సంకలనాలు
Telugu

విద్యార్థులకు సేవలందించే స్కౌట్ ప్లస్

ashok patnaik
23rd Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


స్కౌట్ ప్లస్ యాప్. స్కూల్ పిల్లల నుంచి కాలేజీ విద్యార్థుల దాకా అన్ని కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ యాప్ ప్రారంభించిన రెండు నెలల్లోనే వేల డౌన్ లోడ్స్ దాటింది.

నెలకి 2మిలియన్ వ్యూస్

జెనిత్ ప్లస్ తాలూకు ప్రాడక్ట్ ఇది. స్టార్టప్ నెట్ వర్కింగ్ , మెంటార్షిప్ అందించే జెనిత్ ప్లస్ ఈ కాన్సెప్ట్ ని రెండు నెలల ముందు జనం ముందుకు తీసుకొచ్చింది. అంత్యంత ఆదరణ కలిగిన ఈనెట్ వర్కింగ్ స్టార్టప్ లో స్కౌట్ ప్లస్ కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం విశేషం. మొదటి వారం నుంచే యాప్ వ్యూస్ సంఖ్య కాన్ స్టంట్ గా పెరుగుతోందని ప్రవీణ్ అంటున్నారు. విద్యార్థులకు కావల్సిన సమచారం ఇస్తున్నారు కనక ఈ రకమైన రెస్పాన్స్ వస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా స్టూడెంట్స్ వీరి టార్గెట్ మార్కెట్ కనుక ఆ రకంగానే ప్రమోషన్ చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారం అందించే అన్ని ప్లాట్ ఫామ్ లలో యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు.

image


స్కౌట్ ప్లస్ అందించే సేవలు

స్కౌట్ ప్లస్ విద్యార్థులకు సంబంధించిన అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. అందులో ప్రధానంగా ఇచ్చే సేవలివే. 

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన మొత్తం సమాచారం అందిస్తారు. ఎక్కడ జరిగేది, వాటి తారీఖులు, సిలబస్ లాంటివి యాప్ లో లభిస్తాయి. ఉద్యోగాలు, విద్యార్థులు ఎక్కువగా ఎదురు చూసే విషయాల్లో ఇది కూడా ఒకటి. ఎమ్మెన్సీ, పబ్లిక్ లేదా ప్రైవేట్ కంపెనీల్లో ఉండే ఉద్యోగ సమచారం అందిస్తారు. క్రీడలు, క్రికెట్, ఫుడ్ బాల్ లాంటి క్రీడలు, ఇతర ఆటలకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ అందిస్తారు. దీంతో పాటు ఆటపై విశ్లేషణాత్మక కధనాలను కూడా చూడొచ్చు. సాంకేతికత, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న న్యూస్ ఏజెన్సీలు అందించే తాజా సమచారాన్ని కూడా దీని ద్వారా అందిస్తారు. మొబైల్స్, గాడ్జెట్స్, వేరబుల్, వీడియో, గేమ్స్ లాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యర్థుల కోసం సమాచారం అందిస్తారు.సాధారణ సేవలతో పాటు ఇందులో ప్రధానంగా ప్రభుత్వ పధకాలు అందుబాటులోకి తెచ్చారు. వీటి తోపాటు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లాంటివి అందిస్తారు. జిఆర్ఈ, ఎబ్రాడ్ వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్, ప్రాక్టీస్ లాంటి సేవలను అందిస్తారు. సినిమాల్లాంటి ఎంటర్టయిన్మెంట్, కరెంట్ అఫైర్స్, కెరీర్ గైడెన్స్ లాంటి సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు.

image


స్కౌట్ ప్లస్ టీం

వినితా సురానా స్కౌట్ ప్లస్ కో ఫౌండర్. ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీయే పూర్త చేసిన వినితాకు యూకేలో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె ప్రారంభిచింన సంస్థే జెనిత్ ప్లస్. దాని ప్రాడక్టుగా వచ్చిన స్కౌట్ ప్లస్ కు ఆమె కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ మడిపోజు ఈ స్టార్టప్ కి సిఓఓగా ఉన్నారు. జెఎన్టీయూ నుంచి బిటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన ప్రవీణ్ ఈ స్టార్టప్ కోసం పనిచేస్తున్నారు. వీరితో పాటు ఆదిత్య చింతా, సాయి చాణక్య, బల్మీత్ కౌర్ లు క్రియేటివ్ టీంలో ఉన్నారు.

ఆదాయ వనరులు

జెనిత్ ప్లస్ లో ఉన్నయూజర్ బేస్ కు ఈ యాప్ ని పరిచయం చేసి సబ్ స్క్రిప్షన్ లో కొత్త సేవలను అందిస్తున్నారు. పెయిడ్ ఆర్టికల్స్, యాడ్స్, స్టూడెంట్స్ కన్సల్టింగ్ లాంటివి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

image


సవాళ్లు, భవిష్యత్ ప్రణాలికలు

స్టూడెంట్స్ సర్వీసులో ఈ తరహా స్టార్టప్ లు ఎక్కువగానే ఉన్నాయి. ఎక్యురేట్ సమాచారం అందిస్తే తప్పితే క్రెడిబిలిటీ కాపాడుకోవడం కష్టం. తమకుండే స్ట్రాంగ్ టీంతో దీన్ని అధిగమిస్తామని ప్రవీణ్ చెబుతున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఆంధ్రా, తెలంగాణాల్లో విస్తరిస్తామని అంటున్నారు. ముందుగా ఫ్రీ యాప్ గా జనం లోకి వెళ్తున్నాం కనుక మంచి స్పందన వస్తోందని, దీన్ని కొనసాగిస్తామని ప్రవీణ్ ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags