సంకలనాలు
Telugu

బస్ జర్నీలో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్న మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు

ashok patnaik
7th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హైదరాబాద్ నుంచి విజయవాడకో, విశాఖకో, బెంగళూరుకో.. ముంబైకో మీరు ఎప్పుడో ఒకసారి బస్సులో ప్రయాణించే ఉంటారు. అందులో వాళ్లు వేసే బోరింగ్ సినిమాతో విసుక్కున్న సందర్భాలు బహుశా అందరికీ ఉండే ఉంటాయి. అది చూసిన సినిమా కావొచ్చు..లేకపోతే ఆ హీరో మనకు నచ్చకపోవచ్చు. కానీ మనకు ఇష్టం లేకపోయినా తప్పక భరించాల్సిన పరిస్థితి. మనం వద్దనుకున్నా.. ఆ లైటింగ్, సౌండ్ మన చెవుల్లో పడుతూ మరింత అసహనాన్ని కలిగించవచ్చు. 

image


అలాంటి వారికి మొబైల్‌లో ఎవరికి నచ్చిన సినిమా వాళ్లకు చూపిస్తే ఎలా ఉంటుంది ? భలే ఐడియా కదా ? ఇలాంటి సమస్యకే పరిష్కారం చూపిస్తామంటూ ముందుకు వచ్చింది ఫ్రాప్ కార్న్ డాట్ కామ్ (www.fropcorn.com). ఇద్దరు మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కలిసి దీన్ని గతేడాది ప్రారుభించారు.

“నేను, నా ఫ్రెండ్ ముంబై ట్రెయిన్‌లో ప్రయాణిస్తుండగా, చాలా బోర్ ఫీలయ్యాం. మొబైల్ మెమొరీ కార్డులో ఉన్న వీడియోలు చూసి మరింత బోరు కొట్టింది. అప్పుడే ఇలాంటి స్టార్టప్ ఆలోచనకు బీజం పడింది” - కార్తీక్ బన్సాల్

కార్తీక్ బన్సాల్ ఫ్రాప్ కార్న్‌ కో ఫౌండర్. ట్రావెలింగ్‌ లో ఉన్న వారికి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే క్రమంలో మొదలైందే ఈ స్టార్టప్.


ఫ్రాప్ కార్న్ హాట్ స్పాట్

ఫ్రాప్ కార్న్ హాట్ స్పాట్‌లను ట్రెయిన్స్ ,బస్సులు, విమానాల్లో అమర్చుతారు. ప్రయాణికులు హాట్ స్పాట్ నుంచి డౌన్ లోడ్ లేదా స్ట్రీమ్ ఎంటర్‌టైన్మెంట్‌ను మొబైల్స్‌లో పొందొచ్చు. లొకేషన్ క్యాచింగ్ టెక్నాలజీ అనేది హై ఇంటర్నెట్ స్పీడ్‌ను డెలివరీ చేస్తుంది. అయితే దీంతో యూజర్ మొబైల్ డేటాకు ఎలాంటి సంబంధం ఉండదు. డిఆర్ఎం సిస్టమ్ అనేది కంటెంట్ ఓనర్ ఐపిని ప్రొటెక్ట్ చేస్తుంది. 'ఎంటర్‌టైన్మెంట్ ఫర్ పీపుల్ ఆన్ ది గో' పేరుతో దీన్ని పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే ఇది సాధారణంగా మనం వైఫై వాడినట్లే ఉంటుంది. కాకపోతే ఆ పర్టిక్యులర్ యాప్‌లో మాత్రమే ఈ వైఫై పనిచేస్తుంది. అందులో సినిమాలు చూడటానికి ఇది సహకరిస్తుంది. అది కూడా యూజర్‌గా లాగిన్ అయ్యాకే.

image


ఫ్రాప్ కార్న్ టీం

కార్తీక్ బన్సాల్ ఫ్రాప్ కార్న్ కో ఫౌండర్. మైక్రోసాఫ్ట్‌లో ఆరేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. ఈ స్టార్టప్‌లో తను ఆపరేషన్స్ చూసుకుంటున్నారు. కార్తీక్ పొద్దార్ మరో కో ఫౌండర్. ఈయనకు మైక్రోసాఫ్ట్‌లో రెండేళ్ల అనుభవం ఉంది. అంతకు ముందు కొన్ని ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేశారు. వీరితో పాటు బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లలో 22 మంది టీం ఉన్నారు.

image


ఆదాయ వనరులు

బిటుబి కంపెనీ అయిన ఫ్రాప్ కార్న్ లో ఎండ్ యూజర్‌కి ఫ్రీ టైం ఇస్తారు. తర్వాత చార్జ్ టైం ఇస్తారు. రీచార్జి చేసుకుంటే సినిమా మొత్తం చూసుకోవచ్చు. కంటెంట్ లైబ్రరీలో 500లకు పైగా సినిమాలున్నాయి. ఇందులో యష్ రాజ్, రిలయన్స్‌తోపాటు ఎంటివికి సంబంధించిన సినిమాలు, టీవీ షోలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 200మిలియన్ల ట్రావెల్ అవర్స్ నమోదయ్యాయి. బస్సుల్లో అయితే మొదటి పది నిముషాలు మాత్రమే ఫ్రీ. ట్రెయిన్ , ఎయిర్ కి ఈ నంబర్ మారుతుంది. ఇదే ప్రధాన ఆధాయ వనరు. సబ్ స్క్రిప్షన్ మోడ్ కూడా ఉంది కానీ, పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయలేదు.

“స్మార్ట్ ఫోన్ ఉన్న వారంతా మా టార్గెట్ ఆడియన్సే” కార్తీక్

ఎంటర్‌టైన్మెంట్ సెక్టార్లో మరిన్ని మార్పులొస్తున్నాయి. యూట్యూబ్ లో సినిమాలు చూడటానికి మొబైల్ డేటా సహకరించకపోవచ్చు. ఎందుకంటే జర్నీలో సిగ్నల్స్ అంతంత మాత్రంగా ఉండొచ్చు. ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్ ఉండి లాభం లేదు. కానీ స్మార్ట్ ఫోన్‌లో మా యాప్ ఉంటే బస్‌లకు మా ఫెసిలిటీ కలిగించడం వల్ల నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ పొందొచ్చని చెప్పుకొచ్చారాయన.

ఫండింగ్, లక్ష్యాలు

నాస్కామ్ 10వేల స్టార్టప్ లిస్టులో ఫ్రాప్ కార్న్‌కు స్థానం లభించింది. ప్లేస్టోర్‌లో వందల డౌన్ లోడ్స్ ఉన్నాయి. అయితే ట్రావెల్ చేసే యూజర్లు మాత్రమే డౌన్ లోడ్ చేసుకుంటారు. మిగిలిన వారికి యాప్ డౌన్ లోడ్‌తో పెద్దగా పని ఉండదనే చెప్పాలి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు రూట్లలో దాదాపు 1000కి పైగా బస్సులలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఏడాది క్రితం జెన్ ఎక్స్ ఇన్నోవేషన్స్ హబ్ నుంచి సీడ్ ఫండింగ్ వచ్చింది. యాక్సిలరేట్ రిలయన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రాం క్రింద గత మార్చిలో ఈ సంస్థను గుర్తించారు. వీరి తరుపు నుంచి మెంటరింగ్ సాయం అందుతోంది. మొదటి రౌండ్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. 2015 యువర్ స్టోరి టెక్స్ స్పార్క్ లో టాప్ 30 సంస్థగా అవార్డు అందుకుంది.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఫండింగ్ వస్తే మరిన్ని బస్సులు, ట్రెయిన్లలో ఈ సౌకర్యాలను కల్పిస్తామని అంటున్నారు. వచ్చే ఏడాది కల్లా 1000మిలియన్ల ట్రావెల్ అవర్స్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు హోటల్స్, రైల్వే స్టేషన్లు, హాస్పిటళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనేది వీళ్ల ఆలోచన. 

“ప్రెస్ అండ్ ప్లే అనేది మా నినాదం. దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలనేదే మా లక్ష్యం.” అని ముగించారు కార్తీక్
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags