సంకలనాలు
Telugu

మాట్లాడే రెజ్యూమెతో ఇంటర్వ్యూలను ఈజీ చేసిన హ్యాపీ మైండ్స్

team ys telugu
2nd Feb 2017
Add to
Shares
22
Comments
Share This
Add to
Shares
22
Comments
Share

ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి ? మనకున్న అర్హతలతో మంచి కరికులమ్ విటే తయారు చేయాలి. అక్కడితో అయిపోతుందా? అప్లయ్ చేసుకోవాలి. దాన్ని రిక్రూటర్స్ పరిశీలించాలి. మనలాంటి వాళ్లు బోలెడు మంది. అందరినీ షార్ట్ లిస్ట్ చేయాలి. అందులో మనం ఉంటామో ఉండమో. ఒకవేళ పిలిచారే అనుకోండి. తీరా ఇంటర్వ్యూకి వెళ్లే టైంకి వాళ్ల ప్రియారిటీస్ మారిపోవచ్చు. ఇదంతా టైం వేస్ట్ వ్యవహారం. అందుకే దీనికొక బెస్ట్ సొల్యూషన్ కనిపెట్టింది హ్యాపీమైండ్స్ మ్యాన్ పవర్ సొల్యూషన్స్. దానిపేరే సెల్ఫీ వీడియో రెజ్యూమ్.

అంటే, రెజ్యూమ్ మాట్లాడుతుంది. మీరేంటో, మీ కేపబిలిటీ ఏంటో రిక్రూటర్లకు మూడుముక్కల్లో విడమరిచి చెప్తుంది. బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, విద్యార్హతలు, అనభవం అన్నీ మూడు నిమిషాల్లో హెచ్ ఆర్ కు అవగతం చేస్తుంది. ఐటి, బిపిఓ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, మీడియా, రిటైల్ రంగాలకు ఈ కాన్సెప్ట్ చక్కగా పనికొస్తుంది. సేల్స్‌ లో ఉన్నవారికి మరింత బాగా ఉపయోగపడుతుంది.

image


రెండు మూడు పేజీల సీవీలు పట్టుకుని కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం, వాళ్లు పిలుస్తారని కళ్లుకాయలు కాచేలా ఎదురు చూడటం.. ఇదంతా గతం. సెల్ఫీ వీడియో రెజ్యూమ్ అనేది నయా జమానా అంటోంది హ్యాపీమైండ్. సెల్ఫీ వీడియో రెజ్యూమ్ ద్వారా ఆయా సంస్థలు నిఖార్సయిన అభ్యర్ధిని ఎంచుకునే వీలు కల్పించింది. అభ్యర్ధులు చేయాల్సిందల్లా ఒక్కటే. గూగుల్ ప్లే స్టోర్ నుంచి హ్యాపీ మైండ్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో ఆప్షన్లను పాలో అవుతూ, మీ గురించి మీరు బ్రీఫింగ్ ఇవ్వడమే. యాప్ ద్వారా మొబైల్ లోని రియర్ వ్యూ కెమెరా ఓపెన్ అవుతుంది. రికార్డు బటన్ ప్రెస్ చేసి, మీ క్వాలిఫికేషన్, గత అనుభవం ఏంటో క్లుప్తంగా వివరించి, ఆ వీడియోని అప్ లోడ్ చేయడమే. ఇదంతా నిమిషంలో అయిపోతుంది. అలా అప్ లోడ్ చేసిన వీడియోను రెజ్యూమ్ హ్యాపీమైండ్స్ సంస్థ తమతో టై అప్ అయిన కంపెనీలకు చేరవేస్తుంది.

ఇప్పుడు చాలా కార్పొరేట్ సంస్థలు క్వాలిఫికేషన్, అనుభవంతో పాటు అభ్యర్ధి బాడీ లాంగ్వేజీని, వాయిస్, ఐ కాంటాక్ట్, కాన్ఫిడెన్స్ ని గమనిస్తున్నాయి. అలాంటివన్నీ సాధారణ సీవీలో పొందుపరచలేం. ఇలా వీడియో రెజ్యూమ్ లో అయితే సంస్థలు తమకు కావల్సిన క్యాండిడేట్ ని సులభంగా ఎంచుకోగలుగుతాయి. వీడియోల ద్వారా హెచ్ ఆర్ పని మరింత సులువుగా మారుతుంది. ఎందుకంటే వీడియో ప్రొఫైల్ చూడటం వల్ల ప్రిలిమినరీ రౌండ్ ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రొఫైల్ నచ్చితే తర్వాతి రౌండ్‌కి సెలక్ట్ చేసుకోవచ్చు.

image


హైదరాబాదుకి చెందిన హ్యాపీమైండ్స్ సొల్యూషన్స్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వీడియో రెజ్యూమ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది. అటు రిక్రూటర్ల సమయాన్ని, అభ్యర్ధుల వ్యయప్రయాసలను ఒక్క యాప్ ద్వారా పరిష్కరించగలిగింది. గంటలకొద్దీ జరగాల్సిన ఇంటర్వ్యూలు ఎంతో సులభంగా, తక్కువ సమయంలో జరుగుతున్నాయని సంస్థ ఫౌండర్ కమ్ సీఈవో లీలాధర్ రావు తెలిపారు. ప్రస్తుతానికి 21 కార్పొరేట్ కంపెనీలతో హ్యాపీమైండ్స్ టై అప్ అయిందన్నారు. అందులో 90 శాతం ఐటీ, మిగతా సంస్థకు నాన్ ఐటీ కేటగిరిలో ఉన్నాయి. 9 ఇంజినీరింగ్ కాలేజీలతో కూడా భాగస్వామ్యం అయ్యారు. చాటింగ్ ద్వారా విద్యార్ధుల సందేహాలకు సమాధానాలిచ్చే ప్లాట్ ఫాం కూడా ఇందులో ఉంది. కాలేజీ టు కార్పొరేట్ పేరు ఫోరం కనెక్టింగ్ సదుపాయం ఉంది.

ఇప్పటిదాకా 5వేలకు పైగా యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. ప్రస్తుతానికి యాండ్రాయిడ్ వెర్షన్ అందుబాటులో ఉంది. 12 మంది కోర్ టీం, 40 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో హ్యాపీ మైండ్స్ బిజినెస్ లో దూసుకుపోతోంది. 2013లో మొదలైన ఈ ఇన్నోవేటివ్ స్టార్టప్ యేటికేడు 60 శాతం సస్టెయినబుల్ గ్రోథ్ సాధిస్తోంది.. సీఈవో లీలాధర్ రావుకు ఇండస్ట్రీలో 16 ఏళ్ల అనుభవం ఉంది. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, కెనాక్సా వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశారు.

రిక్రూట్మెంట్ ప్రాసెస్ సులభతరం చేయడంతోపాటు జాబ్ సీకర్స్, రిక్రూటర్స్ సమయాన్ని సేవ్ చేస్తున్న హ్యాపీ మైండ్స్.. త్వరలో ఇండియా అంతటా విస్తరించాలనేది ఫ్యూచర్ ప్లాన్ గా పెట్టుకుంది.

హ్యాపీమైండ్స్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Add to
Shares
22
Comments
Share This
Add to
Shares
22
Comments
Share
Report an issue
Authors

Related Tags