సంకలనాలు
Telugu

ఓ స్టార్టప్‌కు మెంటర్ అవసరమెంత ?

పారిశ్రామికవేత్త జీవితం క్లిష్టమైంది. అంతేకాదు ఎప్పుడు ఎటు మలుపులు తిరుగుతుందో ఊహించలేం కూడా. తరచుగా వ్యాపార పరంగా ఎన్నో సందేహాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సిందే. అకస్మాత్తుగా సమస్యలు వచ్చిపడుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా వెన్నంటే ఒక మెంటార్ (గురువు) ఉంటే! ఇక మీరు స్థాపించిన స్టార్టప్ బ్రహ్మాండమైన ప్రయోజనాలను మీకందిస్తుంది.

team ys telugu
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

 

image


ఏ కంపెనీకైనా మెంటార్ వెలకట్టలేని వనరు. ముఖ్యంగా స్టార్టప్ దశలో ఉన్న కంపెనీలకు వీరి అవసరం ఎంతైనా ఉంది. అయితే భారత్‌లో మంచి గురువును దొరకబుచ్చుకోవడం చాలా కష్టం. భారతీయ పారిశ్రామికవేత్తలు మంచి గురువును వెతకడం కన్నా సులువుగా నిధులను సమీకరిస్తారట.

మంచి మెంటార్ కంపెనీకి ఎంతో విలువను చేకూరుస్తారు. కంపెనీ బోర్డులోకి వీరి రాకతో వ్యవస్థాపకుల విజయావకాశాలు రెట్టింపవుతాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు భారత్‌లో వేలాది మంది ఉత్తమ మెంటార్ల అవసరం ఉంది. భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం మొదలైన ఈ సందర్భంలో వీరి అవసరం ఎక్కువగా ఉంది.

మెంటార్ వల్ల నా కంపెనీకి విలువ ఎలా చేకూరుతుంది అని ఒక వ్యవస్థాపకుడిగా మీకు సందేహం రావొచ్చు. అదెలాగో చూద్దాం..

  • మీ వ్యాపారానికి అద్దంలా

మీ వ్యాపార ప్రస్తుత స్థితి, ఏ మార్గంలో వెళ్తుందో మెంటార్ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీరు చేస్తున్న వ్యాపారం ఎలా ఉందో అలా అద్దంలా నిలుస్తారు. వ్యాపారంలో ఏది సరైనది, ఏది తప్పో గుర్తిస్తారు. తప్పులను సరిదిద్దడంలో తోడ్పడతారు.

వ్యాపార ప్రక్రియ బలహీనంగా ఉన్నా, ఖాతాల నిర్వహణ ప్రమాణాలకు తగ్గట్టుగా లేకున్నా, విక్రయ విధానంలో లోపాలున్నా, సమస్య ఏదైనా ఆయన గుర్తించి కంపెనీని సరైన రీతిలో నడిపిస్తారు. 

  • క్లిష్టమైన ప్రశ్నలు సంధిస్తారు 

ఎగ్జామినర్ మాదిరిగా ఆంట్రప్రెన్యూర్‌కు ఎప్పటికప్పుడు ప్రశ్నలను సంధిస్తారు. మిమ్మిల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. కంపెనీ పనితీరును మెరుగు పరుచుకోవడానికే ఈ ప్రశ్నలు. మెంటార్ ఈ పనికి పూనుకోకపోతే ఆంట్రప్రెన్యూర్‌లో నిర్లక్ష్యం ఆవహిస్తుంది. మీకు, మీ సిబ్బందికి అంతా సవ్యంగా ఉందన్న భావన వస్తుంది. వాస్తవానికి అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పలేం.

వ్యాపార విధానం తీరుపైనే మెంటార్ ప్రశ్నలుంటాయి. లక్ష్యిత కస్టమర్లు ఎవరు, ఒక్కో కస్టమర్‌పై చేస్తున్న వ్యయం, డెలివరీ సమయం, లాభ నష్టాలు లేని స్థితికి చేరుకోవడానికి పట్టిన సమయం, తదుపరి పెట్టుబడి ఎంత అవసరం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంపై ప్రశ్నలు ఉంటాయి.

  • వాస్తవ పరిస్థితులను వివరిస్తారు

మెంటార్ మిమ్మల్ని ఒక అడుగు వెనక్కి తీసుకొస్తారు. కంపెనీలో ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు మీ ముందు చూపిస్తారు. కంపెనీపై ప్రభావం చూపుతున్న మీ చుట్టుపక్కల జరుగుతున్న మార్పులను వీక్షించేందుకు వీలు కల్పిస్తారు. ప్రధానంగా కస్టమర్ల శైలిలో వస్తున్న మార్పులు, పంపిణీ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, చట్టాల గురించి అవగాహన కల్పిస్తారు. ఇవన్నీ వ్యాపారంపై, ప్రణాళికపై ప్రభావం చూపే అంశాలే.

  • అవకాశాలను చూపిస్తారు

వృత్తిపరమైన సంబంధాలు లేకపోవడమే వ్యాపారవేత్తలకు అతి పెద్ద అడ్డంకి. డొమెయిన్ నిపుణులు, సేవల కంపెనీలు, నిపుణులైన ఉద్యోగులతో పరిచయాలు లేకపోవడమన్న మాట. వెబ్‌సైట్ డిజైనర్, ఆడిటర్, ఈవెంట్ మేనేజర్, ఇన్వెస్టర్ వంటి వ్యక్తులకు మెంటార్ స్వయంగా ఫోన్ కాల్స్ చేసి పనులను చక్కబెడతారు. వారి నుంచి సేవలు పొందుతారా లేదా అన్నది మీ ఇష్టం.

  • స్థైర్యాన్ని నింపుతారు

భారీ లక్ష్యాలను చేరుకుంటామా లేదా అన్న సందేహం ఆంట్రప్రెన్యూర్స్‌లో ఉంటుంది. ఇటువంటి సందేహాలేవైనా ఉంటే వాటిని మెంటార్ పారదోలుతారు. ఆంట్రప్రెన్యూర్‌లో మనో నిబ్బరాన్ని నింపుతారు. భారీ లక్ష్యంతో రంగంలోకి దిగేలా చేస్తారు. నక్షత్రాలను చేరుకోవాలన్న బలమైన లక్ష్యం ఉంటే చివరకు చంద్రుడి వరకైనా చేరతారన్నది నానుడి.

  • విలువలను నేర్పుతారు

ఉత్తమ విలువలు, నీతి.. ఈ రెండూ... రెక్కలు తొడుక్కుంటున్న కంపెనీకి అత్యంత ప్రధాన అంశాలు. ఇవి అమలైతే కంపెనీ దీర్ఘకాలం మన్నుతుంది. కంపెనీలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడేందుకు ఈ అంశాలు దోహదం చేస్తాయి. మెంటార్ తన వృత్తిపర విలువలను ఆంట్రప్రెన్యూర్‌కు నూరిపోస్తారు. వాటిని కంపెనీలో అమలు చేసేలా చూస్తారు.

  • భుజం తడతారు

పొరపాట్లుంటే కోప్పడడమే కాదు నవ్విస్తారు కూడా. హాస్యాన్ని పూయించే మెంటార్ ఉంటే మీ వ్యాపారానికి పెద్ద ఆస్తి దొరికినట్టే. ఆయన జీవన ఆనందం మీపై, మీ సిబ్బందిపై రుద్దుతారు. దాని ఫలితంగా విజయాలు వరించి వేడుకలు జరుపుకుంటారు. జరిగిన పొరపాట్లను తలుచుకుని నవ్వుకుంటారు. ఇదంతా కంపెనీలో పని వాతావరణంలో సమూల మార్పులకు, స్థిరచిత్తానికి కారణమవుతుంది. మీరు బాగా చేస్తున్నా, ఏదైనా సాధించినా మరిన్ని మైలురాళ్లు అధిగమించాలంటూ ఆయన నుంచి మెచ్చుకోలు కూడా ఉంటుంది.

  • సహనాన్ని నేర్పుతారు

విజయం, గొప్పదనం కోసం వెతుకులాట అధిక సమయంతో కూడుకున్నది. తుఫాన్లు ఎదుర్కొంటారు. మీ శాయశక్తులు, సృజనాత్మకత, హుషారును వెలికితీస్తారు. మెంటార్ చురుకుదనం కొన్ని సందర్భాల్లో విలువ లేనిది అవుతుంది. కోపం తెచ్చుకోవద్దని మెంటార్ మిమ్మల్ని కోరతారు. ఇదంతా సహనం కోల్పోకూడదనే.

ఆంట్రప్రెన్యూర్ జోరును క్రమబద్ధీకరిచడంలో, లయను క్రమాంకనం చేయడంలో, అసహనానికి కళ్లెం వేయడంలో, మీపైన మీకు నమ్మకం కలిగించడంలో మెంటార్ కీలక పాత్ర పోషిస్తారు. ఎప్పటికప్పుడు మీకోసం ఉద్యుక్తులై ఉంటారు. కావాల్సిన సలహాలను ఇస్తుంటారు.

ఇప్పుడు చెప్పండి. ఇప్పటికైనా మీకు మెంటార్ లేకపోతే రంగంలోకి దిగండి. మంచి మెంటార్‌ను వెతికి పట్టుకోండి. ఆల్ ద బెస్ట్. మీ సంస్థలోనూ ఎవరైనా మెంటర్ పాత్ర పోషించి మీకు అద్భుతమైన మార్గదర్శనం చేసిన వాళ్లెవరైనా ఉంటే మాతో పంచుకోండి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags