సంకలనాలు
Telugu

కత్తిలాంటి ఉద్యోగిని వెతికిపెట్టే విస్డమ్ జాబ్స్

team ys telugu
16th Mar 2017
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

నిరుద్యోగి: మంచి జాబ్ కావాలంటే మంచి రెజ్యూమ్ కావాలి. ఇంగ్లిష్ బాగుంటే స‌రిపోదు మ్యాటర్ లో ద‌మ్ముండాలి. ఇంట‌ర్వ్యూ బోర్డును బుట్ట‌లో ప‌డేయాలి. అలాగని ఒక్క రెజ్యూమ్ బాగుంటే స‌రిపోదు. బోర్డు అడిగే ప్ర‌శ్న‌ల‌కు దీటుగా జ‌వాబులివ్వాలి. అన్ని రౌండ్లు సునాయాసంగా దాటినా ఆఖ‌రి రౌండ్ ప‌ద్మ‌వ్యూహాన్ని ఛేదించాలి. అక్క‌ డ దెబ్బ‌తిన్నామా ఇక ఇంటికే. మ‌రి ఎలా? ఈ జాబ్ నాకు క‌చ్చితంగా వ‌స్తుంద‌న్న ధీమాతో ఇంట‌ర్వ్యూకు వెళ్లాలంటే ఏం చేయాలి?

యజ‌మాని: మా కంపెనీ ఉద్యోగానికి సరైన అభ్య‌ర్థి దొరికితే బాగుండేది. రెజ్యూముల‌న్నీ వ‌డ‌పోసి స‌త్తా ఉన్నోడిని ప‌సిగ‌ట్ట‌డ‌మెలా? సీవీ న‌చ్చి జాబిస్తే ప‌ని స‌రిగ్గా చేస్తాడా? ఒక‌వేళ చేయ‌క‌పోతే ఎంత లాసు? మ‌రి క‌త్తి లాంటి ఉద్యోగిని ఎలా ప‌ట్టాలి? అందుకు ఏదైనా మార్గ‌ముందా?

ఎందుకు లేదు! క‌చ్చితంగా ఉంది. అటు ఉద్యోగార్థుల‌కు, ఇటు రిక్రూట‌ర్ల‌కు ఇద్దిరికీ ఉభ‌య తార‌కం WISDOM JOBS. ఇదొక ఫోర్త్ జనరేషన్ జాబ్ పోర్టల్. అతి తక్కువ సమయంలో నిరుద్యోగికి చ‌క్క‌టి ఉద్యోగం వెతికి పెడుతుంది. షార్ట్ పీరియ‌డ్ లో కంపెనీకి ప‌నికొచ్చే ఉద్యోగిని మీ ముందు పెడుతుంది. క్యాండిడేట్ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందే ఆన్ లైన్లో స్క్రీనింగ్ చేస్తుంది. స‌రుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పెడుతుంది. WISDOM JOBS ఫౌండ‌ర్/సీఈవో అజ‌య్ కొల్లా. ఆయ‌న మొద‌లు పెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో నంబ‌ర్ వ‌న్ జాబ్ పోర్ట‌ల్.

ఒక నిరుద్యోగి ఇంట‌ర్వ్యూ రూమ్ లోకి వెళ్లే ముందు త‌న కెపాసిటీ, కేప‌బిలిటీ గురించి అంచ‌నా వేసుకోవాలి. ఉద్యోగానికి స‌రిపోయే స్కిల్ త‌న‌కుందో లేదో చూసుకోవాలి. కాంపిటీష‌న్ త‌ట్టుకోవాలంటే ఎప్పటిక‌ప్పుడు స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ చేసుకోవాలి. కుప్పలు తెప్పలుగా వచ్చి పడే రెజ్యూముల్లో నుంచి మ్యాట‌ర్ ఉన్న సీవీల‌ను గుర్తించ‌డం ఇటు కంపెనీలకు కూడా కత్తి మీద సామే. ఇలాంటి సమస్యలన్నింటికీ సమాధానమే WISDOM JOBS. ఇది స్టార్టప్ కంపెనీలాంటిది. జాబ్ సెర్చ్, స్కిల్ టెస్ట్, స్కిల్ డెవలప్మెంట్, రెజ్యూమ్ రైటింగ్ సర్వీస్ వగైరా సేవ‌లు ఇందులో దొరుకుతాయి.

image


www.wisdomjobs.com అని గూగుల్ లో టైప్ చేస్తే ఈ సైట్ కి ఎందుకింత క్రేజో తెలుస్తుంది. ఇది ఇండియాలోనే ద బెస్ట్ జాబ్ సెర్చ్ వెబ్ సైట్ అని చెప్పొచ్చు. కేవలం ఆరేళ్లలో 3 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను సంపాదించుకుందంటే మాట‌లు కాదు. అందులో కోటిన్నర మంది స్కిల్ టెస్టులో పాసైన వారున్నారు.

WISDOM JOBS లో అభ్య‌ర్థుల వ‌డ‌పోత అల్లాట‌ప్పాగా ఉండ‌దు. దానికంటూ ఒక నిర్దిష్ట‌మైన ప‌ద్ధ‌తి ఉంది. ఇందులో ప్రజ్ఞా మీటర్ అని ఒక టూల్ ఉంది. ఒక‌ర‌కంగా అదే ఇంట‌ర్వ్యూయ‌ర్. అభ్య‌ర్థుల‌ను జ‌ల్లెడ ప‌ట్టి ప‌నికొచ్చే స‌రుకును షార్ట్ లిస్ట్ చేస్తుంది. మీ కంపెనీ అవసరాలకు అతికినట్టు సరిపోయే ఉద్యోగులను ఇది వెతికి పెడుతుంది. కోర్ స్కిల్, భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్, ఆప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ స్కిల్ వంటి ఆరువేల పైచిలుకు నైపుణ్యాల్లో అభ్యర్థులను Pragnya Meter వడబోస్తుంది. రిక్రూటర్లు తమ సొంత ప్రశ్నలు వేయొచ్చు. లేదంటే Pragnya Meter డేటా బేస్ లో డీఫాల్టుగా ఉన్న 5 కోట్ల ప్రశ్నల్లోంచి ఎంపిక చేసుకోవ‌చ్చు. వెబ్ క్యామ్ రీడింగ్, స్క్రీన్ మానిటరింగ్, బ్రౌజర్ టోలరెన్స్ కంట్రోల్, ఐపీ నియంత్రణ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిన, ఆన్ గోయింగ్, షెడ్యూల్డ్ అసైన్మెంట్లకు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ రిక్రూటర్లకు డ్యాష్‌ బోర్డు మీద కనిపిస్తుంది.

WISDOM JOBS సైట్లో అభ్యర్థుల వివ‌రాల ప‌క్క‌నే వారి స్కిల్ స్కోర్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇతర మార్గాల్లో రిక్రూటర్లకు అభ్యర్థుల రెజ్యూమ్‌ లు అందినప్పుడు.. Pragnya Meter ద్వారా క్యాండిడేట్ల స్కిల్ ఏంటో టెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలిస్తే స‌రిపోతుంది. అభ్యర్థులను షార్టులిస్టు చేసే విషయంలో రిక్రూటర్లకు ఆబ్జెక్టివ్ ఛాయిస్ కూడా ఇస్తామ‌ని అజయ్ కొల్లా తెలిపారు.

ఇదీ ప్రాసెస్..

ఉద్యోగార్థులు పోర్టల్‌ లోకి లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌ బోర్డు ద్వారా Pragnya Meter కు యాక్సెస్ కావొచ్చు. ప్రజ్ఞా మీటర్ లో అభ్యర్థులు తమ స్కిల్ ని పరీక్షించుకుంటున్న సమయంలోనే వారి కేప‌బిలిటీ మీద ఒక ఒపీనియ‌న్ ఏర్పడుతుంది. స్కోర్లు, ర్యాంకుల విషయంలో ఇతరులతో పోల్చి చూసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. ప్రజ్ఞా మీటర్ లో ఎన్ని సార్లయినా స్కిల్ ను టెస్ట్ చేసుకోవ‌చ్చు. స్కోర్ పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఫలానా జాబ్ ప్రొఫైల్ కి మీ ఇన్ఫర్మేషన్ సరిపోతుందా లేదా, ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు చేసుకోవాల్సిన ప్రిపరేషన్లు, ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా ఈ సైట్ అందిస్తుంది. ఇందుకోసం VConnect అనే వాయిస్ ఆధారిత టూల్ ఒకటుంది. చిన్న కంపెనీల నుంచి భారీ పరిశ్రమల వరకు ఉద్యోగులను వెతికి పెట్టడంలో Pragnya Meter, VConnect రెండూ విజ‌య‌వంతం అయ్యాయ‌ని అజయ్ కొల్లా తెలిపారు.

జాబే కాదు.. అంతకుమించి!

జాబ్ సెర్చింగ్ విషయంలో అభ్యర్థి కోణంలో నుంచి ఆలోచించడం మొదలు పెట్టారు అజ‌య్ కొల్లా. దీనివల్ల ప‌ని ఈజీ అయింది. ఫ‌లానా కంపెనీ ఉద్యోగానికి సరిపోయే నైపుణ్యాన్ని అభ్యర్థికి online tutorials ద్వారా అందిస్తుంటారు. ఇందులో e-university అని ఇంకో స్పెషల్ టూల్ ఉంది. WISDOM JOBS రిజిస్టర్డ్ యూజర్లు ఈ-యూనివర్సిటీ ఆప్షన్ ద్వారా తమ నైపుణ్యాలకు సాన బెట్టుకోవ‌చ్చు. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావొచ్చు. కోర్సు కంటెంట్, ఇంటర్వ్యూలో తరచుగా అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలు, 4 వేల పైచిలుకు స్కిల్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఇందులో లభిస్తాయి. నిపుణుల‌తో ఎప్పటికప్పుడు e-university డేటా బేస్ ను అప్ డేట్ చేస్తుంటారు.

e-university డేటా బేస్ ను ఇంకా అప్ డేట్ చేస్తున్నాం. కొత్త కోర్సులను చేర్చడంతోపాటు ఆల్రెడీ ఉన్న కోర్సులను అప్ గ్రేడ్ చేస్తున్నాం. మార్కెట్ ట్రెండ్, డిమాండ్ ను బట్టి కోర్సులను యాడ్ చేస్తుంటాం. ప్రతీ రంగం నుంచి పెద్ద సంఖ్యలో కోర్సులు అందుబాటులో తేవడానికి కృషి చేస్తున్నాం. ప్రతి నెలా e-university వెబ్ పేజీకి పది లక్షల ట్రాఫిక్ ఉంటోంది- అజయ్ కొల్లా.

అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, govtjobs ఇతరత్రా walk-ins, sarkari results.. ఇలా ఏ రంగానికి ఆ రంగ‌మే ఉద్యోగాలను విభజించారు. జాబ్ హంటింగ్ లో అభ్యర్థి లొకేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రాంతాల వారీగా కూడా ఉద్యోగాలను వర్గీకరించారు. దీనివల్ల అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగార్థులకు ఇద్దరికీ టైం సేఫ్. ఉద్యోగావకాశాలపై నమోదుచేసుకున్న యూజర్లకు free-job-alert కూడా పంపిస్తుంటారు.

-------------------------------------------------------------------------------------------------------

మీరు మీమీ ప్రాంతాల్లో మంచి ఉద్యోగావకాశాల కోసం వెతుకుతున్నారా? మీలాంటి వారికోసమే WISDOM JOBS ఉంది. మీ దగ్గర్లోనే మీరు కోరుకున్న ఉద్యోగాలను వెతికిపెడుతుంది. 

Jobs-in-Delhi  /  Jobs-in-Mumbai /  Jobs-in-Pune / / Jobs-in-Bangalore / Jobs-in-Chennai / Jobs-in-Hyderabad /

--------------------------------------------------------------------------------------------------------------

అంతా టెక్ మ‌హిమ‌..

ఏ బిజినెస్ కు అయినా టెక్నాల‌జీనే కీల‌కం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ దగ్గర్నుంచి బిజినెస్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్స్ వరకు ఎలాంటి ఉద్యోగమైనా స‌రే WISDOM JOBS ద్వారా సంపాదించ‌వ‌చ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కూడా టెక్నాలజీదే అగ్రతాంబూలం. పైగా ఈ మ‌ధ్య కంపెనీలు రిక్రూట్ మెంట్ కోసం పెద్దగా టైం వేస్ట్ చేసుకోవడం లేదు. ఎవరికి వాళ్లు క్లౌడ్ టెక్నాలజీలు, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. డేటా అనలిటిక్స్ దే ఇప్పుడు కీ రోల్. అరచేతిలో మొబైల్ ఉంటే చాలు. బోలెడన్నీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. న‌చ్చిన ఉద్యోగాన్ని ఆన్ లైన్ లోనే ప‌ట్టేస్తున్నారు- అజయ్ కొల్లా

WISDOM JOBS లో ఇంకో రెండు టూల్స్ ఉన్నాయి. అవి హడూప్ లేదా బిగ్ డేటా టూల్. వీటి ద్వారా మరింత కచ్చితత్వంతో ఉద్యోగాలకు పనికొచ్చే సరుకును వెతికి పట్టుకోవచ్చు. డే-టూ-డే రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో Pragnya Meter, VConnect కూడా అంతర్భాగం అయ్యాయి. అందుకే బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ లాంటి లెటెస్ట్ టెక్నాలజీని అందిస్తున్నారు అజయ్. మంచి మంచి ఫీచర్లతో మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

సవాళ్లు లేకుండా ఎలా..?

స్టార్టప్ ఈకో సిస్టమ్ గా అభివృద్ధి చెందుతున్న ఇండియాలో స్టార్టప్ లకు కూడా సేవలందిస్తామంటున్నారు అజయ్ కొల్లా. స్టార్టప్ ల కోసం ప్రత్యేకంగా క్విక్ సోర్స్ ను డిజైన్ చేశామని వెల్లడించారు. వాటి అవసరాలకు అనుగుణంగా రెజ్యూమ్ ప్యాక్స్ అందిస్తున్నారు.

స్టార్టప్ కంపెనీ ఎప్పుడూ తొందరపడి ఒక కన్ క్లూజన్ కు రాకూడదు. అపాయింట్ చేసుకున్న వ్యక్తికి గురుతర బాధ్యతలు అప్పగించి, తన ఉద్యోగానికి ఒక విలువ ఉందని ఉద్యోగి భావించుకునేలా చేయాలి. వాళ్లు చేయగలరని మీరు అనుకుంటే.. అది క్రాస్ ఇండస్ట్రీ క్యాండిడేట్లు అయినా సరే ఉద్యోగంలో పెట్టుకోవాలి. ఇంకో ముఖ్య విషయం. అన్నింటికీ మించి కంపెనీ వ‌ర్కింగ్ కల్చర్ పూర్తిగా మీ చేతుల్లోనే ఉండాలి. ఒక పాజిటివ్, వెల్ కమింగ్ కల్చర్ మీకుంటే.. మీ వ్యాపారాన్ని భుజాన మోసే అంబాసిడర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని WISDOM JOBS.COM సీఈవో అజయ్ కొల్లా విలువైన సలహాలు ఇచ్చారు.

గమనిక: ఇది WISDOM JOBS వారి స్పాన్సర్డ్ ఆర్టికల్

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags