సంకలనాలు
Telugu

ఏ బొటిక్ లో ఏముందో వెతికిపెట్టే ‘వైలెట్ స్ట్రీట్’

5th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఒక్కో బొటిక్‌లో ఒక్కో వెరైటీ కాస్ట్యూమ్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చి ఓ సరైన వేదిక కల్పింది వైలెట్ స్ట్రీట్ . ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్ బొటిక్ మార్కెట్ గా అవతరించింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన వైలెట్ స్ట్రీట్ ఇప్పటి వరకూ రెండు సార్టు ఫండ్ రెయిజ్ చేసింది. ఇప్పుడు యాప్ ఫ్లాట్ ఫాంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ నాలుగువేల డౌన్ లోడ్స్ దాటాయి వైలెట్ స్ట్రీట్ ఆండ్రాయిడ్,ఐఓఎస్ యాప్ లు.

image


“హైదరాబాద్‌లో వందల సంఖ్యలో బొటిక్స్ ఉన్నాయి. ఆన్ లైన్‌లో ఆ బొటిక్స్‌లో దొరికే కాస్ట్యూమ్స్ కావాలనుకునే వారికి మేం సొల్యూషన్ వెతికి పెట్టాలనుకున్నాం. కానీ అదిప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించింది” - కో ఫౌండర్ నయన్ కుమార్


అసలేంటి వైలెట్ స్ట్రీట్

భారత దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో ఉన్న బొటిక్ లకు సంబంధించిన వస్త్రాలను వైలెట్ స్ట్రీట్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తారు. దాదాపు 75కు పైగా బొటిక్‌లు ఈ సైట్‌తో అనుసంధానమై ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా లాంటి మెట్రోలతో పాటు ఇతర నగరాలకు సేవలను విస్తరించారు. లోకల్ డిజైనర్లకు గ్లోబల్ ఆడియన్స్‌ను పరిచయం చేసే వేదికగా ప్రస్తుతం కొనసాగుతోంది. స్థానిక బొటిక్ వివరాలతో పాటు ఇతర మెట్రో నగరాలకు సంబంధించిన బొటిక్‌లలో అప్‌డేటెడ్ ఫ్యాషనబుల్ థింగ్స్‌ని ఆన్ లైన్ కస్టమర్లకు అందించడం వైలెట్ స్ట్రీట్ ప్రధాన ఉద్దేశం.

image


వంద మంది కస్టమర్లు వస్తే చాలనుకున్నారు !

ఈ-కామర్స్ జోరు పెరుగుతున్న రోజులవి. అంకుర్ గుప్త, నయన్ కుమార్‌లు ఆన్‌లైన్ మార్కెట్లో వస్తున్న బూమ్ గమనించారు. ఆఫ్ లైన్ కస్టమర్లకు సర్వీసు ఇచ్చే విషయంపై పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేశారు. అప్పుడు తట్టిన ఆలోచనే ఈ వైలెట్ స్ట్రీట్. మన మెట్రో నగరాల్లో స్టైళ్లకు పర్యాయపదాలుగా ఉన్న బొటిక్స్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని అనుకున్నారు. అలా మొదలైందే వైలెట్ స్ట్రీట్ ప్రస్థానం. గతేడాది జనవరిలో ఇది ప్రారంభమైంది. మొదట్లో సోషల్ షాపింగ్ పోర్టల్‌గానే మొదలైంది. ఏడాదిలో భారతదేశంలో బొటిక్‌లకు సంబంధించిన అత్యుత్తమ మార్కెట్ గా అవతరించింది. ప్రారంభ రోజుల్లో నెల రోజులకు వందమంది కస్టమర్లు వస్తే గొప్పేనని భావించారు. కానీ రాను రానూ సంఖ్య పెరుగుతూ వచ్చింది. బొటిక్స్ , వాటి ప్రాడక్టులతో యాక్టివ్ యూజర్ల సంఖ్య రోజుకు వేలల్లో పెరిగింది. దీంతో ఇప్పుడు దేశంలో వైలెట్ స్ట్రీట్ నంబర్ వన్ బొటిక్ సొల్యూషన్ ప్లాట్‌ఫాంగా ఎదిగింది.

image


వైలెట్ స్ట్రీట్ టీం

అంకుర్ గుప్త, నయన్ కుమార్‌లు వైలెట్ స్ట్రీట్ సంస్థకు సహ వ్యవస్థాపకులు. నిట్ అలహాబాద్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో అంకుర్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌ ఆర్ అండ్ డీలో పనిచేశారు. నయన్ హైదరాబాద్ బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి. ఇతనొక సీరియల్ ఆంట్రప్రెన్యూర్. వీరితో పాటు మొత్తం 18మంది టీం ఉన్నారు.

సవాళ్లు

వైలెట్ స్ట్రీట్ ప్రారంభించిన రోజుల్లో ఈ తరహా స్టార్టప్ కొత్తదే. కానీ ప్రస్తుతం ఈ సెగ్మెంట్లోకి చాలా మంది వస్తున్నారు. కొన్ని బొటిక్స్ కలసి ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం క్రియేట్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వారితో కాంపిటీషన్ తప్పడం లేదు. అయితే తమది పూర్తి స్థాయి ఈ-కామర్స్ మోడల్ కావడంతో వారితో పోటీ పెద్దగా లేదని నయన్ కుమార్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

ఫండింగ్

ఏంజిల్ రౌండ్‌లో రెండుకోట్ల ఫండ్‌ను రెయిజ్ చేసింది వైలెట్ స్ట్రీట్. వెంకట్ వల్లభనేని, శ్రీనివాసరావు పోటూరి నాయకత్వంలో ఇది పూర్తయింది. ఈ ఫండింగ్‌ని నూటికి నూరు శాతం వినియోగించుకున్న కంపెనీ టీంను పెంచుకోవడంతో పాటు ఫ్యాషన్ మార్కెట్లో సరికొత్త బెంచ్ మార్క్ దాటింది. అనంతరం టైగర్ గ్లోబల్ నుంచి 15 మిలియన్ డాలర్ల బి-సిరీస్ ఫండింగ్ పొందింది.

భవిష్యత్ ప్రణాళికలు

వైలెట్ స్ట్రీట్ వందలాది బొటిక్స్‌తో భారత దేశంలోనే పెద్ద బొటిక్ మార్కెట్ గా అవతరించాలని చూస్తోంది. అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువై, తమ డిజైనర్లకు గ్లోబల్ కస్టమర్లను పరిచయం చేయాలని చూస్తున్నట్లు నయన్ ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags