్యాపారంగా మార్చేశారు. కొద్ది మొత్తంలో డ‌బ్బులు తీసుకుని ఇలాంటి స‌హ‌జ‌మైన బ‌హుమ‌తులను రూపొందించ‌డం కోసం గ్రీన్ థంబ్స్‌బొటిక్‌ను వారు ప్రారంభించారు. కస్ట‌మ‌ర్ల డ‌బ్బుల‌కు న్యాయం చేకూరుస్తూ నాణ్య‌మైన బ‌హుమ‌తుల‌ను రూపొందించడం మొద‌లుపెట్టారు.

image


చిన్న‌పిల్ల‌ల‌కు శిక్ష‌ణ‌

బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ మిన్నెట్టా, ఆమె భ‌ర్త రంజిత్‌.. చిన్న పిల్ల‌ల‌ను కూడా ఈ మొక్క‌ల పెంప‌కం వైపుగా మ‌ళ్లించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకొన్నారు, మొక్క‌లు, వాటి పెరుగ‌ద‌ల గురించి ఐదేండ్లు, ఆపైనా వ‌య‌సున్న చిన్నారుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇంకాస్త పెద్ద వ‌య‌స్కుల‌కు మొక్క‌ల‌ను త‌యారు చేయ‌డం, బాల్క‌నీల్లో చిన్న‌చిన్న గార్డెన్‌ల‌ను రూపొందించ‌డం వంటి అంశాల‌పై కూడా ట్రైనింగ్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీంతో 2011లో గ్రీన్‌థంబ్ బోటిక్‌ను ప్రారంభించారు. మినెట్టా కార్పొరేట్ ఉద్యోగాన్ని వ‌దులుకుంటే.. రంజిత్ మాత్రం ఖాళీ స‌మ‌యాల్లో ఈ సంస్థ కోసం స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు.

మినెట్టా, గ్రీన్ థంబ్స్

మినెట్టా, గ్రీన్ థంబ్స్


"మాకు గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం. కార్పొరేట్ ఉద్యోగాన్ని వ‌దిలేసిన త‌ర్వాత రిలాక్సింగ్ కోసం మొక్క‌ల‌తో అనుబంధాన్ని పెంచుకున్నాను. అదే నా జీవితంలో అత్య‌త్త‌మ నిర్ణ‌యంగా మారిపోయింది. రంజిత్‌ అనుకోకుండా పండ్ల‌తో కూడిన బొన్సాయిని సృష్టించారు. ఆ బొన్సాయే ఇప్పుడు మాకు ఫ‌లాలు అందిస్తున్న‌ది. అని అంటారు మినెట్టా.

కార్పొరేట్ ఉద్యోగాన్ని వ‌దులుకున్న త‌ర్వాత మొక్క‌ల పెంప‌కం, గార్డెన్‌ల‌ను రూపొందించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు మినెట్టా. రంజిత్‌ సృష్టించిన బొన్సాయి స్ఫూర్తినివ్వ‌డంతో కూర‌గాయ‌ల మొక్క‌ల‌ను కూడా పెంచ‌డం మొద‌లుపెట్టారు. ట‌మోటో, మిర్చీ, క్యాబేజీ, క్యార‌ట్‌ల‌తోపాటు వ‌న‌మూలిక‌లైన ద‌వ‌నం, వామాకు, వ‌మ్ము, పూదిన‌ వంటి సువాస‌న వెద‌జ‌ల్లే మొక్క‌ల‌ను కూడా పెంచి త‌మ‌కు తెలిసిన‌వారికి బ‌హుమ‌తిగా ఇచ్చేవారు.

image


ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌

హాబీగా మొద‌లైన మొక్క‌ల పెంప‌కం మినెట్టా, రంజిత్‌ల‌కు మంచి వ్యాపారంగా మారిపోయింది. తెలిసిన‌వారు, చుట్టుప‌క్క‌ల‌వారు త‌మ ఇళ్ల‌లో ఏదైనా వేడుక ఉంటే వీరి వ‌ద్దే మొక్క‌ల‌ను కొనుక్కుని వెళ్లేవారు. ఆ త‌ర్వాత తమ వ్యాపారాన్ని విస్త‌రించుకునేందుకు వీరు ఫేస్‌బుక్‌ను కూడా ఉప‌యోగించుకోవ‌డం మొద‌లుపెట్టారు. తాము సృష్టించిన ప్లాంట్ల‌ను ఫేస్‌బుక్ పేజీల్లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసేవారు. వీటిని న‌చ్చి ఎవ‌రైనా ఆర్డ‌ర్ చేస్తే వెంట‌నే డెలివ‌రీ చేసేవారు. స్థానికంగా జ‌రిగిన ఫెయిర్స్‌, గార్డెన్‌/ వెజిటెబుల్ మార్కెట్ల‌లో కూడా తాము సృష్టించిన అంద‌మైన స‌హ‌జ ప్ర‌కృతిని ప్ర‌ద‌ర్శించారు.

మినిమం రూ.500

క‌నిష్ఠంగా రూ. 500లు ఆర్డ‌ర్ చేస్తే త‌మ ఉత్ప‌త్తుల‌ను గ్రీన్‌థంబ్స్ హోమ్ డెలివ‌రి చేస్తుంది. ఎవ‌రైనా క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన ఆకృతిలో చేసివ్వ‌మంటే కూడా అందుకు త‌గ్గ‌ట్టుగా వారు బ‌హుమ‌తుల‌ను సృష్టించి ఇచ్చేవారు. దేశ‌వ్యాప్తంగా అలాంటి బ‌హుమ‌తులేమైనా ఉన్నాయా అని ప‌రిశోధ‌న జ‌రిపి ఆ త‌ర్వాత వాటిని త‌యారు చేసేవారు.

బాల్క‌నీ బాస్కెట్స్‌

గ్రీన్‌థంబ్స్ బెంగ‌ళూరు న‌గ‌రాల్లో సృష్టించిన బాల్క‌నీ బాస్కెట్స్ చాలామంది దృష్టిని ఆక‌ర్షించాయి. బాల్క‌నీల్లో వీరు సృష్టించిన గార్డెన్.. ఏడాది, రెండేళ్ల‌యిన త‌ర్వాత అందంగా రూపుదిద్దుకుంటుంది. ఈ గార్డెన్ గురించి క‌స్ట‌మ‌ర్లు చెబుతుంటే.. మినెట్టా, రంజిత్‌ల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయేది.

''గార్డెన్‌ను ఏర్పాటు చేసిన ఒక‌టి, రెండేళ్ల త‌ర్వాత వాటికి సంబంధించిన ఫొటోల‌ను క‌స్ట‌మ‌ర్లు మాకు పంపేవారు. బాల్క‌నీ నిండా ప‌చ్చ‌టి గార్డెన్ విక‌సిస్తుంటే.. చూసేందుకు ఎంతో ముచ్చ‌టేసేది. మా శ్ర‌మ‌కు ఇంత‌కుమించి ప్ర‌తిఫ‌లం ఇంకా ఏం అక్క‌ర్లేదు అనిపిస్తుంది. త‌మ బాల్క‌నీ మొక్క‌ల‌తో ఎంతో అందంగా ఉంద‌ని ఇటీవ‌లే ఓ క‌స్ట‌మ‌ర్ చెప్పిన‌ప్పుడు మా ఆనందానికి అంతే లేకుండా పోయింది''. అని వివ‌రించారు మినెట్టా.

image


ప్ర‌కృతే మంచి టీచ‌ర్

ఎవ‌రికైనా ప్ర‌కృతే మంచి టీచ‌ర్‌. ప్ర‌కృతిలో దొర‌క‌నిదంటూ లేదు. ప్ర‌తి రోజూ కొత్త పాఠాలు చెబుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదని అంటారు గ్రీన్‌థంబ్స్‌ వ్య‌వ‌స్థాప‌కులు. 

''ఆరంభంలో మేం కొన్ని త‌ప్పులు చేసేవారం. అప్పుడు చాలా బాధేసేది. ఆ త‌ర్వాత మొక్క‌ల‌తో ఎలా ప్ర‌వ‌ర్తించాల‌ని అన్న విష‌యాన్ని తెలుసుకున్నాం. ప్ర‌కృతే ఈ పాఠాలు మాకు నేర్పింది''. అని మినెట్టా వివ‌రించారు. ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ఎన్ని స‌వాళ్ల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌ని ఆమె చెప్తున్నారు.

''మొక్క‌ల గురించి చెప్పే అవ‌కాశ‌మున్న‌ప్పుడు.. పిల్ల‌ల‌కు వేరే అద్భుతాల గురించి చెప్ప‌డ‌మెందుకు''.. అంటారు ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత రాబ‌ర్ట్ బ్రాల్ట్‌.

ప్లాంట్ హాస్పిట‌ల్‌

బాల్క‌నీల్లో వెజిటేబుల్ గార్డెన్స్‌, హెర్బ్ గార్డెన్స్‌, టెర్ర‌స్ గార్డెన్‌వంటి వాటిని సృష్టించి ఇస్తున్న‌ది గ్రీన్ థంబ్స్ బొటిక్‌. వీటి గురించి ఎంతోమంది ప్ర‌తిరోజు మినెట్టా, రంజిత్‌ల‌కు ఫొన్ చేసి వివ‌రాలు తెలుసుకుంటున్నారు. వీరి బొటిక్‌ను ప్లాంట్ హాస్పిట‌ల్‌గా కూడా కొంద‌రు పిలుస్తారు. ఏదైనా మొక్క అనారోగ్యంగా ఉంటే.. దాన్ని పూర్తి ఆరోగ్యంగా మార్చేవ‌ర‌కూ వీరే బాధ్య‌త తీసుకుంటారు.. అందుకే వీరిది బొటిక్ కాదు.. ప్లాంట్ హాస్పిట‌ల్ అని అంటుంటారు..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags