సంకలనాలు
Telugu

ఇంగ్లిష్ నేర్చుకోవడానికి నానా తంటాలు పడి.. నేడు100 కోట్ల డాలర్ల కంపెనీకి అధిపతిగా ఎదిగి..

bharathi paluri
15th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఎక్క‌డో ప‌ల్లెటూర్లో పుట్టి, ఇంగ్లీష్ మీడియ‌ంలో చ‌ద‌వ‌డానికే క‌ష్ట‌ప‌డిన శ్రీ‌విద్య‌.. ఈరోజు వంద‌కోట్ల డాల‌ర్ల సంస్థ‌కు అధిప‌తి అంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే.. కానీ శ్రీ‌విద్య‌కు అది సాధ్య‌మే.. ఎందుకంటే, ఆమె ప‌ని చేయ‌డంలేదు. ప‌నిని ప్రేమిస్తున్నారు. ప‌నే జీవితంగా జీవిస్తున్నారు. ''చ‌దివేట‌ప్పుడు ప్ర‌తి అక్ష‌రాన్నీ ప్రేమించాలి..! కెరీర్‌లో ఆ అక్ష‌రాల‌ను అనుభవంగా అనువ‌దించాలి..'' ఇంజనీరింగ్ చ‌దివి , ప్ర‌స్తుతం అమాగి సంస్థ‌కు కో ఫౌండ‌ర్ గా వున్న శ్రీ‌విద్య శ్రీ‌నివాస‌న్ న‌మ్మిన జీవన‌సూత్ర‌మిదే. 

శ్రీ‌విద్య త‌ల్లిదండ్రులు ఓ చిన్న గ్రామంలో ఎయిడ‌ెడ్ స్కూల్లో టీచ‌ర్లు. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు ద‌గ్గ‌ర వుండే ఈ గ్రామంలోనే శ్రీ‌విద్య చిన్న‌ప్పుడు చ‌దువుకున్నారు. ఎలిమెంట‌రీ స్కూల్ త‌ర్వాత ఆమె ఇంగ్లీష్ మీడియ‌మ్ స్కూల్లో చేరారు. మొద‌ట్లో ఇంగ్లీష్ చాలా క‌ష్టంగా వుండేది. చివ‌రికి ఇంట‌ర్మీడియ‌ట్ క వ‌చ్చేస‌రికి ఆమెకు ఇంగ్లీష్ పై ప‌ట్టువ‌చ్చింది.

కోయంబ‌త్తూరులోని గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ టెక్నాల‌జీలో ఆమె కంప్యూట‌ర్ సైన్స్‌లో బి టెక్ పూర్తి చేసారు. కాలేజిలో లెక్చ‌ర‌ర్లు చెప్పే దానికంటే, త‌న‌కు తానుగా నేర్చుకోవ‌డం మీద‌నే శ్రీ‌విద్య ఎక్కువ మ‌న‌సు పెట్టారు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్, డాటా స్ట్ర‌క్చ‌ర్స్, ఇలాచ‌దివిన ప్ర‌తీ స‌బ్జెక్టుని పూర్తిగా ప్రేమించారామె. డిగ్రీ అయిన వెంట‌నే ఆమెకు టెక్సాస్ ఇన్స్‌ట్రుమెంట్స్‌లో ఉద్యోగం దొరికింది. తాను ప‌నిచేయ‌బోయే టెక్నాల‌జీ గురించి తెలుసుకుంటున్న‌ప్పుడే, ఆమెకు ఎక్క‌డ లేని ఉత్సాహం వ‌చ్చేసింది. ఇక 6వేల రూపాయ‌ల మొద‌టి జీతం అందుకున్న‌ప్పుడు ఆమె ఆనందానికి అవ‌ధుల్లేవు. 1996లో ఆమె మొద‌టి జీతం తీసుకునే నాటికి ఆరువేలు అంటే.. చాలా ఎక్కువ‌..

సాఫ్ట్ వేర్ డిజైన‌ర్ నుంచి స్టార్టప్ వ‌ర‌కు..

24 ఏళ్ళ వ‌య‌సులో శ్రీవిద్య మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి ఇంప‌ల్స్ సాఫ్ట్ అనే సంస్థ‌ను నెల‌కొల్పారు. ఇందుకు టెక్సాస్ ఇన్స్‌ట్రెమెంట్స్ లో వ‌చ్చిన అనుభ‌వం వారికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. అక్క‌డే వాళ్ళు ఎల‌క్ట్రానిక్ డిజైన్ ఆటోమేష‌న్ రంగంలో అనేక సాఫ్ట్‌వేర్ టూల్స్ డిజైన్ చేసారు. దీంతో ఈ రంగంలో వున్న డిమాండ్ కూడా వారికి అర్థ‌మైంది. ఈ అనుభ‌వంతోనే 1998లో ఇంప‌ల్స్ సాఫ్ట్ పుట్టింది.

శ్రీ విద్య శ్రీనివాసన్, అమాగి కో ఫౌండర్

శ్రీ విద్య శ్రీనివాసన్, అమాగి కో ఫౌండర్


ఇంప‌ల్స్ సాఫ్ట్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్ టూల్స్ డిజైన్ చేసాక , కాస్త భారీ స్థాయిలో ఏమైనా చేయాల‌నుకున్నారు. అంతే, రాత్రికి రాత్రి బ్లూటూత్ స్పెఫికేష‌న్స్‌కు సంబంధించి వెయ్యి పేజీల‌ను చ‌దివి ఆక‌ళింపు చేసుకుంది శ్రీ‌విద్య‌. ఆ త‌ర్వాత త‌మ సొంత బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్ రూపొందించ‌డం మొద‌లుపెట్టారు.

ఇక అక్క‌డి నుంచి ఇంప‌ల్స్ సాఫ్ట్‌లో ప్ర‌తిరోజు ఓ ఉద్విగ్న అనుభ‌వంగా మారింది.

టాలెంటెడ్ ఇంజ‌నీర్స్‌ను నియ‌మించుకోవ‌డం, లాజిస్టిక్స్‌ను స‌మ‌కూర్చుకోవ‌డం, లాంటి ర‌క‌ర‌కాల బిజినెస్ అవ‌స‌రాలు ఒక‌టొక్క‌టి అర్థ‌మ‌వుతూ వ‌చ్చాయి. సీమెన్స్, సోనీ ఎరిక్సన్, మోటొరోలా, టెక్సాస్ ఇన్స్‌ట్రుమెంట్స్ లాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ క‌స్ట‌మ‌ర్స్‌తో డీల్ చేయ‌డంతో ఇంప‌ల్స్ సాఫ్ట్ బిజినెస్ రేంజ్ చాలా పెరిగింది. ఎనిమిదేళ్ళ పాటు ఏంజిల్ ఫండింగ్‌తో న‌డిచిన ఇంప‌ల్స్ సాఫ్ట్‌ను చివ‌రికి 2006లో నాస్డాక్ లిస్ట‌ెడ్ కంపెనీ SIRF సంస్థకు అమ్మేసారు.

ఇంప‌ల్స్ సాఫ్ట్‌ను తీర్చిదిద్ద‌డంలో శ్రీ‌విద్య చాలా నేర్చుకున్నారు. కేవ‌లం సాంకేతిక అంశాలే కాక, బిజినెస్‌లో వుండే చాలా అంశాలు కూడా ఆమెకు అర్థ‌మ‌య్యాయి. మంచి టెక్నిక‌ల్ టీంను బిల్డ్ చేసుకోవ‌డం, సొల్యూష‌న్స్‌ను డెలివ‌ర్ చేయ‌డం, రోజు రోజుకూ అభివృద్ధి చెందే బిజినెస్ మోడ‌ల్‌ను నిర్మించ‌డం, మార్కెట్ లోటుపాట్లు తెలుసుకుని అందుకు అనువైన ఉత్ప‌త్తుల‌ను రూపొందించ‌డం లాంటి నైపుణ్యాల‌ను ఇంప‌ల్స్ సాఫ్ట్ శ్రీ‌విద్య‌కు నేర్పింది.

ఆంట్ర‌ప్ర‌న్యూర్‌షిప్ ఒక‌సారితో పోయేది కాదు..

ఇంప‌ల్స్ సాఫ్ట్ అక్విజిష‌న్ త‌ర్వాత మ‌ళ్ళీ ముగ్గురు మిత్రులూ డ్రాయింగ్ బోర్డ్ ద‌గ్గ‌ర చేరారు. మ‌ళ్ళీ కొత్త‌గా ఏదైనా మొద‌లుపెట్టాల‌నుకున్నారు. అలా మొద‌లైందే అమాగి.. అమాగి నెలకొల్ప‌డం వెనుక ముఖ్యంగా మూడు ల‌క్ష్యాలున్నాయి.

1. ఇంప‌ల్స్ సాఫ్ట్‌లో అంత‌ర్జాతీయ క‌స్ట‌మ‌ర్స్‌ను టార్గెట్ చేసిన శ్రీ‌విద్య టీమ్ ఈ సారి దేశీయ మార్కెట్‌ను టార్గెట్ గా పెట్టుకున్నారు.

2. త‌మ బిజినెస్ మోడ‌ల్ తో ప‌రిశ్ర‌మ‌ను ఓ కుదుపు కుద‌పాలి.

3. దేశీయ మార్కెట్‌తోనే వందకోట్ల డాల‌ర్ల బిజినెస్‌ను సాధించాలి.

ప్ర‌సార మాధ్య‌మాలకు టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ అందించే బిజినెస్ కావ‌డంతో అమాగి ఉత్ప‌త్తులు ప్ర‌తిరోజూ ల‌క్షలాది మందికి చేరేవి. దీంతో ఈ సొల్యూష‌న్స్ మ‌రింత క‌చ్చితంగా, నూరు శాతం పొర‌పాట్ల‌కు అవ‌కాశం లేని విధంగా, 24x7 ప‌నిచేసే విధంగా రూపొందించాలి. ఈ ఛాలెంజే వారికి ఎగ్జైటింగ్ గా వుండేది.

మ‌హిళా ఆంట్రప్రెన్యూర్స్‌కు ఎదుర‌య్యే స‌వాళ్ళు

“ఒక మ‌హిళ‌గా నేను చాలా ప‌నులు చేయాల్సి వ‌చ్చేది. టైమ్ మేనేజ్‌మెంట్ నాకు చాలా స‌మ‌స్య‌గా వుండేది. అమాగికి, కుటుంబానికి మ‌ధ్య సమయ నిర్వాహణ ఇబ్బందయ్యేది. బిజినెస్‌లో కూడా ఒక మ‌హిళగా నేనేంటో నిరూపించుకోవ‌డం క‌ష్టమైంది. కానీ రోజులు గడిచే కొద్దీ, నేనేంటి, నా బాధ్య‌త‌లేంటి ఎదుటి వారికి అర్థ‌మ‌వుతూ వ‌చ్చాయి. దీంతో నా ప‌ని సులువైంది” అని తొలినాళ్ళ‌లో తాను ఎదుర్కొన్న స‌వాళ్ళ గురించి చెప్పారు శ్రీ‌విద్య‌. 

క‌ష్ట‌మైన , సంక్లిష్ట‌మైన స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం కనుక్కొనే త‌న ప‌ని అంటే శ్రీ‌విద్య‌కు చాలా ఇష్టం. ఒక అథ్లెట్ ఎలాగైతే తొలి అడుగు నుంచే ఒక ఉత్తేజంతో ప‌రిగెడ‌తాడో.. తాను కూడా అంతే అంటారు శ్రీ‌విద్య‌. “అమాగిలో సొల్యూష‌న్స్ క్రియేట్ చేయ‌డం నాకు చాలా గ‌ర్వంగా వుంటుంది. మా టీమ్ కూడా నాకు మ‌రో గ‌ర్వ‌కార‌ణ‌మే” అంటారు శ్రీ‌విద్య‌.

ఇంజనీరింగ్‌ను ప్రేమిస్తూ, టెక్నాల‌జీ అంటే ఆస‌క్తి వున్న అమ్మాయిల‌కు శ్రీ‌విద్య ఇచ్చే స‌లహా ఒక‌టే. ధైర్యంగా వుండండి.. వ‌త్తిడికి లొంగి పోవ‌ద్దు. ఇటు కుటుంబం నుంచి, అటు ఆఫీస్ లో మేనేజ‌ర్ల నుంచి, వ‌ర్క అసైన్‌మెంట్ల వ‌ల్ల వ‌చ్చే ఒత్తిళ్ళ‌ను త‌ట్టుకోలేక చాలా మంది మ‌హిళ‌లు వాళ్ళ ఉద్యోగాల‌ను మానేస్తూ వుంటారు. కొద్దిగా ఓపిక స‌హ‌నం వుంటే వీటిని అధిగ‌మించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదంటారు శ్రీ‌విద్య‌.

image


ఈ కాలం మ‌హిళ‌లు త‌మ‌కు తాము కొన్ని ప్ర‌శ్న‌లు వేసుకోవాలి. “మ‌న‌మెక్క‌డున్నాం ? ఇక్క‌డెందుకున్నాం? మ‌న‌మేం చేస్తున్నాం..మ‌నం చేసే ప‌నులు మ‌న‌ల్ని ఉత్తేజ‌ప‌రుస్తున్నాయా? మ‌నల్ని ఉత్తేజ‌ప‌రిచే ప‌ని మ‌నం చేస్తే, విజ‌యానికి ఢోకా వుండ‌దు” అంటారు శ్రీ‌విద్య‌. “ అలాంటి ప‌ని ప‌నే కాదు.. జీవితం ” ఇదీ శ్రీ‌విద్య చెప్పే జీవిత‌స‌త్యం. .

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags