సంకలనాలు
Telugu

ఆన్‌లైన్ షాపింగ్‌లో బిల్లు ఆదా చేసే నేస్తం డిస్కౌంట్‌మీ

ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి డిస్కౌంట్ కూపన్ గురూగా మారిన ‘డిస్కౌంట్ మీ’ 120 ఆన్‌లైన్ స్టోర్లకు సంబంధించిన డిస్కౌంట్ కూపన్లు ఈ యాప్‌లో కనిపిస్తాయిరోజువారీ స్టోర్స్ అందించే ఆఫర్లతో పాటు, ఎక్కువ డిమాండ్ ఉన్న కూపన్లను ప్రత్యేకంగా డిస్‌ప్లే

28th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
image


ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు.. మాంచి డీల్ కోసం ఎదురుచూడ్డం మామూలే. అయితే.. చాలాసార్లు సరైన కూపన్, ప్రోమో కోడ్స్ వెతకడంలో ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. కొన్నిసార్లు ఈ కోడ్స్ వెతకడానికి చాలా టైం పట్టేస్తుంది. చిరాకు తెప్పిస్తుంది కూడా.

మనకు అవసరమైన, తగిన, లైవ్‌లో ఉన్న కూపన్లను వెతకడం కష్టమైన విషయమే. దీంతో చాలాసార్లు కొనుగోలుదారులు వారి లావాదేవీలను ఎలాంటి కూపన్స్ ఉపయోగించకుండానే పూర్తి చేసేస్తుంటారు. ఆఫర్లను పట్టించుకోవడం కూడా మానేస్తుంటారు. ఇది వారికి చాలా నష్టం కలిగించే విషయం అని అర్ధం చేసుకోరు.

కస్టమర్లకు కలుగుతున్న ఈ కష్టాన్ని చూసిన చేసిన ప్రయణ్ ఎయిరన్‌కు ఓ ఆలోచన వచ్చింది. వీళ్లందరి కోసం తనే ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయొద్దని అనిపించింది. అంతే ‘డిస్కౌంట్‌మీ’ ని ప్రారంభించారు. ఇది డిస్కాంట్ కూపన్స్, ఆఫర్లను లిస్టింగ్ చేసే ఒక యాప్.

image


ఏమిటీ ‘డిస్కౌంట్‌మీ’

డిస్కౌంట్ మీ యాప్ ద్వారా దేశంలోని అనేక ఆన్‌లైన్ స్టోర్స్ అందిస్తున్న 10వేలకు పైగా కూపన్స్, ఆఫర్లను చేతివేళ్లమీదే జల్లెడపట్టచ్చు. ఆన్‌లైన్ కొనుగోళ్లకు బిల్లులు చెల్లించేవారిలో మెజారిటీ మందికి ఉపయోగంగా ఉండేదే ఈ డిస్కౌంట్ మీ యాప్.

ఫ్లిప్‌కార్ట్, మింత్ర, జబాంగ్, మేక్ మై ట్రిప్ సహా.. 120 ఆన్‌లైన్ స్టోర్లకు సంబంధించిన డిస్కౌంట్ కూపన్లు ఈ యాప్‌లో కనిపిస్తాయి. ట్రావెల్, లైఫ్‌స్టైల్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్, ఇలా 40 పైగా కేటగిరీల్లో వీటిని సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్ కూపన్లకూ ప్రత్యేక కేటగిరీ ఉండడం హైలైట్.

స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను తేలిగ్గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కేవలం 3.3ఎంబీ సైజ్ ఉండడం, ఆండ్రాయిడ్ 2.3.3(జింజర్ బోర్డ్) నుంచి అన్ని రకాల ఆండ్రాయిడ్ వెర్షన్లపైనా పని చేస్తుంది. తమకు కావలసిన కూపన్ల వివరాలను నేరుగా యాప్‌లోంచే హెల్ప్ ద్వారా అడగొచ్చు. అదే సమయంలో ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వొచ్చు. ఫేవరేట్ స్టోర్లను సేవ్ చేసుకోవడం ద్వారా.. వారిచ్చే కూపన్లను యాప్‌లోని హోమ్ స్క్రీన్ పైనే చూడొచ్చు.

డిస్కౌంట్ మీలో ఉండే మరో అదనపు ఫీచర్ హాట్ కూపన్స్. రోజువారీగా స్టోర్స్ అందించే ఆఫర్లతో పాటు, ఎక్కువగా డిమాండ్ ఉన్న కూపన్లను ప్రత్యేకంగా డిస్‌ప్లే చేస్తారు. ఈ యాప్ ప్రస్తతం 27కూపన్స్.కాం ఏపీఐ ద్వారా లిస్టింగ్ అవుతోంది.

ప్రణయ్ ఎయిరన్

ప్రణయ్ ఎయిరన్


కూపన్స్ వెనుక కోడర్

మొబైల్, వెబ్ ఆప్స్‌ను అభివృద్ధి చేసే ఇన్‌ట్యూట్ ఇంజినీర్ ప్రణయ్ ఎయిరన్. ఈయన అభివృద్ధి చేసిన 7యాప్స్ గూగుల్ ప్లేలో లిస్టింగ్ అయ్యాయి. అన్నిటికీ కలిపి లక్షకు పైగా డౌన్‌లోడ్స్ సాధించడం విశేషం.

బెంగళూరు ఆండ్రాయిడ్ యూజర్ గ్రూప్‌నకు ఈయన సహకరిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆండ్రాయిడ్ గ్రూప్. ఆండ్రాయిడ్, మొబైల్ సంబంధిత ఈవెంట్ల నిర్వహణలో వారికి సహకరిస్తున్న ప్రణయ్. బెంగళూర్ ఆండ్రాయిడ్ టీచ్ ప్రోగ్రామ్ ద్వారా 1500 మందికిపైగా స్టూడెంట్లకు ఆండ్రాయిడ్ యాప్స్ అభివృద్ధిపై శిక్షణ ఇచ్చారు ఈయన.


డిస్కౌంట్ మీ ప్లస్‌లు, మైనస్‌లు

వైఫై, త్రీజీల ద్వారా ఉపయోగిస్తే.. ‘డిస్కౌంట్ మీ’ యాప్ వేగంగానే పనిచేస్తోంది. దీనిలోని యూజర్ ఇంటర్‌ఫేజ్ కూడా చాలా సౌకర్యవంతంగానే కాదు... ఉపయోగించేందుకూ తేలికగా ఉంటుంది. దీన్ని రూపొందించేందుకు పడ్డ కష్టం ఈ యాప్ ఫీచర్లను చూస్తే అర్ధమవుతుంది. మనం సెలక్ట్ చేసుకున్న కూపన్ కోడ్‌.. ఆటోమేటిగ్గా క్లిప్‌బోర్డ్‌పై కాపీ అయిపోతుంది.

అయితే సెర్చ్ బార్ కొంత ఇబ్బంది పెట్టేదిగా ఉందని యూజర్లు అంటున్నారు. కొన్నిసార్లు మనకు అవసరమైన రిజల్ట్స్ అందడం లేదు. సరైన కీవర్డ్స్ ఇచ్చినా ఈ సమస్య ఎదురవుతోంది. సెర్చ్ బార్‌పై మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ట్రావెల్ పేరుతో కేటగిరీ ఉన్నా, ఫ్లైట్స్ అని సెర్చ్ చేస్తే రిజల్ట్స్ రాకపోవడం నిరుత్సాహం కలిగించే విషయం.

ఈ యాప్ ఇంకా లొకేషన్ ఆధారితంగా అప్‌డేట్ చేయలేదు. ఇది కూడా కొంత ఇబ్బంది కలిగించే విషయమే.

గూగుల్ ప్లే స్టోర్‌లో డిస్కౌంట్‌మీ యాప్‌కు 4.1/5 రేటింగ్ ఉంది. ఈకామర్స్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఇండియాలోనూ ఈ కల్చర్ బాగా పెరిగింది. అందులోనూ మన దేశ ప్రజలు డిస్కౌంట్ల కోసం ఎదురుచూసే మనస్తత్వం ఉన్నవారు కావడంతో, మనకు ఈ యాప్ ఉపయోగకరమైనదే.

‘డిస్కౌంట్ మీ’ కి ఉన్న యూజర్ ఇంటర్‌ఫేజ్, తేలికగా ఉపయోగించగలిగే లక్షణాలు, మనకు ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చుతాయి.

డిస్కౌంట్ మీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : (https://play.google.com/store/apps/details?id=com.binarybricks.dexterapps.discountme)

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags