సంకలనాలు
Telugu

సరుకులూ, రెసీపీ అన్నీ మేమే ఇస్తాం.. జస్ట్ వండుకోండి చాలు

బిల్ట్ టు కుక్ వినూత్న కాన్సెప్ట్..ఉప్పు,పప్పు,నూనె అన్నీ వాళ్లే ప్యాక్ చేసి మరీ పంపుతారు..వంట ఎలా వండుకోవాలో కూడా వివరిస్తారు..జస్ట్ స్టౌ వెలిగించి వంట చేసుకుని తినడమే పని..

26th Sep 2015
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share


టైం లేదు.. టైం లేదు.. ఈ మధ్య ఎల్.కె.జి. పిల్లాడి నుంచి ఎవరిని కదిపినా.. ఇదే మాట. అందరూ బిజీనే. ఎవరికీ క్షణం తీరిక ఉండడం లేదు. చివరకు ఎంత బిజీ అయిపోయారంటే.. కడుపు నిండా తినేందుకు కూడా తీరికలేని బతుకులైపోయాయి. అందుకే ఈ మధ్య ఫుడ్ స్టార్టప్స్ పండగ చేసుకుంటున్నాయి. ఏకంగా ఇంటికే ఆహారాన్ని కూడా తెచ్చిపెడ్తున్నాయి. అయితే బయటి ఆహారం కంటే... మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో చాలా మందిలో ఉంటుంది. కానీ ఏదైనా వంట చేయాలంటే.. అందుకు అవసరమైన కూరగాయలు, సరుకులు తెచ్చుకునే ఓపిక లేక ఏదో ఒకటి లాగించేస్తున్నారు. దీన్నే ఓ వ్యాపారావకాశంగా గుర్తించారు అల్తాఫ్. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లా.. ఇన్‌స్టంట్ ఫుడ్‌ను రెడీ చేస్తున్నారు.

image


బిల్ట్ టు కుక్ (built2cook.com) ఇదో వినూత్న ఆలోచనతో మొదలైన ఫుడ్ స్టార్టప్. ఇక్కడ ఏంటంటే.. వంటకు కావాల్సిన సరుకులన్నీ.. ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తారు. రెసీపీ కూడా దానిపై పక్కాగా రాసి ఉంటుంది. జస్ట్ వాటిని ఫాలో అయి.. ఇంట్లో వంట వండుకోవడమే. కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో లోపు తయారైపోయే వంటలకే వీళ్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ మాత్రం కష్టం లేకుండా జస్ట్ నూడుల్స్ వండుకున్నంత సులువుగా వంట తయారు చేసుకోవచ్చనేది వీళ్ల కాన్సెప్ట్.

image


ఉదా. ఏదైనా చైనీష్ డిష్ ఆర్డర్ చేశామని అనుకుందాం. అందుకు అవసరమైన ఆలివ్ నూనె ఉప్పు, కారం, కొబ్బరి తురుము సహా.. వంటకు సంపూర్ణంగా తయారయ్యేందుకు చిన్న చిన్న డిటైలింగ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని సామగ్రిని డెలివర్ చేస్తారు. దానితో పాటు వంట ఎలా వండాలి.. అనే రెసిపి కూడా పక్కాగా ప్రింట్ చేసి పంపిస్తారు. ఏవైనా డౌట్స్ వస్తే చెఫ్స్‌తో మాట్లాడుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

బిల్ట్ టు కుక్ టీం

ఈ స్టార్టప్‌ను అల్తాఫ్ సయీద్ ప్రారంభించారు. అతనికి హైదరాబాద్‌తో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు.. కానీ ఆఫీస్ పనుల మీద ఇక్కడికి చాలాసార్లు వచ్చేవారు. అందుకే ఈ నగరంతో అనుబంధం ఏర్పడి ఇక్కడి నుంచి తన స్టార్టప్ మొదలుపెట్టారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ చేసిన అల్తాఫ్.. ఇప్పటికే రెండు స్టార్టప్స్‌లో చురుగ్గా ఉన్నారు. వైబ్రంట్ గుజరాత్‌కు విదేశాల్లో బ్రాండింగ్ బాధ్యతలూ చూసుకుంటున్నారు. హైదరాబాద్‌లో తన ఆలోచనలను అమలు చేస్తే.. వర్కవుట్ అవుతుందని భావించి బిల్ట్ టు కుక్‌ను ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన విద్యార్థులతో పాటు ఓ స్టార్ హోటల్‌కు చెందిన చెఫ్‌ కూడా వీళ్ల కోసం పనిచేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ చేసిన పల్లవి.. హైదరాబాద్ సిటీ ఆపరేషన్స్‌ను చూసుకుంటున్నారు. మొత్తం 23 మంది సభ్యుల బృందం ప్రస్తుతం బిల్ట్ టు కుక్‌లో పనిచేస్తున్నట్టు అల్తాఫ్ చెప్తున్నారు.

image


'' ఏదైనా డిష్ వండుకోవాలంటే.. చాలా మందికి ఇంగ్రిడియెంట్స్‌తోనే సమస్య. వండుకునే ఒకరిద్దరికి అన్ని వస్తువులు తెచ్చుకోవడం చాలా కష్టం. కొన్ని ఒకే చోట దొరకవు కూడా. అలాంటి వాళ్లే మా కస్టమర్స్. వంటకు అవసరమైన వస్తువులన్నీ ఫ్రెష్‌గా మా కస్టమర్లకు పంపుతాం. వాళ్లు కేవలం నాలుగు స్టెప్స్‌తోనే వంటను పూర్తి చేయొచ్చు. ఎంత సులువుగా వీలైతే... అంత సులువుగా ఉండేట్టు ప్లాన్ చేశాం. ఇంట్లో కొత్త రకం డిషెస్‌ను ట్రై చేయాలనుకునే వాళ్లకు బిల్ట్ టు కుక్ మంచి ఆప్షన్ '' - అల్తాఫ్ హుసేన్

ఎప్పటికప్పుడు మెనూ మారుస్తూ రిపీటెడ్ కస్టమర్లను పొందాలని ఈ స్టార్టప్ చూస్తోంది. తమ దగ్గర తయారయ్యే రెసీపీలన్నీ స్టార్ హోటల్ చెఫ్స్ రూపొందించినవేనని చెబ్తోంది. అన్నీ సమపాళ్లలో రెడీ చేసి పంపించడం వల్ల టేస్ట్‌లో కూడా పర్ఫెక్షన్ వస్తుందనేది బిల్ట్ టు కుక్ ఇస్తున్న భరోసా. మెనూను బట్టి ఒక్కో సర్వింగ్‌కు రూ.250తో మొదలైంది. కస్టమర్లు ఆర్డర్ చేసిన తర్వాత ప్రాంతాన్ని బట్టి అరగంట నుంచి గంటన్నరలోగా వంటకు అవసరమైన వస్తువులను డెలివర్ చేస్తున్నారు.

జూన్ నెలలో కంపెనీ ఏర్పాటు చేసి, ఆగస్ట్ నుంచి మార్కెటింగ్ మొదలుపెట్టినట్టు కంపెనీ చెబ్తోంది. ఆశ్చర్యంగానే ఉన్నా అతితక్కువలో 1000 ఆర్డర్లను డెలివర్ చేసినట్టు అల్తాఫ్ వివరించారు. ప్రస్తుతానికి సొంత నిధులతో కంపెనీని ఏర్పాటు చేశామని, త్వరలో ఫండింగ్ వస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన డెలివరీని మరింత విస్తరించాలని చూస్తున్నారు. త్వరలో ముంబైలో కూడా తమ సేవలను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.

website

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి