సంకలనాలు
Telugu

యాప్ యూజర్లను ఎంగేజ్ చేసే సరికొత్త స్టార్టప్

ఫీడ్ బ్యాక్ ఇచ్చి ముందుగానే సూచనలు చేసే కొనోటోర్చెన్నై కేంద్రంగా ఐఐఎం మాజీ విద్యార్థులు ప్రారంభించిన సంస్థ

ashok patnaik
12th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పెరుగుతున్న ఈ-కామర్స్ వ్యాపారంలో సరికొత్త ప్రత్యేక పంథాతో ముందుకొచ్చింది కొనోటోర్. యాప్ లోనే ఇన్ బిల్ట్ అయి యాప్ కు సపోర్ట్ ఇవ్వడం దీని ప్రధాన అజెండా. యాప్ కు రెండు రకాలుగా శక్తిమంతం చేస్తుంది కొనోటోర్. ఇది మొబైల్ మొదటి యూజర్ ఎంగేజ్ మెంట్ ప్లాట్ ఫాం. యూజర్లు యాప్ కి అంటిపెట్టుకునే ఉండేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం. యాప్ లో ఒక ఫీచర్ గా ఉంటూ ప్రకటన, మార్కెటింగ్ సమాచారం, ఈవెంట్ కమ్యూనికేషన్ తోపాటు ఫీడ్ బ్యాక్ ను అందిస్తుంది. యాప్ కు పూర్తి స్థాయి మద్దతిస్తుంది. యూజర్లతో అన్ని రకాలుగా కమ్యునికేషన్ చేయాలంటే యాప్ ని ట్రైచేసి చూడాలంటున్నారు కొనోటర్ ఫౌండర్ శ్రీకృష్ణ‌ మరికొన్ని అద్భుతమైన ఫీచర్లు కొనోటోర్ లో ఉన్నాయని వివరించారు.

యాప్ లోపల నిక్షిప్తమైన కొనొటోర్

యాప్ లోపల నిక్షిప్తమైన కొనొటోర్


“కొనోటోర్ అనేది యాప్ కాదు. యాప్ లోనే ఇంటిగ్రేట్ అయివుంటుంటి. యాప్ ని ప్రమోట్ చేసే పనిని యాప్ లోపలి నుంచే చేస్తుంది. యాప్ కు వేల్యూఎడిషన్ లాగా ఇది ఉపయోగపడుతుంది. సాధారణ సంస్థల్లాగ మాకు ప్రత్యేకమైన యాప్ ఉండదు. మా ప్రత్యేకత మాకుంది” అన్నారు శ్రీకృష్ణ‌

యాప్ లో వాట్సాప్ ఎలా ఉంటుందో అదేవిధంగా కొనోటోర్ ను డెవలప్ చేశాం. యాప్ యూజర్లతో కనెక్ట్ అయి ఉండటంతో పాటు వారితో ఎంగేజ్ అయి ఉంటానికి సరిపడ టూల్స్ ఇందులో ఉన్నాయి. వ్యక్తిగతంగా, సందర్భోచితంగా వ్యవహరించి యూజర్ బేస్ పెంచడానికి సాయపడుతుంది. ఇప్పటి వరకూ కొనోటొర్ 100కు పైగా యాప్స్ లపై పనిచేసింది. 25 మిలియన్ యూజర్లతో నేరుగా కనెక్ట్ అయింది. గొప్ప గొప్ప ఈకామర్స్ కంపెనీలకు సపోర్ట్ ఇస్తోంది. ఆన్ లైన్ గ్రాసరీ, టికెట్ బుకింగ్,ఫాస్ట్ ఫుడ్, యుటిలిటీ సర్వీసు, టెల్కోస్ లాంటి కంపెనీలతో పనిచేస్తోంది కొనోటోర్ . మార్కెటింగ్, కస్టమర్ సపోర్టు, ఫీడ్ బ్యాక్, రీ ఎంగేజిమెంట్ చేయడానికి ఈ కంపెనీల.కు సంబంధించిన యాప్స్ కొనొటోర్ ని ఉపయోగిస్తున్నాయి.

కొనొటోర్ పనిచేసే విధానం

కొనొటోర్ పనిచేసే విధానం


కోనోటోర్ టీం

శ్రీ కృష్ణ‌ గణేషన్ తోపాటు మరో ఇద్దరు ఈ కంపెనీని చెన్నై కేంద్రంగా ప్రారంభించారు. గణేషన్ బెంగళూరు ఐఐఎం పూర్వ విద్యార్థి. వెరిజోన్ లో ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేశారు . జిగ్సీలో ప్రాడక్ట్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. వివిధ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో కొనొటోర్ ని ప్రారంభించారు. విఘ్నేష్ గిరిశంకర్ మరో ఫౌండర్ మెంబర్. ఈయన లక్నో ఐఐఎం నుంచి ఎంబీయే పూర్తి చేశారు. అనంతరం జిగ్నాలో ప్రాడక్ట్ మేనేజర్ గా పనిచేశారు. దీపక్ బాలసుబ్రమణ్యం మరో కో ఫౌండర్. అన్నా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన దీపక్ ఈబేలో ప్లాట్ఫామ్ ఇంజనీర్ గా పనిచేశారు. వీరితో పాటు 9మంది కోర్ టీం కొనోటోర్ కి పనిచేస్తోంది.

కొనోటోర్ లో ఉండే కొన్ని గొప్ప ఫీచర్లు సాధారణ యాప్ లకంటే దీన్ని భిన్నంగా చూపించేలా చేస్తాయి. సైనప్ చేసిన మొదటి రోజు నుంచే యూజర్ తో యంగేజ్ అయి ఉంటుంది. సౌలభ్యంతో కూడిన గొప్ప సెగ్మెంటేషన్ ని మీ యాప్ కి అందిస్తుంది. దీంతో యూజర్ మీ యాప్ ని విడిచిపెట్టకుండా ఉండేలా చేస్తుంది. యాప్ లోనే యూజర్లకు కావల్సిన సమాచారం అందించి కస్టమర్ సపోర్ట్ ఇస్తుంది. వ్యాపారానికి సంబంధించి ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేస్తుంది. ఫోన్ కాల్స్ చేయడానికి బదులు వాయిస్ మెసేజ్ చేసే సౌలభ్యం ఉంది. యాప్ లో కొత్త ఫీచర్ లేదా కొత్త కంటెంట్ వచ్చినట్లైతే దాని గురించి కస్టమర్లకు తెలియజెప్పే బాధ్యతను కొనోటోర్ చేపడుతుంది. ఈ రకంగా యాప్ కు కావల్సిన ప్రమోషన్ చేసి పెడుతుంది. చేయాల్సిన ప్రేయార్టీ ఫీచర్లపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ముంద గానే తీసుకొని దాన్ని అందించడం సంస్థలకు మేలు చేకూరుస్తుందని శ్రీకృష్ణ‌ వివరించారు.

image


ఆదాయ వనరు

మొదట 30రోజుల ఫ్రీ ట్రైలర్ ఇస్తారు. తర్వాత నెలసరి సబ్ స్క్రిప్షన్ తో యాప్స్ నుంచి వసూలు చేస్తారు. నెలసరి కూడా యాప్ లో ఉండే యాక్టివ్ యూజర్లను బట్టి వసులు చేస్తారు. పదివేల నుంచి లక్షమంది యూజర్లుంటే వారి దగ్గర నుంచి 110 డాలర్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ల సంఖ్య ఎక్కువ ఉంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

భవిష్యత్ ప్రణాళికలు

ఈ-కామర్స్ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ యాప్ ల సంఖ్య పెరుగుతుంది. ఒకే మోడ్ బిజినెస్ చేయడానికి చాలారకాల యాప్స్ పోటీ పడుతాయి. దీంతో వారి యూజర్ బేస్ ని కాపాడు కోవడం పెద్ద సవాలుగా ఉంటుంది. దీన్ని కొనోటోర్ చేసిపెడుతుంది. భవిష్యత్ లో జెన్యూన్ యాప్ లకు మాత్రమే కొనోటోర్ పనిచేస్తుంది. యాప్ కు యాజర్లను పెంచడంతోపాటు ఉన్న యూజర్లను యంగేజ్ చేయడం ఇప్పుడు చేస్తున్నాం. దీన్ని మరింత పెంచడంపై కొత్త ఫీచర్లపై పనిచేస్తున్నాం. చెన్నై , బెంగళూరులోని మాకు క్లెయింట్స్ ఉన్నారు. ఇతర మెట్రో నగరాలకు కూడా విస్తరించాలని ప్రణాళికలు చేస్తున్నాం. మేం సపోర్ట్ ఇచ్చే యాప్ ల సంఖ్య వేలల్లో ఉంటే మాకు వందల మిలియన్లలో యూజర్లు ఉన్నట్లు లెక్క. అదే మా తదుపరి లక్ష్యం అని ముగించారు శ్రీ కృష్ణ‌

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags