సంకలనాలు
Telugu

తొమ్మిదేళ్లకే కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకున్న చిన్నారి

team ys telugu
28th Jul 2017
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

ఎనిమిది తొమ్మిదేళ్లకు బాధ్యతలేముంటాయ్ చెప్పండి. స్కూలు, హోంవర్క్, ఆట, పాట, టీవీ. ఇంతకు మించి పసిప్రాయంలో చేసేదేముంటుంది? కానీ ఆ అమ్మాయి ఏకంగా ఇంటి బాధ్యతనే తన భుజాల మీద వేసుకుంది. పొద్దున ఐదింటికి లేచి న్యూస్ పేపర్లన్నీ సైకిల్ మీద పెట్టుకుని, ఇల్లిల్లూ తిరిగి పేపర్ వేసింది. తండ్రి అకస్మాత్తుగా చనిపోతే ఇంటిల్లిపాదికీ పెద్ద దిక్కైంది.

image


రాజస్థాన్ జైపూర్ కి చెందిన ఎరీనాకు పదేళ్లు నిండకుండానే, జీవితం అంటే ఏంటో బోధపడింది. బతకడమంటే ఏంటో తెలిసొచ్చింది. ఏడుగురు అక్కా చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్ల బాధ్యతను నెత్తికెత్తుకుంది. తండ్రి న్యూస్ పేపర్ వెండర్. అతనికి చేదోడు వాదోడుగా నిలిచింది. కొంతకాలానికే నాన్న చనిపోయాడు. దాంతో మొత్తం ఇంటి భారం చిన్నారిపైనే పడింది. 

చదువుకోవాలని ఉన్నా ఆర్ధిక పరిస్థితుల రీత్యా స్కూలుకి వెళ్లడం సమస్యగా మారింది. అయినప్పటికీ పనులన్నీ పూర్తి చేసుకుని బడికి వెళ్లేసరికి ఆలస్యమయ్యేది. చాలాసార్లు ప్రిన్సిపల్ మందలించేవారు. ఎప్పటికప్పుడు ఇకపై లేట్ అవదు అని సర్ది చెప్పేది. కానీ తప్పేది కాదు. ఆమె కష్టాన్నిఅర్ధం చేసుకోలేని ప్రిన్సిపల్ చివరికి టీసీ ఇచ్చి బయటకి పంపారు.

చదువు లేకపోతే భవిష్యత్ లో ఎదురయ్యే ఇబ్బందులేంటో ఎరీనాకు తెలుసు. అందుకే రెహ్మానీ మోడల్ స్కూలుకి వెళ్లి ఇదీ తన పరిస్థితి అని వివరించింది. వాళ్లు ఆమెను బాధను అర్ధం చేసుకుని జాయిన్ చేయించుకున్నారు.

ఎరీనా తొమ్మిదో క్లాసులో ఉండగా ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో ఆమె ఒక హాస్పిటల్లో నర్సుగా చేరింది. మూడేళ్లు అక్కడ జాబ్. ఎందుకంటే తన తోటబుట్టిన వాళ్లు చదువు ఆగిపోకూడదు. వాళ్లకోసం కష్టమైనా, ఉద్యోగం చేసింది. జాబ్ చేస్తూనే స్కూలింగ్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఓ ప్రయివేట్ కాలేజీలో చేరింది. ఇటు ఉద్యోగం ఫుల్ టైం.. అటు క్లాసులు పార్ట్ టైం.

పసితనం నుంచే జీవితంతో పోరాడుతున్న ఈ ధైర్యవంతురాలిని చూసి ముచ్చటపడ్డ హైకోర్టు జడ్జ్ మనీష్ భండారి శ్రీ రాజీవ్ అరోరా ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ఎక్స్ పోర్ట్ వారి నుంచి బ్రేవరీ అవార్డు ఇప్పించారు. ఆ తర్వాత కిరణ్ బేడీ చేతుల మీదుగా మరో పురస్కారం దక్కింది.

ప్రస్తుతం ఎరీనా రాజస్థాన్ లో ప్రముఖ వ్యాపారవేత్తలు నడిపిస్తున్న సంస్థ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తరుపున పనిచేస్తోంది.   

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags