సంకలనాలు
Telugu

2 కోట్ల టర్నోవర్, 3 ఏళ్ల అనుభవం, 20 బిలియన్ డాలర్ల మార్కెట్ ఈ-స్పర్శ లక్ష్యం

ఏడంకెల జీతాన్ని వదులుకుని సొంత వ్యాపారంముగ్గురు ఎన్.ఐ.టి. విద్యార్థుల ఆలోచనసొంతంగా ఆన్ లైన్ లో టి-షర్ట్స్ డిజైనింగ్కస్టమైజ్డ్ మర్కండైజ్ లో దూసుకుపోతున్న మై డ్రీమ్ స్టోర్

team ys telugu
31st Mar 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మార్కెట్ లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అయితే.. అవన్నీ... వినియోగదారుడి అభిరుచికి తగ్గట్లే ఉంటాయా..? అంటే పెదవి విరుపే సమాధానంగా వస్తుంది. ఈ సమస్యనే తమ ఎదుగుదలకు చక్కటి అవకాశంగా అందిపుచ్చుకుంది ఓ మిత్రత్రయం. అలహాబాద్ లోని నిట్ లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు, బాల సతీశ్ జి, నళిన్ గోయెల్, కార్తీక్ వెంకట్ లు స్నేహితులయ్యారు. ఎన్నెన్నో కలలతో వారు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఏడంకెల జీతాన్నిఅందించే ఉద్యోగాలనూ సముపార్జించుకున్నారు. అయితే వారిలో ఏదో వెలితి..! ఇంకా ఏదో సాధించాలన్న తపన. అభిరుచులకు అనుగుణమైన వర్తకం గురించి వారిలో తలెత్తిన ఆలోచన ఈ-స్పర్శ పేరిట ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపింప చేసింది.

అభిరుచులకు అనుగుణమైన వర్తకం అన్నది ఓ ఉత్పత్తిగా చూడలేము. దీన్ని ఓ అనుభూతిగా భావించాలి. మార్కెట్ పూర్తి అస్తవ్యస్తంగా అనిపించింది. ఏ వ్యాపారమూ వినియోగదారుడికి సేవలు అందించే దిశగా కనిపించలేదు. ఆ సమస్యను గుర్తించి.. దాన్నే అవకాశంగా మలచుకుని సొంత వ్యాపార సంస్థను ప్రారంభించాలనుకుని.. రంగంలోకి దిగాము... అంటారు ఈ-స్పర్శ సహ వ్యవస్థాపకులు నళిన్.

మీకు నచ్చినట్టు ముద్రించి ఇచ్చే టీ షర్ట్స్

మీకు నచ్చినట్టు ముద్రించి ఇచ్చే టీ షర్ట్స్


“ ఈ-స్పర్శ.. వివిధ సంస్థలు, కార్పొరేట్ రంగం వారి అభిరుచులకు అనువైన వర్తకాన్ని అందిస్తోంది. గడచిన మూడేళ్ళలో, మా సంస్థ, నమ్మదగిన, ఉత్తమ సేవలను అందించే వర్తక సంస్థగా గుర్తింపు పొందింది. ఈ మూడేళ్ళలో మేము పరిశ్రమను సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. వందలాది మంది వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించుకున్నాము. వీటన్నింటి ఫలితంగా ఆవిర్భవించిందే... “మై డ్రీమ్ స్టోర్” అని కార్తీక్ తెలిపారు.

ప్రజలే టి-షర్టులను డిజైన్ చేసి ఆన్ లైన్ ద్వారా, ఎలాంటి పట్టిక గాని, మరెలాంటి బయానా కానీ లేకుండానే, విక్రయించే అవకాశాన్ని మై డ్రీమ్ స్టోర్ కల్పించింది. క్లబ్బుల్లాంటివి ఎలాంటి సమస్యా లేకుండా వారికి కావలసిన వస్తువులను కొనే అవకాశం, డిజైనర్లు తమ ఉత్పత్తులను ఆవిష్కరించే వీలునూ మై డ్రీమ్ స్టోర్ కల్పించింది.

ఈ-స్పర్శ ప్ర్రారంభించడానికి ముందు, బాల సైప్రెస్ సెమి కండక్టర్స్ లోను, నళిన్ బెంగళూరులోని ఐఐఎం లోను, కార్తీక్ వేరే వ్యాపారంలోనూ ఉండేవారు.

మార్కెట్ అవకాశాలు :

2008 నాటికి.. ఈ రంగంలో వ్యాపార అవకాశాలు వినియోగించుకుంటే.. సుమారు రెండు బిలియన్ డాలర్లన్న మేర వర్తకం నిర్వహించ వచ్చన్నది ఓ అంచనా. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ఆన్ లైన్ వ్యాపారం పుంజుకుంటుండడం, పాప్ సంస్కృతి.. వీటన్నింటి దృష్ట్యా.. 2018 నాటికి వ్యాపార పరిధి 20 బిలియన్ డాలర్లకు విస్తరించ వచ్చని భావిస్తున్నాము.. అని నళిన్ చెప్పారు.

image


పురోభివృద్ధి

తొలి సంవత్సరంలోనే వంద శాతం పురోభివృద్ధి సాధించిన ఈ-స్పర్శ.. వార్షిక టర్నోవర్ ను రెండు కోట్లరూపాయలను దాటేసింది. మా సంస్థ ప్రతి ఏటా, 300 సంస్థలకు చెందిన, సుమారు లక్షా యాభై వేల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఏడాదిలో 700 బల్క్ ఆర్డర్లను వినియోగదారులకు చేర్చాము. మై డ్రీమ్ స్టోర్ ఆవిష్కరణ ద్వారా.. ఎవరైనా మా వేదిక నుంచి తమ టీ షర్టులను అమ్మే అవకాశం కల్పించాము. వచ్చే మూడేళ్ళలో కనీసం 15 శాతం వృద్ధి రేటును సాధిస్తామన్న విశ్వాసం ఉంది అంటారు.. బాల.

గెలుపు మంత్రం

మిత్రులు ముగ్గురూ.. అతి స్వల్ప వ్యయంతో ఇంటర్నెట్ ఆధారిత సంస్థను ప్రారంభించడం ఎలా అన్న సూత్రాన్ని ఒంట బట్టించుకునేందుకు ఎక్కువ కాలం శ్రమించారు. అలా అలవరచుకున్న మితవ్యయం నిబంధనకే కట్టుబడి.. ఇప్పుడు ముందుకు సాగుతున్నారు. తొలి రోజు నుంచీ మేము పొదుపు బాటలోనే సాగాము. పెట్టుబడుదారుల సొత్తుగా కాక, మేము సొంతంగా సంపాదించిన డబ్బును ఖర్చు పెడుతున్నామన్న భావనతోనే వెళ్ళాము. దీంతో.. అనుకున్న దానికన్నా ముందే.. మా వ్యాపారం లాభాల బాటలో సాగింది. ఫలితంగా, ఈ-స్పర్శ కోసం మేము బయటి నుంచి పెట్టుబడులు కోరలేదు. అని వివరించారు నళిన్.

ఈ-స్పర్శ, 2012 నుంచే లాభాల్లో పయనించడం మొదలు పెట్టింది. దీని సిబ్బంది కూడా 30 మందికి చేరింది. ఈ-స్పర్శ ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఇప్పుడు పెట్టుబడుల దిశగా ఆలోచిస్తున్నాము. ఈ విస్తరణ ద్వారా, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వర్తకాన్ని చేరువ చేయాలన్న భావనతో సాగుతోంది.

మీ ఉత్పత్తుల కోసం వినియోగదారులకు వెతక్కండి.. వారి కోసం ఉత్పత్తులను రూపొందించండి. అని సేథ్ గోడిన్ చెప్పారు.

“ ప్రారంభం నుంచీ మా వినియోగదారుల సమస్యలేంటి అన్న దాన్ని గుర్తించ గలిగాము. వాటిని పరిష్కరించక పోతే.. అది మాకు ఆత్మహత్యా సదృశమే. మేము సుదీర్ఘ కాలం ఉండాలనుకుంటున్నాము. అంతేకాదు.. రోజురోజుకీ నవ్యతతో అభివృద్ధి చెందాలనుకుంటున్నాము “ అని కార్తీక్ చెప్పారు.

సవాళ్ళు

నాణ్యమైన వస్తువులను అందించడం చిన్న సమస్యేమే కాదు. టీషర్ట్ పై ముద్రించాలంటే 30 రకాల పనులు ఉంటాయి. క్రమ పద్ధతిలో ఉత్పత్తి చేయడం.. ఎలాంటి లోపాలు ఉండకుండా జాగ్రత్త వహించడం, అది నచ్చక పోతే వినియోగదారుడు తిప్పి పంపడం, దాని వల్ల ఆర్థికంగా బాగా ఇబ్బంది ఎదురు కావడం లాంటి సమస్యలు ఉంటాయి. సొంత నిధులతో ఈ వ్యాపారం చేసుకుంటున్న వారికి ఇలాంటి సమస్యలన్నీ పెను సవాళ్ళు. అయితే.. దీని వల్ల గణనీయమైన అనుభవమూ వస్తుందనుకోండి.. అంటారు బాల.

సభ్యులని ఉత్సాహ పరచి పనిచేయించుకోవడం ప్రతిరోజూ కోర్ టీమ్ ఎదుర్కొనే సవాళ్ళు.. దీనికి తోడు, గొప్ప బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం తొలిసారిగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారికి ఎదురయ్యే మరో పెను సవాలు. దీనికి ఈ మిత్రత్రయం కూడా మినహాయింపే కాదు. “ మేము మా ప్రస్థానంలో ఎన్నో తప్పులు.. ఒప్పులు చేసుకుంటూ సాగాము. మా బృందాన్ని ఎలా ఉత్సాహ పరచాలి.. వారితో అద్భుతంగా ఎలా పనిచేయించుకోవాలి అన్న అంశాన్ని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము.. ఇంకెంతో నేర్చుకోవాల్సిందీ ఎంతో ఉంది. అంటారు నళిన్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags