సంకలనాలు
Telugu

మురికివాడల విద్యార్థులకు మెరుగైన అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తున్న బిల్డింగ్ బ్లాక్స్

అస్తిత్వంపై ఆలోచనే అంబట్‌కు ప్రేరణమారుమూల గ్రామాలకు ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంబిల్డింగ్ బ్లాక్స్ అంటూ స్లమ్ ఏరియాల్లో చిన్నారులకు శిక్షణ

ABDUL SAMAD
29th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పశ్చిమ సిక్కింలో బ్యురియోఖాప్ ఓ గ్రామం. ఈ ప్రాంతమంతా కొండలతో నిండి ఉంటుంది. సిక్కిం హిమాలయన్ అకాడమీ పేరుతో నడిచే ఓ చిన్న ఇంగ్లీష్ అకాడమీయే ఈ కొండప్రాంతవాసులకు విద్యాస్థలం. ఇక్కడ ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉండదు. దశాబ్దాలుగా ఇక్కడ ఇదే పరిస్థితి.

image


తగినన్ని ఆరోగ్య వసతులు కూడా లేని ఈ ప్రాంతవాసుల అభివృద్ధి అంతా పర్యావరణం చుట్టే సాగుతుంటుంది. నవజీవితాలకు ఆమడదూరంలో నిలిచిపోయిన ప్రాంతమిది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటు ఎంతటి అవసరమో... ఈ కుగ్రామాన్ని చూస్తే మనకు అర్ధమవుతుంది. కొంతకాలం క్రితం సిక్కింని చూసినపుడు ఇది జేమ్స్ సురేష్ అంబట్ చూసిన వాస్తవస్థితి. ఇలాంటి పరిస్థితులున్న బ్యురియోఖాప్ ప్రాంతం టెక్నాలజీలో చుట్టుపక్కల పట్టణాలకు కూడా మార్గదర్శకంగా మారిందంటే దానికి కారణం ఆ వ్యక్తే.

జేమ్స్ సురేష్ అంబట్... ఆరుగురు కొడుకులున్న కుటుంబంలో అతి పెద్దవాడు. పుట్టింది భారత దేశంలోని ఓ మారుమూల ప్రాంతంలో. ఇప్పుడు తాను చూస్తున్న పరిస్థితులన్నీ అతను గతంలో స్వయంగా ఎదుర్కొన్నవే. ఇల్లు, స్కూల్ మధ్య కనీసం చెప్పులు కూడా లేకుండా ప్రయాణించిన రోజులను అతను మర్చిపోలేదింకా...! అతి సామాన్యమైన జీవితం ఎంతటి దుర్భరంగా ఉంటుందో అతనికి ఎవరూ చెప్పక్కర్లేదు. ఏ ఆశా లేకుండా బతకడంలోనే ఆనందం ఎంతో ఉంటుంది అనుకునే రోజులను ఎప్పటికి మర్చిపోలేరు అంబట్.

కాలేజ్ జీవితం అంబట్ లైఫ్‌ను మలుపుతిప్పింది. ఒకే తరహా జీవితం తెలిసిన అతను విభిన్న సంస్కృతులను, మనుషులను ఒకేసారి చూసే అవకాశం కల్పించింది. పేదల, ధనికుల జీవనశైలిలో మార్పులనూ తెలియచేసింది.

‘నేనెప్పుడు ఎవరి మాటలు విన్నా... అవన్నీ డబ్బు చుట్టూనే తిరిగేవి. ఇంకా సంపాదించడం ఎలా ? దాన్ని పెంచి పెద్ద నిధిగా మార్చడం ఎలా ?... అంతే నేను కూడా అదే గుంపులో కలిసిపోయా. ఉద్యోగం, డబ్బు, కుటుంబం... ఈ తరహా జీవనంపైనే దృష్టి పెట్టా’ అంటారు అంబట్.

జీవితాన్ని మార్చేసిన ప్రమాదం

అన్ని రోజులూ ఒకేలా ఉండవు. ఒక యాక్సిడెంట్‌లో అస్తిత్వానికే ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. అస్తిత్వం కోసం చేసిన పోరాటం జీవితంలో మార్పులు తీసుకొచ్చింది. మన కోసమే కాకుండా నలుగురికీ ఏదైనా చేయాలనే తపన ఏర్పరచింది.

‘ఒక వేళ నేను మరణిస్తే ఏమయ్యేది ? నా జీవితంలో నేనేం చేశాను ? ’ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేశానంటారు అంబట్. ఇందుకోసం చాలా ప్రాంతాలు తిరిగారు కూడా. ఇలాంటి పరిస్థితి ఎదుర్కున్న ఎంతో మందిని కలిశారు. అంతా తిరిగి ఆయన తెలుసుకున్నదొకటే. స్వలాభం కంటే ఇతరుల మేలు కోసం జీవించడంతోనే ఆత్మ సంతృప్తి మిగులుతుందని. దానిలోనూ ఓ ఆనందం ఉంటుందని.

ఈ యాత్రకు 30 ఏళ్లు

‘ఈ ఆలోచన వచ్చి ఇప్పటికి 30ఏళ్లు గడించింది. నేనెప్పుడూ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదు. చరిత్రలో ఓ వ్యక్తిగా మిగలడం కంటే, ఒక జీవితంలో మార్పు తేవడమే గొప్ప అని భావించా. ఒక మనిషికి అసలు సార్ధకత లభించేదప్పుడే’ అంటారు అంబట్.

‘నేను చనిపోయాక ఈ ప్రపంచం నుంచి కనీసం పూచికపుల్ల కూడా తీసుకెళ్లలేనని నాకు తెలిసింది. మరిక దేని కోసం ఈ స్వార్ధం, స్వలాభం అనిపించింది. ఇవన్నీ టైం వేస్ట్ వ్యవహారాలు అనిపించాయి.’

2004లో బెంగళూరులోని ఉల్సూర్‌లో ఇదే వేదాంతాన్ని మనసులో ఉంచుకుని తన ప్రణాళిక ప్రారంభించారు. అదే బిల్డింగ్ బ్లాక్స్ పేరుతో మొదలైన స్కూల్. ప్రారంభంలో ఒక టీచర్, 4-5గురు విద్యార్ధులు అంతే. ఇందులో ఏ విధమైన ఫర్నిచర్ ఉండదు. అక్కడికి దగ్గరలోని స్లమ్ ఏరియానుంచి పిల్లలు వచ్చేవారు. పిల్లలకు ఫుడ్, స్టేషనరీ, బుక్స్ అందించేందుకు చిన్న చిన్న విరాళాల ఆధారంగానే ఈ స్కూల్ నడిచేది.

image


ప్రస్తుతం బిల్డింగ్ బ్లాక్స్‌కు 7 స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 79 మంది టీచర్లు, 700 మంది విద్యార్ధులతో విద్యాకుసుమాలు పూయిస్తోంది. మురికివాడల్లోని పిల్లలకు ఇక్కడ విద్య పూర్తిగా ఉచితం. అది కూడా హైక్లాస్ స్టాండర్డ్స్‌, టూల్స్‌తో బోధనా తరగతులుంటాయి. ఇదో ఛారిటీ సంస్థ కావడంతో చిన్నారులకు శిక్షణ ఇవ్వడంలో టీచర్లకు నైపుణ్యం పెంచేందుకు... ప్రపంచవ్యాప్తంగా వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహించే ప్రముఖులు నిపుణుల నుంచి మద్దతు లభిస్తోంది.

‘ప్రస్తుతం ఈ స్కూల్‌లో 3 నుంచి 6 ఏళ్ల మధ్య వయసులో ఉన్న పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. మరికొన్నేళ్లలో ఈ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో నేర్పించేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకు మా తరఫు నుంచి మద్దతు ఉంటుంది. మేమే ఓ పెద్ద స్కూల్ ఏర్పాటు చేయడం మా లక్ష్యం. మా ఉద్దేశాలకు అనుగుణంగా దీని నిర్వహణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. కాలేజ్ స్థాయి వరకూ అత్యుత్తమ విద్యను ఉచితంగా అందిచడమే మా ప్రధాన లక్ష్యం’

అంబట్ దృష్టిలో ఈ తరహా స్థాయి విద్య పేదవాళ్లందరికీ ఉచితంగా అందాల్సిన అవసరముంది. దానితోపాటే ఆహారం, వైద్య సదుపాయాలు కూడా. ఇందుకోసం తమ సంస్థ చాలా బలం పుంజుకోవాలంటారు ఆయన. ప్రస్తుతం తాము చిన్న స్థాయిలోనే ఉన్నామని అంగీకరిస్తారు కూడా.

image


‘ఇక్కడ రెండేళ్ల పాటు అత్యుత్తమ స్థాయిలో ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత... తిరిగి వారి మాతృభాష పాఠశాలల్లో చేరాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే ఈ రెండేళ్ల సమయం వృథా అయినట్లే. అయితే ఇందుకు వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మెరుగైన స్థాయిలో ఉండకపోవడం కూడా కారణం కావచ్చు. అందుకే ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేలే చర్యలు తీసుకుంటున్నామం’టారు అంబట్.

రైట్ టు ఎడ్యుకేషన్ పథకం విద్యార్ధులకు.... మరీ ముఖ్యంగా తమ దగ్గర శిక్షణ పొందిన చిన్నారులకు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నారు అంబట్. ప్రస్తుతానికి వీలైనన్ని మురికివాడలకు బిల్డింగ్ బ్లాక్స్‌ను విస్తరించడమే ప్రాథమిక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. త్వరలోనే దేశంలోని మారుమూల గ్రామాలకు విస్తరించే యోచన కూడా ఉంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags