చిన్నారుల బాగోగులు చూసే టైనీస్టెప్‌.. ఆసరాగా నిలిచిన ఫ్లిప్‌కార్ట్ !

చిన్నారుల బాగోగులు చూసే టైనీస్టెప్‌.. ఆసరాగా నిలిచిన  ఫ్లిప్‌కార్ట్ !

Thursday January 21, 2016,

2 min Read

ఏంటి సంగతి.. పాప ఏడ్చింది.. అయితే ఫలానా వాటర్ పట్టమని చెప్పు.. చిన్నప్పుడు నేను నీకు అదే పట్టేదాన్ని.. ఒకప్పుడు ఈ యాడ్ మనందరికీ కంఠతా వచ్చేది. పిల్లలను ఎలా పెంచాలి.. వాళ్లకు ఏం తినిపించాలి? ఇలాంటి విషయాలన్నీ ఇంట్లో పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. సలహాలిచ్చేవాళ్లు. అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు. ఎవరో ఒకరు సాయం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.

image


ఇప్పడెవరు చెప్తారు. పైగా ఈ జనరేషన్ పిల్లలను పెంచాలంటే మాటలు కాదు. అదో ఆర్టు. అంతకుమించిన టాస్క్. ఒక విధంగా చెప్పాలంటే య‌జ్ఞంలాంటిది. తినే తిండి దగ్గర్నుంచి ఆటవస్తువుల వరకు ఏం చేసినా జాగర్తగా చేయాలి. ఎన్నో అంశాలు పేరెంట్స్‌ని తిక‌మ‌క పెట్టేస్తుంటాయి. వీటితో పాటు పిల్ల‌ల ఆరోగ్యంపై స‌ల‌హాలు సూచ‌లు తీసుకోవాలి. పాత‌కాలంలో అయితే పెద్ద‌వాళ్లు జాగ్ర‌త్త‌గా అన్నీ నేర్పించేవాళ్లు. ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌లే లేవు. మ‌రి ఎలా? మ‌ంచీ చెడ్డా ఎలా తెలుసుకోవాలి? ఆ ఆలోచ‌న నుంచి పుట్టిందే టైనీ స్టెప్స్‌!

ఈ కామ‌ర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఈ కంపెనీకి పెద్ద‌మొత్తంలో సీడ్‌ ఫండింగ్ చేసింది. ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌తో పాటు.. కంపెనీని మ‌రింతగా విస్తరించేందుకు ఈ ఫండింగ్‌ను వినియోగించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది టైనీస్టెప్స్‌!

2015 సెప్టెంబ‌ర్‌లో మొద‌ల‌యిన ఈ కంపెనీ ఒక సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫాం, ఫేస్‌బుక్‌లోలా అన్నీ క‌ల‌గ‌లిపిన వ్య‌వ‌హారాలు కాకుండా.. కేవ‌లం పిల్ల‌ల గురించి మాత్ర‌మే ముచ్చ‌టించుకునే ఒక వేదిక‌. అందులో రిజిస్ట‌ర్ చేసుకున్న పేరెంట్స్ ఎవ‌రైనా.. మ‌రో పెరెంట్‌తో ఇంట‌రాక్ట్ అవ్వ‌చ్చు.ఇప్ప‌టికే ఇందులో దాదాపు 10వేల మంది రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్స్ ఉన్నారు.

“ ఇత‌రుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుంటూ త‌మ పిల్ల‌ల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా పెంచేందుకు ఈ ప్లాట్‌ఫాం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.తాజా ఫండింగ్‌తో ఫ్లిప్‌కార్ట్ మాకు అవ‌స‌ర‌మైన గైడెన్స్ ఇస్తోంది” - టైనీ స్టెప్స్ ఫౌండ‌ర్ సుహ‌యిల్ అబీదీ.

క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ రూపంతో పాటు ఫోరం, గ్రూప్‌చాట్స్‌లాంటి స‌దుపాయాల‌తో ఇంట‌రాక్ష‌న్‌ను టైనీస్టెప్ మ‌రింత సుల‌భ‌త‌రం చేసింది. పిల్ల‌ల‌కు ఎప్ప‌డెప్పుడు వ్యాక్సినేష‌న్ చేయించాలి? మ‌ంచి ఆరోగ్యానికి ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వాలి? లాంటి వివ‌రాల‌ను కూడా పొందుప‌ర్చారు.

“ ప్ర‌స్తుత మార్కెట్‌లో ఈ కాన్సెప్ట్‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంది. టైనీస్టెప్స్ టీమ్‌లో కూడా మంచి ఉత్సాహ‌వంత‌మైన యువ‌తీయువ‌కులు ఉన్నారు.- నిషాంత్, ఫ్లిప్‌కార్ట్ కార్పొరేట్ డెవ‌ల‌ప్‌మెంట్ హెడ్.

బిజినెస్ మోడ‌ల్‌

ప‌క్కా వ్యాపారంలా కాకుండా.. డాక్ట‌ర్లు, త‌ల్లిదండ్రులతో పాటు పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌ర్వీసుల‌ను అందిచేవాళ్ల‌ను ఒక‌తాటిపైకి తీసుకురావ‌డ‌మే టైనీస్టెప్ ల‌క్ష్య‌మంటారు ఆ సంస్థ ఫౌండ‌ర్ సుహెయిల్‌. త‌ర్వాత ప్లాట్‌ఫామ్‌లో జ‌రిగే ట్రాన్సాక్ష‌న్ల ద్వారా రెవెన్యూ వ‌స్తుంద‌ని అంటున్నారు.

యువ‌ర్‌స్టోరీ విశ్లేష‌ణ‌

కిడ్స్‌ స్టాప్‌ ప్రెస్‌, బేబీ చక్ర‌, పేరెంటింగ్‌ నేష‌న‌ల్‌, మైసిటీ ఫ‌ర్ కిడ్స్ లాంటి సంస్థ‌ల‌తో కిడ్స్ స‌ర్వీస్ మార్కెట్ 2500 కోట్ల అమెరిక‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది.ఇప్ప‌టికే చాలా కంపెనీలు ఈ మ‌ధ్య‌కాలంలో భారీ స్థాయిలో ఫండింగ్ ద‌క్కించుకున్నాయి.

ఎక్స్‌ప‌ర్ట్స్, బ్లాగ‌ర్స్‌, కిడ్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రొవైడ‌ర్స్‌తో పాటు స‌ర్వీసులు అందించేవారంద‌రినీ ఒకచోట చేర్చిన KIDDS అనే కంపెనీ.. స్ట్రాట‌జిక్ ఇన్వెస్ట‌ర్ల ద్వారా గ‌త సెప్టెంబ‌ర్‌లో 500,000 అమెరిక‌న్ డాల‌ర్లు ఇన్వెస్ట్‌మెంట్ ద‌క్కించుకున్నాయి. అలానే బేబీ చ‌క్ర‌లో సింగ‌పూర్ ఎంజెల్ నెట్‌వ‌ర్క్‌తో పాటు ముంబై ఎంజెల్స్‌, ప‌ట్నీ ఫ్యామిలీ ఆఫీస్‌లు 6 ల‌క్ష‌ల అమెరిక‌న్ డాల‌ర్లు పెట్ట‌బ‌డి పెట్టాయి. ఇన్వెస్ట‌ర్ల ఆస‌క్తి, మార్కెట్‌లో అవ‌స‌రాల‌ను బ‌ట్టి చూస్తే మొత్తమ్మీద పేరెంటింగ్ కాన్సెప్ట్ రాబోయే కాలంలో వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే చెప్పాలి,