క్లీన్‌టెక్ రంగంలో స్టార్టప్స్‌కు విస్తృత అవకాశాలు

టి-హబ్‌లో స్టార్టప్స్‌తో అమెరికా బృందం భేటీ 

క్లీన్‌టెక్ రంగంలో స్టార్టప్స్‌కు విస్తృత అవకాశాలు

Friday March 18, 2016,

1 min Read

క్లీన్ టెక్ ఎనర్జీ రంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయి. పునరుత్పాదక శక్తి రంగంలో ఇన్నోవేషన్ కోసం ప్రపంచం మొత్తం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. విద్యుత్ అవసరాల నానాటికీ విస్తరిస్తున్నా, అందుకు తగ్గట్టు ముడి చమురు, బొగ్గు వంటివి వెలికి తీయడం ఇబ్బందిగా మారుతోంది. పరిమిత నిల్వల నేపధ్యంలో సౌర, పవన విద్యుత్తు రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో భారతీయ కంపెనీలకు సాయం చేసేందుకు అమెరికా ముందుకొస్తోంది. అమెరికన్ ఇన్నోవేషన్ రోడ్ షో పేరుతో అమెరికా నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో పర్యటిస్తోంది. అక్కడి కార్పొరేట్ రంగ ప్రముఖులతో పాటు అమెరికా ఎకనమిక్స్ అండ్ బిజినెస్ ఎఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ చార్ల్స్ రివ్కిన్ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ రెండు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులతో బేటీ అయి ఇక్కడున్న అవకాశాలపై చర్చించారు. క్లీన్ ఎనర్జీ కోసం ఇక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను రివ్కిన్ అడిగితెలుసుకున్నారు.

image


టి-హబ్‌లో కొంత మంది స్టార్టప్స్‌తో కూడా భేటీ అయిన రివ్కిన్ బృందం క్లీన్‌టెక్ పై వాళ్ల ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయోజనకరమైన ఐడియాలను సూచించే భారత్ లాంటి దేశాలతో కలిసి పనిచేయడానికి అక్కడి కంపెనీలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రతినిధులు వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని బలపరిచేందుకు ఇలాంటి రోడ్ షోస్ ఎంతో ఉపయోగపడతాయని రివ్కిన్ వివరించారు. వినూత్న, విభిన్న ఆలోచనలతో వచ్చిన స్టార్టప్స్‌ను అక్కడి సంస్థలు ఎలాంటి సహకారం అందించేందుకు అవకాశం ఉంది అని కూడా ఈ సందర్భంగా చర్చించారు.