సంకలనాలు
Telugu

20 అడుగుల షాప్‌గా మొదలై ఇప్పుడు 40 స్టోర్లకు విస్తరించిన 'చుంబక్'

ఐదేళ్లలో అనిర్వచనీయమైన వృద్ధిఏటా 300శాతం పెరుగుతున్న చుంబక్ టర్నోవర్

Krishnamohan Tangirala
21st Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

బెంగళూరు మహానగరం, ఇందిరానగర్‌లోని చుంబక్ స్టోర్‌లోకి అడుగుపెట్టగానే.. ముదురు రంగులతో మెరిసిపోతున్న అనేక వస్తువులు మన కళ్లని ఇట్టే ఆకట్టుకుంటాయి. 2010 మార్చిలో మొదలైంది చుంబక్. దీన్ని ప్రారంభించినపుడు గుర్తింపు చిహ్నాలు, నివాళిగా ఇచ్చే వస్తువులు, భారతీయ సావనీర్లు విక్రయించాలని భావించారు వ్యవస్థాపకులు వివేక్ ప్రభాకర్, శుభ్ర చద్దాలు. ఇప్పుడు లైఫ్ స్టైల్ బ్రాండ్‌గా ఎదిగిన చుంబక్.. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీల్లోనూ విస్తరించింది. బెంగళూరు, ఢిల్లీల్లో ఫ్లాగ్‌షిప్ స్టోర్లతోపాటు.. దేశవ్యాప్తంగా 35 పాప్అప్ స్టోర్లనూ నిర్వహిస్తోంది చుంబక్.

“భారతదేశానికి గుర్తుగా అంటే.. ఎప్పుడూ అవే తాజ్‌మహల్ ప్రతిరూపాలు, హస్తకళా వస్తువులను చూసీచూసీ మాకు బోర్ కొట్టేసింది. స్మృతి చిహ్నాలు అంటే ఇవి మాత్రమేనా అనిపించింది. మన దేశానికి వచ్చే టూరిస్టులు.. గుర్తుగా అనేక వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారికి మరిన్ని ఆప్షన్స్ ఉంటే బాగుంటుందని భావించాం. అలా మొదలైంది చుంబక్ స్టోర్” అంటూ దీని ప్రారంభం వెనక స్టోరీని వివరించారు సహ వ్యవస్థాపకుడు వివేక్.
చుంబక్ స్టోర్

చుంబక్ స్టోర్


చల్ చల్ చుంబక్

మొదట తాము దాచుకున్న ₹40 లక్షల సీడ్ ఫండింగ్‌తో చుంబక్ స్టోర్ ప్రారంభించారు ఫౌండర్స్. ఐదేళ్లలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తారంగా పెంచుకున్నారు. స్టేషనరీ, బ్యాగ్స్, వాలెట్స్, జ్యూవెలరీ, కీ చైన్స్, దుస్తులు, గృహ అలంకరణ సామాగ్రి సహా.. తమకే ప్రత్యేకమైన అనేక వస్తువులను విక్రయిస్తున్నారు. భారతదేశాన్ని అత్యధికంగా ప్రేమించి, తమ దుస్తులపై కూడా ఇండియాని, దేశ జెండాను ధరించే యువతే.. తమ కస్టమర్లలో ఎక్కువగా ఉన్నారని చెబ్తున్నారు వివేక్. తమ కస్టమర్లు చుంబక్ నుంచి మరిన్ని వస్తువులను కోరుకుటున్నారనే విషయం అర్ధమైన తర్వాత... సావనీర్ల విక్రయం నుంచి భారత్‌కు రిప్రజెంటేటివ్స్‌గా ఎదిగే ప్రయత్నం ప్రారంభమైంది.

image


మొదట మోడర్న్ బ్రాండ్ ఔట్‍‌లెట్లలో కొన్నేసి చొప్పున తమ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించినా.. అన్ని రకాల వస్తువులు ఒకేచోట ఉండాలని కస్టమర్లు కోరుకోవడంతో ఈ తరహా ప్రణాళికలు ప్రారంభించారు వ్యవస్థాపకులు. దీంతో దేశవ్యాప్తంగా బడా మాల్స్‌లో పాప్‌అప్ స్టోర్లను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు.

“గిఫ్టింగ్, కలెక్షన్స్ విషయంలో దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటా తెలిసే బ్రాండ్‌గా ఎదగాలన్నది మా ఆలోచన”అంటారు వివేక్.

తాము విక్రయించే ఉత్పత్తులలో పురాతన భారత సంప్రదాయం కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు చుంబక్ నిర్వాహకులు. అదే సమయంలో ఆధునిక భారత్‌ని ప్రతిబింబించే వస్తువులు కూడా ఉండేలా జాగ్రత్త పడ్డారు. విభిన్నమైన వస్తువులు ఒకే చోట లభించడంతో.. ఎంపిక చేసుకోవడంలో కస్టమర్లుకు ఆప్షన్ పెరిగాయని చెప్పారు వివేక్. చుంబక్‌లో ఇవి ఉంటాయి, ఇవి ఉండవు అనే సందేహం లేకుండా.. అన్ని కాలాలకూ అద్దం పట్టే వస్తువులు లభిస్తాయని కస్టమర్లు విశ్వసించగలడానికి.. తమ కలెక్షన్ ప్రధాన కారణంగా చెబ్తున్నారు.

బెంగళూరులోని చుంబక్ ఫ్లాగ్‌షిప్‌ మాల్

బెంగళూరులోని చుంబక్ ఫ్లాగ్‌షిప్‌ మాల్


20 అడుగుల షాప్‌తో ప్రారంభం

బెంగళూరులోని ఇందిరానగర్‌లో 2014 సెప్టెంబర్‌లో చుంబక్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ ప్రారంభమైంది. హోమ్, డెకరేషన్‌కు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.

“చుంబక్‌కే ప్రత్యేకమైన రంగులు, డిజైన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. అదే సమయంలో క్రాకరీ, ల్యాంప్స్, డైనింగ్ యాక్సెసరీస్, వాల్ ఆర్ట్ సహా.. కొత్త ప్రొడక్టులను మాల్‌లో విక్రయానికి ఉంచాం” అని చెప్పారు వివేక్.

సవాళ్లు ఎదురుకాని విజయగాధ ఒకటి కూడా ఉండదు. చుంబక్ విషయంలో కూడా ఇది అనుభవానికి వచ్చింది. అన్ని ప్రొడక్టులూ ఒక చోటకు తేవడంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు. ముఖ్యంగా పాప్‌అప్ కియోస్క్‌ల ఏర్పాటు విషయంలో తొలి సవాల్ ఎదురైంది. ఎలాంటి స్టోర్ ఉండాలి ? ఎంత స్పేస్ కావాలి ? డిజైన్, ధీమ్ ఎలా ఉండాలి ? లాంటి వాటిపై ఎక్కువ కసరత్తు చేశాం. “మాకు ఇవే మొదటి స్టోర్స్. మా బ్రాండ్‌ని ప్రచారం చేసి అభివృద్ధి చేయండతోపాటు.. మా డిజైన్లకు ప్రతిరూపంగా ఇవి నిలవాలి. అందుకే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాం” అన్నారు వివేక్.


ఇలాంటి సవాల్‌నే స్టోర్ ఏర్పాటులోనూ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఇంకా ఎక్కువ సమస్యలనే ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబ్తున్నారు. ప్రతీ వస్తువుకు తగిన విధంగా స్పేస్ ఇస్తూ.. అమర్చాల్సి ఉంటుంది. కేటగిరీలుగా విభజిస్తూ.. అమ్మకానికి వీలుగా ప్రత్యేకమైన మార్కెటింగ్ పరిభాషను ఉపయోగిస్తూ.. అమర్చారు. దీనికోసం చాలా సమయాన్ని వెచ్చించాల్సి వచ్చినా.. ఈ పనిలో చాలా ఎంజాయ్ చేశామంటారు వివేక్. ఈ ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేసి.. తమ స్టోర్‌ను శక్తివంతమైన మార్కెటింగ్ వ్యూహాలతో తీర్చిదిద్దామని చెప్పారు.

“ఏడాదిన్నర సమయంలో అన్ని విభాగాల్లోనూ కలిపి 30 నుంచి 150 మంది ఉద్యోగుల స్థాయికి చుంబక్ ఎదిగింది. టెక్నాలజీ టీంలో ఎక్కువమంది సభ్యులను పెంచుకోవడం ద్వారా.. వెబ్‌సైట్ లాంఛ్ చేసిన కొన్ని నెలల వ్యవధిలోనే అమ్మకాలను గణనీయంగా పెంచుకోగలిగామ”న్నారు వివేక్. 

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లలో కలిపి.. గత ఐదేళ్లలో ఏటా 300శాతం సగటు వృద్ధిని నమోదు చేసింది చుంబక్.

పలు రకాల రిటైల్ వ్యూహాలను అవలంభించడమే తమ అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణమని విశ్వసిస్తారు చుంబక్ టీం. మాల్ తరహా స్టోర్‌ని ప్రారంభించడం.. కియోస్క్‌ల వ్యాపారం పైనా ప్రభావం చూపిందంటున్నారు వివేక్. ఫ్లాగ్‌షిప్ స్టోర్లలో గృహాలంకరణ వస్తువులను కూడా జత చేయడంతో.. సగటు కొనుగోలు విలువ రెట్టింపు అయిందని తెలిపారు. వెబ్‌సైట్ అమ్మకాల్లోనూ ఈ వృద్ధి కనపడ్డం విశేషం. డిమాండ్‌ను అర్ధం చేసుకుని, దాన్ని అందుకునేలా ఆన్‌‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లను నిర్వహించడం ఒక రకంగా సవాల్ అని చెబ్తారు వివేక్.

బెంగళూరులోని చుంబక్ స్టోర్ లోపలి దృశ్యం.

బెంగళూరులోని చుంబక్ స్టోర్ లోపలి దృశ్యం.


మార్కెట్ సామర్ధ్యం, భవిష్యత్ ప్రణాళికలు

భారతీయత ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన డిజైన్లకు స్పందన అనూహ్యంగా ఉందని చెబ్తోంది చుంబక్ టీం. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా డిజైన్ ట్రెండ్‌లకు తగినట్లుగా ప్రొడక్ట్స్ ఉండాలని.. కస్టమర్లు కోరుకుంటున్నారు.

“మేం అమ్మే ప్రోడక్టుల డిజైన్ ప్రత్యేకతను కస్టమర్లు గుర్తించారు. మా బ్రాండ్‌కు మార్కెట్లో పెరుగుతున్న ఇమేజ్ ఎంతో సంతోషాన్ని ఇస్తోంద”ని వివేక్ అంటున్నారు.

బ్రాండ్ ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ తమ ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించింది అనేది టీం మాట.

దేశవ్యాప్తంగా స్టోర్లను ప్రారంభించడం ద్వారా.. ఆఫ్‌లైన్ అమ్మకాలు మరింతగా పెంచుకునే యోచన ఉంది. మరో ఏడాది కాలంలో ప్రధాన నగరాల్లో ఫ్లాగ్‌షిప్ స్టోర్లను ఏర్పాటు చేయబోతోంది చుంబక్. అలాగే అన్ని రకాల మార్కెట్‌ ప్లేస్‌లలోనూ విక్రయాలు ప్రారంభించి.. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు పెంచుకునేందుకు కృషి చేయనున్నారు.

“ చుంబక్ ఆన్‌లైన్ స్టోర్‌ని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసే యోచన కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అమ్మకాలతోపాటు.. ఇప్పటికే అమెజాన్‌లో బ్రాండ్ స్టోర్ కూడా ప్రారంభించాం. సొంత ఈ-కామర్స్ పోర్టల్‌లోనూ వినూత్న స్థాయిలో ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేయబోతున్నాం” అన్నారు వివేక్. 

తామే సృష్టించిన డిజైన్‌ల విషయంలోనూ కొత్త ప్రయోగాలకు సిద్ధం కాబోతున్నారు. భారతీయులు కాలంతోపాటే మార్పులు కూడా కోరుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న డిజైన్ ట్రెండ్‌లు.. ఇక్కడి మార్కెట్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీనికి తగినట్లుగా మార్పులు చేయడంతోనే ఇండియాసర్కర్, హ్యాపిలీ అన్‌మ్యారీడ్ వంటి వెంచర్ల అభ్యున్నతిలో పాలు పంచుకున్నాయి.

వెబ్‌సైట్


 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags