సంకలనాలు
Telugu

ఉద్యోగులు - యాజమాన్యం మధ్య వారధి 'హాల్‌ వేజ్'

Krishnamohan Tangirala
21st Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మంచి టీం ఉండడం.. ఏ సంస్థకయినా గొప్ప విషయం. వాస్తవానికి పర్ఫెక్ట్ టీం అంటే ఆస్తిలాంటిదని భావించచ్చు. కానీ ఇలాంటి టీంని నిర్మించడం, వారిలోని శక్తిసామర్ధ్యాలను సరిగా ఉపయోగించుకోవడం, శ్రమకు తగ్గ ఫలితాలు రాబట్టడం కోసం... కొంత కృషి చేయాల్సి ఉంటుంది.

హాల్‍వేజ్ టీం

హాల్‍వేజ్ టీం


ఏదైనా సంస్థలో అంతర్గతంగా పనిచేసే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం హాల్‌వేజ్. ఉద్యోగాలు-యాజమాన్యం మధ్య అనుబంధం పెంపొందిండానికి, ఉద్యోగుల ప్రతిభను గుర్తించడానికి, సంస్థ అభివృద్ధిలో ఆలోచనలు పంచుకోవడానికి, తీసుకున్న నిర్ణయాలు సమర్ధంగా అమలు చేయడానికి, ఉద్యోగుల్లో సంతృప్తికరస్థాయిలు పెంపొందించడానికి.. ఒక టీం లీడర్ మాదిరిగా పని చేస్తుంది హాల్‌వేజ్.

టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లపై మక్కువ ఉన్న సైఫ్ అహ్మద్ 2014 ఏప్రిల్‌లో హల్‌వేజ్‌‌ను ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారీయన. ఐటీ రంగంలో 14ఏళ్ల అపార అనుభవం ఈయన సొంతం. వ్యాపార సంస్థలకు ప్రపంచస్థాయి సాంకేతిక పరిష్కారాలు అందించడంలో.. ఈయన దగ్గర అనేక ఐడియాలు ఉన్నాయి.

వర్జీనియాలో డెలావేర్ కార్పొరేషన్‌గా హాల్‌వేజ్ మొదలైంది. ఒక వ్యవస్థకు అవసరమైన అన్ని అవసరాలను తీర్చగల ప్లాట్‌ఫాం ఇది అంటారు సైఫ్. సంస్థ అభివృద్ధి కోసం అవసరమైన అనేక కార్యకలాపాలను నిర్వహించడం దీని ప్రత్యేకత. ఉద్యోగులతో నిరంతరాయంగా టచ్‌లో ఉండడం, వారు కలిసి పని చేసేందుకు ప్రోత్సహించడం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో గ్యాప్ రాకుండా చూసుకోవడం, కార్యకలాపాల్లో పారదర్శకత, అభివృద్ధికి అడ్డు పడే అంశాలను గుర్తించడం వంటి అనేక సమస్యలకు ఏకైక పరిష్కారం హాల్‌వేజ్ అని చెప్పారు సైఫ్.

ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములతోపాటు కస్టమర్లు కూడా ఆన్‌లైన్ ద్వారా సంస్థతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది హాల్‌వేజ్. మెసేజ్‌లు పంపడం, స్టేటస్ అప్‌డేట్ చేయడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ షేర్ చేయడం, ప్రశ్నలు అడగడం వంటి ఫీచర్స్ హాల్‌వేజ్‌లో ఉంటాయి. రిప్లై ద్వారా కానీ, కామెంట్స్ ద్వారా కానీ ఇతరులు స్పందించచ్చు. ఈ తరహా మెసేజ్‌లు, రిప్లైల సంభాషణలను డేటా మాదిరిగా .. సంస్థకు ఫీడ్‌బ్యాక్ రూపంలో అందుతుంది.

వర్క్‌ప్లేస్‌లో సామాజికంగా ఉండే వాటివల్ల ఎంత ప్రభావం చూపొచ్చో తమ నెట్‌వర్క్ నిరూపిస్తుందంటున్నారు హాల్‌వేజ్‌ నిర్వాహకులు. ఇలాంటి ప్లాట్‌ఫాంలు మరికొన్ని ఉన్నా.. వీటిపై యూజర్లు అంత మక్కువ చూపడం లేదని తేల్చేశారు హాల్‌వేజ్ సీఈఓ సైఫ్.

“క్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌లను ప్రజలు ఇష్టపడ్డంలేదు. వాటికి దూరంగా ఉండేదుకు ప్రయత్నిస్తున్నారు. హాల్‌వేజ్ ప్రత్యేకత దానికున్న సులభమైన యూజర్‌ ఇంటర్‌ఫేజ్. ఈ విషయంలో మిగిలిన ప్లాట్‌ఫాంలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. వీటికి చెక్ పెడుతూ మేం అత్యంత సమర్ధంగా హాల్‌వేజ్‌ను రూపొందించామ”న్నారు సైఫ్.

“అనేక ఈఎస్ఎన్‌లు(ఎంటర్‌ప్రైజ్ సోషల్ నెట్వర్క్) కంటెంట్, స్ట్రీమింగ్ పైనే దృష్టి పెట్టాయి. సమాచారం మొత్తాన్ని ఒక్క క్లిక్‌తో పొందగలగడం వాటిలో సాధ్యం కాదు. కానీ మా సెర్చ్ ఇంజిన్ అలా కాదు. ఇండెక్స్‌లు, కేటలాగ్స్‌లను కూలంకుషంగా వెతికి సమాచారాన్ని స్ట్రీమింగ్ చేస్తుంది. మెటాడేటాకు సంబంధించిన వివరాలను వెతికేస్తుంది ” అన్నారు సైఫ్. ప్రస్తుతం గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన భారత్‌లో విస్తృతమైన మార్కెట్ అవకాశాలున్నాయని చెబ్తున్నారు.

ప్రతిభావంతమైన ఫ్రొఫైలింగ్, కంటెంట్ ఫీడ్, రికమెండేషన్స్‌తోపాటు ఇతర సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాంలనుంచి కూడా డేటా సేకరించగలిగేలా హాల్‌వేజ్ ఈఎస్ఎన్‌లో ఫీచర్స్‌ను రూపొందించినట్లు తెలిపారు.

“ఉద్యోగులకు అందుబాటులో ఉండడానికి, వారిలోని టాలెంట్‌ను వెలికి తీయడానికి, కొత్త అవకాశాలపై ఉద్యోగులను సమర్ధంగా వినియోగించుకోవడానికి.. హాల్‌వేజ్ ఉపయోగపడుతుంద”ని వెబ్‌సైట్‌లో కంపెనీలకు ఇచ్చిన సమాచారంలో వివరించారు.

“సీనియర్స్‌, గ్రూప్, కొలీగ్స్.. వీరు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా.. వారితో కనెక్ట్ అయేందుకు అవకాశం ఉంటుంది. ప్రాజెక్టుల నిర్వహణలో నిపుణులైన వారి సలహాలు తీసుకుని.. పలు సమస్యలకు పరిష్కారాలు పొందచ్చు. మార్గదర్శకులు, మీలాంటి ఆలోచనలే ఉన్నవారిని కలుసుకునేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది సహాయపడుతుంది” అంటూ ఉద్యోగులకు హాల్‌వేజ్ ఎలా ఉపయోగపడుతోందో వివరించే ప్రయత్నం చేశారు వెబ్‌సైట్‌లో.

ఆరంభం అదుర్స్

సొంత నిధులతోనే ఈ వెంచర్ ప్రారంభించారు వ్యవస్థాపకులు. పలువురు నిపుణులను బోర్డ్‌లోకి తీసుకునే యోచన ఉంది. చిన్న, మధ్యస్త, పెద్ద సంస్థల నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. వ్యాపార సంస్థల్లో సామాజిక, సాంస్కృతిక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తోంది హాల్‌వేజ్.

అభివృద్ధి ప్రణాళికల్లో సైఫ్‌దే కీలక పాత్ర. స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలను అందించడం, నిపుణులకు మార్గనిర్దేశం చేయడం, సేల్స్ విభాగం నిర్వహణ, కస్టమర్లను పొందడంలో నైపుణ్యం వంటి పలు కార్యకలాపాలను ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు.

“అనేక అంశాల్లో ప్రతిభ ఉన్న వ్యక్తుల గల చాలా చిన్న టీం మాది. చేసే ప్రతీ పనీ ఇష్టపడ్డాకే చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 60మంది టీం కలిసి పని చేస్తున్నాం. ప్రోడక్ట్‌ను యధాతధంగా స్వీకరించి మద్దతు ఇస్తూ.. దాని అభివృద్ధి కృషి చేయడం మా ప్రత్యేకత” అన్నారు సైఫ్.

హాల్‌వేజ్‌ను రెండు రకాలైన బిజినెస్ మోడల్స్‌లో అందిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటే.. యాడ్స్ ఉండే ఫ్రీ మోడల్‌ను గతేడాదే అందించారు. భారత్‌లో 100శాతం వాటా గల అనుబంధ సంస్థను నిర్వహిస్తున్న హాల్‌వేజ్.. అతి తక్కువ కాలంలోనే 7మిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయాన్ని గడించడం విశేషం. మరుసటి ఏడాది 10శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది హాల్‌వేజ్.

తక్కువ కాలంలోనే తాము సాధించిన ప్రగతిని చూసి ప్రేరణ పొందిన సైఫ్.. మరిన్ని నిధులు సమీకరించి విస్తరించేందుకు.. వెంచర్ కాపిటలిస్ట్‌లతో చర్చలు నిర్వహిస్తున్నారు. యూరోప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

“ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మార్కెట్లలో చొచ్చుకుపయేందుకు ప్రయత్నిస్తున్నాం. 15 సంస్థలకు చెందిన 5వేలమందికి పైగా యూజర్లు.. ఈ ప్లాట్‌ఫాంని ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు తాజాగా ఉత్తర అమెరికాకు చెందిన ఓ అతి పెద్ద డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం”అంటూ అభివృద్ధి తీరును వివరించారు సైఫ్.

స్పందన అద్భుతం, కొన్ని సవాళ్లు

హాల్‌వేజ్ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్న కంపెనీల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఉత్సాహాన్ని ఇస్తోందని చెబ్తున్నారు సైఫ్. ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగించడం ద్వారా.. గ్రౌండ్ లెవెల్‌లో పని ఏ విధంగా జరుగుతోందో.. ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిల్లో ఉన్నవారు తెలుసుకునే వీలు కలుగుతోంది. దీని ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని సాధించగలిగేందుకు ఆస్కారం లభించింది. ఆయా ప్రోడక్టుల ప్రచారానికి వారినే బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్న దాఖలాలు.. ఈ వెంచర్ సాధించిన అభివృద్ధికి నిదర్శనం.

కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్న కంపెనీలతో డీలింగ్ చేయడం ఒక సవాల్ అంటారు సైఫ్. ఇలాంటి కొత్త విధానాలను ప్రోత్సహించేందుకు అమెరికా వంటి దేశాల మార్కెట్లలోని కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నా.. భారత్‌లో మాత్రం మిశ్రమ స్పందనే వస్తోందని చెబ్తున్నారు.

“హాల్‌వేజ్ వంటి ఓపెన్ ప్లాట్‌ఫాంల ద్వారా అభివృద్ధి సాధ్యమే అని లీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తులకు అర్దమైనా.. తర్వాత ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే ఆందోళన వారిలో కనిపిస్తోంది”అన్నారు హాల్‌వేజ్ ఫౌండర్.

ఈ సమస్యను అధిగమించేందుకు హాల్‌వేజ్ దగ్గర అడ్వాన్స్‌డ్ అడాప్షన్ టీం ఉంది. వీళ్లు ఈ అంశంలో నైపుణ్యం కలవారే కాకుడా.. ప్రవర్తన, సాంస్కృతికపరమైన మార్పులపై కూడా దృష్టి పెట్టారు. త్వరలో బయటి గ్రూప్‌లు, గ్రూప్ చాటింగ్ వంటి ఫీచర్లను త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. డెస్క్‌టాప్‌ల పైనే కాకుండా.. మొబైల్ లోనూ వినియోగించుకునేలా ఈ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేశారు. పలు విభిన్నమైన వ్యాపారాలకు అనువైన ప్లాట్‌ఫాంని అందుబాటు ధరలోను, లైసెన్సింగ్‌ ప్లాన్‌లలోనూ అందిస్తున్నారు.

ఇప్పటికే ఇదే రంగంలో ఇలాంటి సర్వీసులనే అందిస్తున్నవారి నుంచి పోటీ ఉందని అంగీకరిస్తున్నారు సైఫ్. అయితే.. ఈ రంగానికి ఉన్న విస్తృతమైన అవకాశాల ముందు.. ఈ పోటీ చాలా చిన్నదిగా అభిప్రాయపడుతున్నారాయన. 2104చివరకు 840మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం నిర్వహించిన ఈ రంగం ఏటా 13-14 శాతం వృద్ధి సాధిస్తోంది. మొత్తం మార్కెట్‌లో జైవ్‌కు 8-10శాతం మార్కెట్ వాటా ఉండగా.. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న యామర్, సేల్స్‌ఫోర్స్ ఛాటర్‌లు ఈఎస్ఎన్ విభాగంలో మార్కెట్ లీడర్స్‌గా ఉన్నాయి.

వెబ్‌‌సైట్

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags