సంకలనాలు
Telugu

భారత్ గర్వపడేలా చేస్తామంటున్న బొనిట టీం

Amuktha Malyada
13th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

లాండ్రీ, స్టోరేజ్, కిచెన్ లో ప్రతీ నిత్యం అవసరమయ్యే వస్తువుల కోసం వివిధ రకాలైన స్టోర్స్, సూపర్ మార్కెట్లకు వెళ్లాల్సివస్తుంది. వీటికోసం ఒక్కోసారి చాలా సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. అయినప్పటికీ అందులో బెస్ట్ బ్రాండ్ ఏంటో తెలియక స్టోర్ మేనేజర్ మీద మీద అధారపడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉమంగ్ శ్రీవాత్సవ, నీరజ్ మిట్టల్, వినీత మిట్టల్, చారు శ్రీవాత్సవ బొనిట ప్రారంభించాలని నిర్ణయించారు.


image


బొనిట ప్రోడక్ట్ కాటగిరీ, సవాళ్లు

బొనిట ప్రొడక్ట్ కాటగిరీలో మైక్రోవేవ్ స్టెయిన్ లెస్ స్టీల్ బౌల్స్, ఐరనింగ్ బోర్డ్స్ & మాట్స్, క్లోత్స్ డ్రైయింగ్ స్టాండ్స్, సిలికోన్ పాడ్స్, క్లాత్ పెగ్స్, లాండ్రి బాస్కెట్స్, వాక్యూం బాగ్స్, ఫోల్డింగ్ వార్డోబ్స్, షూ రాక్స్, స్టెప్ లాడర్స్ లాంటి ఆర్గనైజింగ్ సొల్యూషన్స్ ఉంటాయి.

అయితే కంపెనీ ప్రారంభానికి ముందు తమలాగా ఆలోచించేవారు, తమలాంటి విజన్, విలువలు ఉన్న భాగస్వాముల్ని కలుపుకోవడం అతిపెద్ద సవాలుగా అనిపించింది. పాత పరిచయాల్ని టీం ఇందుకోసం ఉపయోగించుకుంది. ఆర్ట్ డి ఇనాక్స్ ల పనిచేసిన ఆంట్రప్రెన్యూర్, వీరికి ఆన్ లైన్ డిస్ట్రిబ్యూటర్ గా దొరకడం కలిసొచ్చిందని ఉమంగ్ అభిప్రాయపడ్తున్నాడు.

మంచి సప్లై చైన్ దొరకడం వాళ్ల తర్వాతి సవాల్ గా మారింది. ఇందుకోసం కూడా అదే కేటగిరీ లో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ ను వెతికిపట్టుకున్నారు. అలాంటి వారితో బొనిట కోసం ఫాక్టరీలు నెలకొల్పేలా చేసి, వారిని కూడా ఆంట్రప్రెన్యూర్ లుగా తయారుచేశామంటున్నారు ఉమాంగ్.

వృద్ధి

ఏడాది ఆటుపోట్ల తర్వాత బొనిట, 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ఇప్పుడు ప్రతీ సంవత్సరం 300% వృద్ధిని సాధించింది. "భారత్ వేగంగా విస్తరించడమే కాకుండా, బొనిట 35 దేశల్లో కూడా అందుబాటులో ఉంది. యూరప్ లోని కస్టమర్ల నుంచి కూడా మా కంపెనీకి ఆమోదం లభించింది. అక్టోబర్ అంతానికి యూరోప్ లోని 20 దేశాల్లో మా అమ్మకాలు ప్రారంభమవుతాయి" అని అంటున్నారు ఉమాంగ్.

బొనిటకు భారత్ లోని 45 నగరాల్లో నెట్ వర్క్ డిస్ట్రిబ్యూటర్లతో పాటుగా, 1,000 ఇండిపెండెంట్ హౌస్ వేర్ స్టోర్స్ ఉన్నాయి. స్నాప్ డీల్, అమెజాన్, పెప్పర్ ఫ్రై, పేటీఎం, ఈబే, హోం స్టాప్ 18, షాపర్స్ స్టాప్ లాంటి ఆన్ లైన్ పోర్టల్స్ తో టై అప్స్ ఉన్నాయి. ఇక అమెరికాలో వేఫెయిర్, అమెజాన్, జులిలీ, బెడ్ బాత్ & బియాండ్ లాంటి వెబ్ సైట్స్ తో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. యూరోప్ లో వెస్ట్ వింగ్, లిమంగ్ తోను, దుబాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వైసద, సోక్, వెబ్ సైట్స్ తో టై అప్ ఉంటే, బొనిట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కూడా ఉంది.

"500 మిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల వరకు గ్లోబల్ మార్కెట్ రేంజ్ మాకుంది. ఇది ప్రతీ సంవత్సరం 10% వృద్ధి చెందుతోంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్ఏ, యూరోప్, సౌత్ అమెరికా, యుఏఈ పైనే ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒక్క అమెరికాలోనే హోం సెగ్మెంట్ కేటగిరీలో మా మార్కెట్ సైజ్ 500 యుఎస్ డాలర్లుంది" అంటున్నారు ఉమాంగ్.

బొనిట టీం

బొనిటలో గ్లోబల్ బిజినెస్ డెవెలప్ మెంట్, బ్రాండింగ్ చూస్తున్న ఉమాంగ్ కు, మార్కెటింగ్ & స్ట్రాటజీ లో 20 ఏళ్ల అనుభవం ఉంది. ట్రైడెంట్, ఆర్ట్ డినాక్స్ (జిందాల్ స్టెయిన్ లెస్స్ డివిజన్) లో సీనియర్ పొజిషన్లలో పనిచేశారు.

ఇక నీరజ్ డెవలపింగ్, మేనేజింగ్ సప్లై చైన్ చూస్తున్నారు. సప్లై చైన్ మేనేజ్ మేంట్ లో 25 ఏళ్లకు పైగా అనుభవం నీరజ్ సొంతం. ఫోర్డ్ ట్రాక్టర్స్, డెన్సొ, IKEA వంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లలో పనిచేశారు.

వినీత బొనిటలో క్రియేటివ్ వర్క్ తో పాటుగా, బ్రాండింగ్ చూస్తుంది. ప్రొడక్ట్ డెవలప్ మెంట్ ఫీల్డ్, క్రియేటివ్ విభాగాల్లో 15 ఏళ్ల అనుభవం ఉంది. ఇక చారు ఫైనాన్స్ తో పాటుగా చూస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇండస్ట్రీ కంపెనీలైన ట్రైడెంట్, ICICI బ్యాంక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం చారు సొంతం.

ఇక ఇతర ముఖ్యమైన టీం మెంబర్లలో, రాజ్ కుమార్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్, చూస్తాడు. వినయ్ గుప్తా యుఎస్ఏ ఆపరేషన్స్ చూస్తే, హార్వే లెవ్న్ సన్, యుఎస్ఏ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ గా న్యూ యార్క్ లో పనిచేస్తున్నాడు. చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్ లో హెలెన్ యూరోప్ ఆపరేషన్స్, సేల్స్ చూసుకుంటుంది.

ఫ్యూచర్ ప్లాన్స్

ATL, BTL యాక్టివిటీస్, కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ మెంట్, లాంచింగ్, ఐటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్, టీం విస్తరణ కోసం బొనిట 30 కోట్ల పెట్టుబడులు పెంచాలని చూస్తోంది. దీంతో పాటే 50 దేశాలకు తన పరిధిని పెంచాలని భావిస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags