సంకలనాలు
Telugu

వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో త్వరలో టీ హబ్ -2

ఇప్పుడున్న టీ హబ్ కు 5 రెట్లు పెద్దదిగా టీ హబ్-2 

team ys telugu
5th Nov 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో మొదలైన టీ హబ్ రెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన టీ హబ్ ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు వేదికైంది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్ ఒక్క ఏడాదిలోనే అద్భుత విజయాలు సాధించింది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ గా టీ హబ్ చరిత్ర సృష్టిచింది. ప్రస్తుతం 150కి పైగా స్టార్టప్‌ లు టీ హబ్ లో పనిచేస్తున్నాయి. 20 లక్షల నుంచి 4 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలు టీ-హబ్‌ ను సందర్శించారు. స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్న తీరును అభినందించారు. టీ-హబ్‌ తో కలిసి పనిచేసేందుకు, టెక్నాలజీ సహకారం అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

image


టీ బ్ సక్సెస్ కావడంతో రెండో దశను కూడా ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రాయదుర్గంలోని సర్వే నెంబరు 83లో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్, 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి పరిజ్ఞానం, వసతులతో రెండో దశను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 400 మంది ఒకేసారి పనిచేసుకోవచ్చు. వంద కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేంత ప్లేస్ ఉంటుంది. అధునాతన సౌకర్యాలతో కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మించనున్నారు. త్వరలోనే టీ హబ్ రెండో దశ అందుబాటులోకి రానుంది. ఇప్పుడున్న టీ హబ్ కు 5 రెట్లు పెద్దదిగా టీ హబ్-2 ఉండబోతోంది. 

image


త్వరలోనే సీఎం కేసీఆర్ దానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించిన నమూనా చిత్రాలను ట్విటర్ ద్వారా విడుదల చేశారు. 

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags