వరుడు కావాలన్నా ఓకే.. వధువు కావాలన్నా సరే..!!

వారంలో మూడు పెళ్లిళ్లు.. మ్యాట్రిమోనీ రంగంలో దిల్‌మిల్ దూకుడు

18th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు ఎంతో కష్టమైన పనులు. అందుకే కాబోలు అలా అన్నారు. 21వ శతాబ్దంలో కూడా ఇది నిజమవుతోంది. అమ్మాయిల సంఖ్య పడిపోతుండటంతో మగవారికి పెళ్లిళ్లు జరగడమే గగనమైపోతోంది. మూడు పదులు దాటి.. నలుభైకి చేరువవుతున్నా పిల్ల దొరకని రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయడం అంత కష్టం కాదంటోంది దిల్ మిల్. తమ యూజర్లకు సులభంగా మ్యాచ్‌లను కుదిర్చిపెడతామంటోంది.

దక్షిణాసియా నిర్వాసితులు, స్థానికులకు మ్యాచ్‌లను కుదిర్చిపెడతామంటోంది దిల్ మిల్. పెళ్లిళ్లకే కాదు డేటింగ్, సీరియస్ రిలేషన్‌షిప్‌లకు కూడా అమ్మాయిలు లేదా అబ్బాయిలను చూసిపెడుతోంది. ఇప్పటివరకు పదిలక్షల మ్యాచ్‌లను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా కుదిర్చింది. అంటే ప్రారంభమైనప్పటి నుంచి సగటును వారానికి మూడు సంబంధాలను ఫిక్స్ చేసింది.

ఇమేజ్ క్రెడిట్ షట్టర్‌స్టాక్

ఇమేజ్ క్రెడిట్ షట్టర్‌స్టాక్


ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని డేటింగ్ యాప్స్ మాదిరిగానే దిల్ మిల్‌ కూడా పని చేస్తుంది. ఇందులోని కొన్ని విభిన్నమైన ఫీచర్లే దిల్ మిల్‌ను అన్నిటికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా మిగతా డేటింగ్ సైట్లలో యూజర్ల ప్రొఫైల్స్‌ను ఇతరులు చూస్తుంటారు. తమకు నచ్చితే లైక్ చేయడమో, లేదంటే పాస్ చేయడమో చేస్తుంటారు. కానీ దిల్ మిల్‌లో ఓ ప్రత్యేకమైన ఎలిమెంట్ ఉంది. ఇతర యూజర్లు మరో యూజర్ ఫొటోను కేవలం ఐదు సెకన్లు మాత్రమే చూడగలుగుతారు. దిల్‌మిల్ ఇటీవలే ప్రీ సిరీస్ ఏ రౌండ్‌ను క్లోజ్ చేసింది. లివరేజ్ వీడియో, వర్చువల్ రియాలిటీని త్వరలోనే అప్‌డేట్ చేయాలనుకుంటోంది.

image


ఎలా పనిచేస్తుంది..?

యూజర్లు ఫేస్‌బుక్ ఐడీ ద్వారా దిల్ మిల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే లింక్డిన్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా లాగిన్ అవ్వొచ్చు. ఆ సామాజిక వెబ్‌సైట్లలో ఉన్న ఫోటోలను, సమాచారాన్ని దిల్‌మిల్ నేరుగా తమ సైట్లలో ప్రచురిస్తుంది. పేరు, వయసు తదితర వివరాలను కూడా వాటి ఆధారంగానే తీసుకుంటుంది. వయసు, ఎత్తు, మతం, విద్య, దేశం, వృత్తి ఆధారంగా అందుకు సరిపోయే మ్యాచ్‌ను యూజర్‌కు చూపిస్తుంది. అలాగే ఏ దేశం మ్యాచ్ కావాలో కూడా యూజర్ ఇష్టాఇష్టాన్ని బట్టి ఎంపికచేస్తుంది.

బిజినెస్ మోడల్

పెళ్లిళ్లకు సంబంధించి ఇటీవల పెద్ద ఎత్తున భారీ మోసాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ సంబంధాల్లో ఎక్కువగా ఇదే తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫేక్ అకౌంట్ల ప్రొఫైల్స్‌ను అరికట్టేందుకు వివిధ పద్ధతుల్లో వివరాలను చెక్ చేస్తుంది దిల్ మిల్. యూజర్లు ఇచ్చిన సమాచారం నిజమైందేనా? కాదా అన్న వివరాలను వెరిఫికేషన్ చేస్తుంది. అలాగే ప్రీమియం విధానంలో ఒక యూజర్ రోజుకు ఒక మ్యాచ్‌ను మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అదే వీపీఐ యూజర్ అయితే ఒక రోజులో అన్‌లిమిటెడ్ మ్యాచెస్‌ను వీక్షించొచ్చు. ఈ మోడల్‌లో ఒక ఫొటోను కేవలం కొద్ది సేపు మాత్రమే చూసే వీలుంటుంది. అదే వీఐపీ వెర్షన్‌లో గతంలో చూసిన ప్రొఫైల్ మరోసారి రివైండ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఈ స్టార్టప్ అందిస్తోంది.

ఇదీ దిల్ మిల్ స్టోరీ..

దిల్‌మిల్‌ను కేజే ధాలివాల్, టామ్ జేమ్స్ హోల్బ్, సుఖ్‌మీత్ టూర్, జాకబ్ ఇలిన్ 2014 అక్టోబర్‌లో స్థాపించారు. ప్రేమ అనేది ఎప్ఉడు పుడుతుందో చెప్పలేం. దానికి సీజన్ అంటూ ఉండదు. ఆ తర్వాత పెళ్లి. ఇలా ప్రేమా, పెళ్లిళ్లు అనేవి నిరంతర ప్రక్రియ. ఇలాంటి రంగంలో ప్రవేశిస్తే తమకు ఎదురుండదన్న ఉద్దేశంతోనే నిర్వాహకులు ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు.

‘‘మా ప్రధాన దృష్టి ప్రాడక్ట్‌పైనే. యూజర్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకునే యాప్‌ను సృష్టించాం. 200 మిలియన్ల నిర్ణయాలు, పది లక్షల మ్యాచ్‌లు మా ఖాతాలో ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వారానికి మూడు మ్యారేజీలు.. ఇవీ మా ఘనతలు’’ అని సీఈఓ కేజే ధాలివాల్ చెప్పారు.

నిధుల ప్రవాహం.

భారత్‌లోనే కాదు.. విదేశాల్లో సైతం దిల్‌మిల్ యూజర్లను ఆకట్టుకుంది. అమెరికా, బ్రిటన్, కెనెడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ యాప్‌కు పిచ్చ డిమాండ్. మే 2015లో దిల్‌మిల్ 1.1 మిలియన్ డాలర్ల రౌండ్ ఫండ్‌ను సమీకరించింది. ప్రి సిరీస్ ఏ రౌండ్ ఫండ్ 2.7 మిలియన్ల డాలర్లకు చేరిందని దిల్ మిల్ ఇటీవలే ప్రకటించింది. నెల్‌స్టోన్ వెంచర్స్ (రిచ్ నెల్సన్స్ ఫండ్), ట్రాన్స్‌మీడియా క్యాపిటల్, మెయిడెన్ లేన్ వెంచర్స్, సీఎస్‌సీ అప్‌షాట్, నవల్ రవికాంత్(ఏంజెల్ లిస్ట్ ఫౌండర్), కునాల్ షా (ఫ్రీచార్జ్ ఫౌండర్, సీఈఓ), సమీర్ పర్వానీ (కూపన్ దునియా ఫౌండర్ కమ్ సీఈఓ), విజయ్ ఉల్లాల్ (విక్టరీ వెంచర్స్ ఫౌండర్) వంటి ఆంట్రప్రెన్యూర్ దిగ్గజాలు దిల్‌మిల్‌లో పెట్టుబడి పెట్టారు.

వర్చువల్ డేటింగ్..

ఇప్పటికే ఎంతోమంది ప్రజల ఆదరణ చూరగొన్న దిల్‌మిల్‌ తమ స్థానాన్ని మరింత పదిలపర్చుకునేందుకు సేవలను విస్తరించాలనుకుంటోంది. ఉద్యోగుల సంఖ్యను, టెక్నాలజీని త్వరలోనే విస్తరించే ఆలోచనలో ఉంది. యూజర్లు తమకు నచ్చిన మ్యాచ్‌ను ఎన్నుకునేందుకు సహకరించే సాధానాలను మరింత పెంచాలనుకుంటుంది. త్వరలోనే వీడియో ప్రొఫైల్స్‌ను కూడా పొందుపర్చే యోచనలో ఉంది.

తదుపరి లక్ష్యం

వీడియో చాటింగ్. పరస్పరం కలుసుకోవడానికి ముందే ఒకరినొకరు తెలుసుకునేందుకు యాప్ ద్వారా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. వీడియో డేటింగ్‌కు అవసరమైన సాంకేతికత కోసం సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే వర్చువల్ రియాలిటీ డేట్స్‌కు శ్రీకారం చుడతాం అని కేజే వివరించారు. యూజర్ల నుంచి అభిప్రాయాల ఆధారంగా వీడియో డేట్, వర్చువల్ రిలేషన్స్‌ సేవలను మరింత విస్తృత పర్చాలన్నదే ఈ సంస్థ లక్ష్యం.

‘‘పెళ్లిళ్లనేవి దీర్ఘకాలిక సంబంధాలు. మేం చూపిన లక్షలాది మ్యాచెస్ ఈ విషయాన్ని నిరూపించాయి. వీడియో, వీఆర్ ఈ ప్రాసెస్‌ను మరింత వేగవంతం చేస్తాయని మేం భావిస్తున్నాం. డేటింగ్ యాప్‌ల గురించి భయపడే భారతీయ మహిళలకు ఈ రెండు ఆప్షన్లు ధైర్యాన్నిస్థాయి’’ అని కేజే తెలిపారు.

దిల్ మిల్ టీమ్..

దిల్ మిల్ టీమ్..


మార్కెట్..

ప్రపంచంతోపాటు భారత్‌లోనూ ప్రతి ఒక్కరి జీవితాల్లో టెక్నాలజీ ఒక భాగమైపోయింది. పెళ్లిళ్లు, సంబంధాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటుండేవారు. అందుకే సంప్రదాయ భారతదేశంలో ఆన్‌లైన్ మ్యాచెస్ సెక్టార్ నెమ్మదిగా అభివృద్ధి చెందుతోంది. భారతీయులు కూడా ఇప్పుడిప్పుడే మార్పును గ్రహిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ మాట్రిమోనియల్ రంగంలో భారత్ మాట్రిమోనీ, షాదీ.కామ్ వంటివి ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయి.

డేటింగ్ విషయానికొస్తే థ్రిల్ ఇండియా, సింగపూర్, అమెరికా నుంచి సీడ్ ఫండ్ సమీకరించింది. గత ఏడాది మార్చిలో ట్రూలీ మ్యాడ్లీ సంస్థ 35 కోట్ల రూపాయలను హెలియన్ వెంచర్ ఫాంథర్స్, కే క్యాపిటల్ నుంచి సమీకరించింది. మ్యాచిఫై డేటింగ్ యాప్‌లో మ్యాట్రిమోనీ.కామ్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. వూ, కాగ్‌జియో, ఐ క్రష్ ఐఫ్లష్, అస్లీ.కో వంటి సంస్థలు కూడా ఈ రంగంలో ఇటీవలే ప్రవేశించాయి. అస్లీ.కో సంస్థ కోటీ 25 లక్షల నిధులను టెర్మ్‌షీట్.ఐఓ, అహ్ వెంచర్స్‌ నుంచి ఇటీవలే సమీకరించింది.

వరల్డ్‌వైడ్‌గా చూస్తే టిండర్ సంస్థ అన్నిటికంటే చాలా ముందుంది. దాని పేరెంట్ కంపెనీ మ్యాచ్.కామ్ గత ఏడాది నవంబర్‌లో ఐపీఓకు కూడా వెళ్లింది. హింజ్ (ఇటీవలే 12 మిలియన్ డాలర్లు సమీకరించింది), కాఫీ మీట్స్(7.8 మిలియన్ డాలర్లు), ప్లెంటీ ఆఫ్ ఫిష్ (మ్యాచ్ గ్రూప్ ఇటీవలే ఈ స్టార్టప్‌ను సొంతం చేసుకుంది) వంటి సంస్థలు కూడా ఈ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. దక్షిణాసియా ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని అడుగుపెట్టిన దిల్ మిల్ కూడా ఈ రంగంలో స్థిరపడాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది.

image


విభిన్నమైన దిల్..

మార్కెట్‌లో ఎన్నో డేటింగ్ యాప్స్ ఉన్నప్పటికీ దిల్ మిల్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నది మాత్రం ‘ఎంఫెమెరల్ ఫొటోస్’ ఆప్షన్. ఈ ఆప్షన్‌లో పొందుపర్చిన ఫొటోలు చూస్తే చాలు వెంటనే రిజిస్టర్ కావాలనిపిస్తుంది. సైన్ అప్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. అలాగే దిల్ మిల్ యాప్‌లో దాని బ్లాగ్‌కు సంబంధించిన లింక్ కూడా అనుసంధానం చేశారు. ఆ బ్లాగ్‌లో డేటింగ్ టిప్స్, ట్రిక్స్ వంటివాటిని అందిస్తున్నారు.

యూజర్ ఇంటర్‌ఫేస్ బాగానే ఉన్నప్పటికీ, దిల్‌మిల్ యాప్‌ను యూజర్లకు మరింత దగ్గర చేసేందుకు కొన్ని మార్పులు చేయాల్సిన అవసరముంది. ఉదాహరణకు ప్రస్తుతం మ్యాచెస్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం స్క్రీన్ మొత్తం వస్తున్నాయి. మిగతా వివరాలు చూడాలనుకుంటే యూజర్లు తర్వాతి పేజీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇమేజెస్ కోసం మల్టీ స్క్రీన్ ఉంటే యూజర్లు సులభంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయి.

యువర్‌స్టోరీ అభిప్రాయం

స్మార్ట్‌ఫోన్స్ రంగంలో అభివృద్ది చెందుతున్న అతి పెద్ద మార్కెట్ ఆసియా. మరోవైపు ఆసియన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కానీ దిల్ మిల్ మాత్రం ఒక్క దక్షిణాసియా మార్కెట్‌కే పరిమితమైంది. అలాగే చాలా సంబంధాలు సుదూర ప్రాంతాలకు చెందినవి అయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో వీడియో, వీఆర్ ఫీచర్స్‌ను పొందుపర్చడం సంస్థ వృద్ధికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అయితే ఏంజిల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడంతో ఈ సంస్థ తన లక్ష్యాలను చేరుకునేందుకు సహకరిస్తుందనడంలో సందేహం లేదు. డేటింగ్ రంగంలో దూసుకెళ్లాలనుకుంటున్న దిల్ మిల్ స్వప్నం నెరవేరాలని యువర్‌స్టోరీ ఆశిస్తోంది. 

వెబ్‌సైట్‌: 

మరిన్ని అప్‌డేట్స్ కోసం యువర్‌స్టోరీ యాండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close