సంకలనాలు
Telugu

యాప్‌లన్నింటినీ ఒక చోట చేరిస్తే అదే 'క్లోజర్'

డీల్స్ కోసం ఒకటిటేబుల్ బుకింగ్‌కి మరోటి లాయల్టీ ప్రోగ్రాంలకు ఇంకోటి పేమెంట్లకోసం మరో యాప్అన్ని యాప్‌లను ఒక చోటకు తెస్తే క్లోజర్

ABDUL SAMAD
13th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మన దేశంలో రెస్టారెంట్లు, ఫుడ్ చెయిన్స్ వివరాలు ఇచ్చే యాప్స్ చాలా ఉన్నాయి. అయినా సరే దాదాపుగా రోజుకో అప్లికేషన్ ఇలాంటిది పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిలో తాజాగా ప్రవేశించిందే క్లోజర్...

క్లోజర్... ఐఐటీ మద్రాస్ విద్యార్ధులు డెవలప్ చేసిన యాప్. ఇది మనముండే పరిసరాల్లో ఉన్న రెస్టారెంట్ల వివరాలు అందిస్తుంది. ఈ యాప్ ఉపయోగించడం ద్వారా... మన బిల్లులపై లాయల్టీ పాయింట్లను పొందే అవకాశం ఉంది.

image


కె.ఆర్. రాహుల్... క్లోజర్‌కు వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా. స్వతహాగా భోజన ప్రియుడైన ఈయన... ఎప్పుడూ కొత్త రుచులు, హోటళ్లు, రెస్టారెంట్ల వివరాలను అన్వేషిస్తూనే ఉంటారు. తరచుగా వెళ్లే రెస్టారెంట్లు వారు ఇఛ్చే రివార్డుల పొందడాన్ని గొప్పగా భావించేవారు. అతని జేబులెప్పుడూ రివార్డుల కార్డులతో నిండిపోయేవి. అలాగే గ్రూపాన్ సైట్ నుంచి అనేక డీల్స్ ద్వారా... బోలెడు రెస్టారెంట్ల వివరాలు తెలుసుకుని వాటన్నిటి చుట్టూ తిరిగేసేవాడు. అలాగే జొమాటో లాంటి యాప్స్ ఉపయోగించి దగ్గర్లోని రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవడం, ఫుడ్‌పండా ద్వారా ఆర్డర్ చేయడం, డైన్ అవుట్ యాప్‌తో టేబుల్ బుకింగ్, మరో యాప్ ద్వారా క్యాష్‌లెస్ పేమెంట్స్... అన్నిటినీ ఉపయోగించడం అతనికి సర్వసాధారణం. ప్రతీదానికి ఒక్కో యాప్ చొప్పు ఉపయోగించడం ఓ టైంలో అతనికి చిరాకొచ్చేసింది. అన్ని అవసరాల కోసం ఒకే యాప్‌ను తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా రాహుల్ మనసులో పుట్టిన ఆలోచనే క్లోజర్.


కె ఆర్ రాహుల్, క్లోజర్ వ్యవస్థాపకుడు -సిఈఓ

కె ఆర్ రాహుల్, క్లోజర్ వ్యవస్థాపకుడు -సిఈఓ


తక్కువ పెట్టుబడితో అవసరమయ్యే స్టార్టప్ కంపెనీలకు సహాయం చేసేందుకు... నిర్మాణ్ పేరుతో ఐఐటీ మద్రాస్ ఓ కార్యక్రమం చేపడుతోంది. ఐఐటీఎం తగిన సహాయం, కార్యాలయ నిర్వహణకు తగిన స్థలం, కొంత పెట్టుబడి, నెట్వర్కింగ్ వంటి విషయాల్లో క్లోజర్‌కు సహాయ పడ్తోంది కూడా. ప్రస్తుతం కొత్త పెట్టుబడుల కోసం అన్వేషణ కూడా జరుగుతోంది.

image


రాహుల్ మాటల్లో క్లోజర్ గురించి -"అన్ని రెస్టారెంట్ల లాయల్టీ కార్డులు, పాయింట్లను నిర్వహించగలిగే ఒకే యాప్ ఇది. ప్రతీ సారీ ఆయా రెస్టారెంట్లను వెళ్లినపుడల్లా.. ఒక క్లిక్‌తో లాయల్టీ పాయింట్లను పొందే అవకాశం ఇస్తుంది క్లోజర్. అదే సమయంలో కొత్త రెస్టారెంట్ల అన్వేషణకూ ఇది సహాయపడుతుంది. మళ్లీ మళ్లీ ఒకే ప్రాంతానికి వెళ్లేవారికి రివార్డులు పొందేందుకు, ఉపయోగించుకునేందుకు సహాయపడుతుంది. ప్రస్తుతానికి మేం కేవలం రెస్టారెంట్ల పైనే దృష్టి పెట్టాం. త్వరలో స్పాలు, సెలూన్లు, బోటిక్స్ వంటి ఇతర రంగాలకూ విస్తరించేందుకు ప్రయత్నిస్తాం. చిన్న, మధ్య తరహా వ్యాపారాల విషయంలో టేబుల్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం వంటివి ఇంకా అభివృద్ధి చెందలేదు. ఈలోటును భర్తీ చేయనుంది క్లోజర్. అలాగే అదే రంగాల్లో ఉన్న ఇతర సంస్థల వివరాలు, కేష్‌లెస్ పేమెంట్స్ పైనా దృష్టి పెట్టాం."

"మేం బీ2బీ(బిజినెస్ టూ బిజినెస్), బీ2సీ(బిజినెస్ టూ కస్టమర్).. రెండు రంగాల్లోనూ ఉండే సంస్థ మాది. మా ప్లాట్‌ఫాంపై ఉన్న రెస్టారెంట్లే అసలు కస్టమర్లు మాకు. ముందుగా మేం చెన్నైలోని అన్ని రెస్టారెంట్లను సందర్శించి, క్లోజర్ గురించి వివరణ ఇవ్వాల్సి ఉంది. క్లోజర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్లకు అదనపు ఉపయోగం ఉంటుందని ఒప్పించాలి. దీంతో రెస్టారెంట్లకి వచ్చే కస్టమర్ల పెరుగుతందని వారికి తెలియచెప్పాలి. మొదట్లో కస్టంగా ఉన్నా.. ఇప్పుడు కొత్త రెస్టారెంట్లను మా నెట్వర్క్‌లోకి తెచ్చుకోవడం కొంత సులభంగానే ఉంది."-రాహుల్

“ ఎవరికీ అభ్యంతరం లేకుండా... లావాదేవీల వివరాలు సేకరించడం మా వ్యాపార విధానంలో చాలా కీలకం. ఇది ఆయా వ్యక్తుల వివరాలు, అలవాట్లు, అభిరుచులను మేం తెలుసుకోడానికి ఉపయోగపడ్తుంది. వీటిని విశ్లేషించడం చాలా ముఖ్యం కూడా. కస్టమర్లకు ఇష్టమైన ఫుడ్ ఏది? దానికోసం వారెంత ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ? ఏ తరహా రెస్టారెంట్లలో ఎంత వెచ్చిస్తున్నారో తెలుసుకోవచ్చు. అలాగే ఆయా రెస్టారెంట్ల వ్యక్తులకు కూడా కస్టమర్లను అర్ధం చేసుకునే అవకాశం చిక్కుతుంది. అతి పెద్ద డేటా నెట్వర్క్‌లోకి చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా ప్రవేశించి, వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఆస్కారం లభిస్తుందం"టారు రాహుల్.

image


క్లోజర్ టీం తయారైందిలా

ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతండగా క్లోజర్‌ను మొదలుపెట్టారు రాహుల్. గతంలో పేపర్ కట్ అడ్వర్‌టైజ్‌మెంట్ల కాన్సెప్ట్‌తో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు. అయితే దానికి తగిన టీం లభించలేదు. అదే సమయంలో పూర్తి స్థాయిలో దాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేకపోవడంతో అది విఫలమైంది. క్లోజర్ విషయంలో మాత్రం టీం లభించింది. గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దీనికోసం 14మంది పని చేస్తున్నారు. ఇందులో ఆరుగురు ముఖ్యసభ్యులు. వారు రాహుల్, సాయి ప్రవీణ్, శ్రేయాస్ మోహన్, క్రిష్ణ కిరీటి, దరిశా రోహిత్, గురు ప్రసాద్‌లు. మొదటి స్టార్టప్ ఫెయిల్ కావడంతో... ఆలోచన కంటే టీం చాలా ముఖ్యమని తెలుసుకున్నానంటారు రాహుల్. “ఈసారి క్యాంపస్‌లో సహ విద్యార్ధులతో కొన్ని నెలలపాటు సమయం వెచ్చించాను. టీం సభ్యులను ఎంచుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. సి-టైడ్స్‌కు పబ్లిసిటీ హెడ్‌గాను, ఐఐటీఎంలో ఈ-సెల్ నిర్వహించడం ద్వారానూ.. నాకు విద్యార్ధులతో అనుబంధం ఎక్కువగా ఉండేది. దీంతో స్టార్టప్‌లలో చేరే వారిని తెలుసుకోవడం మరింత సులభమైంది నాకు” అంటారు రాహుల్.

SMEల కోసం SMS

" మొదట మేం చెన్నైలోని 20 రెస్టారెంట్లతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాం. ప్రతీ నెలా ఈ సంఖ్య కనీసం 50 చొప్పున పెంచాలన్నది లక్ష్యం. మేం కాంటాక్ట్ చేసిన వాళ్లలో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. దీనికి కారణం వ్యాపారరంగానికి అవసరమైవేంటో మేం నెలల పాటు రీసెర్చ్ చేశాం. అతి తేలికైన ప్లాట్‌ఫాం ద్వారా... ఇటు కస్టమర్లు, అటు వ్యాపారులు లాభపడాలన్నదే మా టార్గెట్. ఇదే రంగంలోని ఇతర సంస్థల మాదిరిగా... వ్యాపారులు ఐప్యాడ్స్ కానీ, క్యూఆర్ రీడర్లు గానీ ప్రత్యేకంగా మెయిన్‌టైన్ చెయ్యక్కర్లేదు. ఆఖరికి ఆయా వ్యాపారులకు కంప్యూటర్ ఉన్నా, లేకపోయినా సరే.. క్లోజర్‌తో కనెక్ట్ అవచ్చు. దీనికి తగినట్లుగా... ఎస్ఎంఎస్ బేస్డ్ మోడల్ కూడా మా దగ్గర ఉంది."- రాహుల్

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇప్పటికి క్లోజర్ యాప్‌ని దాదాపు 5వేల మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కాలేజ్‌లలోనూ, కమ్యూనిటీ హాల్స్ వంటి ప్లేస్‌లలో కేంపెయిన్ చేస్తోంది క్లోజర్ టీం. “ రెస్టారెంట్లు కూడా మాకు పబ్లిసిటీ ఇస్తున్నాయి. లాయల్టీ పార్ట్‌నర్ అంటూ తమ భాగస్వామిగా గుర్తింపునిస్తున్నాయి. దీని ద్వారా క్లోజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేందుకు పలువురు మొగ్గు చూపుతున్నారు.” -రాహుల్

స్టార్టప్‌లో అందరూ స్టూడెంట్సే

క్లోజర్‌లో ఉన్న టీం అందరూ ఐఐటీ-మద్రాస్ విద్యార్ధులే. ఈ స్టార్టప్ సంస్థ కార్యకలాపాలు చూడ్డమే కాదు.. వారి విద్యాభ్యాసాన్ని కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు వారు. రెండో దఫా నిధుల సేకరణను దిగ్విజయంగా పూర్తి చేయగలగితే... వెంచర్ సక్సెస్ అయినట్లే. అదే సమయంలో ఈవిషయంలో కాలేజ్ కూడా వారికి కొంతవరకూ సాయం చేస్తోంది.

ప్రస్తుతం క్లోజర్ ప్రవేశిస్తున్న రంగంలో ఇప్పటికే జొమాటో, ఫుడ్ పండా, జస్ట్ఈట్, బుక్ యువర్ టేబుల్ వంటి అనేక సంస్థలు పాతుకుపోయాయి. వారిని కాదని.. కస్టమర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు క్లోజర్ వైపు మారడం అంత సులభమైన విషయమేం కాదు. అయినా సరే ఆ స్థాయిలోనే కష్టపడ్డానికి వారు సిద్ధంగానే ఉన్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags