సంకలనాలు
Telugu

చిన్న క్యాబ్ ఆపరేటర్లు... కోట్లాది కస్టమర్లు... అదరగొట్టిన లోకో క్యాబ్స్ !!

ఆన్ లైన్, ఆఫ్ లైన్ తేడా లేదు... టాక్సీ అనగానే లోకో క్యాబ్స్ గుర్తు రావాలి..

15th Jan 2016
Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share

ఏ క్యాబ్ బుక్ చేయాలి? ఈ ప్రశ్న మీకెపుడైనా వచ్చిందా? అందుబాటులో క్యాబ్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, మొబైల్ లో యాప్ లు ఉన్నా, మీ అవసరాలకు తగ్గట్టు తక్కువ ఫేర్ తో వచ్చే బెస్ట్ డీల్ ఏది? ఇలాంటి సందేహం చాలా సార్లు వచ్చి ఉంటుంది. ఈ ప్రశ్నలకు మేం సమాధానం ఇస్తాం అంటోంది లోకో క్యాబ్స్.

లోకో టీమ్ ఇదే...

లోకో టీమ్ ఇదే...


నిజానికి రేడియో క్యాబ్స్ సెలక్ట్ చేసుకోవటం లోనే కాదు.. దూర ప్రాంతాల ప్రయాణాలకు వెళ్లటానికి, గంటకింత లెక్కన ఛార్జ్ చేసే టాక్సీలను ఎంపిక చేసుకోవటంలోనూ చాలా సందేహాలు వస్తుంటాయి. సరిగ్గా ఇదే పరిస్థితి నేహా బోరా, షలక్ నాయక్ లకు వచ్చింది. అప్పుడు పుట్టిన ఆలోచనే -"లోకో క్యాబ్స్". ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్యాబ్ సర్వీసుల కోసం రూపొందించిన ఈ మెటా సెర్చ్ ఇంజన్ ఇది. నగరం లోపలే కాదు, దూర ప్రయాణాలకు కూడా ఏ క్యాబ్ బుక్ చేయాలా అని గందరగోళపడకుండా, మేం పరిష్కారం చూపిస్తాం అంటోంది ఈ పుణె బేస్డ్ స్టార్టప్.

2014లో లోకో క్యాబ్స్ మొదలయింది. నేహ, షలక్ ఇద్దరూ ఈ స్టార్టప్ మూల స్తంభాలు. సరికొత్త వ్యాపారాల గురించి, టెక్నాలజీని బేస్ చేసుకుని విన్నూత్నంగా ఆలోచించటానికి ఇష్టపడే ఈ ఇద్దరూ కాలేజ్ డేస్ నుంచీ మంచి ఫ్రెండ్స్ కూడా. యూనివర్సిటీ చదువులతో పాటు కార్పొరేట్ ఉద్యోగాల్లో చాలా కాలం పనిచేసిన అనుభవం తర్వాత ఈ సొంత వెంచర్ మొదలు పెట్టారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఈక్విటీ రీసెర్చ్ అండ్ కార్పొరేట్ ఫైనాన్స్ ఇన్ మేనేజ్ మెంట్ లో పదేళ్ల అనుభవం ఉన్న నేహ- లోకో క్యాబ్స్ ఫైనాన్స్, ఆపరేషన్స్ మార్కెటింగ్ వ్యవహారాలను చూస్తుంటే, కార్డిఫ్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్ మెంట్ డిగ్రీ తీసుకున్న షలక్- ట్రావెల్ ట్రేడ్ ఇండస్ట్రీలో తన 14ఏళ్ల అనుభవంతో ప్రొడక్ట్ డెవలప్ మెంట్, బిజినెస్ డెవలప్ మెంట్ వ్యవహారాలు చూస్తుంటారు.

యాండ్రాయిడ్ మరియు విండోస్ లపై నడిచే లోకో క్యాబ్స్ యాప్ ని ఇప్పటికి 18వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంటర్ సిటీ ట్రావెల్ కోసం వెబ్ బుకింగ్ ని ఈ నెలఖారుకు, ఐఓఎస్ యాప్ ను మరో ఆర్నెల్లలో మొదలు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నారు.

టాక్సీ ఇండస్ట్రీపైనే ఎందుకు ఎంచుకున్నారు?

ఇండియన్ టాక్సీ ఇండస్ట్రీ మార్కెట్ విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు ఉంది. ఇది చాలా వరకు ఆఫ్ లైన్ గానే నడుస్తోంది. టాక్సీ ఇండస్ట్రీలో పై చేయి సాధించిన అగ్రిగేటర్లు, ఆపరేటర్ల వాటా కేవలం 6 నుండి 7 శాతం మాత్రమే. ఏ సంస్థకు సంబంధం లేకుండా సొంత టాక్సీలను నడుపుకుంటున్నవాళ్లు లేదా, కొన్ని టాక్సీలకు సొంతదారుగా డ్రైవర్లతో నడిపిస్తున్న చిన్న చిన్న ఏజన్సీలే ఎక్కువ శాతం ఉన్నాయి. కానీ పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగం రాబోయే రోజుల్లో ఈ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకురాబోతోంది.

కానీ ఇలాంటి చిన్న క్యాబ్ ఆపరేటర్లు, ఓనర్లకు కోట్లాదిగా ఉన్న కస్టమర్లకు మధ్య ఎలాంటి బ్రిడ్జి లేదు. పైగా నెలలో అన్ని రోజులు గిరాకీ లేక, ఒకవేళ ఉన్నా సరైన ఆదాయం రాక ఈ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లు, చిన్న చిన్న ఏజన్సీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ లోటును తాము పూడుస్తామంటోంది లోకో క్యాబ్స్. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న క్యాబ్ ఆపరేటర్లకు, కస్టమర్లకు మధ్య వారధిలా లోకో క్యాబ్ వ్యవహరిస్తోంది.

గట్టి పోటీ ఉన్నా నిలదొక్కుకున్న లోకో క్యాబ్స్...

ఇక్సిగో, వివిగో లాంటి కంపెనీలు ఈ బిజినెస్ లో పోటీ ఇస్తున్నప్పటికీ, లోకో క్యాబ్స్ తన సర్వీసుల్లోని కొన్ని ప్రత్యేకతల కారణంగా నిలదొక్కుకోగలిగింది. ఓలా, ఉబెర్, టాక్సీఫర్ ష్యూర్ లాంటి అగ్రిగేటర్లను ఒకే దగ్గర చేర్చి అందిస్తున్నా, లోకో క్యాబ్స్ ముఖ్యంగా చిన్న ఆపరేటర్లే లక్ష్యంగా పనిచేస్తోంది. వారికి మార్కెటింగ్, టెక్నాలజీ లాంటి సమస్యలతో సంబంధం లేకుండా పైసా ఖర్చు పెట్టకుండా సువిశాల మార్కెట్ కి అనుసంధానం చేసే ఏర్పాటు చేస్తోంది. అంతే కాదు.. మార్కెట్ లోని డిమాండ్ సప్లై ల ఆధారంగా వారికి తమ సేవలను మెరుగు పరుచుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. 

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్లాట్ ఫాం క్యాబ్ ఓనర్లకు, ఏజన్సీలకు సువర్ణావకాశం లాంటిది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించకుండా, మరే ఇతర హిడెన్ ఛార్జెస్ లేకుండా, కేవలం యాప్ ద్వారా జరిగిన టూర్ ని బట్టి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది క్యాబ్ ఓనర్లకు చాలా మేలు చేసే విషయం. అంతే కాక, ఈ సర్వీసులు ఆయా క్యాబ్ ఓనర్ల పేరు మీదుగానే జరుగుతాయి కాబట్టి వాళ్ల రెప్యుటేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువ.

ఇలాంటి బిజినెస్ మోడల్‌తో రంగంలోకి దిగిన లోకో క్యాబ్స్ ఇటు కస్టమర్లను, అటు టాక్సీ ఆఫరేటర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ యాప్ ద్వారా సిటీ లోపల ప్రయాణాలతో పాటు, ఇంటర్ సిటీ బుకింగ్స్ సంఖ్య కూడా బాగా పెరుగుతూ వస్తోంది. మరో ఆరు నెలల్లో రోజుకి 150 ఇంటర్ సిటీ ప్రయాణాలు సక్సెస్ ఫుల్ గా బుక్ అవుతాయని అంచనా వేస్తోంది. 

లోకో క్యాబ్స్ సారధులు....

లోకో క్యాబ్స్ సారధులు....


ఈ వివరాలన్నీ చూస్తే ఈ యాప్ కేవలం టాక్సీ ఆపరేటర్లకు, అగ్రిగేటర్లకు సంబంధించినదేనా అనే అనుమానం రావచ్చు. కానీ, దీనివల్ల వినియోగదారులకు చాలా పెద్ద ఉపయోగమే ఉంది. లోకో క్యాబ్స్ ఉపయోగించే ప్రయాణికులు వివిధ ఆపరేటర్ల సర్వీసులు, యూజర్ రివ్యూలు, రేటింగ్స్, ఛార్జీలు, అవైలబిలిటీ... లాంటి అంశాలు పోల్చుకుని తమ ప్రయాణాలకు ఏ ఆపరేటర్, ఏ క్యాబ్ ఉపయోగించాలో కచ్చితమైన నిర్ణయానికి వచ్చే అవకాశం కలుగుతోంది.

ఫ్యూచర్ ప్లాన్..

ఇప్పటికే ఊపందుకుంటున్న లోకో క్యాబ్స్ తమ వ్యాపారాన్ని దేశమంతా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో క్యాబ్ ఆపరేటర్లను తమ యాప్ కు అనుసంధానం చేయటం, కస్టమర్లకు దగ్గరవటమే లోకో క్యాబ్స్ ప్రస్తుత లక్ష్యం. తర్వాతి దశలో అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు నగరాలవైపు దృష్టిసారించాలని భావిస్తోంది. అదే సమయంలో భవిషత్యులో వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణ కూడా మొదలు పెట్టింది. భవిషత్యులో టాక్సీ అనగానే లోకో క్యాబ్ గుర్తురావాలి.. ఇదే తమ లక్ష్యమని షలక్ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు..

Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share
Report an issue
Authors

Related Tags