సంకలనాలు
Telugu

యూపీ నుంచి ఆస్ట్రేలియా వరకు.. హన్సీ మెహ్రోత్రా అలుపెరుగని ప్రయాణం

Amuktha Malyada
15th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అంకెలు, సంఖ్యలు చాలా మంది అర్ధం కావనేది చాలామంది మహిళల అభిప్రాయం. తమపై తమకు నమ్మకం తక్కువుంటుంది. ఆర్ధికపరమైన అంశాల్ని మానేజ్ చేయలేమని భావిస్తారు. అలాంటి అభిప్రాయాన్ని దూరం చేసి చూపింపించారు హన్సీ మెహ్రోత్రా. ఆమె ఇప్పుడు లీడింగ్ ఇన్వెస్ట్ మెంట్ కన్సల్టెంట్. టాప్ ఫైనాన్సియల్ అడ్వైజర్స్ లో ఒకరు. ధృఢ చిత్తంతో తన లక్ష్యాన్ని సాధించారామె.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ కు చెందిన హన్సీ హెహ్రొత్రా, తండ్రి కోరిక మేరకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన హన్సి స్టాక్ బ్రోకింగ్ గురించి నేర్చుకోవాలనుకుంది. ఆ తర్వాతస్టాక్ బ్రోకింగ్ కాకుండా ఫైనాన్సియల్ అడ్వైసరీ సర్వీసెస్ లో చేరింది. ఆస్ట్రేలియాలో 20 ఏళ్లున్న హన్సి భారత్ కు తిరిగి వచ్చింది. ఇప్పుడామె ఫైనాన్సియల్ అడ్వైజర్స్ రంగంలో పేరున్న వారిలో ఒకరు.

image


18 ఏళ్ల వ్యసులో హన్సీ కెరీర్ సేల్స్ విమెన్ గా ప్రారంభమైంది. తల్లి తండ్రులు విడిపోవడంతో, తండ్రితోనే కలిసి ఉండేది హన్సి. ఢిల్లీకి వెళ్లి చదువుకోవాలని భావించింది. అదే సమయంలో తండ్రికి కేన్సర్ బయట పడింది. దీంతో ఫుల్-టైం గా యూనివర్సిటీలో చదువుకోలేక పోయారు. అలా కరస్పాండెన్స్ ద్వారా చదువును కొనసాగించించారు. బైండింగ్ అండ్ లామినేషన్ కంపెనీ లోను పనిచేశారు.

image


కేన్సర్ తో మరణించే ముందు హన్సీ తండ్రి, ఆమెను దేశం విడిచి వెళ్లమని చెప్పారు. అదే టైంలో మేనమామ పెళ్లిచేసుకోమని హన్సీని కోరడంతో బయటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. తండ్రినుంచి విడిపోయి ఆస్ట్రేలియాలో ఉంటున్న తల్లి దగ్గరకు వెళ్లాలని భావించింది. తన కుటుంబంలో పనిచేస్తున్న మొదటి అమ్మాయి హన్సీనే అయినప్పటికీ, తండ్రి మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో, భారత్ ను విడిచిపెట్టక తప్పలేదు ఆమెకి.

అలా ఆస్ట్రేలియాలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమ ఇన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కోర్స్ లో పేరు నమోదు చేయించుకుంది. ఇక అక్కడ ఉన్న ఒక అమెరికన్ ఫ్రెండ్, భాషకు సంబంధించిన తప్పులని సరిచేశారు. పదాల్ని ఎలా పలకాలో నేర్పించారు. అక్కడ జరిగే అన్ని ఫ్రీ కాన్ఫరెన్స్ లకు తప్పనిసరిగా హాజరయ్యేవారు. 

"ఏ సమయంలో కాన్ఫరెన్స్ ఉన్నా వెళ్లేదాన్ని. ఫ్రీ గా సబ్జెక్ట్ గురించి నేర్చుకునే అవకాశం రావడంతో పాటుగా, ఫ్రీ బ్రేక్ ఫాస్ట్, లంచ్ కూడా ఉండేది. భాష మీద పట్టు సాధించుకోవడం తో పాటుగా, యాక్సెంట్ మార్చుకోవడం, కంటెంట్, కాంటాక్ట్స్ నేర్చుకోవడానికి అవి ఉపయోగపడేవి"- హన్సి.

ఆస్ట్రేలియాలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమ కోర్స్ లో ఉన్నపుడు ఫైనాన్సియల్ రంగానికి చెందిన ఎంతో మంది నిపుణుల సెషన్స్ జరిగేవి. ఇలాగే వచ్చిన ఎక్స్పర్ట్ తో ఒకరోజు, తనకు స్టాక్ బ్రోకింగ్ గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఉందని అడిగారు హన్సి. ఇక డిప్లొమా పూర్తయిన తర్వాత ఎన్నో ఉద్యోగాలకు అప్ప్లై చేసుకునే అవకాశం వచ్చింది. అయితే స్టాక్ బ్రోకింగ్ కాకుండా, ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ లో పనిచేయలని నిర్ణయించుకుంది.

కాఫీ మీటింగ్స్

23 ఏళ్ల వయసులో హన్సీ టాప్ 10 కంపెనీల CEO లకు లెటర్స్ రాసింది. కాఫీ ఖర్చులు పెట్టుకుంటాను ఆలోచనలు పంచుకోవడానికి సమయం ఇస్తారా? అన్నది ఆ లేఖల సారాశం. అందులో కేవలం ఒక్కరు మాత్రమే ఆ రెస్పాండ్ అయ్యారు. హన్సీని కలవడమే కాదు ఇంప్రెస్ కూడా అయ్యారు. అయితే, తను ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నా అన్నాడు. కానీ సదరు కంపెనీ కో-ఫౌండర్ కు పరిచయం చేస్తానని మాటిచ్చాడు.

అపజయం వెనుకే విజయం

ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం ఆ కంపెనీలో కాంట్రాక్ట్ పద్ధతిలో, మూడు నెలల కాలానికి జూనియర్ అనలిస్ట్ గా చేరారు హన్సీ. అప్పటి నుంచి పదేళ్ల పాటు అదే కంపెనీలొ వివిధ రకాల పనులు చేస్తూ, రీసెర్చర్, అనలిస్ట్ గా మారారు. 2002 లో డాట్ కాం బూం వచ్చినపుడు, అదే కంపెనీ అనుబంధంగా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ లో ప్రవేశించింది. ఆ ఆలోచన నచ్చిన హన్సీ- తన సేవింగ్స్ అన్నీ అందులో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే డాట్ కాం కుప్పకూలడంతో అనుబంధ సంస్థని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో హన్సీ బయటకు వచ్చేసింది. అయితే ఆ కంపెనీని మొదటగా తీసుకోవాలనుకుని ఉత్సాహం చూపించిన మెర్కర్ కంపెనీ హన్సి ని హైర్ చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు ఇండియన్ మార్కెట్ చూసుకునే బాధ్యతలను అప్పగించింది.

మెర్కర్ ఇండియన్ మార్కెట్ కు రూపమిచ్చిన హన్సి

ఆ సమయంలో భారత మార్కెట్లో మెర్కర్ లేదు. మొదటి నాలుగేళ్ల కాలంలో మెర్కర్ వెల్త్ మేనేజ్ మెంట్ డివిజన్ ను ఏర్పాటుచేసుకుంది. తర్వాత ఇండియన్ మార్కెట్ పికప్ అయింది. దీంతో హన్సి భారత్ కు వచ్చింది. సింగపూర్ తో పాటుగా, భారత్ లోను ఆఫీసుల్ని ప్రారంభించింది. భారత ఫైనాన్సియల్ ఇండస్ట్రీ లో స్థిరపడాలనుకున్న హన్సీ తొందర్లోనే మెర్కర్ నుంచి బయటకు వచ్చింది.

భారత్ కు తిరిగి వచ్చిన హన్సీని మరో కంపెనీ త్వరలో ప్రారంభించబోయే తమ ఇండియన్ ఆఫీసులో పనిచేయమని కోరింది. అయితే హన్సీ వారి కోసం కాకుండా, వారితో కలిసి పనిచేస్తానని చెప్పింది. 

"అలా నేను రెండున్నరేళ్ల క్రితం జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశాను. ఒక ఏడాది తర్వాత మేము విడిపోవాలని అనుకున్నపుడు, నేను కంపెనీని ఉంచుకుంటే, వాళ్లు ప్లాట్ ఫాం ని పెట్టుకున్నారు" హన్సీ.

వర్కింగ్ ప్లాట్ ఫామ్స్ గురించి తెలుసుకున్న హన్సీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లో B2B, B2C ప్లాట్ ఫామ్స్ ఏర్పాటుచేశారు. ఇన్వెస్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లను ఎలాంటి ప్రశ్నలు అడగాలనేది B2B లో నేర్పిస్తారు. సరైన శిక్షణ తీసుకోకుండానే, వెల్త్ మేనేజర్లు షార్ట్ కట్ లో ట్రస్టెడ్ అడ్వైజర్లుగా మారాలనుకుంటున్నారు. అందుకనే ఇన్వెస్టర్లు ఎలాంటి ప్రశ్నలు అడగాలో నేర్పిస్తున్నాను అంటున్నారు హన్సీ.

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇండస్ట్రీ లో ఉండే కష్ట నష్టాల గురించి వివరించి చెప్పే హన్సీ, తన దగ్గరకు వచ్చే క్లైంట్లకు ఎలాంటి ప్రశ్నలు వేయాలో వివరిస్తారు. రాబోయే 12 నెలల కాలంలో ఇలాంటివి ఎక్కువగానే జరుగుతాయి, అయినప్పటికీ అది ఇండస్ట్రీకి మంచిదే అంటారామె.

ఇక ThaMoneyHans అనే B2C ప్లాట్ ఫామ్ మహిళలకు అవగాహనా కార్యక్రమాల మీద ఫోకస్ పెడ్తుంది. అంకెలంటె మహిళల్లో ఉండే భావనను తొలగించే ప్రయత్నం చేస్తుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags