చిన్న నగరాల్లో IIT, JEE కోచింగ్‌కు ఉన్నఅనూహ్యమైన మార్కెట్‌పై కన్నేసిన 'ఇగ్నస్'

ద్వితీయ శ్రేణి నగరాలకు అందుబాటులో కాంపటీటివ్ ఎగ్జామ్ కోచింగ్తక్కువ ఖర్చుతోనే ట్యాబ్లెస్ పీసీలతో టీచింగ్పట్టణాల్లో జనాలకు అవగాహన కల్పిండమే ముందున్న సవాళ్లుహసన్‌లో ప్రారంభమైన ప్రయాణం

చిన్న నగరాల్లో IIT, JEE కోచింగ్‌కు ఉన్నఅనూహ్యమైన మార్కెట్‌పై కన్నేసిన 'ఇగ్నస్'

Wednesday May 20, 2015,

3 min Read

మెట్రోనగరాల్లో ఐఐటి, జెఇఇ కోచింగ్ అంటే ఎంతో కామన్. కానీ ద్వితియ శ్రేణి నగరాల్లో ఈ కోచింగ్ సెంటర్ పెట్టడమంటే ఆశామాషి వ్యవహారం అయితే కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయాలి. అంతకు మించి విద్యార్థులను కోచింగ్‌కి రప్పించగలగాలి. ఈ సాహసాన్ని ఇగ్నస్‌తో చేసి, చూపించారు ఆ ముగ్గురు. ఇందులో ఇద్దరు ఐఐటి నుంచి మరొకరు బిట్స్ నుంచి ఈ రంగంలోకి వచ్చిన వారు కావడం విశేషం. ప్రస్తుతం కర్నాటకలోని హసన్‌లో ట్యాబ్లెట్ బేస్డ్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. నేర్చుకోడానికి ఈ పద్ధతి ఎంతో సులభతరంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. అన్ని వర్గాల విద్యార్థులపైనా కాన్సన్‌ట్రేట్ చేయడమేకాదు ప్రతిరోజూ టెస్ట్ లను నిర్వహించడాన్ని మనం గుర్తించాలి. తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సంబంధించిన విషయాలు చర్చిస్తూ.. అదే సమయంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వసాన్ని పెంచుతూ దూసుకు పోతోంది ఇగ్నస్.

ఇగ్నస్ ప్రారంభం

నైపుణ్యం గల విద్యార్థులు ఎక్కడైనా ఉంటారు. ఇదే విషయాన్ని ఫౌండర్లు నమ్ముకున్నారు. అయితే సరైన గైడెన్స్, గుర్తింపు, సరైన టైంలో అవకాశం ఇవ్వడం అనే విషయాలు ప్రధానంగా విద్యార్థులపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ఆలోచనతో మొదలైందే ఇగ్నస్. కోఫౌండర్ల లో ఒకరైన మెర్విన్ రొసారియో కొన్ని ఆసక్తి కరమైన విషయాలను బయటపెట్టారు. పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ కావాలన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశించాలన్నా జెఈఈ, క్యాట్, సివిల్ సర్విస్ ఎగ్జామ్స్ లాంటి పరిక్షల్లో సత్తా చాటితే కానీ కుదరదు. అయితే ఈ పరిక్షలకు సంబంధించిన కోచింగ్ సెంటర్లన్నీ సిటీల్లోనే ఉండటం.. చిన్న చిన్న పట్టణాల్లోని జనం ఈ పరీక్షల కోచింగులకు దూరం అవుతున్నారు. సిటీలో ఉండి హాస్టల్ ఫీజులు కట్టగలిగే స్తోమత ఉన్నవారు మాత్రమే వీటిని పొందగలుగుతున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో మంచి టీచర్ల కొరత కూడా మరో కారణం. ఈ కారణంగా శ్రీమంతులు పిల్లలు మాత్రమే ఈ కోచింగ్ తీసుకోడానికి ముందుకొస్తున్నారు. పదేళ్లుగా ఇదే ఫీల్డులో తన కుటుంబం పనిచేస్తున్నందున, భారత దేశంలో కోచింగ్ సెంటర్ల పరిస్థితిని చక్కగా అర్థం చేసుకున్నారు మెర్విన్. 

పెద్ద పెద్ద నగరాల్లో ఐఐటి జెఈఈ ట్రెయినింగ్ కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేయడానికి కారణం కనుక్కున్నారు. టీచర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వడమే మొత్తానికి కారణంగా తేల్చారు.దీంతో టీం ఇగ్నస్ తక్కువ ఖర్చులో నేర్చుకునే వీలు కల్పించింది. ప్రధానంగా చిన్న పట్టణాల్లో ఉండే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించింది.

image


సాధారణంగా విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను టీం అర్థం చేసుకుంది. ఆన్ లైన్ ద్వారా నేర్పించడమనే పరిష్కార మార్గంతో ముందుకు పోవడానికి నిర్ణయించుకుంది. ఆ తర్వాత కొన్ని లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అనుకుంది. దీంతో 2013 సెప్టెంబర్ లో ఇగ్నస్ ప్రారంభమైనా.. ఆతర్వాతి ఏడాది జూలైలో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇగ్నస్ సెంటర్‌కు ప్రిమియర్ ఇనిస్టిట్యూట్ నుంచి కంటెంట్ అందుతుంది. క్లాసులో అనుభవం ఉన్న లెక్చరర్ల పాఠాలను రికార్డ్ చేసి దాన్ని ట్యాబ్లెట్ లో చూపిస్తారు. దీంతో ఖర్చును దాదాపు తగ్గించగలిగారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ రకమైన నేర్చుకొనే పద్దతిపై అమితంగా మక్కువ చూపించారు. ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఏదైనా సమస్య ఉంటే వీడియో కోర్సు కి వెళ్లే వెసులుబాటుండటం విద్యార్థులు ఇష్టపడటానికి మరో కారణంగా చెప్పొకొచ్చారాయన

ఇగ్నస్ టీం

ఇగ్నస్ టీం


ఇగ్నస్ టీం- బ్యాక్ గ్రౌండ్

మెర్విన్ రోసారియోతో ఇగ్నస్ టీంలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులున్నారు. వీరిలో శరత్ హొల్లా(బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి). ఆయనకి అమెజాన్ విప్రోలో టెకీగా చేసిన అనుభవం ఉంది. అక్షయ్ బెధోతియా(ఐఐటిబి పూర్వవిద్యార్థి). ఆగ్రాలో కోచింగ్ సెంటర్లతోపాటు టీచింగ్‌లో ఈయనకు నైపుణ్యం ఉంది. గౌరీష్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. ఇగ్నస్‌లో సేల్స్, స్ట్రాటజీ వ్యవహారాలు చూసుకుంటున్నారీయన. 

హసన్‌లో మొదటి సెంటర్‌ను ప్రారంభించిన సమయంలోనే కస్టమర్ రీసెర్చ్, ఫోటో టైపింగ్ చేయడానికి విల్ గ్రో నుంచి పెట్టుబడులను ఆకర్షించింది. కర్నాటకాలో మరిన్ని పట్టణాలతోపాటు, దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. చిన్న చిన్న పట్టణాల్లోని జనానికి ఇలాంటి విషయాలపై అవగాహన తక్కువ. సాధారణ కోచింగ్ సెంటర్లకు మాత్రమే తమ పిల్లలను పంపించడానికి పేరెంట్స్ కోరుకుంటున్నారు. దీంతో ట్యాబ్లెట్ పిసిలతో కోచింగ్ సెంటర్ నడపడం కత్తిమీద సామే అంటున్నారు మెర్విన్. చిన్న పట్టణాల్లో చాలా రకాలైన కోచింగ్ సెంటర్లు సాధారణంగానే కోచింగ్ ఇస్తున్నాయి. సైన్స్, మ్యాథ్య్ విషయంలో చాలా తక్కువ విలువలతో కూడిన కోచింగ్ ను ఇవి అందిస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతి రాష్ట్రంలో రెండు లేదా మూడు మాత్రమే జెఈఈ సెంటర్లున్నాయి. దీంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి.దీంతో జెఈఈ కోచింగ్ అంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయంగా మారింది. ప్రతి జిల్లా కేంద్రాన్ని జెఈఈ కోచింగ్ సెంటర్ గా మార్చడమే టార్గెట్ గా ముందుకు పోతున్నామని మెర్విన్ ముగించారు.

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి