సంకలనాలు
Telugu

ఫ్యాషన్‌కి కేరాఫ్ ఎఫ్ స్టుడియో !

-ఎకో ఫ్రెండ్లీ, నేచురల్ డై ఫ్యాబ్రిక్స్ -మూడున్నరేళ్ల క్రితం హైదరాబాద్ లో వ్యాపారం -ఆన్ లైన్ లో అమ్మకాలతో దూకుడు

21st Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఫాషన్‌. ఇదొక రకమైన సోషల్ స్టేటస్‌. బ్రాండ్ న్యూ ఫోన్‌. బ్రాండ్ న్యూ కారు. అలాగే బ్రాండ్ న్యూ క్లోత్స్. బట్ట బ్రాండెడా కాదా అన్నది మ్యాటర్‌. అది చూసిన తర్వాతే ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడేది! ఒకప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. డ్రెస్‌ని చూసి సెల్యూట్ చేసే సమాజం. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ కూడా మర్చేయాలి! లేకపోతే సమాజంలో వెనుకబడ్డాం అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి వారికోసమే ఎఫ్ స్టూడియో!

“సింతటిక్ గార్మెంట్స్ ను జనం నుంచి దూరం చేసి, జనాన్ని నేచర్ కు దగ్గర చేయడమే మా లక్ష్యం.” కో ఫౌండర్ హిమాంశు రటాని

ఎఫ్ స్టుడియోస్ ప్రధానంగా సహజసిద్ధమైన, సాంప్రదాయ ఫ్యాబ్రిక్ కు ప్రోత్సహిస్తుంది. వాటినే అమ్మకానికి పెడతారు. సిల్క్, కిఫోన్, వెల్వెట్, సేతిన్, బ్రోకేడ్, లినెన్, ఝరీ, కాటన్, డిజిటల్ ప్రింట్ లాంటి బట్టలు ఈస్టోరులో ఎక్కువగా దొరుకుతాయి.

image


ఆఫ్ లైన్ టు ఆన్ లైన్

ఎఫ్ స్టుడియో సూరత్ కేంద్రంగా ప్రారంభమైన ఆఫ్ లైన్ స్టోర్. మూడున్నరేళ్ల క్రితం హైదరాబాద్ లో వ్యాపారాన్ని విస్తరించింది. అనంతరం ఆన్ లైన్ సేట్స్ లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఢిల్లీ, కోల్‌కతా, పాట్నా, అహ్మదాబాద్ లో ఆఫ్ లైన్ స్టోర్లున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆన్ లైన్ సర్వీసులు కూడా ప్రారంభించింది. తమకున్న కస్టమర్ బేస్ తోనే ఆఫ్ లైన్ వ్యపారం సైతం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందంటున్నారు హిమంశు. ఆఫ్ లైన్ స్టోర్ లో తమని ఓ బొటిక్ గానే చూసిన జనం ఆన్ లైన్ లో పూర్తి స్థాయి స్టుడియోగా రిసీవ్ చేసుకున్నారని చెప్పుకొచ్చారాయన. బొటిక్ కంటే ఎక్కువ వయబిలిటీ ఆన్ లైన్ మార్కెట్ లో ఉందంటన్నారాయన. తమ స్టోర్ సేల్స్ ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ పాపులారిటీ విషయంలో ఆన్ లైన్ లోనే ఎక్కువగా వస్తోందని అభిప్రాయపడ్డారు.

image


ఎఫ్ స్టుడియో టీం

హిమంశు ఎఫ్ స్టుడియో కో ఫౌండర్. హైదరాబాద్ స్టుడియో వ్యవహారాలతో పాటు డిజైనింగ్ , ఫ్యాబ్రికేషన్ అతనే చూసుకుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యూయేషన్ చేసి, వ్యాపారంలోకి అడుగు పెట్టారు. తనతో పాటు ఐదుగురు కో ఫౌండర్లున్నారు. మార్కెటింగ్, స్టిచింగ్ , ఆన్ లైన్ సేల్స్, ప్రమోషన్స్, ఆపరేషన్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో పని చూసుకుంటారు. వీరితోపాటు అన్ని స్టోర్లలో కలిపి 200లకు పైగా ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఎంతో మంది డిజైనర్లతో టై-అప్ అయిన ఈ స్టుడియో డిజైన్స్ ను ఆన్ లైన్లో డిస్ ప్లే చేస్తుంది.

image


ఎఫ్ స్టుడియో ప్రాడక్టులు,ఎగ్జిబిషన్లు

ఎఫ్ స్టుడియో చైన్ ప్రధానంగా రెండు రకాల సెగ్మెంట్లను కస్టమర్లకు అందిస్తోంది. ఫ్యాబ్రిక్స్ ఎంబ్రాయిడరీ, రెడీమేడ్ సెగ్మెంట్ లే వీరి టార్గెట్. 5వందల నుంచి 50వేల దాకా ధర ఉండే గార్మెంట్స్ ఈ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి.

“ఆన్ లైన్ లో డిజైన్ ఫ్యాబ్రిక్ రిటైల్ చైన్ మాదే.” హిమాంశు

ఎకో ఫ్రెండ్లీ, నేచురల్ డై ఫ్యాబ్రిక్స్ ఎఫ్ స్టుడియోలో దొరుకుతాయి. ధర కూడా చాలా రీజన్ బుల్ అంటున్నారు. జపాన్ లోని అసాహి బెంబర్గ్, బిర్లాగ్రూప్ లతో టై అప్ అయిన ఈ స్టోర్ కి ఇప్పటి వరకూ వేల సంఖ్యలో రిజిస్ట్రర్ కస్టమర్లున్నారు. సైట్ ద్వారా ప్రతి రోజూ లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ఎగ్జిబిషన్లలో ఎఫ్ స్టుడియో పాల్గొంది. దాదాపు మూడు వేలకు పైగా వెరైటీల దుస్తులను ఇప్పటి వరకూ ప్రదర్శనకు పెట్టింది. ఫ్యాషన్ ఈవెంట్లలో కూడా పాల్గొని అవార్డులు పొందింది. టార్గెట్ కస్టమర్లను రీచ్ అవ్వడానికి మరిన్ని ఎగ్జిబిషన్స్ లో పాల్గొంటామని హిమంశు చెప్పుకొచ్చారు.

లక్ష్యాలు, పోటీదారులు

ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్న ఎఫ్ స్టుడియో టార్గెట్ ఆడియన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇదే సెగ్మెంట్ లో తక్కువ ధరలకే దొరికే గార్మెంట్స్ తో ప్రధానంగా పోటీ పడాల్సి వస్తుంది. అయితే ఫ్యాషన్ దుస్తులకు కేరాఫ్ గా మారినప్పుడు వేరే వారి పోటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని హిమంశు అంటన్నారు. ఈ కామర్స్ సైట్లలో ఫ్యాషన్ దుస్తుల్లో ఎక్కువ వెరైటీలు లభిస్తున్నాయి. ఎఫ్ స్టుడియో లో ఎక్కువ రకాలైన స్టైల్స్ ఉండాలి. దీన్ని అధిగమించాల్సి ఉంది. స్టైలింగ్ కోసం ఎక్కువ మంది డిజైనర్లతో టై అప్ కావాల్సిన అవసరం ఉంది.

image


భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే ఏడాది సరికి మొబైల్ ఫ్లాట్ ఫాం లోకి ప్రవేశించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో అమ్మకాలతో దూసుకు పోతున్న ఎఫ్ స్టుడియో యాప్ మోడ్ లోకి ప్రవేశించాలనుకుంటోంది. డెలివరీ విషయంలో మరింత స్పీడ్‌ పెంచాలని ప్రయత్నిస్తున్నారు. అమెరికాతో పాటు మిడిల్ ఈస్ట్ లలో స్టోర్లను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషన్ పార్ట్‌నర్‌ షిప్ కోసం ఫండింగ్ వస్తే ఈ ప్రాజెక్టును మరింత త్వరగా పట్టాలెక్కించాలనుకంటున్నామని హిమాంశు ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags