సంకలనాలు
Telugu

నచ్చిన యాడ్ చూడండి, పేమెంట్ పొందండి అంటున్న 'యాడ్ స్టోర్'

Krishnamohan Tangirala
21st Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మన దేశంలో డెస్క్‌టాప్‌, కంప్యూటర్ల సంఖ్యను మొబైల్ ఫోన్స్ మించిపోయాయి. మేరీ మీకర్ చెప్పిన వివరాల ప్రకారం కొత్త ఇంటర్నెట్ యూజర్ల విషయంలో 2014లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి. ఐఏఎంఐఎ, కేపీఎంజీ అందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో మూడో అతి పెద్ద స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ మనదే. 2017 చివరకు 31.4 కోట్ల యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు మన దేశంలో ఉంటారని ఓ అంచనా.

అందుకే మొబైల్ అడ్వర్‌టెయిజింగ్‌పై కంపెనీలు, అడ్వర్‌టెయిజర్లు, బ్రాండ్లు దృష్టి పెట్టాయి. ఇతర విధానాలతో పోల్చితే.. కస్టమర్లకు సంబంధించిన వివరాలను మొబైల్స్ మరింత ఎక్కువగా సేకరిస్తాయి. వారి అలవాట్లు, ప్రాధాన్యతలు, బ్రాండ్లకు సంబంధించిన డేటాను ఎక్కువగా పసిగడతాయి స్మార్ట్‌ఫోన్స్. దీంతో అడ్వర్‌టెయింజింగ్ మరింత శక్తివంతంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. బ్రాండ్స్ ఇచ్చే యాడ్స్‌కు సంబంధించి యాడ్‌స్టోర్ ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది. అంతే కాదు.. ఆయా ప్రకటనలను చూడడం ద్వారా.. కస్టమర్లకు ప్రతిఫలం కూడా దక్కుతుంది.

యాడ్‌స్టోర్ టీం

యాడ్‌స్టోర్ టీం


ఏమిటీ యాడ్‌స్టోర్ ?

యాడ్‌స్టోర్ ద్వారా మూవీ ట్రైలర్స్, యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్స్, వెబ్ ఆధారిత వీడియో యాడ్స్‌ను సెర్చ్ చేసి చూడచ్చు. ఇందులోని వీడియోలు సాధారణంగా 2 నుంచి 3 నిమిషాల నిడివి గల స్టోరీలైన్ కలిగి ఉంటాయి. వీడియో చూసిన తర్వాత.. యూజర్లు ఓ పోల్‌లో పాల్గొనడం కానీ.. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ ఇవ్వడం కానీ చేయాలి. ఈ ప్రాసెస్‌నే తమ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్‌గా చెబుతోంది యాడ్‌స్టోర్. ఈ ప్రశ్నలు, జవాబులను విశ్లేషించి గణాంకాలను అడ్వర్‌టెయిజర్లకు అందిస్తుంది యాడ్‌స్టోర్. నేరుగా యూజర్ల నుంచి రావడంతో ఇది చాలా విలువైన సమాచారంగా పరిగణించవచ్చు. మార్కెటింగ్ వ్యూహాలు, పరిశీలనలు, పరిశోధనల విషయంలో బ్రాండ్ కంపెనీలకు ఈ డేటా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ప్రతిఫలంగా ఫ్లిప్‌కార్ట్, ఫ్రీఛార్జ్, మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీల నుంచి యూజర్లకు వోచర్లు అందుతాయి.

హై స్కూల్ నుంచి స్నేహితులైన నరేన్ భుద్వాని(సీఈఓ), పియూష్ ఢకన్(సీఓఓ)లు యాడ్‌స్టోర్‌ను ప్రారంభించారు. వీరిద్దరూ దుబాయ్‌లోనే పుట్టి పెరిగిన వ్యక్తులు. ఎన్ఎంసీసీఈ కోర్స్‌ డిగ్రీ చదివేందుకు గాను నరేన్ ముంబై వచ్చారు. ఆ సమయంలో పియూష్ మిడిలెసెక్స్ యూనివర్సిటీలోనే విద్యాభ్యాసం చేశారు. హాజరు తగ్గడంతో.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయకుండా నరేన్‌పై నిషేధం విధించింది యూనివర్సిటీ. ఒక ఏడాది వృథాగా గడపాల్సి రావడంతో.. ఆ సమయంలో దుబాయ్‌ వెళ్లిపోయి.. ఫుడ్ స్టఫ్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు నరేన్. దీని ద్వారా బేకరీ సంబంధిత ఉత్పాదనల తయారీకి అవసరమైన ఉత్పత్తులను ఫైవ్ స్టార్ హోటల్స్‌కు సరఫరా చేసేవారు. అయితే తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తిరిగి ముంబై వచ్చి డిగ్రీ చదువును కొనసాగించారు నరేన్.

అదే సమయంలో సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో.. ఓ స్నేహితుడితో కలిసి.. మొబైల్ కవర్స్‌ను విక్రయించే ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించారు పియూష్. ఈ కామర్స్‌కి దుబాయ్‌లో అంతగా డిమాండ్ లేకపోవడంతో.. ఇది కొంతకాలానికే మరుగునపడే స్థాయికి వచ్చింది. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి యాడ్‌స్టోర్‌ను ప్రారంభించడానికి ముంబై వచ్చేశారు పియూష్. డిగ్రీని మధ్యలోనే వదిలేసి పియూష్‌కు జత కలిశాడు నరేన్. ప్రస్తుతం ఈ టీంలో ఆరుగురు సభ్యులు ఉంటారు. నరేన్, మరొక ఎంప్లాయి కలిసి టెక్నాలజీ విభాగాన్ని నిర్వహిస్తుండగా.. పియూష్ సహా మిగిలిన ముగ్గురు వ్యాపారాభివృద్ధిపై దృష్టి నిలిపారు.

బిజినెస్ మోడల్

కాస్ట్ పర్ వ్యూ మోడల్‌లో.. ఒక్కో వ్యూకి ఇంత చొప్పున చెల్లింపులు చేస్తుంది యాడ్‌స్టోర్. “ ప్రస్తుతం మేం యూనిక్ వ్యూస్‌పైనే దృష్టి పెట్టాం. ఎంత సంఖ్యలో వ్యూస్ కావాలో.. వీడియోను ఆప్‌లోకి అప్‌లోడ్ చేసే ముందు అడ్వర్‌టెయిజర్ నిర్ణయించుకుంటాడు. టార్గెట్‌కి తగినట్లుగా వ్యూస్ క్లిక్ కాగానే.. యాప్‌లోంచి వీడియా ఆటోమేటిక్‌గా మాయమైపోతుంద”ని నరేష్ చెబ్తున్నారు.

ఒక్కో నిజమైన వ్యూయర్‌కి రూ. 1.5 నుంచి రూ. 7 వరకూ.. ఛార్జ్ చేస్తారు అడ్వర్‌టెయిజర్లు. ఆ యాడ్ నిడివి, ప్రశ్నల సంఖ్యపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రశ్నల సంఖ్యను 3కి పరిమితం చేశారు. యాప్‌లో ఎన్ని రోజుల పాటు ఆ యాడ్‌ని ఉంచాలనే అంశం కూడా ప్రైసింగ్‌లో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కథ చాలా ఉంది

ప్రస్తుతం యాడ్‌స్టోర్‌ను సొంత నిధులతోనే నిర్వహిస్తున్నారు. త్వరలో ఏంజెల్ రౌండ్ ఫండింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఈ టీం. ఇప్పటికి 8,500మంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉండగా.. వీరిలో 65శాతం మంది యాక్టివ్‌గా ఉండడం విశేషం. వీరు వారానికి కనీసం మూడు సార్లు యాప్‌ని వినియోగిస్తున్నారు.

స్టార్టప్ నిర్వహణలో ప్రతీ రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటున్నామని చెబ్తున్నారు పియూష్, నరేన్‌లు. ఒక్కో టైంలో ఒక్కో సమస్య ఎదురవుతూ ఉంటుంది. ప్రతిభావంతులను రిక్రూట్‌ చేసుకోవడం తాము ఫేస్ చేసిన అతి పెద్ద ఇబ్బందిగా చెబ్తారు వీరు. స్టార్టప్‌లకు ఫండింగ్స్ వస్తుండడంతో.. ఉద్యోగులకు వేతనాలు కూడా భారీగానే అందుతున్నాయి. తరచుగా తమను ఇబ్బంది పెడుతున్న విషయం ఇదేనంటున్నారు ఈ ఇద్దరు మిత్రులు.

యాప్ ఇంటర్నల్ పిక్చర్

యాప్ ఇంటర్నల్ పిక్చర్


ప్రస్తుతం యాడ్‌స్టోర్‌ని ఉపయోగిస్తున్నవారిలో. 16-25 ఏజ్ గ్రూప్‌లోని వ్యక్తులే ఎక్కువగా ఉంటున్నారు. వీరితోపాటు విభిన్నమైన ఏజ్‌ గ్రూప్‌లను ఆకర్షించే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోందీ స్టార్టప్. ప్రస్తుతం ఐఓఎస్ యాప్ రూపకల్పన జరుగతుండగా.. త్వరలో దీన్ని లాంఛ్ చేయబోతున్నారు కూడా.

ఇదే రంగంలో పోటీ

వెబ్ అడ్వర్‌టెయింజింగ్‌లో గూగుల్, యాహూ వంటి టెక్నాలజీ దిగ్గజ సంస్థలు రాజ్యమేలుతున్నా.. మొబైల్ యాడ్స్ విషయంలో ఇంకా పోటీ ప్రారంభ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి విజేతగా ఫలానా కంపెనీ అని చెప్పడం కష్టమైనా.. అందరికంటే ఉన్నత స్థాయిలో గూగుల్ ఉంది.

ఇన్‌మొబి ఈ రంగంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటి. తాజాగా వీరు ఎంఐఐపీని లాంఛ్ చేశారు. దీనిద్వారా సాంప్రదాయ మొబైల్ అడ్వర్‌టెయింజింగ్‌కు భిన్నంగా.. యూజర్లకు అవసరమైన, తగిన కంటెంట్ ఆధారిత యాడ్స్‌ను అందిస్తూ దూసుకుపోతోంది ఈ కంపెనీ. ఈ రంగంలోని మరో ప్రధాన కంపెనీ ఎయిర్‌లాయల్. ఆదాయం విషయంలో జనవరి 2015నుంచి ఈ కంపెనీ ప్రతీ నెలా 240శాతం వృద్ధి సాధిస్తోంది.

“టాటా గ్రూప్ కంపెనీ గెట్, మైక్రోసాఫ్ట్ లాంఛ్ చేసిన మ్యాడ్ వంటివి కూడా పోటీ ఇచ్చేవే. అయితే వీరికి మా మోడల్‌కి కొన్ని ప్రధానమైన తేడాలున్నాయి. ఏదైనా కాల్ చేసేందుకు ముందు ఆ యాడ్‌ను చూడాలనే నిబంధన విధిస్తున్నాయి ఆ కంపెనీలు. ఇది బలవంతంగా చేయించడం కిందకే వస్తుంది” అంటున్నారు నరేన్.

image


యూజర్లకు ఏం నచ్చుతాయంటే ?

యాడ్‌స్టోర్ యాప్‌కు రూపొందించిన యూజర్ ఇంటర్‌ఫేస్ బాగా ఆకట్టుకుంటుంది. లిస్ట్‌లోని వీడియోలను విభాగాలను ఈ కామర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటొమొబైల్స్ అంటూ విభజించడం విశేషం. హోమ్‌పేజ్‌లో ట్రెండింగ్ వీడియోస్ పేరుతో.. ఎక్కువ పాయింట్లను అందించే వీడియోలు డిస్‌ప్లే అవుతాయి. అలాగే నచ్చిన వీడియోలను ఫేవరెట్ కింద మార్క్ చేసుకుని, ఆ తర్వాత అయినా చూసే వీలుంది. టీవీలలో యాడ్స్ చూడని వారికి యూట్యూబ్‌లో యాడ్స్‌ను మిస్ చేసేవారికి.. ఈ యాప్ చాలా ఉపయోగంగా ఉంటుంది. బ్రాండ్స్ అందించే స్టోరీస్ నుంచే వీడియోలను రూపొందించి.. వాటిని చూసినందుకు బదులుగా యాప్ క్రెడిట్స్‌ను పొందచ్చు.

ఏం అభివృద్ధి చెందాలి

ఏవైనా కేటగిరీలను మార్క్ చేసుకుని., వాటిని ఫాలో అయ్యే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఈ విభాగాలకు సంబంధించిన కొత్త వీడియోస్ వస్తే.. వాటిపై అప్‌డేట్స్, అలర్ట్స్ ఇచ్చే వెసులుబాటును కల్పించాలి. తద్వారా మరింతమందికి వీడియోల విషయం తెలిసి.. క్లిక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఓచర్ల విషయంలోనూ పరిమితులు కనిపిస్తున్నాయి. ఈ తరహా వోచర్లు.. ఉచితంగానే ఆఫ్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. అందుకే ఈ వోచర్ల వ్యవహారాన్ని మరింత సమర్ధవంతంగా, కస్టమర్లకు లాభదాయకంగా మార్చాల్సిన అవసరం ఉంది.

ప్రజలకు తాము చూసిన, తమకు నచ్చిన కంటెంట్‌ని షేర్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అందుకే వీరు ప్రదర్శిస్తున్న వీడియోలకు కొన్ని సోషల్ ఫీచర్స్ జత చేయాల్సి ఉంది. కామెంట్స్ ఇవ్వడం, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో షేర్ చేయడం వంటి ఫీచర్స్ అందించాలి. దీంతో వీటికి ఆదరణ కూడా మరింతగా పెరుగుతుంది. ఉత్పత్తులకు ప్రచారం ఎక్కువగా లభిస్తుంది.

యువర్ స్టోరీ అభిప్రాయం

వీడియో అడ్వర్‌టైజింగ్ విషయంలో యాడ్‌స్టోర్ ఓ వినూత్నమైన ప్లాట్‌ఫాం. చిన్న చిన్న యాడ్స్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ కూడా చిన్న ప్రమోషనల్ వీడియోలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. అలాంటి సమయంలో కేవలం యాడ్స్‌కే పరిమితయ్యేలా ప్లాట్‌ఫాం డిజైన్ చేయాలనే ఆలోచన విభిన్నమైనదే. ఈ యాడ్స్‌కు కొన్ని స్టోరీలైన్స్ జత చేస్తుండడంతో.. యూజర్లు యాప్‌కి అతుక్కుపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. మరింతమంది యూజర్లు, అడ్వర్‌టెయిజర్లను ఈ ప్లాట్‌ఫాంపైకి తీసుకురాగలిగితే.. ఈ వెంచర్ విజయం సాధించే అవకాశం ఎక్కువగానే ఉంది.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags