సంకలనాలు
Telugu

వ్యతిరేకతపై ఎలా విజయం ఎలా సాధించాలో వీళ్లను చూసి నేర్చుకోవచ్చు

team ys telugu
17th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఏటా మార్చి 8న స్త్రీ శక్తిని కొనియాడుతూ మహిళా దినోత్సావాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం అంతర్జాతీయ సమాజానికి ఆనవాయితీగా మారింది. ఇక మార్చి వచ్చిందంటే చాలు... మహిళలు- వారు సాధించిన విజయాలు, వారి అవసరాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించడంలో సేవా సంస్థలు నిమగ్నమైపోతాయి.

(This article is published in collaboration with Milaap.org)

ఈ ఏడాది అంతర్జాతీయ విమెన్స్ డే థీమ్ - "మేక్ ఇట్ హ్యాపెన్". స్త్రీ సాధికారతను కొనియాడటమే... ఈ థీమ్ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అడ్డంకులను అధిగమించి... తమ జీవితాలను చక్కదిద్దుకోవడమే కాకుండా ఇతరులకు జీవనోపాధి కల్పిస్తూ విజయపథాన దూసుకుపోతున్న గ్రామీణ ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళామణుల గురించి తెలుసుకుందాం.

image


లాల్ ఫక్జువాలీ - జీవన పోరాటమే ఆమె నేర్చిన పాఠం

కా మా చే...( మిజోరాం ఆచారం ప్రకారం విడాకులు పొందేందుకు ఉచ్చరించే పదం)అనే మూడక్షరాల పదంతో భర్త తనతో తెగదెంపులు చేసుకున్నప్పుడు లాల్ ఫక్జువాలీ చేతిలో చంటిబిడ్డతో ఒంటరిగా మిగిలిపోయింది. అప్పటివరకూ రెక్కలు ముక్కలు చేసుకుని తాను సంపాదించినది, కూడబెట్టుకున్నది క్షణంలో తన చేజారిపోయింది. ఆ క్షణమే జీవితంతో పోరాటానికి సిద్ధమైన ఫక్జువాలీ... బిడ్డతో సహా తండ్రి ఇంటికి చేరుకుంది.

లాల్ ఫక్జువాలీ

లాల్ ఫక్జువాలీ


కన్నవారి ఆదరణతో కాస్త స్థిమితపడ్డాక... వారి ప్రోత్సాహంతో సాలువాలు, మిజోరాం సంప్రదాయ స్కర్ట్ లైన పునాలు నేసి, అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది ఫక్జువాలీ. తల్లిదండ్రుల మరణంతో మరోసారి విధి వెక్కిరించినా స్థైర్యం కోల్పోకుండా.. తన సోదరీమణుల సహాయంతో ముందుకు నడవాలనే నిర్ణయించుకుంది ఆమె. వివిధ కలర్ కాంబినేషన్ లలో శాలువాలను, పూనాలను అందంగా తీర్చిదిద్దే బాధ్యతను ఫక్జువాలీ చూసుకోగా... వాటి అమ్మకాలు, ఇతర లావాదేవీలను ఆమె తోబుట్టువులు పర్యవేక్షిస్తుంటారు.

మగ్గం పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్న ఫక్జువాలీ

మగ్గం పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్న ఫక్జువాలీ


మూడేళ్లు గడిచేసరికి.. అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫక్జువాలీ శాలువాలు, పూనాలకు మరింత డిమాండ్ పెరిగింది. తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఇదే సరైన సమయమని భావించిన ఫక్జువాలీ... మరో చేనేత మగ్గాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు.. తన సోదరీమణులకు తెలిపింది. అందుకు తగినంత మొత్తం తమ వద్ద లేదని సోదరి వారిస్తున్నా.. తాను అనుకున్నది ఆచరణలో పెట్టేందుకు ఫక్జువాలీ వెనుకాడలేదు. అయితే దీని ప్రతిఫలం త్వరలోనే వారి చేతికి అందింది. వ్యాపారం మరింత వృద్ధి చెంది... మూడు పువ్వులూ, ఆరు కాయలు అన్నట్లుగా వర్ధిల్లుతోంది. ప్రస్తుతం ఫక్జువాలీ... మరో నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఆమె ఏడేళ్ల కొడుకు... తమ సొంతూరైన ఐజ్వాల్‌లోనే మంచి స్కూల్ కు వెళుతున్నాడు.

తన విజయగాధను వివరిస్తున్నప్పుడు.. ఫక్జువాలీ కళ్లలోని మెరుపు చూసి తీరాల్సిందే..! ఆమె కథను ఆమె మాటల్లోనే వినేందుకు క్రింది వీడియో పైన క్లిక్ చేయండి.


సునీతాబెన్ వాడేచా - స్త్రీ వివక్షపై పోరాటం

గుజరాత్ లోని గాంధీధామ్ మార్కెట్ లో గత ఎనిమిదేళ్లుగా కూరగాయల వ్యాపారం చేసుకుంటోన్న సునీతా బెన్ ది మరో పోరాటగాథ. ఆడపిల్లలంటే ఇంటికి భారమని భావించే తల్లిదండ్రుల ఇంట జన్మించిన సునీతా బెన్... తానెప్పుడూ స్కూల్ కు వెళ్లలేదని చెప్పేందుకు ఎంతగానే బాధపడుతుంది. నిజమేమరి.. కట్టలు కట్టలు కట్నాలు దోచుకెళ్లే అమ్మాయిలకు ఓ తోడు వెతికి పెడితే చాలనుకునే తల్లిదండ్రులు.... ఇక ఆమెకు చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకువస్తారని ఆశించడం వృధాప్రయాసే...! అలా 19ఏళ్లకే ఓ మొగుడికి ఇల్లాలిగా మారిపోయిన సునీతాబెన్... చాలాకాలం పాటూ వంటింటికే పరిమితం అయిపోయింది.

సునీతాబెన్ వాడేచా

సునీతాబెన్ వాడేచా


"ఏళ్లు గడిచాయి. నేను నలుగురు పిల్లల తల్లినయ్యాను. మా అత్తగారు కూడా మాతో పాటే ఉంటారు. నా భర్త సంపాదన నెలకు 5000వేల రూపాయిలు మాత్రమే. దానిమీదే ఆధారపడి ఏడుగురు మనుషులు బతకాలంటే చాలా కష్టం. నాకెప్పుడూ బయటకు వచ్చే స్వాతంత్రం లేకపోయింది. కానీ, పరిస్థితులు నేను బయటకు వచ్చేలా చేశాయి. ప్రస్తుతం నా కూరగాయల వ్యాపారమే మా కుటుంబాన్ని పోషిస్తోంది" అని తన ప్రయాణాన్ని వివరించిన సునితా బెన్... "నా పిల్లలు నాలా కూరగాయలు అమ్ముకోకూడదు. వారు మంచి స్కూళ్లకు వెళ్లాలి. బాగా చదువుకుని జీవితంలో మంచిగా స్థిరపడాలి" అని ధృఢంగా చెబుతుంది.

అంతంత మాత్రంగానే నడుస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు క్రౌడ్ ఫండెడ్ సంస్థ నుంచి లోన్ తీసుకున్న సునీతాబెన్.. కొంతకాలానికే లాభాలను చవిచూసింది. నెలల వ్యవధిలోనే ఆమె ఆదాయం మూడింతలైంది.

మహానంద - విధివంచితలకు మార్గదర్శి

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి. ఆమెకు చికిత్స కాదు కదా... కనీసం పట్టెడు అన్నం కూడా పెట్టలేని స్థితిలో 16ఏళ్ల మహానందకు జరిగిన అన్యాయం... జీవితం పట్ల ఆమెకున్న ధృక్పధాన్నే మార్చేసింది.

ప్రతి రోజూ జీవన పోరాటమే అవుతున్న సమయంతో మహానంద మేనమామలు ఆమె తల్లికి వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అయితే.. అది మూన్నాళ్ల ముచ్చటేనని ఆమె గ్రహించలేకపోయింది. కొంతకాలానికి సహాయాన్ని నిలిపివేయడమే కాకుండా.. అప్పటివరకూ ఖర్చుపెట్టినది కూడా తిరిగి ఇచ్చేయమన్నారు. అంతా కలపి 3 వేల రూపాయిలే అయినా.. అది కూడా ఇవ్వలేని పరిస్థితి మహానందది.

ఆ ఘటనే తన జీవితాన్ని మార్చేసిందని తెలిపిన మహానంద... ఆ తరువాత ఎంతటి దారుణమైన పరిస్థితులను చవిచూసిందో తన మాటల్లోనే వివరించింది. మాహానంద కథను వినేందుకు ఈ క్రింది వీడియో పై క్లిక్ చేయండి.


మేనమామలు మహానందను దేవదాసిని చేశారు. అక్కడితో ఆగకుండా డబ్బు కోసం ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టేశారు. తన పట్ల ఎంత అన్యాయం జరుగుతుందో గ్రహించేలోగానే... మహానంద జీవితం పూర్తిగా చీకటి కూపంలోకి జారిపోయింది.

మూడేళ్ల పాటూ ఆ నరకంలోనే గడిపిన మహానంద... చివరికి గర్భం కూడా దాల్చింది. ఇక.. ఈ జీవితం నుంచి బయటపడాలని ఆ క్షణాన్నే నిర్ణయించుకున్న ఆమె... తమ బ్రోతల్ హౌస్ నిర్వాహకురాలి కాళ్లా వేళ్లాపడి ఎట్టకేలకు ఆ మురికి కూపం నుంచి బయటపడింది.

అయితే అక్కడి నుంచే అసలైన ఆమె జీవన పోరాటం ప్రారంభమైంది. అదే సమయంలో మాజీ దేవదాసీల్లో చైతన్యం కల్పించేందుకు పాటుపడుతున్న సామాజిక కార్యకర్త సీతావాను కలసిన మహానంద... అప్పటినుంచే తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం ప్రారంభించింది.

"ఒకసారి దేవదాసిని చేశాక.. ఆమె ఇంకొకరిని పెళ్లాడేందుకు వీలులేదు. జనాలు ఆమెను వెలేస్తారు. ఆమెపై వేశ్య ముద్రవేస్తారు. కన్నవారు సైతం అలాంటి వారని ఆదరించరు సరికదా.. సమాజంలో కనీసం ఓ మనిషిగాను గౌరవించరు" అని దేవదాసీల పరిస్థితి పట్ల అవేదన వ్యక్తం చేశారు సీతావా.


మహానంద

మహానంద


కాలం ఎదురు తిరిగినప్పుడు... పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పుడు.. ఓ చిన్ని ఆశే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇంకొకరైతే ఇలాంటి పరిస్థితుల్లో తన కుమార్తెను కూడా దేవదాసిగా మార్చేసి చేతులు దులుపుకునేవారే...! కానీ, మహానంద అలా చేయలేదు. అదే సమయంలో తన లాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపే "మాస్" అనే స్వచ్ఛంధ సంస్థ ఆమెనూ ఆదుకుంది. తమ భాగస్వామి సహకారంతో మహానందకు క్రౌడ్ ఫండ్ నుంచి మైక్రో లోన్ అందించి ఆమె తన కాళ్లపై తాను నిలబడేలా సహాయ సహకారాలు అందించింది.

మైక్రోలోన్ సహాయంతో టైలరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించిన మహానంద... సమాజంలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ఎంతగానో శ్రమించింది. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. అయినా పట్టుసడలని ధైర్యంతో అన్ని అడ్డంకులనూ అధిగమించి తన కుమార్తెలకు మంచి జీవితాన్ని అందించేందుకు పాటుపడుతోంది. అంతేకాదు... తనలాంటి ఎందరో విధివంచితలకు మార్గనిర్దేశం చేస్తూ.. వారి జీవితాల్లోనూ వెలుగులు నింపుతోంది ఈ మహిళామూర్తి.

ఈ సమాజంలో మహానంద వంటి వీర నారీమణులు ఎందరో ఉన్నారు. గ్రామీణ భారతంలో ఉన్నత విద్యకు నోచుకోకపోయినా... అరకొర వసతులతోనే తమ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తాపత్రయపడుతున్నారు ఎందరో మాతృమూర్తులు. వారికి కావాల్సిందల్లా... కాస్తంత శిక్షణ, ఆర్ధిక సహాయం మాత్రమే.

ఈ చిరు సహాయం అందిస్తే చాలు.. ఎందరో గృహిణులు వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ, ఉన్నత శిఖరాలను అందుకుంటారు.... ఓ నవ విప్లవానికి నాంది పలుకుతారు.

అలాంటి ఉద్యమానికి మద్దతు తెలిపి, వారి శ్రమను గుర్తించి,... మహానంద వంటి వీర వనితలకు కాస్తంత ప్రోత్సాహం అందించినప్పుడు అదే అసలైన మహిళా దినోత్సవం.!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags