నవజాత శిశువుల కోసం నెమోకేర్ స్మార్ట్ డివైజ్.. హైదరాబాద్ స్టూడెంట్ల ఆవిష్కరణ

నవజాత శిశువుల కోసం నెమోకేర్ స్మార్ట్ డివైజ్.. హైదరాబాద్ స్టూడెంట్ల ఆవిష్కరణ

Tuesday August 01, 2017,

2 min Read

దేశంలో ప్రతీ సంవత్సరం 3.6 మిలియన్ల నవజాత శిశువులు అప్నియా, హైపోథెర్మియా అనే వ్యాధులకు గురవుతున్నారు. ఆ రెండు వ్యాధులను సకాలంలో గుర్తిస్తే నవజాత శిశువులను భద్రంగా కాపాడుకోవచ్చు. నియోకేర్ స్మార్ట్ బేబీ మానిటర్ చేసే పని అదే. ఇదొక చవకైన స్మార్ట్ వేరబేల్. యునిక్ కాంబినేషన్ తో కూడా మెడికల్ గ్రేడ్ సెన్సర్లు నిరంతరం శిశులను పర్యవేక్షిస్తుంటాయి.

image


హైదరాబాదుకి చెందిన మనోజ్ శంకర్, ప్రత్యూష మిత్ర ద్వయం నుంచి వచ్చిన ఆలోచన ఇది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను స్టడీ చేసి, లోపం ఎక్కడుందో కనిపెట్టి, ఈ పరికరాన్ని తయారు చేశారు. ఐడియా ఆవిష్కరణగా మారే క్రమంలో ప్రత్యూష, మనోజ్ కలిసి హెల్త్ కేర్ స్టేక్ హోల్టర్లతో పనిచేశారు. ప్రొటోటైప్ పరికరాన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. నవజాత శిశువుల ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేలా రూపొందించిన ఈ గాడ్జెట్ ని హైదరాబాద్ ఐఐటీ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రోత్సహిస్తోంది.

డీప్ లెర్నింగ్ ఆల్గారిథం సాయంతో శిశువులో లోపాన్ని కనిపెడతారు. దీనివల్ల వారిని ఫిజికల్ గా ఎప్పటికప్పుడు చెక్ చేసే భారం నర్సులకు, ఇటు డాక్టర్లకూ తగ్గుతుంది. ఈ డివైజ్ ఒకేసారి శిశువులందరి డేటా కలెక్ట్ చేసి నర్సింగ్ స్టేషన్ కు పంపుతుంది. దీనివల్ల పిల్లల పరిస్థితిని ఒకే ఇంటర్ ఫేస్ ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏ శిశువైనా అప్నియా, హైపోథెర్మియా లక్షణాలతో బాధ పడుతుంటే, నర్సింగ్ స్టేషన్లో ఆడియో, విజువల్ అలారం మోగుతుంది. తక్షణమే ఏ రకమైన వైద్య సహాయం అవసరమో ఆ దిశగా డాక్టర్లను, నర్సులను పురమాయిస్తుంది. శిశులు కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి అప్ డేట్ రిపోర్ట్స్ అందిస్తుంది.

స్మార్ట్ బేబీ మానిటర్ గురించి ఈ మధ్యనే హైదరాబాద్ ఐఐటీ కాన్ఫరెన్సులో వెల్లడించారు. 2019 కల్లా ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం వుంది. నెమో కేర్ వెబ్ సైట్లో కూడా ప్రాడక్ట్ అందుబాటులోకి రాబోతోంది. దాంతోపాటు అన్ని మేజర్ ఈ కామర్స్ సైట్లలోనూ వుంచుతారు. ఇటీవలే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫస్ట్ సెట్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయింది. డివైజ్ మీద మరికొంత స్టడీ చేయాల్సి వుందని ఫౌండర్లు అంటున్నారు.

ఇనీషియల్ ఆపరేషన్స్ సస్టెయిన్ కావడానికి సెంటర్ ఫర్ హెల్త్ కేర్ ఆంట్రప్రెన్యూర్షిప్, ఐఐటీ హైదరాబాద్ నుంచి సీడ్ గ్రాంట్ కూడా అందుకున్నారు. పూర్తిగా ఆపరేషన్స్ ప్రారంభంచడానికి ఏంజిల్ ఇన్వెస్టర్లు కావాలంటున్నారు.