సంకలనాలు
Telugu

ఐటిలో మేటిగా ఎదుగుతున్న శ్రీలంక వనిత షాహిని

ఐటి రంగంలో మహిళలకు ఆదర్శం..కొత్త ప్లాట్ ఫామ్ ఆవిష్కరణ కు రంగం సిద్ధం చేసిన శ్రీలంక వనిత..ప్రపంచ ఐటి దిగ్గాలతో పోటీకి సై అంటున్న షాహిని..

Lakshmi Dirisala
18th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఎన్నో విజయాలకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం .. షహాని మార్కస్. షహాని శ్రీలంకలోని ఒక డాక్టర్ల కుటుంబంలో పుట్టిపెరిగారు. తానూ ఓ డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అలా జరిగి ఉంటే.. ఆమె వర్చుసా(శ్రీలంక)కు ఇంజినీరింగ్ హెడ్ కాలేకపోయేవారు. శ్రీలంకలోని ఐసిటీ ఏజెన్సీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయ్యేవారుకాదు. ఆమె యూనివర్శిటీ ఆఫ్ కొలంబోలో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్‌కి బోర్డు మేనేజ్‌మెంట్ మెంబరు కూడా. యునైటెడ్ నేషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కి సీనియర్ ఈగవర్నెన్స్ కన్సల్టెంట్, రాయల్ గవర్నమెంట్ ఆఫ్ బూటాన్‌కి సలహాదారు. ఇన్ని బాధ్యతల్ని చక్కబెడుతున్నా.. మూడు కంపెనీలకు సహ వ్యవస్థాపకురాలు కూడా.

గ్లామర్ అనేది దానంతట అదే వస్తుంది, షాలిని ఇప్పటి వరకు తన జీవితాన్ని నిజాయితీగానే గడిపారు కాబట్టి. అది ఆమె చదువైనా... కార్పొరేట్ జీవితామైనా, ఆమె అన్నిచోట్లా లింగ వివక్షను ఎదుర్కొన్నారు. కానీ ప్రతిసారి వాటిని ధైర్యంగా ఎదుర్కొని, విజయం అనే నిచ్చెన మెట్లు ఎక్కుతూ తన లక్ష్యాలకు చేరుకున్నారు. ఇప్పుడు శ్రీలంకలోని ఎందరో మహిళా టెక్కీలకు షాలిని ఓ రోల్ మోడల్. మా రచయిత, షహానితో సాగించిన సంభాషణల్ని ఎడిట్ చేసి ఇక్కడ ప్రచురిస్తున్నాం.

image


‘‘మెంటర్లతో మాట్లాడుతూ, వీలైనంత తొందర్లోనే మీ రోల్ మోడల్ ఎవరన్నది తేల్చుకోవడం చాలా ముఖ్యం. వాళ్ల స్ఫూర్తితో మీరు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. వాళ్ల అనుభవాలను తెలుసుకుంటూ... కష్టాలపై సవారీ చేస్తూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు ’’.

రీడర్స్ డైజెస్ట్ టెక్ శకం

చిన్నప్పటి నుంచి కూడా షహాని చదువు మీద అత్యంత శ్రద్ద చూపించేవారు, పుస్తకాలు చదవడం అంటే ఆమెకి అమితాసక్తి. టైమ్ మ్యాగ్జైన్, న్యూస్ వీక్ నుంచి రీడర్స్ డైజెస్ట్ వరుకు అనేక పుస్తకాల్ని కవర్ పేజీ నుంచి చివరి పేజీ దాకా ఏదీ వదిలిపెట్టకుండా చదివేసేవారు. శ్రీలంకలో టెలివిజన్ అప్పుడే అడుగుపెట్టిందని, ఇంటర్నెట్ ఇంకా రాలేంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారామె. మ్యాగ్జైన్ల ద్వారా యూఎస్‌లో టెక్నాలజీ పురోగతి మీద అవగహన ఏర్పర్చుకున్నారు. దీనికి సంబంధించి ఆమె మెదడులో ఓ ఊహాచిత్రం ఏర్పడిపోయింది. భవిష్యత్తులో కంప్యూటర్ గురించి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమెని డాక్టర్‌ని చేయాలనుకున్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మహిళ అయినప్పటీకి ఊహించని విధంగా శ్రీలంక నుంచి బయటకు వచ్చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.

10వ తరగతి పూర్తి అయిన తర్వాత ఆమె గణితం, జంతుశాస్త్రం ఎంచుకున్నారు. ఫలితంగా ఆమె వైద్య, భౌతిక శాస్త్రం రెండు రంగాలకు సంబంధించిన అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు. గణితం పట్ల ఉన్న ఆసక్తి కారణంగా తనంతటతాను ఇంజినీరింగ్ వైపు అడుగులు వేశారు. మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో ఎంపిక కాకపోవడంతో అందుకు బదులుగా భౌతిక శాస్త్రం తీసుకున్నారు. అదే సమయంలో యూనివర్శిటీ ఆఫ్ కొలంబోలోని స్టాటిస్టిక్స్ అండ్ మెథమెటిక్స్ డిపార్ట్‌మెంట్ లో కంప్యూటర్ విద్యను అందించేవారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఆకస్మిక మార్పులు కారణంగా ఆ కోర్సులో ప్రవేశాలు ఆపేశారు. దాంతో షహాని తల్లిదండ్రులు నిరాశచెందారు. కానీ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ బిజినెస్ (ఎన్ఐబిఎం) రూపంలో వారికి ఒక ఆశాకిరణం దొరికింది. అక్కడ కంప్యూటర్ సిస్టమ్ డిజైన్ కి సంబంధించి ఒక డిప్లమో కోర్స్ నిర్వహించేవారు.

స్కూల్ ఎ లెవెల్ క్లాస్

స్కూల్ ఎ లెవెల్ క్లాస్


ఆ రోజుల్లో సింక్లెర్ స్పెక్ట్రమ్ పర్సనల్ హోమ్ కంప్యూటర్ల అమ్మకాలను బ్రిటన్‌లో ప్రారంభించింది. షహాని తండ్రి కూడా ఒక కంప్యూటర్ ని కొన్నారు. దాని మీద ఆమె సోదరుడు గేమ్స్ ఆడుకునేవాడు. షహాని మాత్రం కొన్ని మ్యాగ్జైన్లను చదివి వాటిలో ఇచ్చిన సోర్స్ కోడ్‌ను సాధన చేసే పనిలో బిజిబిజిగా గడిపేది. ఎన్ఐబిఎంలో తమ బ్యాచ్ టాపర్‌గా నిలిచింది షహాని, అంతే కాదు ఆమెను అమెరికాకు వెళ్లి పెద్ద చదువులు చదవమంటూ ఆ సంస్థ అధిపతి ప్రోత్సహించారు. లైబ్రెరీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ డేటా ఎంట్రీ కార్యకలాపాల ద్వారా మంచి కాలేజీల వివరాలు ఆమెకు తెలిశాయి. తాను రూపొందించిన వివరాలను ఏ యూనివర్శిటీకి అందించాలన్నదాని కోసం ఆమె జర్నల్స్‌ను ఔపోసన పట్టేది.

కల నెరవేర్చుకోవాలా.. లేక డిగ్రీ చేయాలా ?

అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న షహాని నిర్ణయానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆమె లా చదవాలని, లా కాలేజీ పరీక్షలు పూర్తి చేయాలని వారు పట్టుబట్టారు (ఆమె ఆ పరీక్షలు రాయల్సిందేని ఆమె తల్లి గట్టి పట్టుదలతో ఉన్నారు). ఎన్ఐబిఎం డీన్‌తో చర్చించిన తర్వాత గాని వాళ్లు తమ కూతుర్ని అమెరికాకు పంపడానికి అంగీకరించలేదు.

అమెరికాలో బ్యాచిలర్ స్టడీస్‌కి అప్లయ్ చేసిన కొంత కాలానికే షహాని తండ్రి ఆకస్మికంగా చనిపోయారు. ఆమె ఆర్థిక స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక మైనర్‌గా ఆమె విద్యకు సహాయపడే వనరులేమీ లేకుండా పోయాయి. ఉన్న మార్గాలు కూడా చట్ట ప్రకారం వీలునామా రూపంలో మూసుకుపోయాయి. అదే సమయంలో ఆమెరికా నుంచి ఓ డాక్టర్ ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఆయన వైద్య విద్య అభ్యసించడానికి షహాని తండ్రి సాయపడ్డారు. ఆయన షహాని కుటుంబానికి సాయం చేసేందుకు సంతోషంగా ముందుకొచ్చారు. ఆయన రూపంలో షహాని విద్యకు ఒక స్పాన్సర్ దొరికారు. తనకు అదృష్టం కలిసొచ్చిందని షహాని సంతోషించింది. ఆమె పర్డ్యూ యూనివర్శిటీలో కాలేజీ చదువు ప్రారంభించింది. ఇంజినీరింగ్ విభాగంలో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్న సంగతి ఆమె అక్కడ గమనించింది.

ఆమె కంప్యూటర్ సైన్స్ అండ్ మేథమెటిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మేథమెటిక్స్‌లో మాస్టర్స్ చేసింది. అది అంకెల పట్ల ఆమెకు ఉన్న అభిరుచిని తెలియజేసింది. అదే సమయంలో పర్డ్యూ లో పిహెచ్‌డి చేస్తున్న ఒక శ్రీలంకన్ వ్యక్తితో షహానికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె అతడిని పెళ్లాడింది. పిహెచ్.డి పూర్తి చేసే సమయానికి ఆమెకు ఇద్దరు పిల్లలు.

షహాని దీంతోపాటుగా కంప్యూటర్ పరిశోధనలు సాగిచింది. కొద్ది పాటి తేడాలతో ఉన్న సమీకరణాలను తిరిగి ఉపయోగించుకోవడం మీద ఆమె పరిశోధనలు చేశారు. కంప్యూటర్ లాంగ్వేజెస్ అయిన సి, జావా, పెరల్ వంటి వాటిని సైంటిఫిక్ కంప్యూటింగ్, నియంత్రణ, వాటిని హైబ్రిడ్ సూపర్ కంప్యూటర్ సైంటిఫిక్ సాఫ్ట్ వేర్ అడ్మిన్ మాడ్యూల్స్ లో కంపైలింగ్ చేయడం వంటి అంశాలపై ఆమె పనిచేస్తుండేవారు.

ఆత్మవిశ్వాసం తగ్గడం, తిరిగి వెనక్కి రావటం

షాహినీ 1997లో న్యూయార్క్ లోని ఐబిఎం రిసెర్చ్ సెంటర్‌లో కన్సల్టెంట్ గా చేరారు. ఆదే సమయంలో న్యూయార్క్‌లో కొత్తగా ప్రారంభమవుతున్న కంపెనీలు ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్, ఇతర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు సంబంధించి అర్ధిక సంస్థల కోసం సిస్టమ్స్‌ను నిర్మించే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. 1999లో పిహెచ్‌డి పూర్తి చేసిన తర్వాత ఆమె అటువంటి స్టార్టప్ ఒకదాంట్లో దాదాపు ఏడాది పాటు ప్రిన్సిపల్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఆమె ఏం చెబుతారంటే..

‘‘అమెరికాలో చాలా తక్కువ మంది మహిళలు (శ్రీలంకతో పోల్చితే) మాత్రమే ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తారు. నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. నేను 'బెస్ట్' అనే నిర్ధారణకు రాలేకపోయాను ’’

షహాని సమస్య ఏంటంటే అప్పట్లో మహిళా రోల్ మోడల్స్ ఎవ్వరూ లేకపోవడమే. తమ పిల్లల్ని శ్రీలంక సంస్కృతికి అనుగుణంగా పెంచాలన్న ఉద్దేశంతో తిరిగి శ్రీలంకకు వెళ్లిపోవాలని ఆమె భర్త నిర్ణయించారు . షహాని మాత్రం ఈ మార్పుకి అంత సుముఖంగా లేరు. ఆమె వర్చుసా సీఈవోతో మాట్లాడిన తర్వాత శ్రీలంకకు వెళ్లడమే మంచిదని ఆయన గుర్తించారు. శ్రీలంకలో అవకాశాలు పరీశీలించి రమ్మని ఆయన సలహా ఇచ్చారు. శ్రీలంక టీమ్ షహానిని చీఫ్ అర్టిటెక్ట్‌గా నియమించుకుంది. ప్రారంభంలో కొంత కాలం ఆమె బోస్టన్ నుంచి పనిచేసేలా అంగీకరించారు.

తన డెస్క్ దగ్గర షహాని – వర్చుసా 2003

తన డెస్క్ దగ్గర షహాని – వర్చుసా 2003


వ్యాపారం నుంచి ఈగవర్నెన్స్ వైపు

షహాని వర్చుసాలో పనిచేసిన ఐదేళ్లలో, శ్రీలంక సెంటర్లో సభ్యుల సంఖ్య 200 నుంచి 1000కి పెరిగింది. ఆమె టెక్నాలజీ టీమ్‌ని నిర్వహించేవారు, ఒకే సమయంలో నడిచే 20 వేరు వేరు ప్రాజెక్టులకు కావాల్సిన టెక్నాలజీ పరమైన అవసరాలు తీర్చడం ఆ టీమ్ బాధ్యత. టీమ్ కోసం ప్రణాళికలు రూపొందించడం, సామర్ధ్యాల్ని కొలిచే సిస్టమ్స్ రూపొందించడం, సాఫ్ట్‌వేర్ డిజైన్లు, ఆర్కిటెక్చర్లను సమీక్షించడం ఆమె ప్రధాన బాధ్యతలు.

ఇంటిదగ్గర పిల్లలకు తన అవసరం ఎంతో ఉందని ఆమెకు అనిపించి, ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. కానీ ఉద్యోగం నుంచి వైదొలిగిన కొద్ది రోజుల్లోనే తాను ఇంట్లో ఉండలేనన్న విషయాన్ని ఆమె గుర్తించారు.

షహాని మెంటర్, ప్రొ. సమరనాయకే శ్రీలంక ప్రభుత్వ అత్యున్నత కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. దేశంలో ఈగవర్నెస్ అమలు చేసేందుకు పనిచేస్తున్న కమిటీ అది. శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఐసిటి ఏజెన్సీలో సీటీవో చేరాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. ఒక వ్యాపార సంస్ధలో పనిచేయడం కంటే ఇది చాలా భిన్నమైంది, కానీ ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించలేకపోయారు.

శ్రీలంకలోని ఐసిటి ఏజెన్సీలో షహాని

శ్రీలంకలోని ఐసిటి ఏజెన్సీలో షహాని


ఐసిటి ఏజెన్సీలో పనిచేసిన సమయంలో ఆమె లంక గేట్ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించారు. దీని లక్ష్యం ఏంటంటే అక్కడి వ్యవస్థలన్నింటిని ప్రధాన వ్యవస్థతో అనుసంధానం చేయడం. ఈ ప్రాజెక్టు మొత్తానికి ప్రపంచబ్యాంకు నిధులు సమకూర్చింది. ఆ ప్రాజెక్టును సేవాభావంతో కూడిన ఆర్కిటెక్చర్‌గా మార్చాలని ఆమె కలలు కనేవారు. ఓపెన్ సోర్స్‌కి మద్దతునిచ్చే వక్య్తిగా ఆమె ఓపెన్ సోర్స్ కాంపొనెట్స్‌తోనే ఆ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆమె భావించారు. ఇందుకోసం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఓపెన్ సోర్స్ వల్ల ఎదురైన ప్రధాన సవాల్ ఏంటంటే ఫ్రొక్యూర్‌మెంట్ మెథడ్ ఫలితాల్లో మార్పులు రావటం. దాని గురించి షహాని ఇలా చెబుతారు.

‘‘ ఆర్కిటెక్చర్ లేకుండా, మనం ఒక చురుకైన మార్గాన్ని పొందగలం అయితే ప్రస్తుత వ్యవస్థ వాటర్ ఫాల్ మెథడ్‌ను ఉపయోగించుకొంటోంది. ఈ చర్చ వాషింగ్టన్ డిసిలో ఉన్న ప్రపంచ బ్యాంకు కార్యాలయం వరకూ వెళ్లింది. ఈ మధ్యలో మేం ఒక పేపర్ ను ప్రచురించాం. ఓపెన్ సోర్స్ ఆధారంగా నడిచే ఈ-గవర్నమెంట్ సొల్యూషన్స్‌కి ఒక చురుకైన ప్రొక్యూర్‌మెంట్ మెథడ్‌కి సంబంధించింది అది.’’

ప్రపంచబ్యాంక్, అంతర్గత బ్యాంకుల సహకారంతో షహాని దానిని విజయవంతంగా అమలు చేయగలారు. మొదటి ఏడాది గడిచేటప్పడి ప్రొ. సమరనాయకే మరణించారు. అంత వరకు ఆయన రాజకీయ ఒత్తిళ్లు ఆమె పై పడకుండా రక్షణ కవచంలా నిలిచారు. ఆయన లేకపోవడంతో ఆ రాజకీయ వాతావరణంతో కూడిన సంస్థలో పనిచేయడం ఆమెకు చాలా కష్టమైంది. రెండు సంవత్సరాలపాటు సేవలు అందించిన తర్వాత ఐసిటి ఏజెన్సీని వదిలేయాలని నిర్ణయించుకున్నారు షహాని.

స్టార్టప్ మొదలపెట్టమని ప్రోత్సహించిన ప్రొఫెసర్

శ్రీలంకలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో నెంబర్ వన్‌గా పేరొందింది యూనివర్శిటీ ఆఫ్ మొరతువ్వా. అక్కడ కంప్యూటర్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేసేవారు షహాని. కమ్యూనికేషన్స్, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ సబ్జెక్టులను పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్ధులకు బోధించేవారు.

image


ప్రస్తుతం, షహాని తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలుకుంటున్నారు. అందుకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. 2011లో ఆమె కాలేజీల ఫుల్ టైమ్ బాధ్యతలకు రాజీనామా చేశారు. కానీ కొన్ని ప్రాజెక్టులకు గెస్ట్ ఫ్యాకల్టీగా కొనసాగుతున్నారు. ఆమె తన వ్యక్తిగత జీవితంలో చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన వృత్తి బాధ్యతల్ని వెంటనే ప్రారంభించాలనుకుంటున్నారు.

చివరగా ప్రారంభించడం... ఒకటో, రెండో కాదు

‘‘ నన్ను నేను పరిశీలించుకుంటే ఐటి పరిశ్రమలో ఉద్యోగం చేయడానికి కావల్సిన దానికంటే చాలా చాలా ఎక్కువగా క్వాలిఫికేషన్లు నాకు ఉన్నాయి. అక్సాంటా పేరుతో ఒక సాఫ్ట్ వేర్ సొల్యూషన్ కంపెనీని ఏర్పాటు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. వ్యాపార సంస్థల యొక్క శ్రమను తగ్గించే దిశగా మా కంపెనీ పని చేస్తుంది’’ అని చెబుతారు షహాని.

ద్వంద్వ పౌరసత్వం కారణంగా షహాని చాలా తేలికగా శ్రీలంక నుంచి బయటకు వెళ్లిపోగలరు. ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఆమె జనవరి 2014లో తన స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ మధ్యలో మార్చి2014 యూనివర్శిటీ ఆఫ్ మొరతువ్వాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న నలుగురు విద్యార్ధులు క్యాప్టన్ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒక భాషలోని భావాల్ని గుర్తించి, వాటిని విశ్లేషించడమే దీని ముఖ్య లక్షణం.

image


తమకు మైక్రోసాఫ్ట్‌కి చెందిన ఆడియన్స్ రెస్పాన్స్ సిస్టమ్ – బింగ్ ప్లాస్ పోటీదారుడని, కానీ సామర్ధ్యం విషయంలో ఎమోజోట్ కంటే అది వెనుకబడే ఉందని ఆమె అంటున్నారు.

నిజ జీవితంలోని భావోద్వేగాలను గ్రహించి విశ్లేషించగల సామర్థ్యం ఎమోజోట్ కి ఉంది. ఈ డేటా సాయంతో క్లయింట్లు తిరిగి వినియోగదారులను అర్ధం చేసుకోగలుగుతారు, అందుకు అనుగుణంగా సందేశాలను ఎడ్వర్టయిజ్ మెంట్ల రూపంలో నిజజీవితంలోకి తీసుకెళ్లగలుగుతారు. సందర్భానుసారంగా వ్యక్తమయ్యే భావోద్వేగాలను నిర్ధారించుకోవడం ద్వారా ప్రేక్షకుల ఫీలింగ్స్ ను అర్ధం చేసుకోవడంలో ఎమోజోట్ సాయపడుతుందని షహాని నమ్ముతున్నారు. ఈ కంపెనీ ఇప్పటికే శ్రీలంక లోని అతిపెద్ద టీవి చానెల్ తో కలిసి ఒక పైలెట్ ప్రాజెక్టు నిర్వహిస్తోంది.

నేర్చుకొనే క్రమంలో తప్పులు

‘‘టెక్ ఫీల్డ్ లోకి రావటమే మహిళలకు ఉత్తమమైన మార్గం. మీరు మీ లక్ష్యాల కోసం పనిచేయవచ్చు, మీ కుటుంబానికి తగినంత సమయం కేటాయించవచ్చు. అదే ఒక డాక్టరో, లాయరో అయితే ఇది కొంచెం కష్టమే, మీరు ఎక్కువ సమయం పనిచేసే చోటే గడపాల్సి ఉంటుంది.’’

ఒక స్టార్టప్ యొక్క విజయం పూర్తిగా దాని టీమ్ సభ్యులు, గతి సూత్రాల మీదే ఆధారపడి ఉంటుందంటారు షహాని. ఒక వీడ్కోలు సభలో ఆమె ఈ విషయాన్ని నొక్కి చెప్పారు,

‘‘మెంటర్లతో మాట్లాడటం మొదలుపెట్టడం, వీలైనంత తొందరలోనే ఒక రోల్ మోడల్ ను వెతికి పట్టుకోవడం చాలా ముఖ్యం. వాళ్లు మిమ్మల్ని ముందకు నెడతారు, దాంతో మీరు పడుతూ లేస్తూ పురోగతి సాధిస్తారు, వాళ్ల పరపతితో మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, అనుభవం సాధిస్తారు. ’’
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags