ఒకప్పటి హోం మేకర్.. ఇప్పుడొక మిలియన్ డాలర్ కంపెనీకి ఓనర్..!

By ashok patnaik|6th Mar 2016
Clap Icon0 claps
  • +0
    Clap Icon
Share on
close
Clap Icon0 claps
  • +0
    Clap Icon
Share on
close
Share on
close


సొంతంగా కంపెనీ పెట్టి పదిమందికి సాయం చేయాలనుకున్నారు. దానికోసం 35 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగం వదిలేశారు. స్టాఫింగ్, రిక్రూట్మెంట్ లో సంహిత సాఫ్ట్ గ్రోత్ ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీలకు సమానంగా ఉంది. ఇదంతా సాధించడానికి రోజుకి 18 గంటలు పనిచేశానన్నారు పద్మిని బొలినేని.

“హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, ప్రతి వీకెండ్ కి ఏలూరు వెళ్లి వచ్చేదాన్ని,” పద్మిని

సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో దాదాపు అన్ని డొమైన్లలో రెండు దశాబ్దాలు పనిచేసి అనుభవంతో కంపెనీ ప్రారంభించారు.

అమ్మ చెప్పింది

తను పెద్ద స్థాయిలో ఉండాలని అమ్మ కోరుకొనేదని పద్మిని చెప్పారు. అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేని రోజుల్లో పద్మినీ పెళ్లి చేసుకోవల్సి వచ్చిందట. అలా తాను డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నప్పుడే పెళ్లైంది. వ్యవసాయ కుంటుంబం కనుక ఓ రైతు కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి చేశారు. అర్ధాంతరంగా చదువు ఆపేయాల్సి వచ్చింది. అయినా భర్త సహకారంతో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

“నేను పెద్ద చదువులు చదక లేకపోయానని అమ్మ చాలా సార్లు బాధపడేది, ఉద్యోగం మాత్రం చేయమని ప్రోత్సహించేది,” పద్మని

ఒక రకంగా నేను ఉద్యోగంలో చేరడానికి అమ్మే కారణం. అమ్మాయి సంపాదించే శక్తి ఉంటేనే స్వేచ్ఛ ఉంటుందనేది అమ్మ నమ్మేసిద్ధాంతం. అలా నాకు ప్రతివిషయంలో సాయం అందిస్తూ ఉండేది. నా కెరీర్ లో నిలదొక్కు కోడానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది.

“అమ్మమరణం నా జీవితాన్ని మార్చేసింది,” పద్మిని

కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో పద్మని వాళ్ల అమ్మ చనిపోవడం అత్యంత విషాదం. కానీ అమ్మ చివరి కోరిక ఎప్పుడూ గుర్తొచ్చేది. ఉద్యోగం వదలొద్దని అమ్మ చెప్పిన విషయం ఇప్పుడీ స్థితికి తీసుకొచ్చిందని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పుకొచ్చారు పద్మిని.

image


రెండుసార్లు వీసా రిజెక్ట్ అయింది

డిస్టన్స్ మోడ్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1995లో సిడిఏసి అనే కంప్యూటర్ కోర్స్ పూర్తి చేశారు పద్మినీ. అది చేస్తే అమెరికా హెచ్1 బి వీసాకు అర్హత వస్తుందని పద్మని వాళ్ల అన్న చెప్పడంతో దాన్ని కంప్లీట్ చేశారు. అనంతరం హెచ్1బీ విసాకి అప్లై చేశారు. మొదటిసారి రిజెక్ట్ అయింది. రెండోసారి ప్రయత్నించినా అప్పుడు కూడా సేమ్ పరిస్థితి.

“నేను తెలుగు మీడియం స్టూడెంట్ ని, నాకు ఇంగ్లీష్ అంతబాగా రాదు,” పద్మిని

ఇంగ్లీష్ రాకపోవడం వల్లే వీసా రెండుసార్లు రిజెక్ట్ అయింది. అయినా తాను ప్రయత్నించడం మానేయలేదని ఆమె అన్నారు. ప్రయత్నించి ఫెయిలైనా ఫర్వాలేదు కానీ, ప్రయత్నించడంలో ఫెయిలైతే భరించలేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. పద్మిని వాళ్లబ్బాయి, భర్త.. తనకోసం చాలా వదులుకున్నారని అన్నారు. ప్రతి వీకెండ్ కి ఏలూరు వెళ్లి వచ్చేవారట. వారం రోజుల పనులన్నీ రెండురోజుల్లో పూర్తిచేసుకొని సోమవారానికల్లా హైదరాబాద్ లో రెడీ అయ్యేవారట. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఐబీఎంలో ఉద్యోగం చేసింది. అప్పుడే అమెరికాలో ఆన్ సైట్ లభించడంతో అక్కడికి వెళ్లారు. టెక్ మహీంద్ర తో పాటు చాలా ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ సహా ఏడు దేశాలల్లో పర్యటించారు.

“మెదటి సారి విసా రిజెక్ట్ అయిందని వదిలేసి ఉంటే నేనిక్కడ ఉండేదాన్ని కాదు,” పద్మిని

అలా వీసారిజెక్ట్ నుంచి ఇప్పుడు అమెరికాలోనే క్లెయింట్స్ సాధించే స్థాయికి ఎదిగారు పద్మిని.

సంహిత సాఫ్ట్ ప్రారంభం

వంద మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవంతో తాను సొంతంగా కంపెనీ ప్రారంభించాలనుకున్నారు. జాబ్ వదిలేసే సమయానికి పద్మిని సాలరీ అక్షరాలా 35లక్షలు.

“రిక్రూట్మెంట్ లో నాకున్న అనుభవమే నా పెట్టుబడి అని భావించా,” పద్మిని

2014లో ప్రారంభమైన సంహిత కి 12మంది క్లయింట్స్ ఉన్నారు. ఇందులో టెక్ మహీంద్ర లాంటి జెయింట్స్ ఉన్నాయి. దాదాపు మిలియన్ డాలర్ టర్నోవర్ తో దూసుకు పోతోంది కంపెనీ. మొదటి బ్రాంచి బెంగళూరులో, తర్వాత హైదరాబాద్ లో విస్తరించారు. ఈ ఏడాది చివరికల్లా అన్ని మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తున్నారు.

ఒక ఉద్యోగం ఇస్తే, ఆ వ్యక్తి కుటుంబానికి సాయం చేసినట్లవుతుంది, పద్మిని

మా కంపెనీ మోటో ఇదే. ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబానికి అది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారామె.

image


స్కూల్ టీచర్ నుంచి కంపెనీ సిఈఓ దాకా..

వీసా రిజెక్ట్ అయిన తర్వాత పద్మిని ఓ స్కూల్లో కంప్యూటర్ టీచర్ గా జాయిన్ అయ్యారు. అప్పుడు తన సాలరీ 17వందలు. అయినా మొదటిసాలరీ చెప్పుకోడానికి గర్వంగా ఉందంటారామె. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా టెస్టింగ్ ఫ్యాకల్టీగా పార్ట్ టైం జాబ్ చేసేవారు. 2001లో ఇక్కడ టెస్టింగ్ ఫ్యాకల్టీగా ఉన్న వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఎనిమిది ఇనిస్టిట్యూట్స్ లో చెప్పేవారట. ఇంజనీరింగ్ నుంచి రిలీవ్ అయిన వాళ్లకి ట్రెయినింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వడం ఈ సంస్థ చేసేపని.

ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు. ఉద్యోగరీత్యా ఎన్నో ప్రాంతాలకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఓ విలేజీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తనలాంటి అమ్మాయికి ఇది పెద్ద సవాలే అని చెప్పుకొచ్చారు. మార్నింగ్ ఫ్లైట్ కి ఒక చోటికెళ్లి సాయంత్రం ప్లైట్ లో వేరే చోటికి వెళ్లాలి. హోటల్లో సింగిల్ గా స్టే చేయాల్సి వచ్చేది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నానంటే.. అప్పటి నా ధైర్యం తలుచుకుని నాకే నవ్వొస్తుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన పద్మిని ఈ స్థాయికి రావడానికి ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.

“వాషింగ్టన్ డిసీలో ఉద్యోగం చేయడంకంటే.. ఇక్కడ ఉద్యోగాలు కల్పిండంలోనే ఎంతో సంతృప్తి ఉందని ముగించారు పద్మిని”

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding Course, where you also get a chance to pitch your business plan to top investors. Click here to know more.

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి