సంకలనాలు
Telugu

మీ స్టార్ట‌ప్ స‌క్సెస్ కావాలా..? అయితే ఈ గేమ్ ఆడండి..!!

RAKESH
25th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ముందుగా మూడు విష‌యాలు..

క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఆడినంత మాత్రాన గొప్ప ఆంట్ర‌ప్రెన్యూర్ అయిపోలేరు!

క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్ కి నేనో పెద్ద ఫ్యాన్

మీకూ ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంద‌ని భావిస్తున్నా

ఇక మ్యాటర్ లోకి వద్దాం.. నాలుగేళ్ల కిందట‌ కొత్త ఐఫోన్ కొనుక్కున్నా. యాప్ స్టోర్ లో ఫ్రీ గేమ్స్ కోసం వెతికితే ఈ క్లాష్ ఆఫ్ క్లాన్స్ క‌నిపించింది. బాగుంది క‌దా అని డౌన్ లోడ్ చేశాను. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మై ప్రోమోవీడియోస్ అనే కంపెనీ స్టార్ట్ చేశాం. ఇంత‌కీ క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్ కి, నా కంపెనీకి సంబంధం ఏంటి? ఉంది. అక్కడికే వ‌స్తున్నా!

క్యాబిన్ లో కూర్చొని మొబైల్ లో క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఆడిన‌ప్పుడ‌ల్లా నాకు ఒక‌టే అనిపిస్తుంది. ఆఫీసు సిట్యువేష‌న్స్ కి, ఈ గేమ్ కి చాలా విష‌యాల్లో సారూప్య‌త ఉంద‌ని! అందుకే చాలా మంది ఆంట్ర‌ప్రెన్యూర్లు ఈ గేమ్ ఆడ‌తార‌ని! దట్ ఈజ్ ట్రూ!

image


స‌క్సెస్ ఫుల్ స్టార్ట‌ప్ కోసం నాదొక స‌ల‌హా..

క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఫ‌స్ట్ లెవెల్ ఓపెన్ చేస్తే ఒక చిన్న గుడిసె క‌నిపిస్తుంది. కొన్ని ఫ్రీ జెమ్స్ వ‌స్తాయి. అవే మీ పెట్టుబ‌డి. వాటితోనే ఆట మొద‌లెట్టాలి! సువిశాల‌మైన క్లాన్ ప్రపంచంలో మీది ఒంట‌రి పోరాటం. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఎదురొచ్చిన శ‌త్రువుల్ని చీల్చి చెండాడాలి. బ‌ట్ బీ కేర్ ఫుల్! ఎప్పుడు ఎట్నుంచి అయినా మీపై దాడి జ‌ర‌గొచ్చు సుమీ!

ఫ‌స్ట్ లెవెల్ ఈజీగానే ఉంటుంది. హాయిగా ఆడేయొచ్చు. క్లాన్స్ ని స్మాష్ చేస్తున్న‌కొద్దీ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆ త‌ర్వాతి లెవెల్స్ లోనే ఉంటుంది అస‌లు మ‌జా!

లెవెల్ పెరుగుతుంటే ప్రెష‌ర్ పెరుగుతుంది. ప‌వ‌ర్ త‌గ్గిపోతుంది. నిరాశ‌లో డీ మోటివేట్ అయిపోతుంటాం. పెద్ద పెద్ద గ్రామాల్లోని ఫ్యాన్సీ ట్రూప్స్ మ‌న‌మీద దండెత్తి వ‌స్తుంటాయి. వారిని ఎదుర్కోవాలంటే మెచ్యూరిటీ కంప‌ల్స‌రీ! లేదంటే శ‌త్రువుల చేతిలో చిత్త‌యిపోవ‌డం ఖాయం!

ఈ గేమ్ లో అంద‌రూ చేసే కామ‌న్ మిస్టేక్ ఒక‌టుంది. కేవ‌లం త‌మ విలేజ్ ను అప్ గ్రేడ్ చేసుకొని త‌ర్వాతి లెవెల్ కి వెళ్లిపోతుంటారు. సైన్యాన్ని బ‌లోపేతం (అప్ గ్రేడ్) చేయాల‌న్న స్పృహ ఉండ‌దు. అందుకు రెండు కారాణాలు! ఒక‌టి- సైన్యం స‌త్తాని గుర్తించ‌క‌పోవ‌డం! రెండు- అర్జెంటు గా అప్ గ్రేడ్ చేయాల‌న్న ఆలోచ‌న లేక‌పోవ‌డం! స‌రిగ్గా నేనూ ఇవే త‌ప్పులు చేశాను. అందుకు ఫ‌లితం అనుభ‌వించాను. నెక్స్ట్ లెవెల్స్ లో నా సైన్యంపై భీక‌ర‌ దాడులు జరిగాయి. ఒక్కటంటే ఒక్క దాడిలో కూడా నేను విజ‌యం సాధించ‌లేక‌పోయాను.

పైన చెప్పిన‌ట్టు ఈ పాటికే మీకు అర్థ‌మై ఉంటుంది! స్టార్ట‌ప్ ను స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించ‌డానికి ఈ గేమ్ ఎక్స్ పీరియెన్స్ ఎంతో ఉప‌యోగ‌పడుతుంది. బిజినెస్ అంటేనే ఒక ఛాలెంజ్. ఆ దారిలో రాళ్లూ ముళ్లూ కామ‌న్. వాటిని ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాలి. గేమ్ ప‌రిభాష‌లో చెప్పాలంటే అప్ గ్రేడ్ కావాలి. ఒక్క‌సారి అడుగు ముందుకేస్తే మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూసుకోవ‌ద్దు. అలాగ‌ని అవ‌స‌రం లేకున్నా ఉద్యోగుల‌ను నియ‌మించుకొని, ఔట్ లెట్లు తెర‌వ‌డం వంటి తొంద‌ర‌పాటు ప‌నులు మంచిది కాదు. ఏదైనా స‌రే అవ‌స‌రాన్నిబ‌ట్టే చేయాలి.

టీం ఎప్ప‌డూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి..

క్లాష్ ఆఫ్ క్లాన్స్ లో ముందుగా మీకంటూ ఒక క్లాన్ (బృందం) ఏర్పాటు చేసుకోవాలి. ఆ త‌ర్వాతే శ‌త్రువుల‌పై దాడికి దిగాలి. యుద్ధ నైపుణ్యం, స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌, ట్రూప్స్ మ‌ధ్య కో ఆర్డినేష‌న్ ఉంటే త‌ప్ప విజ‌యం సాధించ‌లేరు. సైన్యంలో చైత‌న్యం ర‌గిలించే ఒక లీడ‌ర్, కో లీడ‌ర్ కూడా అంతే అవ‌స‌రం. లీడ‌ర్ అనే వాడు త‌న బృందాన్ని స‌రిగ్గా గైడ్ చేయాలి. సైనికులెవ‌రైనా త‌ప్పు చేస్తే వార్నింగ్ ఇవ్వాలి. విన‌క‌పోతే నిర్మొహ‌మాటంగా తీసి ప‌క్క‌న పెట్టేంత గ‌ట్స్ కావాలి.

గేమ్ అయినా స్టార్ట‌ప్ అయినా ఒక‌టే లాజిక్! మీ సైన్యం పోరాడ‌లేదంటే మీరు ఓడిపోయిన‌ట్టే లెక్క‌! దీన్ని బ‌ట్టి మీరొక్క‌రు స్ట్రాంగ్ ఉంటే స‌రిపోదు. మీ టీం కూడా అంతే బ‌లంగా ఉండాలి. ఏదో ఒక రోజు మీ బాధ్య‌త‌ల‌ను పంచుకునే టైం వ‌స్తుంది. అందుకోసం క‌త్తి లాంటి టీమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఏ కంపెనీ అయినా.. గుడ్ టీమ్ ఉంటే విజ‌య తీరాల‌కు చేరుతుంది. అదే బ్యాడ్ టీంను న‌మ్ముకుంటే న‌ట్టేట మునుగుతుంది.

దేనికైనా ప్లానింగ్ ఉండాలి గురూ..

ప్ర‌తీ ప‌నికి ఒక పర్ప‌స్ అంటూ ఉంటుంది. కొన్ని డ‌బ్బు కోసం చేస్తే, ఇంకొన్ని పేరు కోసం! ఒక్కోసారి రెండూ కావొచ్చు. కాబ‌ట్టి మీ ప్రియారిటీస్ మీకుండాలి. ఎక్క‌డి నుంచి ఎలా మొద‌లు పెట్టాలో తెలుసుకోవాలి. అందుకోసం ప్ర‌ణాళిక‌లు వేసుకోవాలి. ప‌ర్ ఫెక్ట్ టీంను త‌యారు చేసుకోవ‌డం చాలా ముఖ్యం. ఈ గేమ్ నేర్పే పాఠం ఒక‌టే. వార్ అండ్ విన్! అందులో కొంద‌రు ఫెయిల్ అవుతుంటారు. మ‌రికొంద‌రు స‌క్సెస్ చూస్తారు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే నేర్పు ఆంట్ర‌ప్రెన్యూర్ కు అవ‌స‌రం. అన్నింటికీ మించి అన్నీ సాధించేశాన‌న్న‌ భ్ర‌మ‌ల్లో బ‌త‌కొద్దు. మీ కాళ్లెప్పుడూ నేల మీదే ఉన్నాయ‌న్న ఫీలింగ్ తో ప‌నిచేయండి. టైం, మ‌నీ జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేయండి. అవే మిమ్మ‌ల్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుస్తాయి!

ర‌చ‌యిత‌: అనిల్ కుమార్

(నోట్: ఈ క‌థ‌నంలో పేర్కొన్న‌వి కేవలం ర‌చ‌యిత అభిప్రాయాలు మాత్రమే. వాటిని యువ‌ర్ స్టోరీ ఒపీనియన్ గా భావించవద్దు)

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags