సంకలనాలు
Telugu

ఫీపాల్‌తో ఆన్‌లైన్‌లో స్కూల్ ఫీజులు కట్టేయొచ్చు

ఫీపాల్‌తో ఫీజులు ఎప్పుడైనా ,ఎక్కడి నుంచైనా దేశంలో ఉన్న విద్యాసంస్థలే టార్గెట్భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా విస్తరణటెక్నాలజీతో దూసుకుపోతున్న సరికొత్త సంస్థ

10th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అన్ని పనులూ ఆన్‌లైన్‌లోనే చకచకా చేసుకునే వెసులుబాటు ఉండడంతో భౌతికంగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతోంది. దీంతో సాధ్యమైనన్ని ఎక్కువ పనులు చేసేస్తున్నాం. గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పని లేకుండా ఓ చిన్న క్లిక్‌తో వర్క్ కంప్లీట్ అవుతోంది. సాంకేతిక తెచ్చిన మార్పుతోనే ఇది సాధ్యపడిందనే చెప్పాలి. కానీ కొన్ని రంగాల్లో టెక్నాలజీ పూర్తి స్థాయిలో విస్తరించలేదు. విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీల విషయంలో దీన్ని మనం గమనించొచ్చు. దీనికోసం ఓ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ కధే ఇది. స్కూలు ఫీజులు కట్టిన రోజులు గుర్తున్నాయా ? అరకిలోమీటర్ లైన్లో నుంచొని కట్టిన రోజులూ కొంత మందికి జ్ఞాపకం ఉండొచ్చు. 

భవిష్యత్తులో ఆ అవసరం లేకుండా చేసింది ఫీ పాల్. ఒక క్లిక్ కొడితే ఫీజ్ పేమెంట్ జరిగిపోతుంది. నిరుడు జూలై 2014లో ప్రారంభమైన ఫీపాల్ ఈ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పునకు నాంది. ఫీ పాల్ ఓ సరికొత్త ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్ మాత్రమే కాదు.. సర్వీస్ మార్కెట్ ప్లేస్ కూడా. ఫీపాల్ యూజర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా ఇన్‌స్టిట్యూట్ ఫండ్స్ డిపాజిట్ చేయడంతో పాటు రసీదు పొందొచ్చు. విద్యాసంస్థలు ఫీ పాల్‌లో ఎలాంటి డబ్బులు కట్టకుండానే సైనప్ చేసుకోవచ్చు. ఫీపాల్ నుంచి ఓ లింక్ ఇస్తారు. ఈ లింక్‌తో ఫీజులను వసూలు చేసుకోవడమే కాదు అడ్మిషన్ ఫామ్‌లను అమ్ముకోవచ్చు. విద్యా సంబంధమైన వస్తువులను కూడా అందించొచ్చు. ఆన్‌లైన్ టెస్టులను నిర్వహించడంలాంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఢిల్లీ వాసులైన అంకుర్ శర్మ, పూజా ఈ.. ఫీ పాల్‌ నెలకొల్పారు. 

విద్యారంగంలో ఎలాంటి అలసట లేకుండా యూజర్లు ఆర్థిక లావాదేవీలు చేసుకోడానికి వీలుగా దీన్ని డిజైన్ చేశారు.

ఫీ పాల్ బృందం

ఫీ పాల్ బృందం


''ఈ కామర్స్ అసైన్‌మెంట్ చేసేటప్పుడు స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్లో పనిచేయాల్సి వచ్చింది. ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు జనం ఇబ్బందులు ఎదుర్కోడాన్ని గుర్తించాను. ప్రధానంగా విద్యసంస్థల విషయంలో ఈ రకమైన సౌలభ్యం లేకపోవడం నన్ను ఆలోచింపజేసిందని అంటారు అంకుర్.

ఈ రంగంలో ఆటోమేటింగ్ ట్రాంజక్షన్ కోసం ఆన్లైన్ సొల్యూషన్ చూపగలిగితే కచ్చితంగా లాభదాయకంగా ఉంటుందని భావించారు. విద్యారంగంలో భారత్ అతిపెద్ద మార్కెట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. విద్యాసంస్థల ఫీజుల ఆర్థిక లావాదేవీల రంగం రూపురేఖలను ఫీపాల్ మార్చబోతోందని అంకుర్ అండ్ టీం ఆశాభావంతో ఉంది. టెక్నాలజీ సాయంతో ఫండ్ కలెక్షన్ చేయడంతో ఫీ పాల్ బండెడు చాకిరీని సులభతరం చేసింది.

“మా భాగస్వామ్య విద్యసంస్థల్లో సాధారణ పద్దతి ఉండకూడదు. ఫండ్స్‌ని సేకరించే పద్ధతిని మార్చేసి పూర్తిగా డిజిటల్ మీడియంలో లావాదేవీలు జరగాలి. భవిష్యత్తులో మరిన్ని ప్రీస్కూళ్లు, స్కూళ్లు, కాలేజీలు,యూనివర్సిటీ తోపాటు కోచింగ్ సెంటర్లకు మా సేవలను విస్తరిస్తాం.” అంటారు అంకుర్.

టీం విషయానికొస్తే ఫీ పాల్‌లో అనుభవం ఉన్న వ్యక్తులతోపాటు కొత్తతరం కూడా ఉంది. అంకుర్ భువనేశ్వర్ జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌లో గోల్డ్ మెడలిస్ట్. సేల్స్ ఏరియా మేనేజర్‌గా మదర్స్ డెయిరీలో పనిచేశారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిజిటల్ మార్కెట్ ఈకామర్స్ రంగంలో మేనేజిమెంట్‌కి సంబంధించిన అనేక విషయాలపై అవగాహన పెంచుకున్నారు. పూజా, రాజస్తాన్ యూనివర్సిటి నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. రాజస్తాన్ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (DOIT)లో కొన్నాళ్లు పనిచేశారు. ఫీపాల్ లో టెక్నికల్ టీం, ప్రాడక్ట్ డెవలప్మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాడక్ట్ ఇంప్రూమెంట్, డాటా సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ లాంటి విధులను పూజ నిర్వహిస్తారు. 

టీంలో ఇతర సభ్యుల విషయానికొస్తే డాక్టర్ అలోక్ చౌహాన్, డాక్టర్ రుద్రేష్ పాండేలున్నారు. వీళ్లిద్దరూ విద్యాసంస్థలకు సంబంధించిన బిజినెస్ స్ట్రాటజీని రూపొందిస్తారు. వీళ్లిద్దరికీ విద్యారంగంలో అపార అనుభవం ఉంది. ఇనిస్టిట్యూట్‌లో ట్రాంజాక్షన్ పూర్తయితే కనిష్ట రుసుంని వసూలు చేస్తుంది ఫీపాల్. ఆన్ లైన్ లావాదేవీల విషయంలో ఎలాంటి సందేహాలున్నా వాటిని తీర్చే బాధ్యతను సైతం ఫీపాల్ చేపడుతుంది. దీనికోసం కస్టమర్ కేర్ ను నిర్వర్తిస్తోంది.

ఫీ పాల్ వెబ్ పేజ్

ఫీ పాల్ వెబ్ పేజ్


ఫీ కలెక్షన్ ఓ ఈకో సిస్టమ్

  • అడ్మిషన్ ఫామ్ ఆన్ లైన్ లోనే అమ్మకం
  • ఆన్ లైన్ వెబ్ స్టోర్
  • ఆన్ లైన్ ఎగ్జామ్ ప్లాట్ ఫాం
  • ఆన్ లైన్ ఈవెంట్ టికెటింగ్

ఫీపాల్ ఐదు నెలల స్టార్టప్ కంపెనీ. కానీ పది నగరాల్లో విస్తరించింది.దాదాపు యాభైకి పైగా విద్యాసంస్థలతో కలసి పనిచేస్తోంది. కోటిన్నరకు మించిన ట్రాంజాక్షన్లను ఇప్పటి దాకా పూర్తి చేసింది. ఫీపాల్ కు మూడు ఆదాయ మార్గాలున్నాయి.

  1. కన్వీనియన్స్ ఫీ: ప్రతి విజయవంతమైన లావాదేవీ నుంచి ఫీపాల్ కన్వినియన్స్ ఫీజుని వసూల్ చేస్తుంది.
  2. సాఫ్ట్‌వేర్ సెల్లింగ్: విద్యాసంస్థకు కావల్సిన కస్టమైజ్డ్ , అడ్వాన్స్ డ్ సాఫ్ట్ వేర్ను ఫీపాల్ సేల్ చేస్తుంది.
  3. సైట్ స్పేస్ సెల్లింగ్: జియోగ్రాఫికల్ టార్గెట్ లో ఫీపాల్ ఇనిస్టిట్యూట్ లను సిటీ,లొకాలిటి, ఇతర రకాలుగా విభజిస్తుంది.

విద్యాసంస్థలకు వెళ్లి వారతో మాట్లాడటం అనేది సరైన మార్కెట్ స్ట్రాటజీ అంటారు ఫౌండర్ అంకుర్. కానీ ఇతర స్టార్టప్ లాగానే ఫీపాల్ కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తోంది. విద్యాసంస్థల్లో సేల్స్ సైకిల్ అనేది ఇందులో ఒకటి. విద్యసంస్థను నమ్మకం కలిగించడం మరో సవాలు. భవిష్యత్ లో ఈ సవాళ్లను అధిగమిస్తామని అంకూర్ ఆశాభావంతో ఉన్నారు.

“ దేశంలో సాధ్యమైనన్ని ఎక్కువ విద్యాసంస్థలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఇతర దేశాల్లో కూడా విస్తరించాలని చూస్తున్నాం. యూజర్ బేస్‌ని పెంచుకొని ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల లావాదేవీలు చేపట్టాలనేది మా టార్గెట్ ” అని అంకుర్ వివరించారు. మొబైల్ సొల్యూషన్ పై కూడా ఫీపాల్ పనిచేస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags