కార్ సర్వీసింగ్‌ను సులువు చేసిన 'కార్టిసన్'
రవికి కార్లంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక.. ఎప్పటికైనా ఓ కొత్త కారు కొనుక్కోవాలని. పెద్దై.. ఓ మంచి జాబ్ సంపాదించిన తర్వాత ఆ ముచ్చట తీరింది. ఎంచక్కా ఓ మంచి కారు కొన్నాడు. సరదాగా తిరిగాడు. దాన్ని బంగారంలా చూసుకున్నాడు. అద్దంలా మెరిసిపోవాలని ప్రతీ ఆదివారం తానే దగ్గరుండి మరీ తుడుచుకున్నాడు. ఆరునెలలు గడిచింది.. ఏడాదైంది. ఆ కొత్త ముచ్చట తీరింది. వారం రోజుల క్లీనింగ్ కాస్తా.. పదిహేను రోజులు.. నెలైంది. మెయింటెనెన్స్‌కు కూడా కష్టమైంది. ఇంటి దగ్గర మెకానిక్‌కు ఇద్దామంటే ధైర్యం సరిపోదు. డీలర్ దగ్గరికి వెళ్లి ఇచ్చేంత టైం లేదు.
ఒక్క రవికే కాదు.. రోజు వారి రెగ్యులర్ యాక్టివిటీస్‌తో ఉండే యజమానులుకు ఇది కష్టమైన పని. మరో వైపు నమ్మకంగా సర్వీస్ అందించే వారు లేకపోవడంతో.. ఓనర్లు ఆ విషయంలో కొంత సందిగ్ధంలో ఉన్నారు. కొంతమంది మిత్రుల సూచనలు, సలహాలపై ఆధారపడుతున్నారు. అయితే వీటిన్నింటికి వన్ స్టాప్ సొల్యూషన్స్ అందించేందుకు రెడీ అయింది www.cartisan.in. ఎంతో కాలంగా ఈ రంగం అవ్యవస్థీకృతంగా ఉంది. పారదర్శకత అనే పదం ఇక్కడ వినిపించదు. నైపుణ్యం లేని మెకానిక్స్, ఘోరమైన సర్వీస్.. ఈ రంగంపై అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
ఆటోమోటివ్ రంగాన్ని రెండు విభాగాలుగా చూడాలి. ఇక్కడ వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. మెట్రో నగరాల్లో 40% సేవలు వ్యవస్థీకృత రంగానికి వెళతాయి. మిగిలినదంతా అన్ ఆర్గనైజ్డ్. అందుకే ఈ రంగంలో మెరుగైన సేవలు కంటే పూర్తిస్థాయి ప్రక్షాళన అవసరం. డిమాండ్, సరఫరాకు మధ్య ఉన్న అంతరానికి తగ్గించేందుకు ఏర్పాటు చేసిందే 'Cartisan' అని వివరిస్తారు కంపెనీ వ్యవస్థాపకులు .
జూన్ 2015 లో వెంకట్ శ్రీరామ్, శరత్ మూర్తి, పీట్ బుల్లీలు కార్టిసన్ ప్రారంభించారు. అన్ని రకాల వాహనాలకు సంబంధించిన వివిధ సేవలు ఇక్కడ పొందొచ్చు. ఇది కారు యజమానులకు ఇంటరాక్టివ్ ప్లాట్ ఫాం.
" మేము ఫాస్ట్ వాషింగ్ మొదలు మేజర్ బాడీ రిపేర్ల వరకూ అన్నీ హ్యాండిల్ చేస్తాం. అన్ని రకాల సేవలూ విస్తృత శ్రేణి తో మా వినియోగదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పబ్లిక్ నుంచి వచ్చే డిమాండ్ ఆధారంగా మరిన్ని సేవలను జోడించే ఆలోచన ఉందని'' CEO వెంకట్ శ్రీరామ్ చెప్తారు.
ఇప్పటివరకు 100 కు పైగా సర్వీసు ప్రొవైడర్స్ తమతో కలిసి పనిచేయడానికి వచ్చారని చెబుతున్నారు. ఎలాంటి సర్వీసులు ఆఫర్ చేస్తున్నారు, ఏ కార్లలో స్పెషలైజేషన్ ఉంది, ఏరియా ఎక్కడ, సర్వీస్ ఎలా ఉంది, కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఏంటి అనే ఆధారంగా వీళ్లను ఎంపిక చేశారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో 3M కార్ కేర్, బాష్ కార్ సర్వీస్ సహా.. కొన్ని అధీకృత కంపెనీల సంస్థలూ ఉన్నాయి. అందిస్తున్నాయి. కారు కంపెనీలు అధికారంగా సేవలు అందించేవి ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మాత్రమే పరిమితమైన సేవలను త్వరలో ఇతర నగరాలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది 'Cartisan.
స పరిష్కారం
Cartisan ఓ ఈజీ ఆపరేటింగ్ సిస్టమ్. ఎలాంటి ఒత్తిడీ సమస్యా లేకుండా తమకు అనువైన సర్వీసులను ఎంపిక చేసుకోవచ్చు. వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, ధరల్లో హెచ్చుతగ్గులు, సేవలో నాణ్యత లోపించడం వంటి ప్రధాన సమస్యలకు తాము పరిష్కారం చూపుతామని కార్టిసన్ ధీమాగా చెబ్తోంది. ఎవరు ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు, ధరలు ఎంత తీసుకుంటున్నారు, రేటింగ్స్‌తో పాటు కస్టమర్ల రివ్యూలను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి సదరు టెక్నీషియన్ లేదా సర్వీస్ సెంటర్లో మన కార్ రిపేర్‌కు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునేందుకు కస్టమర్‌కు అవకాశం ఉంటుంది.
''ముఖ్యంగా వినియోగాదారుల్లో విశ్వాసం నెలకొల్పడం మా లక్ష్యం. వాళ్ల అవసరం కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మా పైనా, మా సర్వీస్ ప్రొవైడర్లపై భరోసా నింపగలగాలి. ఎవరికైనా సర్వీస్ కావాలంటే www.cartisan.in ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఓ యాప్‌ను కూడా తీసుకువచ్చాం. కార్ మోడల్ ఏంటి, ఎలాంటి సర్వీస్ కావాలో చెప్తే మీకు కావాల్సిన వివరాలన్నీ తెలుస్తాయి '' అంటారు వెంకట్.
ఈ యాప్ వల్ల సర్వీస్ ప్రొవైడర్లకు ఉపయుక్తంగా ఉండనుంది. వాళ్లు యాప్ ద్వారానే సర్వీస్ రిక్వెస్టులను అందుకోవచ్చు. ఒక వేళ కస్టమర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే ఆ వివరాలు నేరుగా సర్వీస్ స్టేషన్లకు వెళ్తాయి. ఒక వేళ ఆ ఏరియాలో సర్వీస్ లేకపోయినా.. లేక ఇతర సర్వీస్ స్టేషన్లన్నీ బిజీగా ఉన్నా.. ఇతర ప్రత్యామ్నాయాలను కూడా కార్టిసన్ సూచిస్తుంది. వీటితో పాటు సర్వీస్ ఎక్కడి వరకూ వచ్చిందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు కస్టమర్‌కు అందించే వీలుంటుంది.
వీటితో పాటు డాష్ బోర్డ్‌లో సర్వీస్ సెంటర్ ప్రొఫైల్స్, వాళ్ల పనివేళలు, సంప్రదించాల్సిన చిరునామా, ఫోన్ నెంబర్ వంటి వివరాలను కూడా అందిస్తున్నారు.
పోటీ ఎలా ఉంది
ఈ రంగంలో చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం కూడా మార్కెట్ మరింత విస్తరించేందుకు అవకాశముంది.
జస్ట్ డయల్, అర్బన్ క్లాప్ వంటివి కేవలం లిస్టింగ్ వేదికలు మాత్రమే. వాళ్లు ప్రత్యేకించి ఆటోమోటివ్ విభాగంలో సేవలు అందించడం లేదు. అందుకే ఇప్పటి దాకా స్పష్టమైన, పోల్చిచూసుకునే వేదికేదీ భారత్‌లో లేదు అనేది వెంకట్ విశ్లేషణ.
ఇప్పటి వరకూ మాకు అందిన ఫీడ్ బ్యాక్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మా కస్టమర్లు ఈ ప్లాట్‌ఫాంను వాడుకోవడానికి సుముఖంగా ఉన్నారు. ''ప్రస్తుతానికి ఈ సేవలను కస్టమర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు ఉచితంగానే అందిస్తున్నారు. కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిన తర్వాత ఆదాయాన్ని ఎలా సంపాదించాలనే దానిపై స్పష్టత వస్తుంది. మా లక్ష్యం ఏంటంటే.. సులువైన, పారదర్శక అనుభూతిని కస్టమర్లకు అందించడమే'' అంటారు వెంకట్.
భవిష్యత్ లక్ష్యాలు
ప్రస్తుతానికి కార్టిసన్ సొంత నిధులనే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కొంత మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. త్వరలో మొదటి రౌండ్ ఏంజిల్ ఫండింగ్ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.
''మేం ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి కేవలం ఒక నెల రోజులు మాత్రమే అయింది. అయినా ట్రాక్షన్, వెబ్ రెస్పాన్స్ మెరుగ్గా ఉంది. మేం మొదట బెంగళూరుకే పరిమితమై ఇక్కడ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఉన్నాం. ఆరు నెలల తర్వాత ఇతర నగరాలకు వెళ్లే యోచన ఉంది. వృద్ధి చెందేందుకు ఈ రంగానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఇది కస్టమర్లకు.. మార్కెట్‌కూ ఇద్దరికీ మంచిదే అంటారు వెంకట్.
కార్టిసన్‌కు మెరుగైన అవకాశాలే ఉన్నాయి. అయితే నమ్మకమైన సర్వీస్ ప్రొవైడర్లను కస్టమర్లకు అందించగలిగితే ఎంతో మంది ఇంకా వచ్చే అవకాశముంది. కస్టమర్లు ఇప్పటి వరకూ అవ్యవస్థీకృతంగా ఉన్న రంగంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాణ్యమైన, ప్రొఫెషనల్ సేవలు అందించే వాళ్లు ఎవరు వచ్చినా ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు.