సంకలనాలు
Telugu

ఈ కాల్‌సెంటర్‌ ప్రత్యేకతే వేరు ! యూరో ఏబుల్ సాహసోపేత నిర్ణయం

మనకెవ్వరూ ఆసరా లేరని అనుకోవడం పొరపాటే. ఏదో రూపంలో సాయం అందుతుంది. నిరుత్సాహపడేలోపే ప్రోత్సాహం ఇచ్చే వారు వెదుక్కుంటూ వస్తారు. యూరో ఏబుల్ రూపంలో మనం ఇప్పుడు అలాంటి ప్రోత్సాహాన్నే చూడబోతున్నాం.

team ys telugu
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ధర్మకార్యాలే తన జీవిత పరమావధి అని అంటారు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. “అది గొప్ప పనేమీ కాదు. పెద్ద పెద్ద పనులు చేసేందుకు మొదలెట్టే చిన్న కార్యక్రమం. అనాదిగా ప్రజల మదిలో స్థిరపడిపోయిన సమానత్వ సాధనకు మానవతావాదం ఒక గీటురాయి. ప్రతీ ఒకరు గౌరవ ప్రదంగా జీవించాలనుకోవడమే సమానత్వ భావన. పరిస్థితులు, పరిసరాల ప్రభావంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ గౌరవం పొందాలి” అని డీఎన్ఎ దినపత్రికలో రాసిన వ్యాసంలో షారుఖ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

యూరో ఏబుల్ కాల్ సెంటర్ గురించి విన్నప్పుడు షారుఖ్ చెప్పిన విషయం పూర్తిగా బోధపడుతుంది. యురేకా ఫోర్బ్స్ నిర్వహించే కాల్ సెంటర్ పేరే యూరో ఏబుల్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి (కార్పొరేట్ల సామాజిక బాధ్యత) చొరవతో ఏడాది క్రితం ఈ సంస్థ ప్రారంభమైంది. శారీరిక దౌర్భల్యం ఉన్న వ్యక్తులు పనిచేసే అత్యాధునిక కాల్ సెంటర్ ఇది. దేశంలోనే ఇలాంటి తొట్టతొలి కాల్ సెంటర్ ఇది. శారీరక వైకల్యం ఉన్న వ్యక్తులు తమ శక్తియుక్తులు ప్రదర్శించి గౌరవ ప్రదంగాజీవిస్తూ…. ఆర్థిక స్వాతంత్ర్యం పొందేందుకు ఆ సంస్థ అవకాశమిస్తోంది. వారికి సమాన అవకాశాలివ్వడం ద్వారా యూరో ఏబుల్ సంస్థ మన సమాజంలో ఉన్న వివక్షను పారద్రోల గలుగుతోంది. ముంబై ఉప నగరం చెంబూరులో యూరో ఏబుల్ కార్యాలయం ఉంది. వికలాంగుల కోసం సమాన అవకాశాలు అన్వేషించే జాతీయ సంస్థ…. నాసియోలోని 5000 చదరపు అడుగుల ప్రదేశంలో యూరో ఏబుల్ వెలిసింది. విశాలమైన గదిలో 90 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రధాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీల్ ఛైర్లో పనిచేసే వారికోసం ప్రత్యేకంగా పది వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. యురేకా ఫోర్బ్స్ కు చెందిన వినాత్ హెగ్డే ప్రస్తుతం యూరో ఏబుల్ పనులను పర్వవేక్షిస్తున్నారు. ఈ కాల్ సెంటర్ టెక్నాలజీకి అంకురార్పణ చేసి అభివృద్ధి చేసినది కూడా ఆమే. ప్రస్తుతం యూరో ఏబుల్ నిర్వహిస్తున్న బృందాన్ని ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చినది కూడా ఆమే. ఉద్యోగానికి ఎంపిక కావడం వేరు. వృత్తిలో ఎదగడం వేరు. కాల్ సెంటర్‌లో చేరిన ప్రతీ వ్యక్తినీ పనితీరు ఆధారంగా అంచనా వేస్తారు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష తర్వాత…గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.


యూరో ఏబుల్ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న ప్రత్యేక ఉద్యోగులు

యూరో ఏబుల్ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న ప్రత్యేక ఉద్యోగులు


వికలాంగుల్లో మొదట ధైర్యాన్ని నింపారు

“వీరిలో చాలా మంది తొలుత నోరు తెరిచేందుకే సిగ్గు పడేవారు. ఎక్కువ మంది దిగువ మధ్య తరగతి వర్గానికి చెందిన వారే. ఆంగ్లంలో మాట్లాడలేని వారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. వైకల్యంతో పెరిగిన పిల్లలకు సాధారణ బాల్యం లేకపోవడంతో వారు వివక్షకు లోనయ్యారు. జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకు సుదీర్ఘ ప్రయత్నమే చేయాల్సి వచ్చింది.. ” యురేకా ఫోర్బ్స్ సిఈఓ డైరెక్ట్ సేల్స్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ మార్జిన్ ష్రాఫ్ వివరిస్తున్నారు.

ప్రస్తుతం కాల్ సెంటర్లో 96 మంది ఉద్యోగులున్నారు. వారిని నిత్యం పర్యవేక్షిస్తూ, ఉత్తేజ పరచాల్సి ఉంటుందని మార్జిన్ అంటున్నారు. కాల్స్ తీసుకునే పని ప్రారంభించే ముందు ఆంగ్లంలో మాట్లాడటం.. ఉత్పత్తులు గురించి వివరించడం లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. కొత్త ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు నెలల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు. గతంలో ఉద్యోగులకు పది రోజుల శిక్షణా కార్యక్రమం సరిపోయేది. పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ… కార్పొరేట్ శైలి బహుమానాలతో ప్రోత్సహించేవారు. ఉద్యోగుల పనితీరును నాణ్యతా ప్రమాణాలు నిపుణులు పర్యవేక్షిస్తాడు. ఉత్పాదకత 90 శాతానికి దిగువన ఉంటే.. అతడ్ని పునశ్చరణ కార్యక్రమానికి పంపి రాత పరీక్ష నిర్వహిస్తారు. అవసరమనిపిస్తే కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. “పనితీరును మెరుగుపరుచుకుని మేలైన ఫలితాలు సాధించిన ఉద్యోగులను నాయకత్వ కార్యక్రమంలో చేర్చుతారు. కాల్ సెంటర్లోని అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత తరచూ వారికి అప్పగిస్తారు” అని మార్జిన్ సగర్వంగా చెబుతున్నారు. 

ప్రత్యేకమైన వర్క్ స్టేషన్లు, సదుపాయాలు

ఉద్యోగి సమర్థతను బట్టి వృత్తిలో అతని పురోగతి ఆధారపడి ఉంటుంది. 8,500 రూపాయల నుంచి నెలవారీ వేతనం ప్రారంభమవుతుంది. బోనస్, గ్రాట్యూటీ,ప్రావిడెంట్ ఫండ్ లాంటి సౌకర్యాలుంటాయి. సౌకర్యవంతమైన పని పరిస్థితులు ఉండేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా కాల్ సెంటల్ డెస్క్ మూడు అడుగుల పొడవు ఉంటుంది. ఇక్కడ వర్క్ స్టేషన్ ను మరో అడుగు పొడవు ఏర్పాటు చేశారు. వీల్ ఛైర్లోను… క్రచ్‌లోనూ సులువుగా కదిలేందుకు వీలుగా తగిన విస్తిర్ణం ఉంటుంది. డెస్క్ టాప్ కంప్యూటర్లు కూడా కిందకు వంగే అవసరం లేకుండా ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యమూ ఉంది. ప్రతీ వర్క్ స్టేషన్లో రోజూ 125 కాల్స్ కు జవాబు చెబుతారు. యురేకా ఫోర్బ్స్ వారి ఉత్తర భారత కార్యకలాపాలన్నీ యూరో ఏబుల్ ద్వారానే నిర్వహిస్తామని మార్జిన్ వెల్లడించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి కాల్స్ వస్తాయి. గతంలో ఒక్కో కాల్ కు సగటున 356 సెకన్లు పట్టేది. ఇప్పుడది 169 సెకన్లకు తగ్గింది. 2012 లో యూరో ఏబుల్ కు హెలెన్ కెల్లర్ అవార్డు లభించింది. వికలాంగులకు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే జాతీయ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది.

చిన్న ప్రయత్నం ఇప్పుడు మహాయజ్ఞంగా మారింది. 2008లో నాసియోతో చేతులు కలిపిన యురేకా ఫోర్బ్స్…. స్పేర్ పార్ట్స్ మరమ్మత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యం 2009లో మరింత ముందుకు సాగింది. సాసియోలోని వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. అక్వాగార్డ్ నీటి శుద్ధీకరణలో పీసీబీ మదర్ బోర్డ్ అసెంబుల్ చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. నిజానికి సీఆర్ఎం విభాగంలో ఎక్కువ మంది ట్రైనీలను నియమించారు. యువకుల్లో ఉత్సాహాన్ని, విజయాన్ని చూసిన తర్వాత.. వినియోగదారుల స్పందనను తెలుసుకున్న తరువాత, ఎనభై లక్షల మంది వినియోగదారుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది క్రమంగా అత్యాధునిక కాల్ సెంటర్ ఏర్పాటుకు దారి తీసింది.

మార్జిన్ ష్రాఫ్, యురేకా ఫోర్బ్స్ సిఈఓ డైరెక్ట్ సేల్స్

మార్జిన్ ష్రాఫ్, యురేకా ఫోర్బ్స్ సిఈఓ డైరెక్ట్ సేల్స్


దృష్టిలోపం ఉన్నవాళ్లకూ చేయూతనిచ్చే ఆలోచన

వికలాంగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు వైకల్యం ప్రాప్తించిన అనేకమందికి ఉపాధి కల్పించడం పెద్ద సవాలేనని మార్జిన్ అంగీకరిస్తున్నారు. యూరో ఏబుల్ లాంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నం మాత్రం నిజంగా నైతిక విజయమే. కాల్ సెంటర్ విజయం సాధించడంలో యూరో ఏబుల్ సంస్థ ఇతర కార్పొరేట్లతో చర్చలు జరుపుతోంది. ఇలాంటి కార్యాలయాలు ప్రారంభించేందుకు అవసరమైతే తమ ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని ఆహ్వానిస్తోంది. దృష్టిలోపం ఉన్నవారిని పనిలో చేర్చుకునేందుకు కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని యూరో ఏబుల్ వ్యూహ రచన చేస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags