సంకలనాలు
Telugu

మాల్తీ బోజ్వానీని చూస్తే జీవితంపై ఆశకలుగుతుంది !

- లైఫ్ కోచింగ్ ఇచ్చే మాల్తీ బోజ్వానీ- పర్సనాలిటీ డెవలప్ మెంట్ తో అద్భుతాలు- మల్టీ టాలెంటెడ్ ఉమెన్ బోజ్వానీ

CLN RAJU
22nd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మాల్తీ బోజ్వాని... ఓంటోలాజికల్ ట్రైనర్. ఇంకా చెప్పాలంటే లైఫ్ కోచ్. నిరాశ నిస్పృహలతో సతమతమవుతున్న వారిలో కొత్త ఉత్సాహం నింపుతారు. అంతేకాదు సమస్యలను అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో నేర్పిస్తారు. ఇక జీవితం ఇంతేనా అని నిరాశలో బతికేవారిలో ప్రేరణ కలిగించి కొత్త జీవితానికి దారి చూపిస్తారు. ఈమెను కలిసినప్పుడు తన జీవితంలో ఎత్తుపల్లాల గురించి చెప్పుకుంటూ వచ్చారు.

మాల్తీ బోజ్వానీ, ట్రైనర్-రైటర్,లైఫ్ కోచ్

మాల్తీ బోజ్వానీ, ట్రైనర్-రైటర్,లైఫ్ కోచ్


మాల్తీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు

ఇండోనేషియాలో ఇంగ్లీష్ టీచర్ గా మల్టీ జీవితం మొదలైంది. మాల్తీ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ జెమాలజీ పూర్తి చేశారు. తర్వాత ఆస్ట్రేలియాలోని తన ఫ్యామిలీ బిజినెస్‌ను కొనసాగించారు. చిన్న వయసులోనే మల్టీకి వివాహమైంది. అప్పుడే ఆమె జీవితం మలుపు తిరిగింది. మ్యారేజ్ కావడంతో బయటకు వెళ్లి జాబ్ చేసేందుకు వీలుకాలేదు. అందుకే ఆమె 26 ఏళ్ల వయసులో స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకుని బయటకొచ్చారు. తన కూతురి బాధ్యతను భుజాన వేసుకుని సరికొత్త జీవితం ప్రారంభించారు.

టోనీ రాబిన్స్ సెమినార్‌కు అటెండ్ అయినప్పుడు నేను ఎంత కష్టతరమైన ఫీల్డ్ లోకి అడుగు పెడుతున్నానో తెలిసింది. ఇదే సెమినార్‌తో మల్టీ... పర్సనల్ డెవలప్‌మెంట్ జర్నీ మొదలైంది. మల్టీ ఇలాంటి ఎన్నో సెమినార్లకు హాజరుకావడంతో పాటు ఎల్.జి.ఏ.టి లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ అనుభవం మల్టీ కొత్త జీవితానికి మార్గం సుగమం చేసింది

''ఇంటర్నేషనల్ కోచ్ ఫెడరేషన్ అండ్ ట్రైన్డ్ టుబి ఏ లైఫ్‌లో నా పేరు నమోదు చేసుకున్నాను. తర్వాత లైఫ్ కోచ్‌గా మారాలని నిర్ణయించుకున్నారు. అయితే నాకొచ్చిన విద్యను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే దానిపై నాకే స్పష్టత లేదు. మూడేళ్లు అలానే గడిచిపోయాయి. ఆ సమయంలో నాకు ఆర్ధిక సమస్యలు తీవ్రంగా వేధించాయి. నా బంధువులు, స్నేహితులు ఏదైనా ఉద్యోగంలో చేరమని సలహా ఇచ్చారు. కాని నేను అలా చేయలేదు. నేను ఏదైతే అనుకున్నానో ఆ జీవితం కోసమే కష్టపడ్డాను. అదే ఇప్పుడు నన్ను అగ్రస్థానాన నిలబెట్టిందని'' మాల్తీ చెబుతారు.

దేవుడిపై గట్టి నమ్మకమే మల్టీని మానసికంగా ధృడపరిచింది. మాల్తీ రాసిన '7 రికవరీ స్టెప్స్ టు గెట్ ఓవర్ ఏ బ్రేకప్' అనే ఆర్టికల్ అందరిని ఆలోచింపజేసింది.

మాల్తీ బోజ్వాని అందరికీ స్ఫూర్తి దాయకంగా మారారు. తను చాలా స్లిమ్ గా ఉంటారు. శరీరాన్ని ఫ్యాట్‌కు దూరంగా ఉంచుతారు. అందుకే ఆమె ఎప్పుడూ చిన్న పిల్లలానే కన్పిస్తారు. సంతోషం అనేది మన పనుల వల్లే వస్తుంది కాని ఇతరుల వల్ల కాదని బలంగా నమ్ముతారు. తనను తాను ప్రేమిస్తారు. తనలో సామర్ధ్యం, తనకున్న సమయంపైనే ఫోకస్ పెడుతూ బిజినెస్ ను డెవలప్ చేస్తున్నారు.

మల్టీ వృత్తిగత జీవితం సాగిందిలా....

మల్టీ 500 మందిని ట్రైన్ చేస్తూ కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించారు. నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్లల్లో మాల్తీ ధైర్యాన్ని నింపుతారు. మూడు నుంచి నాలుగు నెలల పాటు పర్సనల్ గా వాళ్లతో టచ్ లో ఉంటారు. ఇలా వాళ్లను మళ్లీ మామ్మూలు మనుషులగా తీర్చిదిద్దుతారు. మాల్తీ కోచింగ్ ఇంటర్నేషనల్ పేరుతో ఓ సంస్థను ఆమె ఆర్గ్ నైజ్ చేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ట్రైనింగ్, వర్క్ షాప్స్, కార్పొరేట్ ట్రైనింగ్, ఇండివిడ్యువల్ కౌన్సెలింగ్ ఇస్తారు. మాల్తీ థాయ్‌లాండ్ మైక్రోసాఫ్ట్ వర్క్ షాప్‌లో ఇచ్చిన స్పీచ్ ది బెస్ట్ గా నిలిచింది. కార్పొరేట్ వరల్డ్ లో కూడా తన ముద్ర వేస్తున్నారు మల్టీ. ఆ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులను ఫాలో అవుతూ తన సత్తా చాటుకుంటున్నారు.

image


మాల్తీ.. మల్టీ టాలెండ్ ఉమెన్. ఈమె రచయిత కూడా. 'డోంట్ థింక్ ఆఫ్ ఏ బ్లూ బాల్' పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి కూడా ఇది ట్రాన్స్‌లేట్ చేశారు. థ్యాంక్‌ఫుల్ అప్రిసియేషన్ గ్రాటిట్యూడ్ అనే మరో పుస్తకాన్ని తను రాశారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేలా మరిన్ని పుస్తకాలు రాయాలన్నది ఆమె ఆలోచన.

సోషల్ మీడియాలోనూ మల్టీ దూసుకుపోతున్నారు. యూ ట్యూబ్ లో ఆమె ఓ ఛానల్ రన్ చేస్తున్నారు. తన సంస్థకు సంబంధించి డీటెల్స్ ను అందులో ఉంచుతున్నారు. డైవర్స్ కు సిద్ధమైన దంపతులకు మల్టీ కౌన్సెలింగ్ ఇస్తారు. ఛాలెంజ్స్ ను ఎదుర్కోవడమెలా...? నిజంగా మనమేంటి...? అనే విషయాలపై మల్టీ కౌన్సెలింగ్ ఇస్తుంటారు.

ఇండియాలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు ఇంకా థెరపిస్టులను ఆశ్రయించడం దారుణం. మనకు డిజిటల్ వరల్డ్ అందుబాటులో ఉంది. అది మనకు అన్ని విధాలుగా సహకరిస్తుందని మల్టీ చెబుతారు. ఆన్ లైన్ మీడియాతో ప్రైవెసీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యకు పరిష్కారం దొరకుతుంది. జనం ఎలాంటి సంశయం లేకుండా ఆన్ లైన్ లో సంప్రదించొచ్చు.

మానసిక ఒత్తిడి అధిగమించేందుకు 3 విషయాలు ఆచరించాలి

1. తప్పు జరిగిందని విచారంతో కూర్చోకుండా ముందుకెళ్లాలి. మనకుండే వనరులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ నిర్ణీత సమయంలో మంచి ఫలితాలు సాధించాలి. అలా చేసినప్పుడు అందరిలోనూ మనకు మంచి గుర్తింపు లభిస్తుంది.

2. ప్రతి పనిలోనూ ఎఫర్ట్ పెట్టాలి. ఏదీ సులభంగా అవుతుందని భావించకూడదు. అలాగే దేన్నీ మరో దానితో పోల్చకూడదు. సక్సెస్ ఒక్కటే కాదు అందరి కంటే మనం గొప్పగా ఉండాలి. సాకులు చెప్పే తీరుకు స్వస్తి పలకాలి

3. నేనంత మంచివాడ్ని కాదు, నేనిది చేయలేను, ఇది చాలా కష్టం లాంటి ఆలోచనల్ని మైండ్ నుంచి తొలగించాలి. ఎప్పుడూ నేను మంచివాడ్నే, నేనిది ఖచ్చితంగా చేయగలను అనే ఆలోచన మనల్ని పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. మనల్ని మనం గౌరవించుకునేలా చేస్తుంది.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags