సంకలనాలు
Telugu

ఆటోమోటివ్స్ రంగంలో పావనా జైన్ టాప్ గేర్ జర్నీ

ఒరాకిల్ లో ఉన్నతోద్యాగాన్నే వదిలేశారుసిలికాన్ వేలీ నుంచి షిఫ్ట్ మొబిలిటీ వరకు...కార్ల సమస్యలకు సరికొత్త యాప్రిపేర్,డిస్ట్రిబ్యూషన్,సర్వీస్ అన్నీ ఒకే చోటికి

24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పావన జీవితంలో టెక్నాలజీ ఓ భాగమైపోయింది. సిలికాన్ వేలీ నుంచి బయటకొచ్చాక పావనా జైన్ ఆటోమోటివ్ పరిశ్రమకు ఏకైక వేదికగాఉన్న షిఫ్ట్ మొబలిటీ కంపెనీకి సహవ్యవస్థాపకురాలయ్యారు. క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని షిఫ్ట్ మొబలిటీ ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్స్ కోసం పూర్తిగా సరళతరం చేశారు.

సిలికాన్ వేలీ టు షిఫ్ట్ మొబిలిటి

సిలికాన్ వేలీ టు షిఫ్ట్ మొబిలిటి


తన కో ఫౌండర్ అరవింద్‌ను పెళ్లి చేసుకున్న పావన.. సిలికాన్ వ్యాలీలోనే ఉండిపోతే.. అదే తన జీవితంలో చేసిన పెద్ద తప్పై ఉండేదంటారు. ఒరాకిల్ సంస్థలో 18 ఏళ్లు పని చేసిన తరువాత కొత్తగా తానే ఓ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆటోమొబైల్ రంగంలో అపార అవకాశాలు ఆమెను ఆ వైపు దృష్టి సారించేలా చేశాయి. సాధారణంగా కార్లు చక్కగా నడుస్తున్నంత కాలం వాటి గురించి వాహనదారులు పట్టించుకోరు. ఒక్కసారి అవి ఆగిపోతేనే అసలు సమస్యల్లా... ! ప్రాథమికంగా చాలా వ్యాపారాలను అందులో ఉన్న అవకాశాలను పరిశీలించిన తరువాత షిఫ్ట్ మొబిలిటి కన్నా మంచి వ్యాపారం లేదని నిర్ణయించుకున్నానంటారు పావన.

image


కార్ ఓనర్లకు టైం కలిసొస్తుంది

ఆటోమోటివ్ విభాగంలో ఉత్పత్తిదారులను ఉత్పత్తుల సమాచారాన్ని వాటి పూర్తి వివరాలను ఎక్కడైనా.. ఎప్పుడైనా సెకెన్ల వ్యవధిలోనే వినియోగదారులకు అందించడమే కాదు... ఉత్పత్తులను అమ్మి పెడుతుంది షిఫ్ట్ మొబిలిటి. సర్వీసింగ్ సెంటర్ల వివరాలను కూడా వాహనదారులకు అందించడం వల్ల వారికి రిపేర్ చేయించుకునేందుకు అయ్యే సమయం ఆదా అవుతుంది. దీనివల్ల వీలైనన్ని ఎక్కువ కార్లకు సర్వీస్ చెయ్యడం మాత్రమే కాదు...వినియోగదారులతో ఎక్కువ సమయం గడపడం .. వారితో మాట్లాడటం ద్వారా వారి వాహన అవసరాలను తెలుసుకోవచ్చు. ఒక బహుళ ఉత్పత్తుల కంపెనీగా తమ వద్దకు వచ్చే వినియోగదార్లకు ఏ సమస్యకైనా పరిష్కారం దొరికేలా తన షిఫ్ట్ మొబిలిటీని డిజైన్ చేశారు. అందుకు మొబైల్ టెక్నాలజీ, క్లౌండ్ కంప్యూటింగ్ సేవలు ఉపయోగించుకున్నారు. తమ తయారీ దారులకు, ఉత్పత్తిదారులకు, సర్వీస్ సెంటర్లకు తమ వాటాదారులకు అందరికీ ఆదాయం రావాలి. ఆ విధంగా తమ వ్యాపార వ్యూహాలను తీర్చిదిద్దారు. 

image


షిఫ్ట్ మొబిలిటీ యాప్ లో అత్యాధునిక వాల్డ్ వైడ్ వెబ్ కన్సోరియం ప్రమాణాలు పాటించడం ద్వారా కార్ల తీరు తెన్నులు, వాటి అవసరాలు, విడిభాగాల గురించి అత్యాధునిక విశ్లేషణ చేసి మరింత సమర్థవంతమైన సేవలు అందించగల్గుతున్నామంటారు పావన.

పావని ఓ నేషనల్ ప్లేయర్ కూడా

మైసూర్ లో పుట్టి పెరిగిన పావన చదువు కూడా అక్కడే సాగింది. మైసూర్ విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ చేశారు. డిగ్రీ పూర్తయిన తరువాత బెంగళూరులోని యోకోగోవా ఆటోమెషన్ కంపెనీ ఫ్యాక్టరీలో పని చేశారు. పెళ్లైన తరువాత సిలికాన్ వ్యాలీ వెళ్లిన పావన... కాలిఫోర్నియా విశ్వవిద్యాలలో 1991-93 మధ్య కాలంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. తరువాత న్యూరల్ నెట్ వర్క్స్ లో పీహెచ్.డి. చేసినా దానిపై ఆధారపడలేదు. ఇండియాలో ఉండగా ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణి. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్‌కు ప్రాతినిద్యం వహించారు. కోకో అంటే చాలా ఇష్టం. ప్లేయర్‌గా ఆమె దృష్టి ఎప్పుడూ గమ్యం చేరుకోవడం పైనే ఉండేది. మధ్యలో ఎదురయ్యే ఎంతటి సవాళ్లైనా లక్ష్యం ముందు చాలా చిన్నవిగానే కనిపించేది. ఒరాకిల్లో పని చేసేటప్పుడు అందులో ముఖ్యమైన ఒరాకిల్ ఫ్యూజన్ మిడిల్ వేర్ మరియు ఒరాకిల్ క్లౌడ్ విభాగాలకు వ్యవస్థాపక సభ్యురాలిగా ఉండేవారు. పనికిరాని వనరులతో ఓ కొత్త సంస్థను స్థాపించడం లాంటిదే ఆ పని కూడా . అయితే ఎప్పటికప్పుడు సవాళ్లతో సవాసం చేస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా వినూత్న ఆలోచనలున్న వారితో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఓ సంస్థ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమెకు అవి ఎంతో ఉపయోగపడ్డాయి.

డీల్ క్రాకర్

ఆటోమొబైల్ రంగంలో మహిళలు చాలా అరుదు. ఉన్న ఆ కొద్ది మందిలోనూ పావన తొలి వరుసలో ఉంటారు.

"సుమారు 16 విలీన-స్వాధీన ఒప్పందాలకు నేనే నాయకత్వం వహించాను. బహుశా ఒరాకిల్ సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాఫ్రా ఆదా క్యాడ్జ్ తరువాత అన్ని సమావేశాలకు హాజరైన ఏకైక మహిళనను నేనే అనుకుంటా.."- పావన జైన్

"ఫార్ట్యూన్ 500 కంపెనీల్లో ఉన్నత ఉద్యోగిగా ఉన్న నేను నేర్చుకున్నదేంటంటే... మన స్థానం ఎక్కడన్నది కాదు... ఏం చెప్పదల్చుకుంటున్నామో అది సహజసిద్ధంగా ఉండాలి... అందుకోసం ఏళ్ల సమయం పట్టినా సరే..."

తన సంస్థ అభివృద్ధి చెందే కొద్దీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వీలైనంత ఎక్కుమంది మహిళలకు ఎలా చోటు కల్పించాలా అని వ్యూహరచన చేస్తూ ఉండేవారు పావన జైన్. అందుకోసం ఏదైనా చేసే వారు . చివరకు ఆ వయసులో టెక్ స్కూల్ కి వెళ్లి కార్లు ఎలా ఫిక్స్ చెయ్యాలా అని నేర్చుకోవడం కూడా. పావన ఆంట్రప్రెన్యూర్ జీవితంలో మరో ఆసక్తికర అంశమేంటంటే.. సాక్షాత్తు ఒరాకిల్ వైస్ ఛైర్మనే భార్యా-భర్తల కాంబినేషన్ బిజినెస్‌లో వర్కౌట్ కాదని అన్నారట. కానీ అది తప్పని నిరూపించారు పావన. తనకు, తన భర్తకు తమ లక్ష్యాలేంటో తెలుసని.. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశామంటారామె. తమ వ్యాపారాభివృద్ధి కోసం భార్యా-భర్తల బంధాన్ని ఇంటికే పరిమితం చేశారు.

సెంటిమెంట్ బ్రేక్ చేశారు

సెంటిమెంట్ బ్రేక్ చేశారు


పావనకు తన తల్లే మార్గదర్శి. విద్యావేత్తగా నిరుపేద పిల్లల చదువు కోసం 40 ఏళ్లుగా పాఠశాలలు నడుపుతున్నారామె. ఇటీవలే తన తండ్రిని కోల్పాయారు పావన. ఆటోమోటివ్ రంగంలో వ్యవస్థాపకురాలిగా ఉన్న పావన ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తునే ఉంటారు. ఓ ఎలక్ట్రిక్ కారును రూపొందించాలన్నది ఆమె ఆశయం . అది కూడా టెల్సా స్థాయిలో ఉండాలి(టెల్సా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో పేరెన్నిక గలది)

యువర్ స్టోరీ పావనతో మాట్లాడింది. కొన్ని రాపిఢ్ ఫైర్ ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలివి.

యువర్ స్టోరీ - మీరు అన్ని రకాలుగా ఆలోచించే ఈ రంగంలోకి వచ్చారా..?

పావని: మేం సంస్థ మొదలు పెట్టినప్పటి నుంచి మా విజన్‌లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్ల అవసరాలు, మార్కెట్ అవసరాల గురించి లోతుగా విశ్లేషించాం. రాత్రికి రాత్రే ఫలితాలను ఆశించలేదు. నిర్దిష్ట సమయంలో క్రమంగా వ్యాపార-వాణిజ్య లక్ష్యాలను చేరుకునేలా ఆలోచన చేశాం. ప్రత్యేక వర్గానికి మాత్రమే పరిమితమైన ఈ ఇండస్ట్రీని నడపడానికి విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం కావాలి. అదే సమయంలో ఈ దారిలో ఎదుర్కొనే సవాళ్లు ఎక్కువే. వాటిని అధిగమించడంలో భాగంగా ఓ పరిష్కార వేదికను ఏర్పాటు చేసే ముందు క్లౌడ్ అండ్ మొబైల్ కంప్యూటింగ్ ను వారధిగా ఉపయోగించుకున్నాం. ఫలితంగా మేం ఏర్పాటు చేసిన వేదిక కేవలం ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడం మాత్రమే కాదు..

ఆటోమోటివ్ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలైన హైబ్రిడ్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు , హైడ్రోజన్ కార్లు,కనెక్టర్ కార్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ ఇంటిగ్రేటెడ్ మానుఫ్యాక్చరింగ్‌లో ఎదురయ్యే సవాళ్లకు కూడా పరిష్కారంగా నిలిచింది.

యువర్ స్టోరీ - ఓ వ్యవస్థాపకురాలిగా ఎలాంటి పాత్రను మీరెక్కువగా ఇష్టబడతారు..?

పావని: నిజమైన సమస్యలకు పరిష్కారం కనుగొనే సందర్భంలో స్వేచ్ఛ ఉండాలని పరితపిస్తాను. ఉన్నతమైన విలువలతో కూడిన కంపెనీని నిర్మించడం నాకు చాలా ఇష్టం. నా చుట్టూ ఉండే నా అద్భుతమైన టీం నుంచి నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటునే ఉంటా.

యువర్ స్టోరీ - మీకు నచ్చని అంశం..?

పావని: అలాంటిదేం లేదు. నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను.

యువర్ స్టోరీ - ఓ వ్యాపార వేత్తగా మిమ్మల్ని ముందుకుతీసుకెళ్లేది ఏది..?

పావని: శక్తియుక్తులని పూర్తిగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందడంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఏ ఇతర పరిశ్రమలకు తీసిపోదు. పదేళ్లలో మన రోడ్లు , కార్లు, వ్యాపారాలు, డ్రైవర్లు అన్ని మారిపోయాయి. ఈ ఆటలో మిగిలిన అన్ని టెక్నాలజీ కంపెనీల్లాగే షిఫ్ట్ మొబలిటీ కూడా ఓ ప్లేయర్.

యువర్ స్టోరీ - మీకు పట్టలేని సంతోషాన్నిచ్చేది ఏది..? దాని కోసం మీరేం చేస్తారు..?

పావని: వచ్చే దశాబ్దకాలంలో మా కంపెనీ మరిన్ని ఆవిష్కరణలు చెయ్యాలి. ప్రతి కారు ఓనర్ని మా సేవలతో సంతోషపెట్టాలి. ఇది మొదటిది మాత్రమే.

యువర్ స్టోరీ - ఇబ్బంది కర పరిస్థితుల్ని, సవాళ్లను మీరు ఎలా ఎదుర్కొంటారు..? అలాంటివేవైనా నిర్ధిష్టంగా చెప్పగలరా..?

పావని: నిజంగా సవాళ్లు ఎదుర్కొనే సమయంలోనే మన అత్యుత్తమ పనితీరు బయట పడుతుంది.నా అభివృద్ధికి కారణం అవే. రహస్యం ఏంటంటే..నా చుట్టూ అలాంటి మనుషుల్నే ఉంచుకోవడం... ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, సలహాదారులు, ఉద్యోగులు, వినియోగదారులు.. వీళ్లంతా ఒకేలా ఆలోచించేవాళ్లే.

యువర్ స్టోరీ - చివరిగా.. మీరు దేన్ని నమ్ముతారు..?(ఆచరించే నినాదం..?)

పావని: మార్పు అనివార్యం. దాన్ని అంగీరించాల్సిందే...!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags