సంకలనాలు
Telugu

పేరులేని ప్రాజెక్టుతో ప్రఖ్యాతుడైన ఓ ఫోటోప్రెన్యూర్

ఫోటోగ్రఫీలో ఒక యువకుడి సంచలనం.. ప్రాజెక్ట్ అన్ టైటిల్ కు ఎనలేని ఆదరణ..

team ys telugu
5th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

రోజూ చేసే పనే ఆ రోజూ చేస్తున్నాను. ఫేస్ బుక్ తిరగేస్తున్నాను. ఆ వీడియో చూసేవరకు, అందులో విశేషం ఏమీ లేదు. అది రోజూ చేసే పనే. కిషోర్ కృష్ణ మూర్తి వీడియో నా ఫేస్ బుక్ గోడ మీద వాలింది. కిషోర్ కృష్ణ మూర్తి పేరు ఎప్పుడు విన్నది కాదు. కానీ ఇటీవల కాలంలో అతను చేసిన 'ప్రాజెక్ట్ అన్ టైటిల్డ్' సంచలనం సృష్టిస్తోంది. మరో సారి ఈ పేరు విన్నపుడు ఇట్టే గుర్తొచ్చేలా చేస్తోంది.

కిషోర్ వయసు నిండా 23 ఏళ్లు, కానీ, ఫోటోగ్రఫీ లో అతగాడికి ఉన్న అనుభవం మాత్రం పది సంవత్సరాల పైనే ఉంటుంది. వృత్తి పరంగా చూస్తే అతను ట్రావెల్, ఫాషన్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ప్రవృత్తి పరంగా మాత్రం అతనో ఫోటో జర్నలిస్ట్. అదంటే అతనికి చాలా చాల ఇష్టం. ఫోటోగ్రఫీని కాసేపు పక్కన పెడితే కిషోర్ లో ఒక వ్యాపారవేత్త లక్షణాలు చాలానే ఉన్నాయి. అందుకేనేమో అతను తనకు మక్కువ ఉన్న ఫోటో జర్నలిజాన్నే ఇప్పుడు వృత్తి గా చేసుకున్నాడు. కిషోర్ చదివింది రాజకీయ,ఆర్ధిక శాస్త్రాలు. ఆ కోణంలో చూస్తే అతను ఈ వృత్తిని ఎంచుకోవడం... అబ్బే అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. కానీ, అతను విశ్వాసం తో వేసిన అడుగు అతన్ని ఇప్పుడు అత్యున్నత స్థానానికి తీసుకుపోయింది. కిషోర్ కృష్ణ మూర్తి ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు ...

కిషోర్ కృష్ణ మూర్తి

కిషోర్ కృష్ణ మూర్తియువర్ స్టోరీ - పేరు లేని ప్రాజెక్ట్ కథ వెనక కథేంటి ?

కెకె : నేనూ మిత్రుడు అభిజిత్ షా మాములుగా మాట్లాడుకుంటున్న సమయంలో 'పేరు లేని ప్రాజెక్ట్' (ప్రాజెక్ట్ అన్- టైటిల్డ్ ) కాన్సెప్ట్ చర్చకు వచ్చింది. చోళుల నాటి అందమైన కాంస్య విగ్రహాలకు ఫోటోలు తీసి ప్రాణం పోయాలనే ఆలోచన అద్భుతం అనిపించింది. ఆ తర్వాత చేసిన అధ్యయనం మా సంకల్పాన్ని మరింత గట్టి పడేలా చేసింది. ఈ సమయంలో వస్త్ర ధారణ తదితర విషయాలపై తనకున్న అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ఫాషన్ డిజైనర్ శిల్పా సింగ్ ను మాలో చేర్చుకున్నాం. అయితే ఆ సమయంలో మేము ముగ్గురం మూడు దేశాల (జర్మనీ లో అభిజిత్ ,ఇండియా లో శిల్పా, నేనేమో ఇంగ్లాండ్) లో ఉండడం వలన పని కాలేదు. షూటింగ్ జరగలేదు.

యువర్ స్టోరీ - మరి చివరకు ఎలా సాధ్యమైంది ?

కెకె - అక్కడ నుంచి మూడు సంవత్సరాలు ముందుకు వెళితే నేను ఇండియాకు వచ్చేశాను. మా ముగ్గురిలో కనీసం ఇద్దరం, నేనూ, శిల్పా ఒకే నగరం హైదరాబాద్ లో ఉన్నాం. అభిజిత్ తన ఇన్-పుట్స్ ని ఈ -మెయిల్ లేదా స్కైప్ మీటింగ్స్ ద్వారా ఇస్తున్నాడు. అలా మూడేళ్ళ తర్వాత మళ్లీ మొదలైంది, పేరు లేని ప్రాజెక్ట్. మా మూడు సంవత్సరాల కల ఫలించింది. ఆ ఆనందానికి అవధులు లేవు. శిల్పా వస్త్రధారణ విషయం చూసుకుంటే నేను నాకు లానే ఈ ప్రాజెక్ట్ మీద ఎంతో మక్కువ పెంచుకున్న ఒక బృందాన్ని తయారు చేసుకున్నాను. ఎంతో కష్టపడి, అంతా సిద్డంచేసుకున్న తర్వాత మేమంతా ఒక వారాంతాన గండికోటకు వెళ్లి ఫోటో షూట్ పూర్తి చేసాము.

'యువర్ స్టోరీ - పేరులేని ప్రాజెక్ట్ (ప్రాజెక్ట్ అన్ టైటిల్డ్ ) ఆ పేరేమిటి ?

కెకె: ప్రాజెక్ట్ ఆలోచనలు నలుగుతున్న మూడు సంవత్సరాలు మేము ఈ ప్రాజెక్ట్ ను 'అన్ టైటిల్డ్' అంటూ వచ్చాం. చివరకు ప్రాజెక్ట్ పూర్తియిన తర్వాత అదే పేరు స్థిరపడింది. అయినా పేరులో నేముంది .. ఉండవలసిన దంతా, చూడవలసినదంతా ఫోటోలలోనే ఉంది కదా..

యువర్ స్టోరీ - ఈ ప్రాజెక్టులో కొంచెం ఫాషన్ కొంచెం వారసత్వం కనిపిస్తాయి, ఈ ప్రాజెక్ట్ ను మీరు ఎలా నిర్వచిస్తారు, దాని ప్రభావం ఏమిటి?

కెకె: ముందు నుంచి కూడా మేము అనుకున్నది చోళుల కాంస్య విగ్రహాలు, స్థూపాలను, వారసత్వ విన్యాసాలను ఖచ్చితంగా తెరమీదకు తేవాలనే అనుకున్నాం. కానీ, ఇంకా ఇంకా చదువుతూ, పరిశోధన కొనసాగిస్తున్న దశలో వారసత్వ సంపదకు ఆధునిక హంగులు అద్దితే ఎలా ఉంటుంది అనే ఆలోచన మొదలైంది. అది నాకు బాగా నచ్చింది. ఒక పురాతన కళా రూపానికి ఆధునిక హంగులు అద్దడం ఆ తర్వాత దాన్ని సంప్రదాయ దేవాలయంలో షూట్ చేయడం .. నాకు , మా బృందానికి చాలా .. చాలా నచ్చింది.. ఎంతో ఆలోచింప చేసేదిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ గండి కోటను మరో మరు ప్రాచుర్యంలో తెచ్చింది. అందులో సందేహం లేదు. అదే సమయం లో మేము సంప్రదాయ -ఆధునిక కళలను చాలా చక్కగా సమ్మిళితం చేశామన్న తృప్తి మాకుంది.

యువర్ స్టోరీ : మిమ్మల్ని ఏ శక్తి కదిలిస్తుంది. మీ ప్రయాణంలో మేలి మలుపు ఏది ?

కెకె: ‘నిన్నటి కంటే నేడు నేను ఉన్నతంగా ఉన్నాను' అనే భావన నన్నుప్రతి నిత్యం రేపు వైపు నడిపిస్తుంది. నేను నా లండన్ ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి హైదరాబాద్ వచ్చి నాకు ఇష్టమైన ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నప్పుడు అమ్మా - నాన్న, స్నేహ బృందం ఇచ్చిన ప్రోత్సహం నాజీవితంలో మరిచి పోలేని మధుర ఘట్టం.

యువర్ స్టోరీ - హాబీగా మొదలైన ఫోటోగ్రఫీ వృత్తిగా మారటం లో ఏవైనా ఇబ్బందులు ?

కెకె: హాబీగా చేసేటప్పుడు కొన్ని అంశాలను మనం విస్మరించే వీలుంటుంది. కానీ, వృత్తిగా చేపట్టిన తర్వాత అలా కుదరదు. ప్రతి చిన్న అంశాన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్తల్లో బాధ్యతలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ,ఆ తర్వాత అదే గొప్ప అనుభవంగా మారుతుంది. వృత్తిని హాబీగా చూడడం కుదరదు. నిజానికి వృత్తిని వ్యాపారంగా చూడాలనేదే నా అభిప్రాయం. నేను రోజుకు 6 గంటలు ఫోటోగ్రఫీ కి కేటాయిస్తే తెర వెనక కనీసం నాలుగు గంటలు బుక్ కీపింగ్, కస్టమర్స్ తో మాట్లాడడం లాంటి వ్యాపార కార్య కలాపాలకే సరిపోతుంది.

ప్రాజెక్ట్ అన్ టైటిల్డ్ లో ఒకఫోటో

ప్రాజెక్ట్ అన్ టైటిల్డ్ లో ఒకఫోటోAdd to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags