సంకలనాలు
Telugu

సరుకు రవాణాలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌... 'గో గో ట్రక్స్'

చెన్నై కేంద్రంగా గో గో ట్రక్కులు, తమిళంలో యాప్ రెడీ. ఇంట్రాసిటీ లాజిస్టిక్స్ పైనే దృష్టి .మరిన్ని నగరాలకు విస్తరించాలనే ఆలోచన. చెన్నై కుర్రాళ్ల పకడ్బందీ యాక్షన్ ప్లాన్. లాజిస్టిక్స్ రంగం చాలా హాట్ హాట్‌గా కనిపిస్తోంది. నిన్నటి వరకూ క్యాబ్ మార్కెట్‌పై అధికంగా దృష్టి కేంద్రీకరించిన ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇంట్రా, ఇంటర్ సిటీ రవాణా రంగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ అసంఘటిత రంగంలో అవకాశాలు పుష్కలమని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అయితే ఇప్పటికీ ట్రక్ ఆపరేటర్లు, కస్టమర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ట్రక్కుల లభ్యుత, ధరల నిర్ణయం, పారదర్శకత ఇక్కడ ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. ఈ సమస్యలను సొమ్ము చేసుకుని పరిష్కారం చూపేందుకు వచ్చారు చెన్నై కుర్రాళ్లు. GoGo ట్రక్‌ పేరుతో సేవలు ప్రారంభించారు. ముఖ్యంగా నగరంలోని లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

sudha achalla
26th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అనుభవమే వ్యాపారానికి నాంది

గో గో ట్రక్ వ్యాపారం ఆరంభానికి తన అనుభవమే పాఠం నేర్పిందని చెబుతారు కంపెనీ కో ఫౌండర్ సెంథిల్ కుమార్. చెన్నైలో ఉంటున్న ఆయన ఎదుర్కొన్న రవాణా సమస్యతో

సెంథిల్ కుమార్, వషిశ్టర్ - గోగో ట్రక్స్ వ్యవస్థాపకులు

సెంథిల్ కుమార్, వషిశ్టర్ - గోగో ట్రక్స్ వ్యవస్థాపకులు


కంపెనీ స్టార్టప్ చేశారు. కొన్ని నెలల క్రితం ఫ్రిజ్ చెడిపోయి... దాన్ని సర్వీసింగ్ తీసుకెళ్లడానికి పడ్డ ఇబ్బందులే గో గో స్టార్టప్‌కు దారి తీసింది. సిటీలో ట్రాన్స్ పోర్టు గురించి కనుక్కొని... ట్రక్ ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అంతే కాదు ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో ధర. ఈ రంగంలో సమస్యలను అర్ధం చేసుకున్న మేము... వీటికి సొల్యూషన్స్ కనిపెట్టే ప్రయత్నం చేశామంటారు సెంథిల్ కుమార్.


మార్కెట్లో ఈ రంగాన్ని డ్రైవర్లు నియంత్రిస్తున్నారు. దీంతో వ్యవస్థలో పారదర్శకత లేక ఇష్టారాజ్యంగా నడుస్తోంది. ఫలితంగా యజమానులు నష్టపోతున్న సందర్భాలు అనేకం. మరోవైపు 50 నుండి 60 శాతం పనిలేకుండా ట్రక్కులు ఖాళీగా ఉంటున్నాయి. వినియోగదారులు, ట్రక్ యజమానులు మధ్య ఉన్న ఈ గ్యాప్‌ను సవాల్ గా తీసుకున్న సెంధిల్ కుమార్, వశిస్టార్ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అలా గో గో ట్రక్స్ మార్కెట్ లో అడుగుపెట్టింది. సంస్థలో ఏడుగురు వివిధ రకాల బాధ్యతలు తీసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సెంథిల్‌కు ఐటి హెడ్‌గా పనిచేసిన అనుభం ఉంది. బిజినెస్ గ్రాడ్యుయేట్ వశిష్టర్‌కు చైన్ సప్లై మేనేజ్‌మెంట్‌లో ఉన్న అనువభం ప్లస్ పాయింట్. మరో సభ్యుడు రామమూర్తి వెబ్ అప్లికేషన్ టీంలో ఆండ్రాయిడ్ డెవలప్ చేస్తున్నారు.

ఆరు నెలల కాలంలోనే..

GoGo ట్రక్ ఫిబ్రవరి, 2015 లో మొదలైనా అధికారికంగా మార్చి నెలలో ప్రారంభించారు. 20 టాటా ఏస్ మినీ ట్రక్కులతో స్టార్టప్ ప్రారంభించగా.. ఇప్పుడు 75 ట్రక్కులు గోగో క్లబ్‌లో చేరాయి. ట్రక్కుల్లో ఎక్కువ భాగం ఓనర్ కమ్ డ్రైవర్లే ఉంటారు. టాటా ఏస్, అశోక్ లేలాండ్ దోస్త్, టాటా 407 వంటి ట్రక్కులు చెన్నై అంతటా వ్యాపించాయి. బిజినెస్ కూడా నెల నెలకు వంద శాతం ఉందని గో గో ట్రక్స్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఒక్క జూన్ నెలలో 250 ఆర్డర్లు లభించాయి. డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యల్లో.. పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే..తిరిగి అక్కడి నుంచి బేరం వస్తుందా లేదో అనే సమస్య కూడా ఉంది. వీటిన్నింటికి గో గో ట్రక్స్ సమాధానాలు చెప్పనుంది. 


వినియోగదారులు వెబ్ అప్లికేషన్ ఉపయోగించి చిన్న ట్రక్కులు బుక్ చేసుకోవచ్చు. వారు బుక్ చేసుకున్న వెంటనే దగ్గర్లోని ట్రక్ డ్రైవర్ల వివరాలు SMS ద్వారా ట్రిప్ వివరాలు అందుకుంటారు. ఆసక్తి ఉన్న డ్రైవర్లు ఆర్డర్ తీసుకున్న వెంటనే.... డ్రైవర్లకు అప్పుడు వినియోగదారులు సంప్రదించాల్సిన నెంబర్, పికప్ అప్ పాయింట్, గమ్యానికి సామగ్రిని సరఫరా చేసే సమాచారం అందిస్తారు. GoGo ట్రక్స్ ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. అయితే వినియోగంలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి ఇంటర్నల్ గా అభివృద్ది బృందం కూడా ఏర్పాటు చేశారు.

GoGo ట్రక్కు

GoGo ట్రక్కు


GoGo ట్రక్కులకు వచ్చిన ఆదాయంలో రెవెన్యూ షేర్ ఉంటుంది. గూడ్స్ డెలివరి పూర్తి చేసిన వెంటనే అతని వాటా అతనికి ఇచ్చేస్తారు. చెల్లింపులు సులభతరం చేయడానికి ఆన్‌లైన్ పేమెంట్‌కు అవకాశం ఉంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే వినియోగదారులకు ప్రోత్సాహకాలను అందించి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మార్కెట్లోకి వెళ్లే సేవలు అందిస్తున్నారు. ఆన్‌లైన్ మార్కెట్స్‌లో క్వికర్, ఓలా ద్వారా ఆఫర్ డిస్కౌంట్ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఇండస్ట్రియల్, కన్స్యూమర్ ఎగ్జిబిషన్ జరిగే ప్రాంతాలే టార్గెట్. ఆయా ప్రాంతాల్లో వివిధ రకాలుగా ప్రచారాలు నిర్వహిస్తున్నామంటారు సెంధిల్ కుమార్ . దాదాపుగా 60 శాతం వినియోగదారులు B2B సెగ్మెంట్, మిగిలిన 40 శాతం B2C నుంచి ఆదాయం వస్తోంది. లాంగ్ రన్‌లో డెలివరీ ఒప్పందాలపై ఎఫ్ఎంసిజి, ఫుడ్ డెలివరీ కంపెనీలతో అంగీకారానికి వస్తామంటున్నారు వశిష్టర్.

బిజినెస్ మోడల్ మార్కెట్ సైజ్

GoGo ట్రక్కులకు వచ్చిన ఆదాయంలో రెవెన్యూ షేర్ ఉంటుంది. గూడ్స్ డెలివరి పూర్తి చేసిన వెంటనే అతని వాటా అతనికి ఇచ్చేస్తారు. చెల్లింపులు సులభతరం చేయడానికి ఆన్‌లైన్ పేమెంట్‌కు అవకాశం ఉంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే వినియోగదారులకు ప్రోత్సాహకాలను అందించి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మార్కెట్లోకి వెళ్లి ప్రచారం చేసి, సేవలు అందించాలని చూస్తున్నారు. క్వికర్, OLX ద్వారా ఆఫర్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి ప్రచారాలను నిర్వహిస్తున్నారు. 

వాస్తవానికి ఇండస్ట్రియల్, కన్స్యూమర్ ఎగ్జిబిషన్ జరిగే ప్రాంతాలే టార్గెట్.. ఆయా ప్రాంతాల్లో వివిధ రకాలుగా ప్రచారాలు నిర్వహిస్తున్నామంటారు సెంధిల్ కుమార్ . దాదాపుగా 60 శాతం వినియోగదారులు B2B సెగ్మెంట్, మిగిలిన 40 శాతం B2C నుంచి ఆదాయం వస్తోంది. దీర్ఘకాలంలో డెలివరీ ఒప్పందాలపై ఎఫ్ఎంసిజి, ఫుడ్ డెలివరీ కంపెనీలతో అంగీకారానికి వచ్చామంటారు వశిష్టర్.

లాజిస్టిక్స్ రంగంలో అపారమైన మార్కెట్ ఉంటుంది. ఈ రంగంలో పోటీదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం చెన్నైలో 70 వేలకు పైగా మినీ ట్రక్కులు ఉన్నాయి.ఈ-కామర్స్ భారీగా వ్యాప్తి చెందడంతో , నాణ్యత, సకాలంలో సేవ అందించడం మాకు కష్టంగా మారింది. పగటిపూట దాదాపు 75 మినీ ట్రక్కులు ద్వారా వస్తువుల సరఫరా జరుగుతోంది. ఇదే విభాగంలో స్థానిక, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. కొన్ని హాంకాంగ్, బెంగళూరు ఆధారిత Blowhorn, Shippr, LOTrucks, Zaicus, theKarrier Gogovan ఉన్నాయి. ముంబై ది పోర్టర్, ఢిల్లీ బేస్డ్ ట్రక్ మండి ఇంటర్-సిటీ సేవలను అందిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడిదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు. 

TheKarrier మే 2015 లో రూ .1.5 కోట్లు సేకరించింది. అయితే బ్లోహారన్ నవంబర్, 2014 లో యూనిటస్ నుంచి సీడ్ ఫండ్ పొందింది. 

మా లక్ష్యం ఒక్కటే. ట్రాన్స్‌పోర్టర్లు, ట్రక్ డ్రైవర్లు, కస్టమర్లను ఒకే వేదికపై తీసుకువచ్చి వాళ్లందరికీ సేవలు అందించడం. ఇందుకోసం 24 గంటల పాటు శ్రమించాల్సి వచ్చినా మేం సిద్ధం. ప్రస్తుతానికి కిలోమీటరుకు 16 రూపాయిలు చొప్పున వసూలు చేస్తున్నాం. ఒక వేళ రాత్రిపూట సరుకు డెలివర్ చేయాల్సి వస్తే అందుకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తామంటోంది గోగో ట్రక్స్.

భవిష్యత్తు ప్రణాళికలు

GoGo ట్రక్స్ ఇప్పటివరకూ సొంత నిధులతోనే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం చెన్నైకి మాత్రమే పరిమితమైన సేవలను త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం వెబ్ సైట్ ఇంటర్‌ఫేజ్ మీద ఈ బృందం పనిచేస్తోంది. భవిష్యత్తులో రియల్ టైం బేసిస్ మీద తమ సరుకు డెలివర్ చేసే ట్రక్ ఎక్కడుందో కూడా చూసే వీలు కల్పించబోతున్నారు. డ్రైవర్లకు సులువుగా అర్థమయ్యే విధంగా త్వరలో తమిళ భాషలో యాప్ తయారు చేయబోతున్నారు. కస్టమర్ల నుంచి నేరుగా ఆర్డర్లు తీసుకుని, వారికి తక్షణ సేవలు అందించడానికి ఇది వాళ్లకు ఉపయుక్తంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags