సంకలనాలు
Telugu

హాబీతో మొద‌లై.. కోట్ల ట‌ర్న‌వ‌ర్‌కు ఎదిగిన గ్రీన్‌కార్పెట్‌..

- దేశ్యాప్తంగా గార్డెనింగ్ బిజినెస్‌ నిర్వ‌హిస్తున్న గ్రీన్‌కార్పెట్‌- ప‌లు న‌గ‌రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్‌ను నిర్వ‌హిస్తున్న మైనా- విదేశీ ప్రాడ‌క్ట్‌ల‌ను విక్ర‌యిస్తున్న గ్రీన్‌కార్పెట్‌..- వివిధ న‌గ‌రాల్లో స‌రైన పార్ట్‌న‌ర్‌ల కోసం అన్వేష‌ణ‌..

GOPAL
7th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆస‌క్తి ఉండాలే కానీ.. వ్యాపారం చిన్న‌దైనా కోట్లు కురిపిస్తుంది. అనుభ‌వం లేక‌పోయినా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. అలాంటిదే బెంగ‌ళూరుకు చెందిన గ్రీన్‌కార్పెట్ సంస్థ‌. 13 ఏళ్ల క్రితం హాబీగా మొద‌లైన బిజినెస్ ఇప్పుడు కోట్లాది రూపాయ‌ల‌ను ఆర్జించిపెడుతున్న సంస్థ‌గా మారిపోయింది..

ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టుల‌లో అడుగుపెడితే చాలు ఆకుప‌చ్చ‌టి కార్పెట్లు స్వాగ‌తం ప‌లుకుతూ ఉంటాయి. అప్ప‌టివ‌ర‌కు బిజీ రోడ్ల‌పై ప‌రుగులు పెడుతూ వ‌చ్చిన ప్ర‌యాణీకుల‌కు ఎయిర్‌పోర్టులో దిగిన‌వెంట‌నే ప్ర‌కృతి త‌ల్లి ఒడికి వ‌చ్చిన‌ట్టే అనిపిస్తుంది. అందుకు కార‌ణం ఎయిర్‌పోర్టుల‌లోని ల్యాండ్‌స్కేపే. ఈ ల్యాండ్‌స్కేప్‌ను నిర్వ‌హిస్తున్న‌ది బెంగ‌ళూరుకు చెందిన గ్రీన్ కార్పెట్ సంస్థ‌.

అన్ని ర‌కాల గార్డెనింగ్‌కు సొల్యూష‌న్‌గా మారింది గ్రీన్‌కార్పెట్‌. మొక్క‌ల‌ను పెట్టుకునేందుకు అంద‌మైన కుండీలు, కార్యాల‌యాల్లో వివిధ ర‌కాలైన గార్డెనింగ్ ఆకృతులు అందించ‌డంతోపాటు గార్డెన్ ఫ‌ర్నీచ‌ర్‌, గార్డెన్ యాక్స‌స‌రీస్‌కు పూర్తిస్థాయి సొల్యూష‌న్స్ ఈ గ్రీన్‌కార్పెట్. ఈ గ్రీన్‌కార్పెట్‌ను 2002లో మైనా బ‌ట‌వియా ప్రారంభించారు. 2002కు ముందు హెచ్ఆర్ సంస్థ‌ను న‌డిపిన మైనా.. పాప పుట్ట‌డంతో ఇంటిప‌ట్టునే ఉండాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క ఆస‌క్తిని గార్డెనింగ్‌వైపు మ‌ళ్లించారు.. స్నేహితుల‌కు, తెలిసిన‌వారికి గార్డెనింగ్‌లో సాయం చేసేవారు. అంత‌కుముందు హార్టిక‌ల్చ‌ర్‌లో ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా, గార్డెనింగ్‌పై మ‌క్కువే ఆమెను ఆ కెరీర్‌ను ఎంచుకునేలా చేసింది.

గ్రీన్‌కార్పెట్ వ్య‌వ‌స్థాప‌కురాలు మైనా బ‌టావియా

గ్రీన్‌కార్పెట్ వ్య‌వ‌స్థాప‌కురాలు మైనా బ‌టావియా


2002లో సంస్థ‌ను ప్రారంభించిన స‌మ‌యంలో క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌ను నిర్వహించారు. గార్డెన్‌, ల్యాండ్ స్కేప్‌ను ఏర్పాటు చేసుకునేందుకు క‌స్ట‌మ‌ర్ల‌కు సాయంచేసేవారు మైనా. ఐతే ఓ ట్రేడ్ ఫెయిర్‌లో రెండు జ‌ర్మ‌న్‌ కంపెనీల‌తో ములాఖ‌త్ ఆమె గ‌మ్యాన్ని మార్చేసింది. ఆ త‌ర్వాత అత్యుత్త‌మ నాణ్య‌త క‌లిగిన గార్డెనింగ్ కుండీలను విక్ర‌యించ‌డం కూడా మొద‌లుపెట్టారు. అంత‌కుముందు కేవ‌లం ప్లాంట్ల బిజినెస్‌ మాత్ర‌మే చేసిన గ్రీన్‌కార్పెట్‌, మొక్క‌ల‌కు సంబంధించిన తొట్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది.

"రెండు జ‌ర్మ‌నీ కంపెనీల‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రాడ‌క్ట్స్ బిజినెస్‌లోకి వ్యాపారాన్ని విస్తృత ప‌ర్చాల్సిన అవ‌సరం ఏర్ప‌డింది. 2006 నుంచి దేశ‌వ్యాప్తంగా సేవ‌ల‌ను అందిస్తున్నాను" అని మైనా వివ‌రించారు. ఇప్పుడు గ్రీన్‌కార్పెట్‌కు దేశ‌వ్యాప్తంగా B2B క్ల‌యింట్స్ ఉన్నారు. ఆర్కిటెక్ట్స్‌, ల్యాండ్‌స్కేప్ క‌న్స‌ల్టెంట్స్‌, కార్పొరేట్స్‌తో క‌లిసి మైనా ప‌నిచేస్తున్నారు. బెంగ‌ళూరులో ఓ షోరూం కూడా ఏర్పాటు చేశారు.

"బెంగ‌ళూరులో ఉన్న‌ది ఓ స్టూడియోలాంటింది. చాలామంది ప్ర‌జ‌లు ఈ స్టూడియోను సంద‌ర్శించి, ప్రాడక్ట్‌ల‌ను చూసి, ఆ త‌ర్వాత కొనుగోలు చేస్తుంటారు" అని మైనా వివ‌రించారు.

వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఏర్పాటైన పెద్ద పూల కుండీలు

వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఏర్పాటైన పెద్ద పూల కుండీలు


జ‌ర్మ‌న్ కంపెనీల‌తో ఒప్పందం కుదుర్చుకున్న త‌ర్వాత త‌న వ్యాపారాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు మైనా చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేది. తొలి 6-8 నెల‌లు ఈ విదేశీ ప్రాడ‌క్ట్స్‌కు అంత‌గా డిమాండ్ ఉండేది కాదు. ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టం, సరైన అవగాహన లేకపోవడంతో ఎవ‌రూ జ‌ర్మ‌న్ ప్రాడ‌క్ట్‌ల‌ను కొనుగోలు చేసేవారు కాదు. కానీ ప్ర‌స్తుతం గ్రీన్‌కార్పెట్ రెవెన్యూ ఏటా 1.5 కోట్ల రూపాయ‌ల‌కు పైమాటే. ప్ర‌తియేటా 20 నుంచి 22 శాతం వృద్ధి కూడా ఉంటోంది. ఎయిర్‌పోర్టుల‌తోపాటు బిల్డ‌ర్లు, హోట‌ల్స్‌, రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్‌లకు మైనా గార్డెనింగ్ ప్రాడ‌క్ట్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.

"అప్ప‌టివ‌ర‌కు లేన‌టువంటి, అంత‌వ‌ర‌కు గుర్తింపులేని రంగంలో అడుగుపెట్ట‌డం కార‌ణంగా మార్కెట్‌ను ఆరంభంలో స‌రిగా అంచ‌నా వేయ‌లేక‌పోయం. గార్డెనింగ్ బిజినెస్ అమ్మ‌క‌పు ప‌న్ను విభాగంలోకి రాక‌పోయినా మేము ఎప్ప‌టిక‌ప్పుడు సేల్స్ టాక్స్ క‌డుతుంటాం. గార్డెన్ స్టోర్‌లో ఏం దొరుకుతాయో తెలిసేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టింది. మాది మొక్క‌ల‌ను విక్ర‌యించే సంస్థ‌, ల్యాండ్‌స్కేప్ క‌న్స‌ల్టెన్సీ అని చాలామంది భావించేవారు" అని ఆమె వివ‌రించారు.

జ‌ర్మ‌నీ, ఇట‌లీ, ఇండోనేసియా, వియాత్నం, థాయిలాండ్ దేశాల నుంచి వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకుని భార‌త్‌లో విక్ర‌యిస్తుంది గ్రీన్‌కార్పెట్‌. ఈ వ‌స్తువుల‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దేశ‌వ్యాప్తంగా ఈ ప్రాడ‌క్ట్స్‌ను అమ్మేందుకు చాలా అవకాశాలున్నాయ‌ని మైనా చెప్తుంటారు. సొంతంగా త‌యారు చేసుకునే కంటే ఈ వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డ‌మే సుల‌భ‌మ‌ని ఆమె అభిప్రాయం.

"ఉత్పాద‌న రంగంలోకి వెళ్లాల‌ని అనుకోవ‌డం లేదు. అది మ‌రో ర‌క‌మైన వ్యాపారం. దాన్ని న‌డ‌పాలంటే చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వ్యాపారంపై నాకు ఆస‌క్తిలేదు. మూల‌ధ‌నం కూడా చాలా కావాలి. నిజం చెప్పాలంటే నా కుటుంబంతో గ‌డిపేందుకు నాకు స‌మ‌యం కావాలి. ఉత్పాద‌న రంగంలో అది సాధ్యం కాదు* అని మైనా వివ‌రించారు. క్ల‌యింట్లు డిమాండ్ చేసిన‌విధంగా ప్రాడ‌క్ట్స్‌ను ఆమె దిగుమ‌తి చేసుకుంటూ ఉంటారు.

మెట్రో న‌గ‌రాలే టార్గెట్‌..

గ్రీన్‌కార్పెట్‌కు ముంబై, ఢిల్లీ న‌గ‌రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ న‌గ‌రాల్లో చాలా కార్పొరేట్ కంపెనీలు, ఆర్కిటెక్ట్స్‌తో గ్రీన్‌కార్పెట్ ఒప్పందం చేసుకొంది. దేశ‌వ్యాప్తంగా సేవ‌లందించేందుకు ముందుకొచ్చిన‌ప్ప‌టికీ ఈ సంస్థ దృష్టి ప్ర‌ధానంగా మెట్రో న‌గ‌రాల‌పైనే. ఇప్పుడు ద్వితీయ‌, తృతీయ‌శ్రేణీ న‌గ‌రాల‌కు కూడా త‌న బిజినెస్‌ను విస్త‌రించాల‌ని మైనా భావిస్తున్నారు. మొక్క‌ల‌ను, విదేశీ ప్రాడ‌క్ట్స్‌ల‌ను కొనేందుకు క‌స్ట‌మ‌ర్లు చిన్న న‌గ‌రాల నుంచి కూడా వ‌స్తుండ‌టంతో ఆమె సంస్థ‌ను విస్త‌రించ‌డంపై ఆలోచ‌న చేస్తున్నారు.


గ్రీన్‌కార్పెట్ విక్ర‌యిస్తున్న అంద‌మైన తొట్లు

గ్రీన్‌కార్పెట్ విక్ర‌యిస్తున్న అంద‌మైన తొట్లు


భాగస్వాముల అన్వేషణ

సంస్థ‌ను విస్త‌రించాల‌నుకుంటున్న మైనా.. స‌రైన భాగ‌స్వాముల కో్సం వెతుకుతున్నారు. మెట్రో న‌గ‌రాల్లోనే కాకుండా ఇత‌ర న‌గ‌రాల్లో గ్రీన్ కార్పెట్ వ‌స్తువుల‌ను విక్ర‌యించేందుకు ముందుకొచ్చేవారికి డీల‌ర్‌షిప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారామె. ఐతే చెన్నైతోపాటు నార్త్ ఈస్ట్ రీజియ‌న్‌లో వాతావ‌ర‌ణం గార్డెనింగ్‌కు అనుకూలంగా లేక‌పోవ‌డం కార‌ణంగా ఆ న‌గ‌రాల్లో వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని ఆమె భావించ‌డంలేదు. ప్ర‌జా సంబంధాల ఆధారంగానే గ్రీన్ కార్పెట్ వ్యాపారం నిర్వ‌హిస్తున్న‌ది. 

image


ప‌త్రిక‌ల్లో ఆర్టికల్స్‌..

గార్డెనింగ్ వ్యాపారంలో మంచి అనుభ‌వం సంపాదించిన మైనా ఇప్పుడు.. ఇప్పుడు త‌న అనుభ‌వాల‌ను ఇత‌రుల‌తో పంచుకుంటున్నారు. ప‌త్రిక‌ల‌కు, మేగ‌జైన్ల‌కు ఆర్టిక‌ల్స్ రాస్తూ గార్డెనింగ్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌మ కంపెనీ ఎలాంటి సేవ‌లు అందిస్తుందో కూడా వివ‌రిస్తున్నారు.

చాలా న‌గ‌రాల్లో ఇత‌రుల‌తో క‌లిసి బిజినెస్ చేస్తుండటంతో గ్రీన్‌కార్పెట్‌లో ఉద్యోగుల సంఖ్య ప‌రిమిత‌మే. కేవ‌లం 10 మంది మాత్ర‌మే ప‌నిచేస్తున్నారు. వీరి జాబ్‌ల‌ను కూడా మైనా అప్పుడ‌ప్పుడు మారుస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక్క రంగానికే ప‌రిమితం కాకుండా, అంద‌రూ అన్నీ నేర్చుకుంటార‌ని మైనా చెప్తారు. పెద్ద డిగ్రీలు, అనుభ‌వం ఉన్న వారిని కాకుండా, గార్డెనింగ్‌పై ఆస‌క్తి ఉన్న వారిని మాత్ర‌మే తాను ఉద్యోగులుగా నియ‌మించుకున్నాన‌ని ఆమె వివ‌రించారు. "నా ద‌గ్గ‌ర ప‌నిచేసేవారిని నేను ప్ర‌శంసిస్తూ ఉంటే వారు మ‌రింత నేర్చుకుంటారు. హోదాలు, డిజిగ్నేష‌న్స్‌, వ‌ర్క్ ఎన్విరాన్‌మెంట్ వంటివి ఈ బిజినెస్‌లో కుద‌ర‌వు. పెద్ద డిగ్రీలు ఉన్న‌వారికి ఇవి కావాలి. నేర్చుకోవ‌డానికి ఇక్క‌డ ఎన్నో విష‌యాలున్నాయి. సంస్థ కోసం ప‌నిచేస్తూనే ఎన్నో నేర్చుకోవ‌చ్చు. సేల్స్‌, షోరూం మార్కెటింగ్‌, వేర్‌హౌజింగ్‌, ఇన్వెంట‌రీ మేనేజ్‌మెంట్‌.. ఇలా అన్ని రంగాల్లోనూ అనుభ‌వం సాధించొచ్చు" అని మైనా వివ‌రించారు. ఇలా ప‌ర్యావ‌ర‌ణాన్ని పెంచ‌డంతోపాటు న‌లుగురికి జీవ‌నోపాధి క‌లిపిస్తున్న మైనా భ‌విష్య‌త్ మ‌రింత ప‌చ్చ‌గా ఉండాల‌ని కోరుకుందాం..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags