సంకలనాలు
Telugu

ఇరాన్‌ టు అంతరిక్షయానం.. ఎందరికో స్ఫూర్తినిచ్చిన అనౌష్ !!

GOPAL
28th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కొద్దిగా అదృష్టం తడబడితే నిరాశలో కూరుకుపోయేవారెందరో. పరిస్థితులు సహకరించలేదని, అదృష్టాన్ని తిట్టుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. కానీ రాజకీయ కల్లోలం, ఆర్థిక ఇబ్బందులు ఇలా అన్నింటిని ఎదుర్కొని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనౌష్ అన్సారీ. ఇరాన్‌లోని రాజకీయ కల్లోలిత ప్రాంతం నుంచి వచ్చిన ఈమె తన చిన్ననాటి స్వప్నం అంతరిక్షయానాన్ని పూర్తిచేశారు. పరిస్థితులు బాగోలేవని మూలన కూర్చోక, పట్టుదలతో పలు కంపెనీలు స్థాపించారు. ప్రపంచ ప్రసిద్ధిపొందారు.

అనౌష్ అన్సారీ.. సొంత ఖర్చులతో అంతరిక్షయానం చేసిన నాలుగో ట్రావెలర్. ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు బాగోలేకపోవడంతో అన్సారీ కుటుంబమంతా అమెరికాకు పయనమైంది. అప్పుడు అన్సారీ వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. అమెరికాలో అడుగుపెట్టిన సమయంలో ఆమెకు అసలు ఇంగ్లీష్ ప‌రిజ్ఞాన‌మే లేదు. పెద్ద కూతురు కావడంతో, కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎక్కువ సమయాన్ని చదువుకే కేటాయించారు.. అలా ఉద్యోగం సంపాదించేందుకు చాలా కష్టపడి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1993లో టెలికమ్ టెక్నాలజీస్ ఇన్‌కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాన్ని 750 మిలియన్ డాలర్లకు సోనస్ నెట్‌వర్క్స్‌కు అమ్మేశారు. ఆ వచ్చిన సొమ్మును మంచి పనులకు వినియోగించారు.

ఆ తర్వాత ఐఓటీ కంపెనీ ప్రొడియా సిస్టమ్స్, ఎక్స్ ప్రైజ్ అవార్డును కూడా ఆమె ఏర్పాటు చేశారు. అంతరిక్ష పర్యటనకు ఉపయోగపడే సలహాలు ఇచ్చేవారికి X-ప్రైజ్ మద్దతు ఇచ్చేది. అన్సారీ ఇటీవలే భారత్‌లో పర్యటించారు. సాధారణ టెలివిజన్ కంటే ఇంటర్నెట్ ఎంత ఉపయుక్తమైనదో ప్రజలకు తెలియజెప్పేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే ప్రభుత్వ సేవలు గ్రామీణ, పట్టణ పేదలకు ఎలా అందుతాయో, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఆమె చెబుతున్నారు. భారత్‌లో ఆమె తొలి ప్రాజెక్ట్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది. తమ సంస్థ రూపొందించే పరికరం లక్ష టీవీలకు చేర్చాలన్నదే ఆమె లక్ష్యం. ప్రతియేటా నిర్వహించే సాండ్‌బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ సదస్సుకు ఈసారి వచ్చిన అన్సారీతో యువర్‌స్టోరీ ముచ్చటించింది. స్పేస్ ట్రావలర్‌గా మారడానికి స్ఫూర్తి ఏంటి? ఆంట్రప్రెన్యూర్‌గా ఏం సాధించాలనుకుంటున్నారు? ఇండియాలో ఆమె ప్రాజెక్ట్ పేదలకు ఎలా ఉపయోగపడనుంది? తెలుసుకునే ప్రయత్నం చేసింది.

undefined

undefined


యువర్‌స్టోరీ: రాజస్థాన్‌లో మీ ప్రాజెక్ట్‌ గురించి వివరించండి..

అనౌష్: రాజస్థాన్‌లో మూడు జిల్లాల్లో లక్ష ఇళ్లలోకి చేరాలన్నదే మా లక్ష్యం. తక్కువ ఖర్చుతో కూడుకున్న టీవీలతో పేదలకు దగ్గర కావచ్చని గుర్తించాం. మేం రూపొందించిన పరికరాన్ని టీవీకి అనుసంధించడం వల్ల 4జీ నెట్‌వర్క్‌ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందొచ్చు. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తెలుసుకోవచ్చు. నేను చాలాసార్లు ఇండియాలో పర్యటించాను. చాలా ఇళ్లలో టీవీలు ఉన్న విషయం గమనించాను. అయితే ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇస్తుందో మాత్రం చాలామందికి తెలియదు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ప్రభుత్వ సేవల వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో మా ప్రాజెక్ట్ ఉంటుంది. తొలి ఏడాది ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ ఇస్తాం. ఆ తర్వాత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ప్రభుత్వ సబ్సీడీపై కస్టమర్లకు చార్జ్ చేస్తాం.

యువర్‌స్టోరీ: అమెరికాకు మీరు వలస వెళ్లిన సమయంలో మీరు చాలా పేదవారు. ఆ సమయంలో మీకు స్ఫూర్తి కలిగించిన విషయాలేంటి?

అనౌష్: నాకు 16 ఏళ్లప్పుడు మేం అమెరికా వెళ్లాం. ఇరాన్‌లో తీవ్ర ప్రభావం చూపిన కల్చరల్ రెవల్యూషన్‌ను కూడా చవిచూశాను. అమెరికా వెళ్లిన సమయంలో నాకు ఇంగ్లీష్ కూడా తెలియదు. ఎలాగోలా జీవితాన్ని ప్రారంభించాం. కుటుంబానికి నేను ఏదో విధంగా సాయం చేయాలని మా అమ్మ కోరుకునేది. దీంతో నేను కంప్యూటర్ సైన్స్‌లో చేరాను. అది సరైన నిర్ణయమని ఆ తర్వాత ప్రూవ్ అయింది. టెలికమ్‌ రంగంలో నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత సొంతంగా సంస్థను ఏర్పాటు చేశారు. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారేందుకు మా వారు ఎంతో సహకరించారు.

1993లో అలాంటి సంస్థ సిలికాన్ వ్యాలీలో లేనే లేదు. సంస్థను ప్రారంభించిన మొదట్లో మేం డల్లాస్‌లో ఉండే వారం. టెలికం ఆపరేటర్స్‌కు కొన్ని కన్సల్టింగ్‌ పనులు నిర్వహిస్తున్నాం. అయితే మాలాంటి సంస్థలకు దిగ్గజ కంపెనీలు సొల్యూషన్స్‌ రూపొందించి ఇచ్చేవి కావు. దీంతో మేమే సొంతంగా ప్రాడక్ట్స్ తయారు చేసుకున్నాం. టెస్ట్ ఆటోమేషన్, లోకల్ నంబర్ పోర్టబిలిటీ, డాటా నెట్‌వర్క్స్, వైర్‌లెస్ ఇంటర్నెట్ నెట్‌వర్క్స్ వంటివి నిర్వహించాం. వాయిస్ నెట్‌వర్క్స్‌లో ఉపయోగించే ఐపీని సాఫ్ట్ స్విచ్‌లతో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం. ఆ సమయంలో అదో పెద్ద విప్లవం.

యువర్‌స్టోరీ: అప్పట్లో మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకునేవారా?

అనౌష్: మొదటిసారిగా ఏం రూపొందించేందుకు ప్రయత్నించినా ప్రజలు నవ్వుకోవడం సహజం. రిస్క్‌కు ఎప్పుడు భయపడొద్దు. సమస్య ఏంటో తెలుసుకుని పనిచేస్తే, పరిష్కారం ఏదో ఒకటి దొరుకుతుంది. పరిష్కారం నుంచి పక్కకు జరుగుతుండొచ్చు. కానీ సమస్యను మాత్రం మర్చిపోవద్దు. అందుకోసం మంచి విజన్ కావాలి. నా వరకైతే నాకు మా ఆయనే మెంటర్. ఎలా ప్రజంటేషన్స్ ఇవ్వాలి, ప్రజలతో ఎలా వ్యవహరించాలి అన్న విషయాలు ఆయనే నేర్పించారు. ఎనిమిదేళ్లపాటు సంస్థను నిర్మించిన తర్వాత, ఇంటర్నెట్‌కు కాలం చెల్లడం, డాట్‌కామ్ బూమ్ పేలిపోవడంతో సంస్థను అమ్మేయాల్సి వచ్చింది. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండటంతో మా సంస్థను వేరే దాంట్లో విలీనం చేశాం. కంపెనీని అమ్మేసిన తర్వాత నా కలల ప్రాజెక్ట్ స్పేస్ ట్రావెల్‌పై దృష్టిపెట్టేందుకు సమయం దొరికింది. అంతరిక్ష పర్యటన నా చిన్ననాటి స్వప్నం.

యువర్‌స్టోరీ: అంతరిక్ష యాత్ర ప్లాన్ ఎలా సాధ్యమైంది?

అనౌష్: అంతరిక్ష యాత్ర గురించి సైంటిస్ట్ పీటర్ డిమండిస్ అన్వేషణ సాగిస్తున్నప్పుడు నేను విశ్రాంతి కోసం హవాయి దీవుల్లో ఉన్నాను. ఆ సమయంలో ఆయన నుంచి పిలుపొచ్చింది. అప్పటికే 1995లోనే నేను ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్‌ను ప్రారంభించాను. అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరణలు, నాసాకు ఉపయోగపడేవి 2004 నుంచి మాత్రమే వచ్చాయి. అంతరిక్ష యాత్రకు అయ్యే ఖర్చునే స్వయంగా నేనే పెట్టుకోవాలని అప్పుడు నిర్ణయించుకున్నారు. కాస్మోనట్ అయ్యేందుకు రష్యాలో ఎంతో తెలుసుకోవాల్సి వచ్చింది. అలాగే జీ-ఫోర్స్ అనుభవం కూడా పనికొచ్చింది. కేవలం ముగ్గురికి మాత్రమే ప్లేస్ ఉన్న చిన్న రాకెట్ అది. దానికంటే ముందు జీరో-జీ స్పేస్ ఫ్లైట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాం. పరికరాలన్నీ రష్యన్‌లో ఉండటంతో రష్యన్ నేర్చుకోవాల్సి వచ్చింది. చివరకు స్పేస్ ఫ్లైట్‌లో రెండు రోజులు, స్పేస్ స్టేషన్‌లో తొమ్మిది రోజులు ఉన్నాను.

యువర్‌స్టోరీ: ఆ అనుభవం ఎలా ఉంది?

అనౌష్: ఆ అనుభవాన్ని చెప్పడం అంత సులభం కాదు. అక్కడంతా విభిన్నం. భూమికి అంతరిక్షానికి ఎంతో తేడా ఉంది. అంతరిక్షంలో అంతా శూన్యమే. ఇక ఎంతో సుందరమైన భూగ్రహాన్ని మనమంతా చేజేతులా నాశనం చేస్తున్నాం.

యువర్‌స్టోరీ: అంతరిక్ష యాత్ర ద్వారా ఎలాంటి మార్పులు ఆవిష్కరించారు?

అనౌష్:  అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తే ఉచింతంగా సౌర విద్యుతును పొందే అవకాశాలున్నాయని నాకు అనిపించింది. ప్రపంచం మొత్తం ఉచితంగా సౌర విద్యుత్‌ను పొందితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చంద్రుడిపై కూడా ఓ బేస్‌ను ఏర్పర్చే అవకాశాలున్నాయి. అలాగే మార్స్‌పైకి కూడా వెళ్లే రోజు వస్తుంది. అంతరిక్ష యాత్రకు అయ్యే ఖర్చు వచ్చే 30 ఏళ్లలో చాలా వరకు తగ్గుతుంది.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags