సంకలనాలు
Telugu

"బ్లాక్‌బెర్రీ ప్రివ్‌"... హిట్టా? ఫ‌ట్టా?

6th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాండ్రాయిడ్ బ్లాక్‌బెర్రీ ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చేసింది. కెనాడాకు చెందిన స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ మొట్ట‌మొద‌టి ఆండ్రాయిడ్ డివైజ్ "బ్లాక్‌బెర్రీ ప్రివ్‌" ని లాంచ్ చేసింది. ప్రివ్ అంటే ప్రైవ‌సీ, ప్రివిలేజ్‌. గ‌తంలో స్మార్ట్‌ఫోన్ త‌యారీ రంగంలో అత్యుత్త‌మ‌మైన క్వాలిటీ ఫోన్ల‌ను అందించిన ఈ కంపెనీ.. యాండ్రాయిడ్ యూజ‌ర్స్ పెరిగిపోవ‌డంతో.. సొంత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ని వ‌దిలేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిణామంతో కంపెనీకి ప్ర‌తీ ఏటా రూ.1799.756 కోట్ల రూపాయ‌లను ఆదా చేసుకుంటోంద‌ని ఒక రిపోర్ట్ పేర్కొంది.


బ్లాక్‌బెర్రీ ప్రివ్‌

బ్లాక్‌బెర్రీ ప్రివ్‌


"ప్రివ్" నిల‌బ‌డుతుందా?

స్పెసిఫికేష‌న్ల‌ను బ‌ట్టిచూస్తే ప్ర‌స్తుతానికి మార్కెట్లో ఉన్న అన్ని బ్లాక్‌బెర్రీ ఫోన్ల‌కంటే ప్రివ్ బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పొచ్చు. యాండ్రాయిడ్ 5,1.1 లాలీపాప్ వెర్ష‌న్‌తో ప‌నిచేస్తున్న ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగ‌న్ 808 ఒక అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఎక్స్‌పాండ‌బుల్‌ 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, (22 జీబీ స్టోరేజ్ యూజర్‌కు లభిస్తోంది) 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీతో పాటు 5.4 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. దీని ధ‌ర‌ను రూ.62,990గా నిర్ణ‌యించారు.

మ‌రిన్ని ఫీచ‌ర్స్ - 3 జీబీ ర్యామ్, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, వంటి ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తున్నారు.ఈ ఫోన్ క్విక్‌చార్జ్ 2.0 సపోర్ట్‌ను కలిగి ఉంది. దీని ద్వారా డివైస్‌ను వేగంగా చార్జింగ్ చేసుకునేందుకు వీలుంది. డివైస్‌ను ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 3జీ నెట్‌వర్క్‌లో దాదాపు 14 గంటల వరకు నాన్‌స్టాప్‌గా మాట్లాడుకోవచ్చు. అదే ఇంటర్నెట్ అయితే 8 గంటల పాటు బ్రౌజింగ్ చేసుకోవచ్చు. 6 గంటల పాటు వీడియోలను ప్లే చేసుకోవచ్చు.

ఈ స్టోరీ కూడా చదవండి

బ్లాక్‌బెర్రీ ప్రివ్‌

బ్లాక్‌బెర్రీ ప్రివ్‌


అన్ని యాండ్రాయిడ్ ఫోన్ల‌కు ఉండే ట‌చ్ టైపింగ్ ప్యాడ్‌కు బ‌దులుగా నార్మ‌ల్ కీబోర్డ్ ఉండ‌టంతో...బ్లాక్‌బెర్రీకి అల‌వాటుప‌డిన వాళ్లు ఈ ఫోన్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే అవ‌కాశ‌ముంది. అయితే, ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టంతో.. మార్కెట్ షేర్‌కు ఎంత‌వ‌ర‌కు క్యాప్చ‌ర్ చేయ‌గ‌ల‌ద‌న్న సందేహాలు క‌లుగుతున్నాయి. మార్ష్‌మాల్లో 6.0 వెర్ష‌న్ లేక‌పోవ‌డం కూడా ఒక మైన‌స్ పాయింట్‌.

సెక్యూరిటీ, ప్రొడ‌క్టివిటీతో పాటు అత్యుత్త‌మ‌మైన యాండ్రాయిడ్ ఫోన్ "ప్రివ్‌" అంటున్నారు బ్లాక్‌బెర్రీ సీఈవో జాన్ చెన్ .

ప్ర‌పంచ మొబైల్ మార్కెట్లో 82.8శాతం యాండ్రాయిడ్ ఫోన్లే అమ్ముడవుతున్నాయి. అందులో శ్యాంసంగ్ మొద‌టిస్ధానంలో ఉంది. అందుకే.. బ్లాక్‌బెర్రీ యాండ్రాయిడ్ ఫోన్ల‌పై దృష్టిపెట్టింది. మిగ‌తా 13.9శాతం మార్కెట్‌ని IOs క్యాప్చ‌ర్ చేస్తోంది.

2015 నాల్గ‌వ త్రైమాసికంలో రూ.189.448 కోట్ల రూపాయ‌ల లాభాల‌ను ప్ర‌క‌టించ‌గా..వార్షిక ఆదాయం మాత్రం త‌గ్గింది. బ్లాక్‌బెర్రీ హ‌బ్‌, బ్లాక్‌బెర్రీ లాంచ‌ర్‌తో పాటు అధునాత‌న సెక్యూరిటీ ఫీచ‌ర్స్ ఫోన్‌పై ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. అయితే, అంత‌కంటే త‌క్కువ ధ‌ర‌కు దొరుకుతున్న కొన్ని స్మార్ట్‌ఫోన్లు.. ఎక్కువ ఫీచ‌ర్లు అందిస్తుండ‌డంతో.. రాబోయే రోజుల్లో బ్లాక్‌బెర్రీ కూడా అదే ఫాలో అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగితే.. బ్లాక్‌బెర్రీ బ్రాండ్‌కు మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags