సంకలనాలు
Telugu

ప్రెగ్నెన్సీ టైంలో పనికొచ్చే 10 ముఖ్యమైన యాప్స్

ఆరోగ్య రంగంపై అధికంగా పెరిగిన టెక్నాలజీ ప్రభావంప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతున్న యాప్స్ఉద్యోగం చేసే తల్లులకు అండగా నిలుస్తున్న యాప్స్

ABDUL SAMAD
23rd Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావం ప్రతీ రంగంపై కనిపిస్తుంది. అయితే అందరికన్నా ఆరోగ్య రంగంపై వీటి ప్రభావం ఎక్కువ ఉన్నట్టు గుర్తించారు ఎక్స్‌పర్ట్స్, డాక్టర్లు, ఆరోగ్య నిపుణులతో పాటు పేషేంట్లు కూడా హెల్త్ కేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కొత్త కొత్త విధానాలను కనుగొంటున్నారు. ఈ మధ్య అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ యాప్స్ , ఇతర గాడ్జెట్స్ కారణంగా క్యాలరీలు కౌంట్ చేసుకోవడం, పడుకునే విధానం, ట్రీట్మెంట్ విధానాలతో పాటు హార్ట్ రేట్ కూడా మానిటర్ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తోంది.

image


ఇక మహిళల ప్రగ్నెన్సీ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ నిత్యం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య ఒత్తిడితో పని చేసే మహిళలకు మోబైల్ యాప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. గూగుల్ స్టోర్, ఐఓఎస్ స్టోర్లో ఇలాంటి యాప్స్ విపరీతంగా పాపులారిటీని సంపాదించాయి. ఈ యాప్స్ శిశువు ఎదుగుల తెలపడంతో పాటు, ఉత్తిడిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటెయిన్ చేయాలి, చేయాల్సిన వ్యాయామాలు వంటి అనేక కీలకమైన అంశాలను ఇవి తెలిసేలా చేస్తాయి.

1. ‘మై ప్రెగ్నెన్సీ టుడే’.

image


‘మై ప్రెగ్నెన్సీ టుడే’ యాప్ మీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అనేక ప్రశ్నలకు వీడియోలు, న్యూట్రిషన్ గైడ్‌తో పాటు ఆ బర్త్ క్లబ్‌లో ఉన్న ఇతర తల్లులతో కలుపుతుంది. అందులో ఉన్న క్యాలెండర్ పనితీరుతో మీ శిశువు ఎదుగుదల గురించి తెలుసుకోవచ్చు. దాని వల్ల ప్రెగ్నెన్సీ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంచి అవగాహన కలుగుతుంది. గ్రోత్ విడ్జెట్ ప్రతీ వారం మీ బేబీ ఏ విధంగా కనిపించే అవకాశం ఉందో తెలుపుతుంది. ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లో కూడా లభిస్తుంది.

2. ‘ప్రెగ్నెన్సీ స్ప్రౌట్'

ప్రెగ్నెన్సీ స్ప్రౌట్ పుట్టబోయే బేబి గురించి అవసరమైన సలహాలు ఇవ్వడంతో పాటు, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలు కూడా చూపిస్తుంది. ఈ యాప్‌లో డ్యూ డేట్ కౌంట్ డౌన్ చూపే సౌకర్యం కూడా ఉంది. అంతే కాకుండా యూజర్ ఈ సమాచారాన్ని ఫేస్ బుక్ ద్వారా తమ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునే సౌకర్యమూ కల్పిస్తుంది.

3. ‘బేబీబంప్ ప్రెగ్నెన్సీ ప్రో’...

image


డీటైల్డ్‌గా ఉండటంతో పాటు ఎంతో సులువుగా ఉపయోగించగలిగే ఈ యాప్, ఫోరమ్స్ , ఫోటో అల్బమ్స్‌తో సహా, బేబీ కిక్స్‌ని రికార్డ్ చేస్తుంది. మీ బరువును ట్రాక్ చేయడమే కాకుండా బేబీ బంప్స్ స్టోర్లో షాపింగ్ కూడా చేయవచ్చు. ఈ యాప్ మీ ప్రెగ్నెన్సీని ట్రాక్ చేయడమే కాకుండా త్వరలో కాబోయే తల్లిదండ్రుల కోసం కూడా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఓఎస్‌లో కూడా అందుబాటులో ఉంది.

4.’హ్యాప్పి ప్రెగ్నెన్సీ టిక్కర్’:

ఈ యాప్ మీ బరువు ని ప్రతీ వారం, టైమ్‌తో పాటు ట్రాక్ చేస్తూ మీకు కావాల్సిన సలహాలు అందిస్తుంది, ఇక్కడ ఇతర మదర్స్‌తో సలహాలు సూచనలు కూడా షేర్ చేయవచ్చు. అంతే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలోని అనుభవాలు స్టోర్ చేసుకునే అవకాశంతో పాటు, తల్లి కావాలనుకునే మహిళలకు ప్లానర్ కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్ తో పాటు ఓఎస్ లో కూడా అందుబాటులో ఉంది.

5.‘ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్’ :

మెడికల్ మరియు పర్సనల్ ప్రెగ్నెన్సీ సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. బేబీ ఎదుగుదల పై టిప్స్, వీక్లీ అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటు వీక్లీ ప్రెగ్నెన్సీ వీడియోలు, మీ డాక్టర్‌తో సమాచారాన్ని షేర్ చేసుకునే వీలు కూడా ఉంది. డాక్టర్‌తో అపాయింట్‌మెంట్‌ యాడ్ చేయడంతో పాటు మీ ప్రశ్నలకు జవాబు కూడా ఇందులోని ఫోరంలో తెలుసుకోవచ్చు.

6. ‘ప్రెగ్నెన్సీ గైడ్ ఇన్ హిందీ’:

image


హిందీ లో ఉన్న అతి తక్కువ యాప్స్ లో ఇదొకటి. ప్రెగ్నెన్సీ సమయంలో మీ డైట్, ఫుడ్, వ్యాయామం, నిద్ర వంటి అన్నీ అంశాలపై ఈ యాప్ సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా మొదటి నెల నుండి 9 వ నెల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర టిప్స్ కూడా అందిస్తుంది.

7. ‘ఎమ్ ప్రెగ్నెన్సీ’:

image


అందరికన్నా విభిన్నంగా ఈ ప్రెగ్నెన్సీ యాప్ మగవారి కోసం తయారుచేయబడింది, ఐఫోన్‌లో ఉండే ఈ యాప్, ప్రెగ్నన్సీతో ఉన్న తమ పార్ట్‌నర్ అవసరాలు, వారి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బేబీ గురించి సమాచారంతో పాటు, బేబీ ఏ విధంగా ఎదుగుతుంది అనే అంశాలు తెలుపుతుంది. వాటితో పాటు సామాన్యంగా అడిగే అనేక ప్రశ్నలకు కూడా అందులో సమాచారం ఉంటుంది. అంతే కాకుండా, ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోకూడని ఆహార పధార్ధాల గురించి కూడా తెలుపుతుంది.

8. ‘ప్రెగ్నెన్సీ అసిస్టెంట్’:

పేరుకు తగ్గట్టే ఉన్న ఈ యాప్ చాలా సులువుగా ఉపగించవచ్చు. ప్రతీ వారం బేబీ ఎదుగుదలను ట్రాక్ చేయడంతో పాటు మనకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారం అందిస్తుంది.

9. ‘ప్రెగ్నెన్సీ ++’:

image


ప్రపంచంలోని ప్రముఖ ప్రెగ్నెన్సీ యాప్స్ లో ఒకటైన ‘ప్రెగ్నెన్సీ ++’, బేబీ డెవలప్మెంట్ పై అద్భుతమైన ఫోటోలతో ప్రతీ వారం, నెలకోసారి గైడ్ చేస్తూ ఉంటుంది. వాటితో పాటు డైట్ , వ్యాయామం, లేబర్ గురించి కూడా సమాచారం అందిస్తుంది. ఈ యాప్ మగవారికి, తాతలు, నాయనమ్మలతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు అనుగుణంగా కూడా మలుచుకునే అవకాశం ఉంది.

10. ‘ప్రెగ్నెన్సీ డ్యూ డేట్ క్యాల్కులేటర్’ :

ఇక ‘ప్రెగ్నెన్సీ డ్యూ డేట్ క్యాల్కులేటర్’ మీ బేబీ డ్యూ డేట్‌ని తెలుపుతుంది. ఈ కేలుకులేటర్ మీ బేబీని ఎప్పుడు ఆశించవచ్చో చెబుతుంది. దానితో పాటు ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని అంశాలూ ఈ యాప్ లో ఉన్నాయి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags