సంకలనాలు
Telugu

మనిషిలోని అద్భుత శక్తుల్ని వెలికి తీసే యోగా

యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకునేందుకు నాలుగు కారణాలు

13th Jun 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన ఆరోగ్య విజ్ఞానమే యోగా. యోగా సాధనతో మనిషి చురుగ్గా ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతతను పొందుతారు. అందుకే ఉరుకుల పరుగల జీవితంలో కాసేపైనా యోగాకు టైం కేటాయించాలన్నది నిపుణులు చెప్పే మాట. ముఖ్యంగా ఎంట్రప్రెన్యూర్లు, కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకునేవారికి యోగా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుస్తుంది. యోగా మనిషి విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకత స్థాయిల్ని పెంచుతుంది. అంతేకాదు. యోగా సాధన ఒత్తిడిని దూరం చేయడంతో పాటు క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి, ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. ఇక యోగా సాధన వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మానసిక, నరాల సంబంధింత సమస్యలు రాకుండా నివారిస్తుంది. నిత్యం యోగా సాధన చేసే వ్యక్తులైనా, కొత్తగా నేర్చుకుంటున్నావారైనా సరే రోజూ కొన్ని నిమిషాల పాటు యోగా ప్రాక్టీస్ చేస్తే వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

మానసిక ప్రశాంతత

మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవడం లాంటి సమస్యలకు యోగా మంచి మందులా పనిచేస్తుంది. యోగా సాధనతో ఆక్సిజన్ సరఫరా పెరిగి మెదడు చురుగ్గా మారుతుంది. డిప్రెషన్ లాంటి సమస్యలు దరి చేరవు. యోగాను ఎంత ఎక్కువగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత అంతగా పెరుగుతుందన్నది పరిశోధకుల మాట. కఠిన యోగా సాధన తర్వాత మనిషి మనసు ప్రశాంతంగా మారడంతో పాటు సానుకూల ధృక్కోణం పెరుగుతుంది.

చాలా మంది ఆంట్రప్రెన్యూర్లు శారీరక సౌష్టవంపై తప్ప మానసిక ఆరోగ్యానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. స్టార్టప్ ల యుగంలో ఆంట్రప్రెన్యూయర్లకు ఒకవిధంగా మానసిక ప్రశాంతత కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంట్రప్రెన్యుయర్లు పని మీద దృష్టి కేంద్రీకరించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రమబద్ధమైన జీవనశైలికి యోగా టానిక్ లా పనిచేస్తుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది

ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి నిత్యం ఒత్తిడికి గురవుతున్నాడు. కొన్ని సందర్భాలతో ఒత్తిడి వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని తట్టుకుని ధైర్యంగా నిలబడిన వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుతారు. వాస్తవానికి స్ట్రెస్ అనేది తరతరాల నుంచి వారసత్వంగా వస్తోంది. ఆంట్రప్రెన్యూర్లకు అయితే ఒత్తిడి సర్వసాధారణం. వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆంట్రప్రెన్యూర్లు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. బిజీ షెడ్యూల్, డెడ్ లైన్లు ఆంట్రప్రెన్యూర్లను మరింత ఒత్తిడికి గురవుతున్నాయి.

ఒకస్థాయి వరకు ఒత్తిడి మంచిదే అయినా అది నిత్య జీవితంలో భాగం అయిపోతే పరిస్థితి చేయి దాటి పోతుంది. ఒత్తిడి కారణంగా శరీరంలో యాసిడ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం ఓ వ్యక్తి ఆఫీస్ కు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయి ఆలస్యం అయినప్పుడు ఎదుర్కొనే ఒత్తిడి అడవిలో సింహాలు వెంటపడుతున్నప్పుడు జిరాఫీలు, జీబ్రాలకు కలిగే ఒత్తిడితో సమానంగా ఉంటుందట. ఇలాంటి ఒత్తిడులన్నీ యోగాతో మటుమాయం అవుతాయి.

తొలిసారి యోగా సాధన చేసే వ్యక్తిలో మొదటి రోజు నుంచే మార్పు కనిపిస్తుందన్నది నిపుణుల మాట. ఇక కొంతకాలంగా యోగా సాధన చేస్తున్నవారిలో ఒత్తిడి క్రమంగా మటుమాయం అవుతుంది. ప్రశాంత వాతావరణంలో యోగా టెక్నిక్ లు, మెడిటేషన్ సాధన చేయడం, క్రమబద్ధమైన శారీరక కదలికల వల్ల మెదడు రిలాక్స్ అయి ఒత్తిడి దానంతట అదే దూరం అవుతుంది.

న్యూరోలాజికల్ బెనిఫిట్స్

యోగా సాధన ద్వారా అవయవాలు, నాడీకేంద్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుంది. నరాల్లో కొత్త ఉత్తేజం నిండి మెదడు, శరీరం, మనసుకు కొత్త శక్తి వస్తుంది. యోగా మనిషి జ్ఞాపకశక్తిని, అభ్యసన సామర్థ్యాన్ని, మేథోశక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీర సమన్వయాన్ని కూడా పెంపొందిస్తుంది.

కొత్త ఆలోచనలు

నేటి పోటీ ప్రపంచంలో సరికొత్త ఐడియాలతో ముందుకొచ్చిన వారినే విజయం వరిస్తుంది. మనలో దాగిన అలాంటి కొత్త ఐడియాలను వెలికితీసేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఆత్మతో రీకనెక్ట్ అయ్యేందుకు సాయం చేయడంతో పాటు వ్యక్తుల్లో దాగిన నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికి తీస్తుంది.

యోగా ఆందోళన, డిప్రెషన్ ను దూరం చేయడంతో మనిషిలో అపనమ్మకాన్ని పోగొడుతుంది. ఫలితంగా ఆత్మన్యూనత దూరమై ప్రతి మనిషిలో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను వెలికితీస్తుంది. సామాజిక బంధాలు బలోపేతం చేయడంతో పాటు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆందోళన, ఆత్రుత వ్యక్తిలో దాగిన ప్రతిభను నాశనం చేసి వారిని డొల్లగా మారుస్తుంది. యోగా ఇలాంటి ఒత్తిడులు, టెన్షన్లను దూరం చేసి మనిషిలో దాగిన అద్భుతమైన శక్తుల్ని బయటకు తీసుకొస్తుంది. అందుకే మనమూ రోజూ యోగా సాధన చేద్దాం. శారీరక, మానసిన రుగ్మతల్ని దూరం చేసుకుందాం.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags