సంకలనాలు
Telugu

ఇండియన్ సినిమాలను ఆన్ లైన్ లో అందిస్తాం..!!

ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో అదుర్స్ అనిపిస్తున్న స్పుల్-త్వరలో టీవీ ప్రోగ్రామ్స్, సొంత కార్యక్రమాలు

uday kiran
2nd Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కాలం మారుతోంది. అందుకు తగ్గట్లుగానే మనుషుల వైఖరుల్లోనూ మార్పు వస్తోంది. ఒకప్పుడు నచ్చిన సినిమా మళ్లీ చూడాలంటే వీడియో పార్లర్ కు వెళ్లి క్యాసెట్ తెచ్చుకుని వీసీఆర్ లో ప్లే చేసుకుని చూసుకోవాల్సి వచ్చేది. కాలక్రమంలో వీడియో క్యాసెట్ల స్థానాన్ని సీడీలు, డీవీడీలు ఆక్రయించాయి. కోరుకున్న సినిమా సీడీ ఒక షాపులో దొరకలేదంటే వీడియో పార్లర్ ల చుట్టు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది . కానీ మోడ్రన్ టెక్నాలజీ ఇప్పుడీ కష్టాలన్నింటికీ చెక్ పెట్టింది. ఇష్టమైన సినిమాల్ని కోరుకున్న సమయంలో చూసుకునే వెసలుబాటు కల్పించింది ఆన్ లైన్ స్ట్రీమింగ్. విదేశాల్లోనూ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు ఆదరణ ఉన్నా... ఇండియాలో ప్రసారమయ్యే టీవీ ప్రోగ్రామ్స్, న్యూస్, ఐపీల్, క్రికెట్ , మూవీస్ అందుబాటులో లేకపోవడం విదేశాల్లో ఉంటున్న ఇండియన్స్ కు అసంతృప్తినే మిగులుస్తోంది. ఈ అసంతృప్తే.. మిత్ర త్రయం సుబిన్ సుబయ్య, ఎస్. మోహన్, సుదేశ్ అయ్యర్ ను ఆలోచనలో పడేసింది.

విదేశాల్లో డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిని కూడా ముగ్గురు గమనించారు. సింగపూర్ లో స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్, న్యూస్ ఇలా ఒక్కో కేటగిరినీ ఒక్కో ప్యాకేజీగా విభజించి సొమ్ము వసూలు చేయడమే కాదు.. ఐపీఎల్ మ్యాచ్ లు ప్రసారం చేసినందుకు 40 నుంచి 50 డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ల ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఏదో ఒకటి చేయాలన్న ఈ ముగ్గురు మిత్రులకు వచ్చిన మెరుపులాంటి ఐడియానే ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ స్టార్టప్ స్పుల్.

ఇంతకీ ఎవరీ ముగ్గురు?

image


ఇండియాలో సోని టెలివిజన్ ఫౌండర్స్ లో ఒకరు సుదేశ్. ఇండస్ట్రీలోతుపాతులు తెలిసిన వ్యక్తి. ఇక సిలికాన్ వ్యాలీ, సింగపూర్ లో కంపెనీలను స్థాపించి వాటిని లాభాల బాటలో నడిపిస్తున్న సీరియల్ ఎంట్రప్రెన్యూర్ మోహన్. డాయిష్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్ లాంటి బడా బడా కంపెనీల్లో పనిచేసిన బ్యాంకర్ సుబిన్ సుబయ్య. ఈ ముగ్గురి కృషి తో 2012 ఏప్రిల్ 5న సింగపూర్ హెడ్ క్వార్టర్ గా స్పుల్ సర్వీస్ ప్రారంభమైంది. ముంబైలో స్పుల్ రీజినల్ ఆఫీస్ ఉంది. ప్రస్తుతం సుదేశ్ స్నేహితుడైన రాజీవ్ వైద్య సీఈఓ హోదాలో ఇండియన్ ఆపరేషన్స్ చూసుకుంటున్నారు. 2014లో బేటా వెర్షన్ ను లాంచ్ చేసిన స్పుల్ ఇండియన్ మూవీస్, టీవీ షోస్ ను అందించే మోస్ట్ పాపులర్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ గా జనానికి దగ్గరైంది. ప్రస్తుతం స్పుల్ కస్టమర్లలో 60 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు.

ఇదో మూవీ లైబ్రరీ

ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న స్పుల్ వద్ద ప్రస్తుతం 1000కి పైగా సినిమాలను అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు మరిన్ని సినిమాలు అందుబాటులోకి తెచ్చేందుకుగానూ, యశ్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ, వీనస్, షిమారో, రిలయన్స్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కేవలం బాలీవుడ్ కే పరిమితం కాకుండా, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ సినిమాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే వెసలుబాటు కల్పిస్తోంది. అంతేకాదు.. త్వరలోనే గ్రేట్ ఇండియన్ స్మాల్ స్క్రీన్ - టెల్లీవుడ్ టీవీ ప్రోగ్రామ్ లను కూడా ఆన్ డిమాండ్ లో అందించేందుకు రెడీ అవుతోంది.

“ స్పుల్ లో అందుబాటులో ఉంచిన సినిమాలు, టీవీ షోలను వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా చూడవచ్చు. స్పుల్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్ లలోనూ పనిచేస్తుంది. మనకు నచ్చిన ప్రోగ్రాంలు, సినిమాలు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. వెబ్ సైట్ , స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ ఏ డివైజ్ లో అయినా సినిమా, మరే ఇతర షోగానీ చూడటం మధ్యలో ఆపేస్తే మళ్లీ చూడాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఆపేశామో అక్కడి నుంచి ఇతర డివైజ్ లలోనూ చూసుకునే వెసలుబాటు స్పుల్ లో ఉంది”- రాజీవ్

ఇండియాలో నెట్ వర్క్ ప్రాబ్లం దృష్ట్యా ఆఫ్ లైన్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది స్పుల్. ఈ విధానంలో భాగంగా వీడియోను ఆఫ్ లైన్ మోడ్ లో 72 గంటలలోపు ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉంది. స్పుల్ లో సినిమాలు, వీడియోలను ఫ్రీ, అన్ లిమిటెడ్ మంత్లీ సబ్ స్క్రిప్షన్, పే పర్ మూవీ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఫ్రీమియం మోడల్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో ఒక పూల్ లో ఉన్న 1000 సినిమాల్లో 600 మూవీస్ ను ఫ్రీగా, 300 సినిమాలను పే - పర్ - వ్యూ లో చూసుకోవచ్చు. ఒక కస్టమర్ నెలకు 300 రూపాయల సబ్ స్క్రిప్షన్ చెల్లిస్తే 600+300 యాడ్ ఫ్రీ మిగతా 100 పే - పర్ - వ్యూ మోడల్ లో చూసుకోవచ్చు. లెటెస్ట్ మూవీస్ అన్నీ మొదట ప్రీమియం మోడల్ లో నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఫ్రీగా అందుబాటులోకి తెస్తారు.

“మా వద్ద పెద్ద క్యాటలాగ్ లేదు. అందుకు కారణం ఉంది. ఏ డివైజ్ లో ఎవరు ఏం చూస్తారు. ఎంతమేర చూస్తారన్న డేటా మా వద్ద ఉంది. దాని ప్రకారం చాలా మంది పాత సినిమాలు చూసేందుకు ఇష్టపడరు. అందుకే స్పుల్ లో 90శాతం వరకు 2009-10 తర్వాత విడుదలైన సినిమాలను మాత్రమే అందుబాటులో ఉంచాం”- రాజీవ్

సవాళ్లు అధిగమించి ముందుకు

స్పుల్ ఏర్పాటు, నెట్ వర్క్ విస్తరణ అనుకున్నంత ఈజీగా జరిగిపోలేదు. స్పుల్ ప్రారంభినప్పుడు సినిమా రిలీజైన 6-8 నెలల తర్వాత సినిమా ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ కూడా మంచి ఆదాయ మార్గమని ప్రొడక్షన్ హౌజ్ లు కూడా గుర్తించాయి. అందుకే మూవీ రిలీజ్ అయిన 3వారాల్లోనే స్పుల్ లిస్టులో చేరిపోతోంది. ఆన్ లైన్ పేమెంట్ కూడా స్పుల్ కు మరో ఛాలెంజింగ్ టాస్క్ గా మారింది. జనం ఆన్ లైన్ పేమెంట్ కు అలవాటుపడేందుకు చాలా సమయమే తీసుకున్నారు. కొంత మంది ఇప్పటికీ ఆన్ లైన్ పేమెంట్ అంటే ఇష్టపడరు. పైరసీ కూడా ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు మరో సమస్యలా మారింది. సినిమా ఫ్రీగా దొరుకుతున్నప్పుడు డబ్బు పెట్టి చూసేందుకు జనం ఇష్టపడరు. ఇది కొంత వరకు ప్రాఫిట్ పై ఎఫెక్ట్ చూపినా పైరసీ విషయంలో ఇప్పుడిప్పుడే జనం ఆలోచన విధానంలో మార్పు వస్తోంది.

స్పుల్ లో మూవీస్ చూడటం చాలా ఈజీ. ఎలాంటి అవాంతరాలు లేకుండా మూవీ చూడటం గొప్ప అనుభూతి కలిగిస్తుంది - గౌరవ్ జిందాల్, సల్ప్ యాప్ యూజర్

భవిష్యత్ పై కోటి ఆశలు

ఏ స్ట్రీమింగ్ కంపెనీకి అయిన అడ్వర్టయిజ్ మెంట్లు ప్రాణం లాంటివి. కానీ మితిమీరిన అడ్వర్టయింట్లు అసలుకు ఎసరు పెడతాయి. యాడ్ లు ఎక్కువగా వచ్చే యాప్ ను జనం పక్కన బెడతారు. అందుకే స్పుల్ ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం స్పుల్ నెలనెలా 20శాతం వృద్ధి నమోదుచేస్తోంది. ఆదాయం కూడా బాగానే ఉంది. ఆదాయంలో 90 నుంచి 95శాతం సబ్ స్క్రిప్షన్ నుంచే వస్తుందంటారు రాజీవ్. ప్రస్తుతం స్పుల్ కు 5 లక్షల మంది సబ్ స్క్రైబర్లు, 20 లక్షల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50లక్షల వీడియోలు డౌన్ లోడ్ చేసుకున్నారు. స్పుల్ వ్యూవర్స్ లో చాలా మంది ఢిల్లీ, ముంబైకి చెందిన వారే ఉన్నారు. భవిష్యత్తులో నెట్ వర్క్ ను మరింత ఎక్స్ పాండ్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.

“ప్రస్తుతం స్పుల్ లో కేవలం 10 శాతం మాత్రమే ప్రాంతీయ భాషలకు చెందిన సినిమాలు ఉన్నాయి. వీటి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యంగా దక్షిణాది భాషలు, పంజాబీపై దృష్టి పెట్టాం.”- రాజీవ్.

కొన్నాళ్లుగా భారత్ లో వీడియో స్ట్రీమింగ్ కు ఆదరణ పెరుగుతోంది. హాట్ స్టార్, ఈరోస్ నౌ, హూక్, మూవీజ్ మార్కెట్ ప్రాంతీయ భాషలకు సంబంధించి హీరో టాకీస్ లాంటి స్టార్టప్ లు మార్కెట్ లో స్థానం సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆన్ డిమాండ్, సబ్ స్క్రిప్షన్ విధానంలోనే ఇవి కూడా పనిచేస్తున్నాయి. హూక్ లాంటి స్టార్టప్ లు దూరదర్శన్ లో ప్రసారమయ్యే నుక్కడ్ లాంటి సంప్రదాయ షోలతో పాటు ఇంగ్లీష్ భాషలోని ప్రోగ్రాంలను అందిస్తోంది. స్పుల్ భవిష్యత్తులో టీవీ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రాంలతో పాటు సొంతంగా కొన్ని కార్యక్రమాలు రూపొందించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న సబ్ స్క్రైబర్లను కాపాడుకోవడంతో పాటు మరింత మంది జనాన్ని ఆకర్షించేలా స్పుల్ దూసుకెళ్తేనే ఇండియాలోకి ఎంటర్ కాబోతున్న నెట్ ఫ్లిక్స్ లాంటి విదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags