సంకలనాలు
Telugu

స్టార్టప్ సంస్థల ఓనర్లు చేసే 11 పొరపాట్లు ఇవి !

r k
9th Aug 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

వ్యాపారం అంటే అంత ఈజీ కాదు. ఎంతో అనుభవం కావాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించినవారు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. వ్యాపారానికి కొత్తైతే పొరపాట్లు అనేకం. కొత్తగా కంపెనీ ప్రారంభించే ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎలాంటి తప్పులు చేస్తారో ఫైండ్ యోగి వ్యవస్థాపకుడు న‌మాన్ స‌ర‌వాగి వివరించారు. ఆ పొరపాట్లు ఏంటో ఆయన మాటల్లోనే..

image


ఫైండ్ యోగి ప్రారంభించిన మూడేళ్ల‌లో 20 నుంచి 25 మంది వ్య‌వ‌స్థాప‌కుల‌తో మాట్లాడ‌ాము. ప్ర‌తిరోజూ మేము క‌లుసుకుంటాం. అలాగే మా స‌మ‌స్య‌ల‌ను లంచ్ స‌మ‌యంలో పరస్పరం పంచుకుంటాం. వారికి నేను ఏ విధంగానూ సాయం చేయ‌కపోయిన‌ప్ప‌టికీ మేం చేస్తున్న పొర‌పాట్లు ఏమిటో గుర్తించ‌గ‌లిగాం. చాలామంది వ్య‌వ‌స్థాప‌కులు నా క‌న్నా ప‌దేళ్లు పెద్ద‌. చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో ప‌నిచేశారు. కాబ‌ట్టి వ‌య‌సుతో కానీ, అనుభ‌వంతో కానీ ఇక్క‌డ ప‌నిలేదు. కొన్నిసార్లు భ‌యం, మ‌రికొన్ని సార్లు సోమ‌రిత‌నం ఇవే పొర‌పాట్ల‌కు కార‌ణం.

పొర‌పాట్ల జాబితా ఇదే..

1. ఫ్లెక్సి టైమింగ్స్

ప్ర‌తిరోజు ప‌ది గంట‌ల‌పాటు ప‌నిచేసేందుకు ప్ర‌య‌త్నించాలి. ఉద‌యం తొమ్మిది నుంచి రాత్రి ఏడు వ‌ర‌కు ప‌ని చేయ‌డం మంచిది. ఈ స‌మ‌యంలో ప‌నిచేయ‌డం వ‌ల్ల యాక్టివ్‌గా ఉండ‌టంతోపాటు మాన‌సికంగా, శారీర‌కంగా ఫిట్‌గా ఉండొచ్చు. టీమ్ మెంబ‌ర్స్‌తో క‌లిసి ప‌నిచేసే గంట‌లు ఎంతో ముఖ్యం. అనుకూల స‌మ‌య‌మ‌నేది.. క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యానికి స‌రైన ఉదాహ‌ర‌ణ‌. క్ర‌మ‌శిక్ష‌ణే అన్నిటికంటే ముఖ్య‌మైన‌ది.

2. ఉద్యోగుల‌ ఎంపిక‌కు స‌రైన స‌మ‌యం కేటాయించకపోవడం

విమాన టికెట్ త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుందంటే గంట‌ల‌ పాటు ఇంట‌ర్నెట్‌లో కాలం గడిపే వ్య‌వ‌స్థాప‌కులకు త‌మ సంస్థ‌లోకి వ‌చ్చే కొత్త ఉద్యోగుల గురించి ప‌ట్టించుకునేందుకు మాత్రం స‌మ‌యం చిక్క‌దు. నెల‌ల‌పాటు భారీగా ఖ‌ర్చు చేయ‌డం.. ఒక్క‌సారి డిస్కౌంట్ పొంద‌డం కంటే చాలా ఎక్కువ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

3. నో కోడింగ్

వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉంటే త‌యారు చేయ‌గ‌లగాలి లేదా అమ్మ‌గ‌ల‌గాలి. మిగ‌తావి అంత అవ‌స‌రం ఉండ‌దు. తొలిసారిగా సంస్థ‌ను ప్రారంభించిన‌వారు సాధార‌ణంగా క్ల‌రిక‌ల్ వ‌ర్క్స్‌ను, ఇత‌ర విష‌యాల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకుంటూ టెక్నాల‌జీ, సేల్స్ వంటి కీల‌క రంగాల‌ను ఇత‌రుల‌కు అప్ప‌జెప్తుంటారు. అలాంటి స్టార్ట‌ప్స్ ఎక్కువ కాలం కొన‌సాగిన‌ట్టు మ‌న‌కు ఎక్క‌డా వినిపించ‌దు.

4. ఇత‌ర స్టార్ట‌ప్స్ గురించి చ‌ర్చించ‌డం 

ఈ అంశం అంటే నాకు ఎంతో ఇష్టం. ఇందులోంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఇప్ప‌టికీ నేను ప్ర‌య‌త్నిస్తున్నాను. ఇద్ద‌రు వ్య‌వ‌స్థాప‌కులకూ డాట్‌కామ్ గుర్తింపే ఉండి ఉండొచ్చు. అలా అనీ వారిద్ద‌రి ఇండ‌స్ట్రీస్ ఒక‌టే కావు. అందువ‌ల్ల వాటి గురించి చ‌ర్చించ‌డం అన‌వ‌స‌రం. దానికి బ‌దులుగా మంచి వ‌స్తువును త‌యారు చేయ‌డంపైనో లేక ఓ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌డంపైనో దృష్టిసారించాలి. ఇత‌ర స్టార్ట‌ప్స్‌లో ఏం జ‌రుగుతుందో మ‌న‌కు అన‌వ‌స‌రం.

5. లోగోను రూపొందించేందుకు ప్ర‌య‌త్నించాలి

మార్కెట్‌కు మ‌న ప్రాడ‌క్ట్ ఫిట్ అవుతుందో లేదో మ‌న‌కు తెలియ‌న‌ప్పుడు మ‌న సంస్థ లోగో ఎలా ఉండాలో ఎలా తెలుస్తుంది ? ఒక్క‌సారి విజ్ రాకెట్స్ లోగో చూడండి. చూసేందుకు సింపుల్‌గా ఉన్నా కంపెనీ గురించి లోగోను చూడగానే ఒక్క ముక్క‌లో చెప్పేస్తుంది. వారి వెబ్‌సైట్ లాంచ్ కాక‌ముందే వారికి క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు.

6. చ‌ర్చ‌ల‌ను అసంపూర్తిగా వ‌దిలేయ‌డం

మంచి విష‌యంపై చ‌ర్చ‌లు ఎప్పుడూ మంచివే. వాటిని అసంపూర్తిగా వ‌దిలేయొద్దు. మ‌రింత స‌మ‌చారాన్ని ముందు పెట్టుకుని నిర్ణ‌యం తీసుకోవాలి. అసంపూర్తిగా వ‌దిలేసిన ప్ర‌తి చ‌ర్చా ఒక ప్రాడ‌క్ట్‌పై మ‌రిన్ని రోజులు ప‌నిచేసేలా చేస్తుంది. ఒకరితో ఒక‌రు ప‌ర‌స్ప‌రం స‌రిగా చ‌ర్చించుకోలేని ఏ ఇద్ద‌రినీ ఒకే టీమ్‌లో ఉంచ‌కూడ‌దు.

7. ఫేస్‌బుక్‌లో గ‌డ‌ప‌డం

ఫేస్‌బుక్ అనేది ఒక ప‌నికిరాని ప్ర‌పంచం. మ‌న‌కు తెలియ‌నివారి టైమ్‌లైన్‌ల‌లో గ‌డుపుతూ గంట‌ల‌కొద్ది స‌మ‌యాన్ని వృథా చేయొద్దు. ప‌ది డాల‌ర్ల యాడ్‌ను ర‌న్ చేస్తూ మ‌న అంచ‌నాల‌ను ప‌రీక్షించుకోవాలి.

8. త‌ప్పుగా రాసుకోవ‌ద్దు

ఇది మేనేజ్‌మెంట్ సూత్రం 101. ఎప్పుడూ రాత‌పూర్వ‌క‌మైన ఆదేశాలే ఇవ్వాలి. నోటిమాట‌గా చెప్పిన సూచ‌న‌లు ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌తీస్తాయి. మ‌రిన్ని చ‌ర్చ‌ల‌కు కార‌ణ‌మవుతాయి. మ‌న‌మేదైనా కొత్తగా చేస్తుంటే, అవి ఏవీ పూర్తిగా ఉండ‌వు. అప్పుడు వాటిని పేప‌ర్‌పై రాసుకుంటే మ‌న ఆలోచ‌న‌ల‌కు ఒక రూపం తీసుకురావొచ్చు.

9. మైల్ స్టోన్స్ ఒక్కటే లక్ష్యంగా పనిచేయొద్దు

మ‌రో ఆరు నెల‌ల్లో పెట్టుబ‌డుల‌ను స‌మీక‌రిస్తాం అని ఎప్పుడూ ఎవరితోనూ అనొద్దు. ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని, ఆ మైలురాయిని చేరుకుంటే పెట్టుబ‌డులు అవే వ‌చ్చేస్తాయన్న అభిప్రాయం అంద‌రికీ క‌లిగించాలి. ఈ మైలురాయిని చేరగలిగితే.. దాని తర్వాత ఉన్న మైలురాయిని కూడా చేరడం సులభమవుతుంది. ఒక్కో మైల్‌స్టోన్‌ను ల‌క్ష్యంగా పెట్టుకుని ప‌నిచేయాలి. ఇది మ‌రింత ముందుకు దృష్టిసారించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒకేసారి ప‌లువురు వ్య‌క్తుల‌తో పెట్టుబడుల గురించి మాట్లాడ‌టంలో త‌ప్పులేదు. ఇందులో ఒక‌రికంటే ఎక్కువ‌మంది పాజిటివ్‌గా స్పందిస్తే.. మిగ‌తావారికి సున్నితంగా నో చెప్పండి.

10. స్టార్ట‌ప్ టైప్ పీపుల్‌ను ఎంపిక‌చేసుకోండి 

ఏంజిల్ లిస్ట్ లేదా గిట్ హ‌బ్‌ల‌లో ప్రొఫైల్ ఉన్న‌వారు పెద్ద నిపుణులేమీ కారు. స్టార్ట‌ప్ కూతుహ‌లం నైపుణ్య ల‌క్ష్య‌ణ‌మేమీ కాదు. ఉద్యోగులకు మ‌ళ్లీ శిక్ష‌ణ ఇచ్చేంత స‌మ‌యం మ‌న‌కు లేదు. అన్ని ప‌నులు చ‌క‌చ‌కా చేసే వారినే ఎంచుకోండి. పెద్ద పెద్ద కంపెనీల మాదిరిగా ఉద్యోగ నియమ‌కాల్లో కాపీయింగ్ చేయ‌కండి. ఎందుకంటే పెద్ద కంపెనీలు అప్ప‌టికే ఓ స్థాయికి చేరుకుని ఉండి ఉంటాయి.

11. అవ‌స‌రం లేని విష‌యాల‌ను విన‌డంలో జాగ్ర‌త్త‌లు 

ఇత‌ర స్టార్ట‌ప్‌ల గురించి మ‌న‌కు తెలిసినంత‌గా కూడా ఇత‌రుల‌కు తెలియ‌దు. ఇత‌ర స్టార్టప్‌ల గురించి ఇత‌ర ఫౌండ‌ర్లు, ఇన్వెస్ట‌ర్లు కాకుండా జ‌ర్న‌లిస్టుల ద్వారా స‌మాచారం వ‌స్తే జాగ్ర‌త్త‌గా ఉండండి. ఎందుకంటే అది కేవ‌లం మీడియా అటెన్ష‌న్ కోసం వ‌చ్చిన‌ది కావొచ్చు. అది మ‌న‌కు ఏ విధంగానూ ఉప‌యోగ‌ప‌డ‌దు. వారికి త‌ప్ప‌. మ‌న‌కు సంబంధం ఉంటే త‌ప్ప మ‌న‌కు వాటి గురించి తెలియ‌దు. అలాంటి స్టోరీల‌ను ఇలా విని అలా వ‌దిలేయాలి. మ‌న అంచ‌నాల‌పైనే ఆధార‌ప‌డాలి.

ర‌చ‌యిత గురించి..

న‌మాన్ స‌ర‌వాగి ఫైండ్ యోగి వ్య‌వ‌స్థాప‌కులు. కొనుగోలు చేసేందుకు ఏ వస్తువు నాణ్యత ఎలాంటిదో వినియోగ‌దారుల‌కు ఈ సంస్థ సూచనలు ఇస్తుంది. ఫ్రీచార్జ్‌, జిప్‌ డ‌య‌ల్ వంటి సంస్థ‌ల అభివృద్ధికి న‌మాన్ ఎంతో సాయం చేశారు.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags