సంకలనాలు
Telugu

ఆర్ట్ స్టూడియో కాదు.. అదొక అందమైన ప్రపంచం

ప్రెటీ పింక్ పెబల్స్.. ఒక బ్యూటిఫుల్ హ్యాంగవుట్ ప్లేస్.

GOPAL
25th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హరివిల్లు మీద పరుగులు పెట్టొచ్చు. తొలకరి చినుకుల మట్టి పరిమళాల్ని ఆస్వాదించవచ్చు. మిలమిల మెరిసే నక్షత్రాలను అరచేతిలోకి తీసుకుని తేరిపారా చూడొచ్చు. గులాబీ రంగు పులుముకున్న గులకరాళ్లతో గుసగుసలాడవచ్చు. ఇవన్నీ చిన్నచిన్న ఆనందాలే కావొచ్చు. కానీ, జీవితానికి సరిపడా అనుభూతినిస్తాయి. చూసే మనసుకు కళ్లుండాలే గానీ సృష్టిలో గులకరాయి కూడా గులాబీ రేకులా సుతిమెత్తగా స్పర్శిస్తుంది. .

సంతోషం పంచడం వేరు.. సంతోషాన్ని పెంచడం వేరు

ప్రెటీ పింక్ పెబల్స్. ఒక బ్యూటిఫుల్ హ్యాంగవుట్ ప్లేస్. ఒకసారి విజిట్ చేస్తే చాలు. ప్రపంచంలో మనం మిస్సవుతున్న అందాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యమేస్తుంది. గులాబీ రేకులన్నీ ఒకేచోట రాశులు పోసినట్టుగా- నీలినీలి వర్ణాలన్నీ నాజూకుగా నడుస్తున్నట్టుగా- నిశ్చల ఆకాశం కాన్వాసులో ఒదిగినట్టుగా- ఒక్కో పెయింటింగ్ ఒక్కో భావంతో మనసుని మార్దవంగా తడుముతుంది. కలత చెందిన మనసుకి స్వాంతన ఎక్కడైనా దొరుకుతుందా అంటే –అది కచ్చితంగా చెప్పొచ్చు ప్రెటీ పింక్ పెబల్స్ అని చెప్పొచ్చు. అందుకే దాన్ని ఆర్ట్ స్టూడియో అనడం కంటే అందమైన ప్రపంచం అనడం కరెక్ట్.

image


అలా మొదలైంది..

వందనా జైన్. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా చేశారు. కెరీర్ ఆరంభంలో క్రియేటివ్ ఆడ్వర్టయిజర్ గా పనిచేశారు. లో లింటాస్, గ్రే వరల్డ్ వైడ్, పబ్లిసిస్ ఇండియా, జేడబ్ల్యూటీ, డ్రాఫ్ట్ ఎఫ్ సీబీ ఉల్కా వంటి పేరుమోసిన అడ్వర్టయిజింగ్ ఏజెన్సీల్లో పని చేసిన అనుభవం ఉంది. అద్భుతమైన క్యాంపైన్లను, టెలివిజన్ల కమర్షియల్స్ ను రూపొందించారు. నెస్లే, పెప్సీ, శామ్సంగ్, వర్ల్ పూల్, మారుతీ సుజుకీ, డిష్ టీవీ, డాబర్, హెచ్ పీ వంటి సంస్థల యాడ్స్ లో ఆమె పాత్ర కూడా ఉంది. కానీ ఇవేవీ సంతృప్తినివ్వలేదు. మనసులో ఏదో వెలితి. ఏదో కోల్పోతున్న ఫీలింగ్. నడుస్తున్న దారి ఇది కాదని గట్టి నమ్మకం. సంతోషంగా ఉండటం వేరు.. సంతోషాన్ని పంచడం వేరు. సంతోషాన్ని పెంచడం వేరు. వీటి మధ్యలో ఒక సన్నటి లైన్ దగ్గర ఆగిపోయి ఆలోచనలోకి జారుకుంది. తనను తాను హాపీనెస్ డెవలపర్స్ అని పిలిపించుకోవాలని ఆశ. సంతోషాన్ని పంచేందుకు ఎన్నో దారులుండొచ్చుగాక. కానీ అవి నీటిబుడగలా క్షణమో, అరక్షణమో ఉండొద్దు. కలకాలం నిలవాలి. కళాత్మకంగా మెరవాలి. మదినిండా సంతోషం పరుచుకోవాలి. వ్యాపారం అందరూ చేస్తారు. కానీ కొందరే దాన్ని కళాత్మకంగా మలుస్తారు.

అందుకే రెండేళ్ల క్రితం వందన ఓ డొమైన్ ను బ్లాక్ చేశారు. ప్రెటీ పింక్ పెబల్స్ పేరుతో మొదట్లో ఓ బ్లాగ్ రూపొందించారు. ఇటీవలే దాన్ని వెబ్ సైట్ గా మార్చారు. అదొక ఆన్ లైన్ స్టోర్. అందమైన పెయింటింగ్స్ కి అసలైన చిరునామా. కాన్వాస్ ఆర్ట్ కు తోడుగా చిన్ని చిన్న పెబల్స్, కెటిల్స్ వంటివి కూడా డిజైన్ చేస్తుంటారామె. ‘అబ్ స్ట్రక్ట్ హార్మోనీస్’’ పేరుతో హ్యాండ్ పెయింటెడ్ స్కేర్వ్స్, లైఫ్ స్టైల్ ప్రాడక్ట్స్ ను కూడా పరిచయం చేశారు.

‘‘ఇంటర్నెట్ ద్వారా వ్యాపారం నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదు. వ్యాపారం మరింత పెరిగేందుకు వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగపడింది. ప్రీమియం లొకేషన్లలో ఉన్నషాప్స్ ను తీసేసీ, ఆ కళాకండాలను ఇప్పుడు ఆన్ లైన్ లో రీటైల్ గా అమ్ముతున్నాను. ప్రింటింగ్, ప్యాకేజింగ్ లు కూడా చేస్తున్నాను’’ -వందన

ఆర్టిస్టే కాదు.. రైటర్ కూడా

వాస్తవానికి ఆర్టిస్టుగానే గుర్తింపు పొందాలన్నది వందన కోరిక. ఖాళీ సమయాల్లో ఆమె రాస్తుంటారు కూడా. ప్రస్తుతం షార్ట్ స్టోరీస్ రాసే పనిలో ఉన్నారు. లైఫ్ స్టైల్, ఫ్యాషన్ల మేళవింపుగా హ్యాండ్ పెయింటెడ్ స్టప్ లను కూడా ఆమె రూపొందిస్తుంటారు. లైఫ్ స్టయిల్ ప్రాడక్ట్స్ జ్యువలరీ బ్రాండ్స్ కూడా ఫ్యూచర్లో పనిచేయాలని ఆమె భావిస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి దాచుకున్న డబ్బునంతా తన సంస్థ కోసమే ధారపోశారు. కళను మరింత వైవిధ్య భరితం చేయాలన్నదే ఆమె కోరిక. ప్రస్తుతానికైతే లిమిటెడ్ ఎడిషన్ ఆర్ట్ కలెక్షన్, హ్యాండ్ పెయింటెడ్ ఆర్ట్ లు మాత్రమే అమ్ముతున్నారు. అన్నట్టు వందనకు ఆధ్యాత్మిక మార్గంలో నడవడం కూడా ఇష్టమే.


తల్లి బాటలో తనయుడు..

image


వందనది అందమైన కుటుంబం. భర్త, ఏడున్నరేళ్ల బాబు. కొడుకు కూడా తల్లిలాగే ఆర్ట్ వైపుగా అడుగులు వేస్తున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్టూడియోలోకి పరిగెత్తుకొస్తాడు. అమ్మ ఏమేం పెయింటింగ్స్ వేసిందా అని ఆసక్తిగా చూస్తాడు. పిల్లాడికి తెలుసు. అమ్మ ఏదో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని. వందనకు స్టూడియోనే ప్రపంచం. మనసుకు నచ్చే ఏకైక ప్రదేశం. చివరగా ఇంకో విషయం ఏంటంటే.. వందనా జైన్ ను అనా జే అని పిలుస్తుంటారు. అనా అనేది ఆమె పేరులోని చివరి మూడక్షరాలు. ఇక జే ఆమె ఇంటిపేరు. అనా అనేది హిబ్రూ/అమెరికా పేర్లలో ఒకటి. దయ, కృప, అనుగ్రహం అని వాటి అర్థం. అలా అనడం కంటే అందం, ఆనందం అని అర్ధాలు మార్చుకుంటే ఇంకా బాగుంటుందేమో అని ఆమె సన్నిహితులు అప్పుడప్పుడు అంటుంటారు.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags