సంకలనాలు
Telugu

విద్యతో పాటు విలువలూ నేర్పించే ఓ ఎడ్యుకేషన్ స్టార్టప్ VAL-ED

విద్య మాత్రమే కాదు..విలువలూ ముఖ్యమేబెంగళూరులో వాల్-ఎడ్ ఇనిషియేటివ్ పేరుతో దేశంలో ఓ నవశకం కోసం ఓ యువకుడి కలతండ్రి చూపిన బాటలోనే..సమాజంలో మార్పుకోసం24ఏళ్ల మాయాంక్ సోలంకి విద్యా యజ్ఞం

19th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
" నీ చుట్టూ ఉన్న సమాజమే నిన్ను తయారు చేస్తుంది. నువ్వు దాన్ని మార్చాలా... ? లేక నిన్నే అది మార్చుతుందా ? అనేది నువ్వే నిర్ణయించగలవు" జిమ్రాన్ అనే అమెరికన్ ఆంట్రప్రెన్యూర్ చెప్పిన మాటలివి.

వాటిని గుర్తు చేసుకుంటూ..ఇప్పుడు తండ్రి బాటలో పయనిస్తున్న ఓ కొడుకు కథ చూద్దాం. ఓ గొప్ప తండ్రికి కొడుకుగా పుట్టడం మాయాంక్ సోలంకి చేసుకున్న అదృష్టం. డా. నరపతి సోలంకి మాయాంక్ తండ్రి .బెంగళూరులో ఓ గొప్ప ఆప్తాల్మజిస్ట్ (నేత్ర వైద్యుడు). గొప్ప అని ఎందుకన్నామంటే.. ఆయన కెరీర్లో 13లక్షల మందికి సంబంధించిన కంటి జబ్బులకు వైద్యం చేస్తే అందులో లక్షా నలభై రెండు వేలు ఉచితంగా చేసినవే. మరి అంత గొప్ప వైద్యుడు ఆధ్వర్యంలో నడిచే సోలంకి ఐ హాస్పటల్ దేశంలోనే పేరెన్నికగన్నది. వాల్ ఎడ్( val-ed) స్థాపించిన 24 ఏళ్ల మాయాంక్ సోలంకి డా. నరపతి తండ్రి. ఓ తండ్రికి ఇంతకన్నా ఏమైనా ఆనందం ఏముంటుంది..?

" టాలెంట్ ఉండటంతోనే సరిపోదని..అది మన చుట్టూ ఉన్న జనానికి పంచిపెట్టినప్పుడో..వారికి ఉపయోగపడినప్పుడు మాత్రమే దానికి సార్ధకత అని మా నాన్నగారు చెప్పేవారు.." మాయాంక్ యువర్ స్టోరీతో తన తండ్రి గురించి చెప్తూ గర్వంగా ఫీలయ్యారు. "అంత గొప్ప వ్యక్తితో సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఎవరైనా చాలా త్వరగా స్ఫూర్తి పొందుతారు. ఏదైనా చేయాలనే తపన పడ్తారు. ఆయనతో కలిసి రెండేళ్లు పని చేసినప్పుడు ఆయనతో పోటీ నాకు ఉత్తేజమే ఇచ్చేది తప్ప..పోటీలా ఫీలయ్యేవాడిని కాదు. ఐతే నా టేస్ట్ డిఫరెంట్ అని అప్పుడే అన్పించేది. వైద్యరంగం కాకుండా ఇంకేదైనా రూపంలో సమాజానికి సేవ చేయాలనే ఆలోచన బయల్దేరింది" గతం గుర్తు చేసుకున్నారు మాయాంక్ సోలంకి.

మయాంక్ సోలంకి, వాల్ ఎడ్ వ్యవస్థాపకులు

మయాంక్ సోలంకి, వాల్ ఎడ్ వ్యవస్థాపకులు


ఆ తపనతోనే మాయాంక్ సోలంకి పాతికేళ్లు దాటకుండానే రెండు సంస్థలు ప్రారంభించారు. మొదటిది యువ ఇగ్నైటెడ్ మైండ్స్...పేరుకు తగ్గట్లు యువతలోని ఆలోచనా శక్తికి, సృజనకు మెరుగులు దిద్దతూ, వారి ఉపాధికి సహకరించేది. యువ ఇగ్నైటెడ్ మైండ్స్ యూత్ కోసం చేపట్టిన కార్యక్రమాలకు ఏషియా పసిఫిక్ యూత్ నెట్వర్క్ , ఐలీడ్ ఇండియా క్యాంపెయిన్ అవార్దులతో పాటు టెడ్ స్పీకర్‌గా కూడా గుర్తింపు లభించింది. ఇక రెండోది.ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాల్-ఎడ్ ఇనిషియేటివ్స్. విద్యారంగంలో విద్యార్ధులకు చదువుతోపాటు విలువల గురించి చెప్పడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువు మాత్రమే కాదు సొసైటీకి అవసరమైన నైతిక, సాంఘిక, మానసిక విలువలు కూడా చెప్పడమనేది మాయాంక్ అభిప్రాయం. ఈ ఆలోచనకు యువ ఇగ్నైటెడ్ మైండ్స్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు బీజం పడిందంటారు మాయాంక్. 

"చాలామంది యువ మైండ్స్‌కు వస్తుండేవారు, ఇక్కడ తమ కోర్సు పూర్తికాగానే వెళ్లిపోతుండేవారు. అంతేగానీ ఇక్కడ నేర్పిన దాన్ని ఆచరణలో పెట్టడం కానీ అందుకు తగ్గ అవకాశాల కోసం ఎదురు చూడటం కానీ చేసేవారు కాదు. ఏదో యూనివర్సిటీలో డిగ్రీ పూర్తైనట్లు ఫీలయ్యేవారు. దీనికి కారణం ఆలోచిస్తే..మనం చేసేది వేరు..నేర్చుకునేది వేరు..చదువులు ఏదో ఉపాధి కోసం మాత్రమే అనే ధోరణే చాలామందిలో ఉంది. ఐతే వారిని తప్పుబట్టలేం..ఎవరికైనా బాధ్యతలు ముఖ్యమే. ఐతే మనసు చెప్పినట్లు నడుచుకోవడమనేది తెలియాలంటే..బేసికల్‌గా మన విద్యా వ్యవస్థలోనే కాస్త మార్పులు కావాలనిపించింది" అంటూ వాల్-ఎడ్ ఇనిషియేటివ్స్ ఆవిర్భావానికి పురిగొల్పిన సంఘటనలు గుర్తుచేసుకున్నారు మాయాంక్. 

మనిషి వ్యక్తిత్వం రూపొందడమనేది చిన్నవయస్సులోనే స్కూలింగ్ లోనే జరుగుతుంది. అది మన చుట్టూ ఉన్న సమాజంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఓ గొప్ప నైతిక,మానసిక విలువలున్న సమాజం కావాలంటే..ముందు ఆ మార్పును చిన్నపిల్లలనుంచే మొదలుపెట్టాలి. అప్పుడే వారి పెద్దైన తర్వాత ఓ తరంలో అయినా ఆ మార్పు చూడగలమంటారు మాయాంక్.

ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి..ఇదే మాయాంక్‌ను వేధించింది. అందుకే చాలా రీసెర్చ్ చేశాడు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాడు. స్కూళ్లలో పాఠాలు చెప్పే తీరును గమనించాడు. అన్నీ చూసిన తర్వాత అందరికీ తెలిసినదే అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోని అంశాన్ని గమనించాడు. లక్షలకు లక్షలు ఫీజులు కట్టే పేరెంట్స్‌కు తర్వాత పిల్లలను పట్టించుకునే తీరిక లేకపోవడమే అది. అంటే " ఓ తరం భవిష్యత్తును వారేం నేర్చుకుంటున్నారో చూసుకుకోకుండా సులువుగా క్లాస్‌రూమ్‌లో టీచర్లపైనా, ట్యూషన్ టీచర్లపైనా వదిలేసి మర్చిపోతున్నాం. ఇదే ఓరకంగా ప్రమాదకరంగా మారింది. కట్టే ఫీజులో పదిశాతం కూడా పిల్లల మానసిక, నైతిక విలువలను పెంచేందుకు కూడా వాడటం లేదు. కేవలం మార్కులు, ర్యాంకుల ఆధారంగానే బోధన సాగుతోంది. విలువలు లేని విద్య వినాశానికి దారి తీస్తోంది. ఓ మంచి వ్యక్తిగా ఎదగాలంటే విద్యతో పాటు విలువలూ ముఖ్యమే" తాను గమనించిన అంశాలను మాయాంక్ సోలంకి కాస్త ఆవేదనతో కూడిన స్వరంతో చెప్పారు.

image


అలా వాల్-ఎడ్ ఇనిషియేటివ్స్ ప్రారంభించిన మాయాంక్ ప్రేమ, ఆశావహ ధృక్పథం,ఏకాగ్రత, నిజాయితీ వంటి లక్షణాలు పెంపొందేలా ఓ కరిక్యులమ్‌ను తయారు చేసుకున్నారు. "పది నుంచి పదకొండేళ్ల పిల్లలకు ఈ అంశాలన్నీ తమాషాతో కూడిన పాఠాలతో పెంపొందేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇందుకోసం సైకాలజిస్టులు, విద్యారంగంలో నిజమైన నిపుణుల సాయంతో ఈ పాఠ్యాంశాలన్నీ ఓసారి చెక్ చేసుకుని ప్రారంభించాం. అంతకు ముందు పిల్లలు ఎప్పుడూ చూడని వాతావరణంలో పాఠాలు చెప్పడం ప్రారంభించాం. యుధ్దరంగంలో ఉన్నప్పుడు అనుసరించాల్సిన పద్దతులను, ఉండాల్సిన పాజిటివ్ యాటిట్యూడ్‌ను వివరించేటప్పుడు ఓ ఆర్మీ ఆఫీసర్‌తో, సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేసేటప్పుడు ప్రయోగంపై ఎంత ప్రేమ, ప్యాషన్ ఉండాలో తెలిసేందుకు ఓ సైంటిస్టుతో, పోలీస్ ఆఫీసర్‌గా పని చేసేటప్పుడు ఎంత నిజాయితీగా ఉండాలో ఓ పోలీస్ అధికారితో పాఠాలు చెప్పించేవాళ్ళం. చివరిగా వారి తల్లిదండ్రులతో పిల్లల్లోని విలువల వికాసాన్ని గమనించడానికి ఓ సెషన్ నిర్వహించేవాళ్లం. ఐతే ఇంత పెద్ద తతంగమంతా..రెండే రోజుల్లో పూర్తయ్యేది. తమ కోర్సు నిర్వహించే తీరును మాయాంక్ సోలంకి వివరించారు.

ఐతే ఇదేదో వీకెండ్‌లో వచ్చే రిఫ్రెష్‌మెంట్ కోర్సులా తయారుచేయలేదు మాయాంక్.. నిరంతర ప్రక్రియగా తయారు చేసారు. "ఫౌండేషన్ లెవల్, అడ్వాన్స్‌డ్, బియాండ్ లెవల్స్ అని మూడు దశలుగా కోర్సు రూపకల్పన చేశాం. ప్రతీ దశకూ మూడునెలల అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ మూడు నెలల్లో అప్పటిదాకా నేర్చుకున్న అంశాలు పిల్లల్లో ఏ మేరకు పాదుకున్నాయో ట్రాక్ చేస్తూ ఉండాల్సిందే" అంటారు మాయాంక్.

ఇక ఆదాయం విషయానికి వస్తే ఒక్క స్కూళ్లతోనే కాకుండా కార్పొరేట్ కంపెనీలనూ క్లయింట్లుగా తీసుకుంటుంది వాల్-ఎడ్ ఇనిషియేటివ్స్. స్కూళ్లలో తల్లిదండ్రులు ఫీజు పే చేస్తే..కంపెనీల్లో ఉద్యోగుల పిల్లలకు పే చేయాల్సిందిగా వాల్-ఎడ్ కోరుతుంది. ఓ వేళ కోర్సుతో సంతృప్తి చెందకపోతే..వారిచ్చిన ఫీజును తిరిగి ఇచ్చేస్తామని వాల్-ఎడ్ చెప్తోంది. ఇది వారి బోధనాపద్దతిపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.

భవిష్యత్తులో వాల్-ఎడ్ మరింత ఎదిగి దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తోంది. "స్కూళ్లలో టీచర్లకు పాఠాలు చెప్పేందుకు నేను సిద్ధం. ఎందుకంటే కనీసం ఓ పదిలక్షలమంది విద్యార్దులకు మా కోర్సు అందాలనేది మా లక్ష్యం. వారంతా దేశం గర్వించే ,దేశంలో మార్పు తెచ్చే వారుగా తయారైతే చూడాలనేది నా కల" అంటూ మాయంక్ సోలంకి తన డ్రీమ్ ప్రాజెక్టు లక్ష్యాన్ని వివరించారు. మాయాంక్ సోలంకి లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని యువర్ స్టోరీ ఆశిస్తోంది. కాకపోతే. ఇదంతా టైమ్ ఫ్యాక్టర్..విత్తనం నాటగానే చెట్టుకానట్లుగానే..ఇప్పుడు బీజం పడింది. ఇక సమీప భవిష్యత్తులోనే అతని కల నెరవేరేరోజు వస్తుందనుకోవచ్చు.

దేశంలో ఓ నవశకాన్ని కోరుకుంటుూన్న మాయాంక్ సోలంకి కథనంపై మీ అభిప్రాయాలు యువర్ స్టోరీతో పంచుకోండి. ఇలాంటి వాళ్లు మీకూ ఎవరైనా తారసపడితే మాకు తెలియజేయండి. య

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags